ఆట… పోటీ… యాక్షన్ పరిమితి మేరకు మాత్రమే ఉండాలి… గెలుస్తున్నాం కదాని ఓవరాక్షన్ చేస్తే… అది కూరలో ఉప్పు ఎక్కువైనట్టుగా ఇసం అయిపోతుంది… ప్రత్యేకించి బిగ్బాస్ ఆటలో చాలామంది బోల్తాకొట్టింది ఈ ఓవరాక్షన్తోనే… 14 వారాలు బిగ్ హౌస్లో గడిపినా సరే, ఆరియానాకు ఈ తత్వం బోధపడినట్టు లేదు… ఈరోజు ఆటలో ఆమె వాదన చూసి ప్రేక్షకులు బిత్తరపోయారు… ఏమిటీ ఫూలిష్ వాదన, తలాతోకా లేకుండా మాట్లాడుతున్నదేమిటి అనుకున్నారు… ఇటీవల తన ఆటతో గెలుచుకున్న ప్లస్ అంతా పోగొట్టుకుంది… పైగా బిగ్బాస్ టీం అతి తెలివితో కట్ చేసిన ప్రొమో కూడా అమెను కొంత దెబ్బతీసింది… ఎలాగంటే..?
ఆపకుండా డాన్స్ చేస్తూ… చివరకు ఎవరు స్టేజీ మీద మిగులుతారో… వారికి మైక్ ద్వారా ప్రేక్షకులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తానన్నాడు బిగ్బాస్… ప్రతిసారీ ఎవరు దిగిపోవాలో మీరూమీరూ మాట్లాడుకొని డిసైడ్ చేసుకొండి అన్నాడు… సరే, డాన్సులు స్టార్ట్ చేశారు… ఫస్ట్ బజర్ మోగగానే… ఆరియానా దిగిపోతే బెటరనీ, ఆమె ఆల్రెడీ రెండుసార్లు ప్రేక్షకులకు అప్పీల్ చేసుకుంది కాబట్టి వేరేవాళ్లకు చాన్స్ వచ్చేలా ఆమె తప్పుకుంటే మంచిదనే అభిప్రాయం వచ్చింది… అది కరెక్టు కూడా…
Ads
అవును నిజమే అని అంగీకరిస్తూనే… తరువాత రౌండ్లో దిగిపోతాను, నాకు ఈ స్టేజీ మీద పర్ఫామ్ చేయాలని మొండివాదనకు దిగింది… ఫూలిష్… ఎలాగూ తను వచ్చే రౌండ్ దిగిపోతాను అన్నప్పుడు… ఫస్ట్ రౌండ్ అయితే ఏమిటి..? సెకండ్ రౌండ్ అయితే ఏమిటి..? తనేమైనా పెద్ద డాన్సరా అక్కడ పర్ఫామ్ చేసి ఎక్స్పోజ్ కావటానికి..? పైగా అది డాన్స్ కాంపిటీషన్ కాదు, కెప్టెన్సీ టాస్క్ కాదు, లగ్జరీ బడ్జెట్ కాదు… పోనీ, కింద నిలబడి కూడా డాన్స్ చేసుకోవచ్చుగా… అసలు ఉద్దేశం ఏమిటీ అంటే… సొహెల్ను ముందు దింపేయాలని… తనపై మిగతావాళ్లు ఒత్తిడి తెచ్చి దింపేస్తారని… వెరీ సిల్లీ థింకింగ్…
ఈలోపు స్టేజీ మీద కూర్చోవద్దు అనే రూల్ మరిచిపోయి, అభిజిత్ ఈ వాదన భరించలేక అలా కూర్చుండిపోయాడు… అది తప్పు అని తెలిసి, తనే ఏ తర్కానికీ, వాదనకూ దిగకుండా సింపుల్గా స్టేజీ దిగిపోయాడు… అలా హుందాగా ఉండాలి… ప్రొమో దెబ్బ ఏమిటీ అంటారా..?
పొద్దున్నుంచీ బిగ్బాస్ ఒక ప్రోమో రన్ చేస్తోంది… దాన్ని చూస్తే ఆరియానా మొండి తర్కంతో విసిగిపోయి, అభిజిత్… ఎహెఫో, ఆడుకోఫో అన్నట్టుగా స్టేజీ దిగిపోయినట్టుగా ఉంది… అది ఆరియానా మీద నెగెటివిటీని పెంచింది… వోటింగుకు కీలకమైన శుక్రవారం ఈ ప్రొమో ఇలా తప్పుడు పద్ధతిలో రన్ కావడం ఆరియానాకు మైనసే… నిజానికి జరిగింది వేరు… జనంలోకి వెళ్లింది వేరు… అఫ్ కోర్స్, ఈరోజు ఎపిసోడ్ పూర్తయినా ఆరియానాకు ప్లస్ అయ్యిందేమీ లేదు… ఐనాసరే, ప్రొమో జనాన్ని తప్పుదోవ పట్టించేలా ఉండకూడదుగా… బ్లండర్ ఆఫ్ బిగ్బాస్ టీం…
ఈరోజు అభిజిత్ కొత్తగా కనిపించాడు… మామూలుగా తను పెద్దగా డాన్సులు చేయడు… స్టెప్పులు వేయడు… మరీ టాస్క్ అయితే తప్ప… కానీ ఈరోజు టాస్కులో భాగంగా బోలెడన్ని స్టెప్పులు వేశాడు… స్టేజీ దిగాక కూడా పాటలకు తగ్గట్టు బోలెడన్ని స్టెప్పులు వేస్తూ హుషారుగా కనిపించాడు… స్టెప్పులు కూడా బాగున్నయ్… ఏదో ఫుల్ జోష్ కనిపిస్తున్నది… ఏమిటీ సంగతి అభిజిత్…?!
Share this Article