గతంలో ఓసారి ‘ముచ్చట’లోనే రాసినట్టు గుర్తు… ఈటీవీని అందరూ వదిలేసిపోతున్నారు కదా… కానీ కొత్తగా వచ్చిన ఫైమా, నూకరాజు, ఇమాన్యుయెల్ ఈటీవీ ప్రోగ్రామ్స్‌కు బలంగా అక్కరకొస్తారని..! ఫైమా తనను తాను ప్రూవ్ చేసుకుంది… ఆమె స్పాంటేనిటీ, ఎనర్జీ లెవల్స్‌తో ఆమె కలర్, ఆమె పర్సనాలిటీ గట్రా అసలు మైనసు పాయింట్లే కాలేదు… సరికదా వాటిని కూడా ఆమె సక్సెస్‌ఫుల్‌గా వాడుకుంది…
ఈరోజు బిగ్‌బాస్ టాప్ కంటెస్టెంట్లలో ఒకరు తను… బహుశా టాప్ ఫైవ్‌లో ఉండొచ్చు… దటీజ్ ఫైమా… ఇమాన్యుయెల్, నూకరాజు ఇదే ఈటీవీ నిర్వహించే స్టాండప్ కామెడీ షో జాతిరత్నాలులో కీలకపాత్ర పోషిస్తున్నారు… వాళ్లిద్దరూ లేకుండా ఆ షో లేదు… అప్పుడప్పుడూ వాళ్లే కామెడీ చేస్తూ కాస్త షోను రక్తికట్టిస్తున్నారు… ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కీలకమైన స్కిట్లు చేస్తున్నారు…
అనసూయ, గెటప్ సీను, సుధీర్, చలాకీ చంటి… ఎవరైతేనేం, ఎవరూ ఈటీవికి పర్మినెంట్ ఎంప్లాయీస్ కాదు… వెట్టిచాకిరీ చేయలేరు… పోతుంటారు… కొత్త రక్తం చేరాల్సిందే… కామెడీ షోలకు సంబంధించి జీటీవీ, మాటీవీ ఫ్లాపయ్యాయి కాబట్టి ఈటీవీ కామెడీ షోలలో ఫైమా, నూకరాజు, ఇమ్మూ, వర్షలకు (కాపాడుకోగలిగితే) మంచి ప్రయారిటీ వస్తోంది… ఉంటుంది…
Ads
ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..? కామెడీ, ఫన్ అంటే ఎప్పుడూ నవ్వించేదే కాదు… అప్పుడప్పుడూ ఏడిపించేది కూడా… కారా తింటేనే స్వీటు విలువ… అలాగే ట్రాజెడీ బిట్ల నడుమే కామెడీ బిట్లకు నవ్వు ప్లేవర్… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మొదట్లో ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకుని, ఓ స్కిట్ చేయించేవాళ్లు… సుడిగాలి సుధీర్ హోస్టింగ్ చేసినప్పుడు దివ్యాంగాలు, అనాథలు, వృద్ధ కళాకారులు గట్రా పిలుచుకొచ్చి, వాళ్లతో షో చేయించేవాళ్లు…
తరువాత అన్నీ పోయి, నటన తెలియని కమెడియన్ల ప్రాధాన్యం పెరిగి… పిచ్చి కామెడీ పంచులు, ర్యాగింగులు, బాడీ షేమింగులు ప్రవేశించి… దాన్నే ఫన్, దాన్నే కామెడీ అనుకొండి అన్నారు… మళ్లీ ఇప్పుడిప్పుడే కాస్త నయం… ఆమధ్య నూకరాజుతో కాంతార క్లైమాక్స్ స్పూఫ్ చేయించారు… భలే చేశాడు… నిజంగానే నూకరాజులో టాలెంట్ ఉంది… తను కమెడియన్‌గానే కాదు, మెయిన్ స్ట్రీమ్ నటుడిగా కూడా రాణించగలడు… ఈరోజు మరో స్కిట్ చేశాడు…
ఆన్‌లైన్ లోన్లు, యాప్ లోన్లు, వేధింపులతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు చూస్తున్నాం… అదొక సామాజిక జాఢ్యం ఇప్పుడు… జరగాల్సినంత చర్చ సొసైటీలో జరగడం లేదు… ఆ స్కిట్ చేయడం షో ప్రజెంటర్ల మంచి టేస్టే… నూకరాజు మళ్లీ ఆ పాత్రకు ప్రాణం పోశాడు… రాఘవ, ఉమ కూడా బాగానే చేశారు… నూకరాజు గనుక ఈ స్పిరిట్ కంటిన్యూ చేస్తే తనకు ఇంకాస్త మంచి కెరీర్ కాచుకుని ఉన్నట్టే… ఐతే, నూకరాజును అభినందించడానికి అక్కడున్నవాళ్లకు మాటలే రాలేదేమిటి..? అదేం దరిద్రం..!! ఆటోరాంప్రసాద్ ఒక్కడు ఒక మాట మెచ్చుకున్నాడు… అంతే… థూనీ… ఇక్కడా వివక్షేనా…!!
Share this Article