.
ఏదైనా కొత్త వస్తువు మార్కెట్‌లోకి వస్తే “శుభం” అనే ఫీల్ వచ్చే పేరు పెట్టుకుంటాం… కానీ చైనాలో మాత్రం “నువ్వు చచ్చిపోయావా?” (are you dead) అనే పేరుతో ఒక యాప్ దుమ్మురేపుతోంది…. పేరు వినడానికి కాస్త ఒళ్లు గగుర్పొడిచినా, దీని వెనుక ఉన్న ఐడియా మాత్రం అదిరిపోయింది… ముఖ్యంగా ఒంటరిగా బతుకుతున్న వారికి ఇదొక “డిజిటల్ ప్రాణదాత”గా మారింది…
అసలు ఏంటా యాప్? ఎలా పనిచేస్తుంది? …. ప్రపంచం స్పీడుగా పరిగెడుతోంది… పిల్లలు అమెరికాలో, తల్లిదండ్రులు ఇండియాలో… లేదా భార్యాపిల్లలు ఊర్లో, భర్త సిటీలో… ఇలా ఒంటరి బతుకులు ఎక్కువైపోయాయి… ఒకవేళ ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనకేదైనా అయితే, కనీసం పక్కవాడికి కూడా తెలియని పరిస్థితి… సరిగ్గా ఇక్కడే ఈ యాప్ ఎంట్రీ ఇచ్చింది…
Ads
-
సింపుల్ లాజిక్…: మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక, ప్రతి రెండు రోజులకు ఒకసారి అందులో ఒక బటన్ నొక్కాలి… అంటే.. “నేను బతికే ఉన్నాను బాబోయ్” అని సిగ్నల్ ఇవ్వాలన్నమాట…
-
ఒకవేళ నొక్కకపోతే?…: మీరు 48 గంటల పాటు ఆ బటన్ నొక్కలేదు అనుకోండి… అంతే! యాప్ వెంటనే అలర్ట్ అయిపోతుంది… మీరు ముందే సేవ్ చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ నంబర్లకు, ఫ్రెండ్స్‌కు “వెళ్లి చూడండి… అక్కడ ఏదో తేడాగా ఉంది!” అని మెసేజ్‌లు పంపేస్తుంది…
13 వేల పెట్టుబడి.. 13 కోట్ల విలువ!
ఈ యాప్‌ను చైనాలోని జెంఝువాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు కేవలం రూ. 13 వేల (1000 యువాన్లు) ఖర్చుతో సరదాగా మొదలుపెట్టారు… కానీ 2025లో ‘మూన్ స్పేస్ టెక్నాలజీస్’ పేరుతో లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఇది చైనాలో టాప్ పెయిడ్ యాప్ అయిపోయింది… ఇప్పుడు దీని మార్కెట్ విలువ అక్షరాలా 13 కోట్లు!
ప్రపంచమంతా ఇదే గోల… చైనాలో ఇప్పటికే వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది… ఫర్టిలిటీ రేటు బాగా పడిపోతోంది… అదే కాదు, రష్యా, జపాన్ అన్నిచోట్లా ఇదే సమస్య… 2030 నాటికి చైనాలో 20 కోట్ల మంది ఒంటరిగా జీవించే అవకాశం ఉందట… ఒక్క చైనానే కాదు… అమెరికా, స్పెయిన్, ఆస్ట్రేలియాలోని చైనీయులు కూడా ఈ యాప్‌ను ఎగబడి డౌన్లోడ్ చేసుకుంటున్నారు…
ఒక చిన్న ముచ్చట…: చైనాలో ‘ఆర్ యూ హంగ్రీ?’ (నీకు ఆకలిగా ఉందా?) అనే ఫుడ్ యాప్ ఫేమస్… ఆ పేరును పేరడీ చేస్తూ దీనికి ‘ఆర్ యూ డెడ్?’ అని పేరు పెట్టారు… అయితే పేరు మరీ భయంకరంగా ఉందని తిడుతుండటంతో, త్వరలో పేరు మార్చే ఆలోచనలో ఉన్నారట…
మనకేంటి పాఠం? ఈ యాప్ సక్సెస్ వెనుక ఒక పెద్ద సామాజిక బాధ ఉంది… మనుషుల మధ్య దూరం పెరిగిపోతోందని, పలకరించే నాథుడు లేక టెక్నాలజీ మీద ఆధారపడాల్సి వస్తోందని ఇది నిరూపిస్తోంది…
ఫర్టిలిటీ రేటు తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో... ఇలాంటి "సేఫ్టీ నెట్" యాప్స్ రాబోయే రోజుల్లో ప్రతి మొబైల్‌లోనూ ఉండక తప్పదు... ఇదొక విషాదం... యువత కూడా డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ అంటున్నారు... అసలు నో వెడ్డింగ్ అంటున్నారు... సో, ఈ యాప్ రాబోయే రోజుల్లో అవశ్యం...
Share this Article