Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవిత్ర జయరాం @ విలన్ తిలోత్తమ పాత్రకు భలే దొరికింది ఈమె..!!

June 11, 2024 by M S R

పదే పదే మన వార్తలు పవిత్ర అనే పవిత్రమైన పదం వద్దకే వస్తున్నాయి… తప్పడం లేదు… మరి అంత పవిత్రమైన పదం… ఒక సీనియర్ నరేష్ సహజీవని పవిత్ర… తాజాగా దర్శన్ అనే కన్నడ హీరోతోపాటు అరెస్టయిన హీరోయిన్ పేరు పవిత్ర గౌడ… అంతకుముందు పవిత్రా జయరాం… అదేనండీ త్రినయని సీరియల్‌లో తిలోత్తమ పాత్ర పోషించింది కదా ఆమే…

సరే, ఈ పవిత్రకాండలో తాజాగా చెప్పుకునేదేమిటీ అంటే…. పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది, ఆమె ప్రియుడు, సహజీవి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… కానీ ఆ సీరియల్‌లో అదెలా కవర్ చేస్తారు..? రోజుకు వంద ట్విస్టులు ఇవ్వగల సీరియల్ రచయితలకు అది పెద్ద పనా..? సింపుల్‌గా మార్చిపడేశారు…

అసలే అది విఠలాచార్య సినిమాలకు తాత వంటి సీరియల్ కదా… తిలోత్తమ సర్పదీవికి వెళ్లి కొత్త రూపంతో వస్తుందని కలరింగు, కవరింగు ఇచ్చేసి, కొత్తగా చిత్ర హలికెరి అనే నటిని తెరమీదకు తీసుకొచ్చారు… అబ్బే, కొత్తేమీ కాదు… తను సీనియరే… మోడల్ కమ్ సినిమా నటి కమ్ టీవీ నటి…

Ads

కన్నడంలో పలు సినిమాల్లోె నటించింది… తెలుగు సీరియళ్లు అంటేనే కన్నడ తారలు కదా… ఈమె కూడా వచ్చింది… నాగపంచమి సీరియల్‌లో ప్రధాన పాత్రే… పాత్ర పేరు వైదేహి… నిజానికి మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె బాలాజీ పోత్రాజ్ అనే వ్యాపార వేత్తని 2006లో పెళ్లి చేసుకుంది… వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఇక చైత్రకి ఓ చెల్లి కూడా ఉంది… ఆమె పేరు నిఖిలా… కాలిఫోర్నియాలో ఉంటుంది.,.

trinayani

పెళ్లి జరిగిన కొన్ని రోజులకే చైత్ర ఆమె తన భర్త, అత్తామామలపై పోలీస్ కేసు పెట్టింది… వాళ్లు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది… తన సినిమాలు, సీరియల్స్ ద్వారా వచ్చిన డబ్బును ఆమె దాచుకోగా… అత్తింటి వారు తన బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించుకున్నారని కేసు పెట్టింది… అంతే కాకుండా చైత్ర పేరు మీద గోల్డ్ లోన్‌లు కూడా పెట్టేశారట…

సరే, ఆమె బాధితురాలా..? కావాలని అత్తింటివారిపై కేసులు పెట్టిందా..? ఇప్పుడు భర్తతో సంబంధాలు ఏమిటి..? అనే ప్రశ్నలు పక్కన పెడితే… ఆమె తిలోత్తమ పాత్రలో పవిత్రా జయరాంను మరిపిస్తోంది… ష్, కాసింత ఆమెకన్నా బాగానే చేస్తోంది… గుడ్… ఐనా కన్నడ తారలు టీవీ సీరియళ్లలో బాగానే చేస్తారు… అన్నట్టు ఆల్రెడీ 40 ఏళ్లకు చేరువైన ఈమె స్వస్థలం బెంగుళూరు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!
  • తల్లిదండ్రుల ఓవర్ కంట్రోల్ అసలు సమస్య – చేతన్ భగత్ విశ్లేషణ!
  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!
  • 95 ఏళ్ల వయస్సు దాకా… భారతీయ గుండెలకు అవిశ్రాంత సేవ..!!
  • “కొలై పండ్రాంగప్పో” – కరుణానిధి అరెస్టు రాత్రి అసలేం జరిగింది?
  • నిధి దొరికింది! ‘మనిషి ఆశ’ల్లో ఇరుక్కుంది! ఎవరు సొంతదారు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions