ఎమ్మెల్యే రోజా భర్త, తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ… ఇదీ వార్త… చాలా పత్రికల్లో అసలు వార్తే కనిపించలేదు… ఈనాడులో ఓ చిన్న వార్త వేశారు, కానీ అందులో ఎక్కడా రోజా అనే పేరే కనిపించలేదు… నిజానికి జగన్ కేబినెట్‌లో తాజాగా మంత్రి పదవి వస్తుందని రోజా ఎన్నో ఆశలు పెట్టుకుంది… రోజా భర్త అనేసరికి సదరు వార్తకు ఎంతోకొంత ప్రాధాన్యం, పాఠకాసక్తి ఉంటాయి… ఐనా తెలుగు మెయిన్ స్ట్రీమ్ లైట్ తీసుకుంది… రోజాకు సంబంధం లేదు కదా అనే డౌట్ వస్తున్నదా..? ఈ కేసులో రోజా ప్రస్తావన కూడా ఉంది…
వార్త ఏమిటంటే..? 2016లో… సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అంబరసు (మాజీ కాంగ్రెస్ ఎంపీ కొడుకు) పుత్తియ తళైమురై అనే టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు… అందులో ఓ ఫిలిమ్ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోథ్రా మీద కొన్ని ఆరోపణలు చేశారు… అందులో రోజాకు ఇచ్చిన అప్పుతోపాటు సదరు బోథ్రా వడ్డీ వ్యాపారం తీరు ప్రస్తావనలు కూడా వచ్చాయట…
ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం వాటిల్లజేసేలా ఉన్నాయంటూ ఆ బోథ్రా జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం కేసు వేశాడు… ఆ కేసు నడుస్తూనే ఉంది… కానీ కొన్నాళ్లకు ఆయన మరణించాడు… ఐనాసరే, ఆయన కొడుకు గగన్‌చంద్ బోథ్రా ఆ కేసును నడిపిస్తున్నాడు, వదిలేయలేదు… ఆ కేసు తాజాగా మంగళవారం విచారణకు వచ్చింది… కానీ..?
Ads
దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సెల్వమణి గానీ… అరుళ్ అంబరసు గానీ కోర్టుకు హాజరు కాలేదు… వాళ్ల తరఫు న్యాయవాదులు కూడా రాలేదు… దాంతో న్యాయమూర్తి వారిద్దరి మీద బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశాడు… ఏప్రిల్ 23కు కేసు వాయిదా పడింది… ఇదీ జరిగింది… బోథ్రా ఈ ఇద్దరిపైనే కాదు, ఆ టీవీ చానెల్ మీద కేసు ఫైల్ చేశాడు… దాని మీద చానెల్ అప్పీల్ చేసుకుంది… ఈ సంవత్సరమే చానెల్ మీద కేసును కొట్టేశారు కూడా…!
ఇంతకీ అంత భారీ డబ్బు ఓ ఫిలిమ్ ఫైనాన్షియర్ దగ్గర రోజా ఎందుకు తీసుకుందో..! సెల్వమణి దర్శకుడే కాదు, నిర్మాత కూడా… అయితే 1996 తరువాత ఆయన ఏ సినిమాను నిర్మించలేదు… కేవలం దర్శకుడిగా ఉన్నాడు… 2002లో రోజాతో పెళ్లయ్యేనాటికి దర్శకుడిగా కూడా పెద్ద అవకాశాల్లేవు… అంతగా అప్పులు ఎందుకయ్యాయో, 2016లో ఆ డబ్బుతో ఏం చేశారో తెలియదు..! ఎందుకంటే… 2015 తరువాత ఆయన ఏ సినిమాకు దర్శకత్వం కూడా చేయలేదు..!!
Share this Article