.
కొన్ని చెప్పుకోవాలి… మన హీరోలు కేవలం హీరోలు… తమలోని నటుల్ని చంపేసుకున్నారు… వసూళ్లు, ఫార్ములా సినిమాలు… అంతకుమించి భిన్నంగా ఆలోచించరు, సాహసించరు… తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోరు…
ఎస్, తమిళ వృద్ధ నటులూ అంతే… కానీ ఒక మోహన్‌లాల్… ఒక మమ్ముట్టి… ఎలాంటి పాత్రనైనా సరే, ఆహ్వానిస్తారు, ఆవహింపజేసుకుంటారు… ఇమేజ్ బందిఖానాలో ఉండిపోరు… స్వేచ్ఛగా పాత్రను బట్టి నటింపజేసుకోవడానికి దర్శకులకు ఫ్రీడమ్ ఇస్తారు…
Ads
ఇప్పుడు హృదయపూర్వం సినిమా సందర్భంగా మరోసారి చెప్పుకోవడం… ఈ సంవత్సరమే ఎల్2 ఎంపురాన్, తుడారం సినిమాలతో హిట్ కొట్టిన తను ఈసారి డౌన్ టు ఎర్త్ పాత్రలో జీవించి హృదయపూర్వం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు…
అసలు ఆ పాత్ర పరిచయమే విశేషం… అంతటి హీరో ఓ గుండె రోగిష్టి… గుండె మార్పిడి చేయడంతోనే కథ ఆరంభం… సరే, తన తండ్రి గుండెను అమర్చుకున్న గుండె స్వీకర్తను చూడాలని గుండె దాత బిడ్డ అనుకోవడం, తరువాత అనుకోని పరిణామాలే ఈ సినిమా… సరే, ఆ కథ, ఆ సినిమా విశ్లేషణలోకి పోెకుండా… మోహన్‌లాల్ దగ్గర ఆగిపోదాం…
ఓ క్లౌడ్ కిచెన్ నడిపించుకునే హీరో… ఎలాంటి హీరోయిజం లేని ఓ డీసెంట్ బ్యాచిలర్ పాత్ర ఇది… పటాటోపాలు, ఇమేజ్ బిల్డప్పులు, భీకరమైన ఫైట్లు, తలతిక్క స్టెప్పులు కాదు… అక్కడక్కడా జోక్స్… స్ట్రెయిట్ ప్రజెంటేషన్‌తో దర్శకుడు పలుచోట్ల భావోద్వేగాలను బాగా పండించాడు…
అఫ్‌కోర్స్, మోహన్‌లాల్ స్క్రీన్ ప్రజెన్స్, తన నటన సినిమా కథ బాగా ఎలివేట్ కావడానికి బాగా ఉపయోగపడింది… 1980 నుంచి నటిస్తూనే ఉన్నాడు మోహన్‌లాల్… ఈరోజుకూ సేమ్ క్రేజ్… నటన అంటే సేమ్ ప్యాషన్…
తను కూడా స్టార్ హీరో… విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది… అంతులేని సంపద… కానీ మనవాళ్లలా మూస సినిమాలు చేస్తూ, మబ్బుల్లో తిరగడం లేదు..,. 65 ఏళ్ల వయస్సులోనూ ఇంకా ప్రయోగశీలి… కొత్త పాత్రలు చేయగల సాహసి… సేమ్, మమ్ముట్టి కూడా…
ఆమధ్య చెప్పుకున్నాం గుర్తుందా..? ఓ నగల యాడ్‌లో తనలోని స్త్రీత్వాన్ని ప్రదర్శిస్తూ మోహన్‌లాల్ భలే నటించాడు… అసలు ఇలాంటివి చేయడానికి వాళ్లు అంగీకరిస్తారు, ప్రాణం పోస్తారు… అదే ఇక్కడ చెప్పదలుచుకుంది..! అంతేతప్ప ఇది హృదయపూర్వం సమీక్ష కాదు… మోహన్‌లాల్‌కు ఓ హృదయపూర్వక అభినందన… అంతే…!!
Share this Article