.
సుఖ్వీందర్ సింగ్..! ఏఆర్ రెహమాన్ మూర్ఖ వ్యాఖ్యల పుణ్యమాని… తన నిజతత్వాన్ని బయటపెట్టిన ఆర్జీవీ పుణ్యమాని…… ఈ సుఖ్వీందర్ సింగ్ మళ్లీ ప్రధానంగా వార్తల తెర మీదకు వచ్చింది… తను స్లమ్ డాగ్ మిలియనీర్ ఇప్పుడు… వివరంగా చెప్పాలంటే..?
ఏఆర్ రెహమాన్ ఏవో కూశాడు కదా ఓ పాకిస్థానీ జర్నలిస్టుతో… చావా విభజనవాదం అనీ, తన మతమే తనకు అవకాశాల్లేకుండా చేస్తోందనీ… తన మెదడు అంగుష్ట పరిమాణాన్ని బయటపెట్టుకున్నాడు కదా… ఇలాంటివాడినా మనం ఇన్నాళ్లూ అభిమానించాం అని తన ఫ్యాన్స్ అందరూ సిగ్గుపడుతున్నారు కదా…
Ads
ఈ స్థితిలో అప్పట్లో ఆర్జీవీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది… అందులో ఆర్జీవీ ఏం చెప్పాడంటే..?
‘‘సుభాష్ ఘయ్ ఓ సినిమా కోసం రెహమాన్‌ను మాట్లాడుకున్నాడు, కానీ ఎంతకూ పాటలు ఇవ్వడు, ఓసారి తన స్టూడియోకు వెళ్తే అక్కడ ఉన్న సుఖ్వీందర్ ఓ ట్యూన్ వినిపించాడు… రెహమాన్ వోకేనా అన్నాడు… ఈమాత్రం దానికి మరి నీకు అన్ని కోట్లు దేనికి..? సుఖ్వీందర్‌తో నేను చేయించుకోలేనా అంటూ బూతులు తిట్టాడు… నా బ్రాండ్ ముఖ్యం, ఎవడు పాట ట్యూన్ చేస్తే నీకెందుకు అని అడమెంటుగా బదులిచ్చాడు రెహమాన్…
తరువాత సుఖ్వీందర్ కంపోజ్ చేసిన ఆ పాటను జయహో పాటకు వాడాడు రెహమాన్… దానికి 5 లక్షల పారితోషికం కూడా పంపించాడు సుఖ్వీందర్‌కు…’’ ఇదీ ఆర్జీవీకి సాక్షాత్తూ సుఖ్వీందరే చెప్పుకున్న బాధ…
ఆ పాటకు ఆస్కార్ తీసుకున్నాడు రెహమాన్… అంటే క్రెడిట్ చోరీ, ట్యూన్ చోరీ, ఫేమ్ చోరీ… అదీ రెహమాన్ నిజతత్వం… పైగా ఇప్పుడు దేశం మీదే విద్వేషం కక్కుతున్నాడు… నిజానికి ఆ ఆస్కార్ ఎవరిది..? పక్కాగా సుఖ్వీందర్‌దే… ఇంతకీ ఎవరతను..?
గాయకుడు, కంపోజర్, నటుడు, గీత రచయిత… పంజాబీ, సిక్కు… 400 సినిమాల్లో వేలాది పాటలు పాడాడు… ట్రూ పాన్ ఇండియా సింగర్… తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, ఉర్దూ పాటలెన్నో పాడాడు… తెలుగులో కూడా బోలెడు… లక్ష్మికాంత్- ప్యారేలాల్ దగ్గర నుంచి నేటి దాకా అనేకమంది కంపోజర్లతో కలిసి పనిచేశాడు, చేస్తున్నాడు…
ఎటొచ్చీ ప్రధానంగా భంగపడింది రెహమాన్‌తో కలిసి పనిచేసినప్పుడే… ఎప్పుడైతే 5 లక్షల పారితోషికం ఇచ్చాడో అప్పుడే జయహో పాట ఒరిజినల్ కంపోజర్, గాయకుడు తనే అని రెహమాన్ అంగీకరించినట్టే కదా… మరి ఆస్కార్‌కు అది తన పేరుతో ఎలా వెళ్లింది..? ఆ అవార్డు తీసుకోవడం ద్వారా రెహమాన్ పాతాళంలోకి పడిపోలేదా నైతికంగా..!
రెహమాన్... పేరు మాత్రమే తనది... నిజానికి ఇన్నేళ్లూ తన ట్యూన్లుగా చలామణీ అవుతున్న వాస్తవ స్వరకర్తలు వేరు... భార్య, విడాకులు, టీమ్ మెంబర్‌తో సంబంధాలు గట్రా వ్యక్తిగతం ఏమైపోయినా సరే గానీ, వృత్తిపరంగా ఈ ‘దోపిడీ’కి రెహమాన్ దగ్గర బదుల్లేదు... ఉండదు... తన రియల్ ఫేస్ అది... బాలీవుడ్ తనను ఎందుకు ఛీత్కరించి దూరం పెట్టిందో అర్థమైంది కదా...
Share this Article