యుద్ధాల్లో గుర్రాలు, ఏనుగులు మాత్రమే కాదు… సమాచారం పంపడానికి పావురాలు, కోటలపైకి ఎక్కడానికి ఉడుములు గట్రా ఉపయోగపడేవి… ఇప్పటికీ కొన్ని దేశాల్లో మందుపాతరల్ని కనిపెట్టడానికి పందికొక్కులు, డ్రోన్లపై దాడికి గద్దలు వాడుతున్నారు… అన్నింటికీ మించి జాగిలబలగం… అంటే డాగ్ స్క్వాడ్ ఎక్కువగా సైనికుల వెంట ఉంటోంది…
వెల్ ట్రెయిన్డ్ డాగ్… మందుపాతరల్ని పసిగట్టగలదు… ప్రమాదకర వ్యక్తుల ఉనికిని పోల్చగలదు… ఉస్కో అంటే మీదపడి చీల్చేయగలదు… ఆదివారం కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓచోట ఓ ఉగ్రవాది ఓ ఇంట్లో దాగి ఉన్నట్టు సమాచారం వచ్చింది… అందుబాటులో ఉన్న సైనికుల టీం వెళ్లింది… లోపల ఎందరు ఉన్నారో తెలియదు… గుడ్డిగా లోపలకు వెళ్తే రిస్క్…
వాళ్లతోపాటు వెంట వచ్చాయి బెల్జియన్ మలినోయిస్ జాతి కుక్కలు రెండు… ఒకటి బజాజ్, రెండోది యాక్సెల్… వెల్ ట్రెయిన్డ్… ముందుగా బజాజ్‌ను ముందు గదిలోకి పంపించారు… అది అక్కడ సెటిలైపోయాక యాక్సెల్‌ను పంపించారు… అది బజాజ్ ఉన్న గది దాటి ఇంకాస్త లోపలకు వెళ్లింది… అక్కడ దాక్కుని ఉన్న ఉగ్రవాది కాల్పులు స్టార్ట్ చేశాడు దానిపై…
Ads
వెంటనే సైనికులు వాడి ఉనికి ఉన్న గది చుట్టూ చేరి, కాల్పులు ప్రారంభించారు… ఆ శునకం తన దేహంలో బుల్లెట్ దిగినా సరే, ఉగ్రవాది మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది… వాడు ఉండకూడని వ్యక్తి అనేది దానికి అర్థమైంది… అందుకే తెగించి మీద పడింది… ప్రాణాలు పోతున్నా సరే వాడిని మాత్రం వదల్లేదు… సైనికులు గదిలోకి చేరేసరికి శునకం ప్లస్ ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయి కనిపించారు… దానికి ఎప్పటికప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్న హ్యాండ్లర్‌కు కూడా గాయాలయ్యాయి…
(for representation)
తెలుసు కదా… కుక్కలకు ట్రెయినింగ్ ఇచ్చేవారు వాటితో బాగా అనుబంధం పెంచుకుంటారు… సొంత పిల్లల్లాగే ప్రేమిస్తారు… మరణించిన దాని శవం చూసి కన్నీరుమున్నీరయ్యాడు దాని ట్రెయినర్… ఇది 26 ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందింది… 29 రాష్ట్రీయ రైఫిల్స్‌కు అనుబంధంగా పనిచేస్తుంది…
బయటికి తీసుకొచ్చారు… ఓ శవపేటికలో పెట్టారు… మేజర్ జనరల్ స్లేరియా, కౌంటర్ ఇన్‌సర్జెన్సీ జనరల్ ఆఫీసర్, జమ్ము-కశ్మీర్ పోలీస్ ప్రతినిధులు పుష్పగుచ్చాలు ఉంచి, నివాళి అర్పించారు… ఒక సైనికుడికి ఎలాంటి అధికారిక అంత్యక్రియలు జరుగుతాయో ఈ రెండేళ్ల జాగిలానికి కూడా ఆర్మీ డాగ్ యూనిట్ ప్రాంగణంలో జరిపించనున్నారు…
మేధస్సు, దూకుడు, చురుకుదనం, ఎనర్జీ ఉండే ఈ జాతి శునకాల్ని చాలా దేశాలు తమ ఆర్మీ యూనిట్లలో వాడుతుంటాయి… మన దేశంలో కూడా సీఆర్పీఎఫ్ మొదట్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో వాడేది… తరువాత బోర్డర్‌కు తీసుకుపోయింది… లాబ్రడార్స్, జెర్మన్ షెపర్డ్స్ కూడా వాడుతుంటారు… ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుని ముగిద్దాం… 2015లో నాలుగేళ్ల లాబ్రడార్… పేరు మాన్సి… హ్యాండ్లర్ బషీర్ అహ్మద్… సరిహద్దుల్లో చొరబాట్లను పసిగట్టే టీంలో పనిచేస్తూ ఉగ్రవాదుల కాల్పులకు గురయ్యారు… మరణించారు… సైన్యం యుద్ధ గౌరవాన్ని మొదటిసారి ప్రదర్శించింది ఆ శునక సైనికుడి పట్ల.. ‘Mention of Despatches’ అనే విశిష్ట పురస్కారం ఆ యూనిట్‌కు బహూకరించారు..! ఆఫ్టరాల్ కుక్క, కుక్క బతుకు, కుక్క చావు, కుక్క బుద్ధి అనే అభిప్రాయం కలిగే వ్యాఖ్యలు చేసేముందు ఓసారి గుర్తుచేసుకొండి…!!
Share this Article