మొన్నొక దోస్త్ ఫేసుబుక్కులో ఓ పోస్టు పెట్టాడు… విపరీతమైన కోపం అందులో… పెళ్లి, శుభకార్యాలకు అడ్డుపడి, ఓ మాఫియాలాగా డబ్బులు డిమాండ్లు చేస్తూ, నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్న హిజ్రాలను తంతే తప్పేమైనా ఉందా అనేది ఆ పోస్టు… నిజంగా అటూఇటూ కాని జాతిలాగా, సొసైటీ వివక్షకు గురవుతున్న జాతిలాగా సానుభూతిని పొందాల్సిన వాళ్ల మీద సొసైటీ ఎందుకు మండిపడుతోంది..? ఎందుకు వాళ్లను అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్‌లాగా పరిగణిస్తోంది..? ఇది ఓ పెద్ద ప్రశ్న… ఇదెందుకు గుర్తొచ్చిందంటే… శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఈటీవీలో ఓ షో వస్తుంది ప్రతి ఆదివారం మధ్యాహ్నం… కామెడీ మాత్రమే గాకుండా ఏదైనా ఓ సోషల్ కాజ్ మీద ఓ స్కిట్ కనిపిస్తూ ఈమధ్య ఆదరణ పొందుతోంది… కానీ ఈసారి ప్రోమో చూస్తే, ఆ షో నిర్మాతలకు గానీ, దర్శక బాధ్యులకు గానీ ఫీల్డ్ రియాలిటీ మీద అవగాహన లేదేమో అనిపించింది… పాపం శమించుగాక…
అనాథలు, దివ్యాంగులు, లైంగిక బాధితులు, రోగపీడితులు గట్రా విధివంచితుల గురించి సానుభూతిని కనబరిచే స్కిట్లలో తప్పులేదు… ఆహ్వానించాలి కూడా… నిజంగా మన తెలుగు టీవీల స్థాయి ఆ కోణంలో ఏమాత్రం పెరిగినా ఆనందపడాలి… కానీ హిజ్రాలు..? నగరాల్లో, పట్టణాల్లో వీళ్లు ఓ జాఢ్యం ఇప్పుడు… వాళ్లు ఏరియాలవారీగా రైట్స్ మాట్లాడుకుని, ఏదేని శుభకార్యం ఛాయలు కనిపిస్తే వాలిపోతున్నారు… విపరీతమైన డబ్బు డిమాండ్ చేస్తున్నారు… ప్రభుత్వాలు, పోలీసులు ఏమీ చేయలేరు… అరె, వాళ్లను ఏమంటాం..? ఇదీ సమాధానం… ఓ పట్టణంలో ఓ పాన్ షాపు ఓపెన్ చేసుకుంటుంటే యాభై వేలు డిమాండ్ చేసి, రచ్చ రచ్చకు దిగారంటే, చివరకు ఆ షాపులో కొత్త సామగ్రిని బయటపడేసి ఆ ఔత్సాహికుడు తిట్టుకుంటూ వెళ్లిపోయాడంటే నమ్ముతారా..?
Ads
అనేకచోట్ల ఇదే సమస్య… పందిరి, తోరణాలు కనిపిస్తే చాలు… వాలిపోతున్నారు… ఫంక్షన్ హాళ్లకూ సమస్యే… నేరుగా పెళ్లి వేదిక, రిసెప్షన్ వేదికను ఎక్కేసి, పదిమందిలో ఓ ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం… హిజ్రాలు బాధితులు కాదు ఇప్పుడు… బాధాకారకులు… నిజం నిష్ఠురంగానే ఉంటుంది… షాపుల్లో రెగ్యులర్ బలవంతపు వసూళ్లు సరేసరి… ఎవడు డబ్బు ఇవ్వమన్నాడు అనే ప్రశ్న ఓ వితండవాదం… అనుభవించేవాడికే అర్థమవుతుంది… మరి వాళ్లను పీడితులుగా, బాధితులుగా చూపించడం దేనికోసం..? ఈటీవీ వాడి, సదరు షో నిర్మాతలకు సమస్య మీదున్న నిజ అవగాహన మీద జాలేసింది… ప్చ్, రామోజీరావుకో, మల్లెమాల శ్యాంరెడ్డికో వాళ్ల సెగ తగిలే చాన్స్ లేదుగా… వాళ్లిద్దరినీ ఓసారి ఓ మోటారు బైకు మీద, ఐడెంటిటీ తెలియకుండా… హిజ్రాల సమస్య ఉన్న రోడ్ల మీదకు పంపిస్తే, వాళ్లకు అర్థమవుతుంది… ఇంద్రజకు, గెస్టుగా వచ్చిన తారకరాంకు నిజంగానే ఏమర్థమైందో తెలియదు… ఎందుకు బాధను నటిస్తూ, ఆ నటనలో జీవించారో తెలియదు… నిజంగా ఈ కథనం ఎవరికైనా యాంటీ-హ్యూమన్ అనిపించినా సరే… నిష్ఠురమనిపించినా సరే… హిజ్రాలు ఈరోజు సమాజానికి కరోనా డెల్టా వైరస్..!! ఈ స్కిట్ రచయిత ఎవరో గానీ, ఆయన పాదాల్ని కూడా ఈ షో చివరలో చూపిస్తే బాగుండేది… హిజ్రాలు అంటే అర్ధనారీశ్వరులట… ఎందుకురా తండ్రీ నువ్వొకడివి తయారయ్యావా హిందూ మనోభావాల్ని దెబ్బతీయడానికి తాజాగా…!!
Share this Article