.
ఓ వార్త ఆసక్తికరంగా అనిపించింది… అదేమిటంటే..? నవంబరు 8న హైదరాబాదులో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ కాన్సర్ట్ చేయబోతున్నాడు…
దాందేముందీ..? దేవిశ్రీ ప్రసాద్, థమన్, ఇళయరాజా… అందరూ చేస్తున్నారు కదా అంటారా..? అవును, ఇక్కడే కాదు, మన సౌత్ సంగీత దర్శకులు ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఇండియన్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాన్సర్ట్స్ చేస్తూనే ఉన్నారు…
Ads
అందులో విశేషం కాదు, రేట్లు..! అడ్డగోలు రేట్లు పెట్టేస్తున్నారు… మరి వాళ్ల లెవల్‌కు రేట్లు ఎక్కువే ఉంటాయి కదా సహజంగానే అనే సమర్థన కూడా చెల్లదు… ఎందుకంటే..? థమన్, డీఎస్పీ వంటి తోపు సంగీత దర్శకుల కాన్సర్ట్స్‌తో కూడా ఈవెంట్ల నిర్వాహకుల చేతులు కాలాయి కాబట్టి… హెవీ లాస్ ఈవెంట్స్…
నిజానికి ఇలాంటివి ‘టికెట్ సేల్స్ రెవిన్యూ షేరింగ్’ పద్ధతిలో ఉంటే వర్కవుట్ అవుతాయి… నిర్వాహకులు కూడా మరో నాలుగు ఈవెంట్స్ నిర్వహించడానికి ధైర్యం ఉంటుంది… కానీ ఈ దర్శకులు రెమ్యునరేషన్ తీసుకుని, మిగతా విషయాలు మాకక్కర్లేదు అనేస్తున్నారు…
అవీ భారీ పారితోషికాలు… రెహమాన్ కనీసం 3 నుంచి 3.5 కోట్లు తీసుకుంటాడు… ప్రొడక్షన్ మరో కోటిన్నర… మార్కెటింగ్ ఇంకో కోటి… సో, ఆరు కోట్ల ఖర్చు అస్సలు వర్కవుట్ కాదనేది ఓ సింపుల్ ఈక్వేషన్… ప్లస్ హైదరాబాద్ పెద్దగా కాన్సర్ట్స్ మార్కెట్ కాదు… తమిళనాడులోలాగా కాదు… ఇక్కడ చాలా ఫ్రీ టికెట్లు…
ప్రస్తుతం మార్కెట్‌లో మస్తు డిమాండ్ ఉన్న అనిరుధ్ చెన్నైలో ఇటీవల ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తే, టికెట్ల రద్దీ, ఒత్తిడి విపరీతంగా ఏర్పడి, వేదికను మార్చి, మరో డేట్ ఫిక్స్ చేశారు… తను తూర్పు దేశాల్లో నిర్వహించిన ఈవెంట్స్ కూడా బ్లాక్ బస్టర్స్…
రెహమాన్ ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ కాన్సర్ట్ రేట్లు కూడా చాలా ఎక్కువట… గోల్డ్ క్లాస్ 1800, ప్లాటినం 4000, ఎంఐపీ 13 వేలు… జంట టికెట్లు… ఇంకాస్త దగ్గరగా సీట్లు కావాలంటే 24 వేలు అట… ఫ్యాన్ పిట్ అయితే 5500, 10 వేలు…
రెహమాన్ కాన్సర్ట్ హైదరాబాదుకు కొత్తేమీ కాదు, ఆరేడేళ్ల క్రితం చేశాడు… అప్పుడైనా, ఆమధ్య ఇళయరాజా కాన్సర్ట్ చేసినప్పుడయినా ఇంతగా రేట్లు లేవు… ఐనాసరే, రెహమాన్ అంటే క్రేజ్ వేరు కదా సినిమా సంగీత ప్రపంచంలో… సో, వర్కవుట్ అవుతుందీ అంటారా..? చూద్దాం..!!
Share this Article