మన్సియా అల్లాటప్పా డాన్సర్ ఏమీ కాదు… కేరళ కళామందలంలో భరతనాట్యంలో పీహెచ్‌డీ చేస్తోంది… ఆమె ఆర్టిస్ట్ కమ్ వైణికుడు శ్యామ్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకుంది… పెళ్లి సమయంలో హిందూమతంలోకి మారారా అని గుడి కమిటీ మెంబర్ ఒకరు అడిగారట… అలా ఆమె ప్రదర్శనకు క్లియరెన్స్ ఇవ్వడానికి..! కానీ అప్పుడు కూడా నాకు ఏ మతమూ లేదనే చెప్పిందట ఆమె…

మన్సియాకు ఈ చేదు అనుభవం ఇదే తొలిసారేమీ కాదు… గురవాయూర్ గుడిలో కూడా ఆమె ప్రదర్శనకు ఆలయ కమిటీ అనుమతించలేదు… తిరస్కరించారు… ఇది సెక్యూలర్ కేరళేనా అనడుగుతోంది ఆమె… ఆమె హిందువు కాదు కాబట్టి, మతమే నాకక్కర్లేదు అంటోంది కాబట్టి గుడి ప్రాంగణంలో ప్రదర్శన ఇవ్వకూడదా..? లేక భరతనాట్యమే ప్రదర్శించకూడదా..?
మన్సియా భర్త శ్యామ్ కల్యాణ్ కూడా ఆమె ఫేస్‌బుక్ పోస్టును షేర్ చేస్తూ… మాకు మా కళే మతం, మేం నాట్యానికి, సంగీతానికి భక్తులం… ఇంకేం చెప్పగలం’’ అని రాసుకున్నాడు… కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ స్పందించాడు… ఇది సరైన నిర్ణయం కాదని ఖండించాడు… రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి శైలజ కూడా ఖండించింది… మతం కేంద్రంగా సాగే ఆలోచనలకు, నిర్ణయాలకు అధికార పార్టీ సహా ఎవరూ సపోర్ట్ చేయకూడదని అంటోంది… ‘‘కళకు కూడా కులం, మతం రంగులు పులిమితే నాటి ఫ్యూడల్ యుగానికీ ఇప్పటికీ ఇక తేడా ఏమున్నట్టు..?’’ అంటున్నది…
‘‘చాలావరకు నా ప్రదర్శనలు గుళ్లలోనే జరిగాయి… నాన్ హిందూ పేరిట గుడిలోకి రానివ్వకుండా గుడి బయట స్టేజ్ ఏర్పాటు చేసి, ప్రదర్శన ఇప్పించిన గుడి కూడా ఉంది… మా అమ్మ అమీనా 2007 మరణిస్తే మసీదు జాగాలో ఖననం చేయనివ్వలేదు, ఎందుకంటే..? నేను, నా సిస్టర్ రుబియా భరతనాట్యం డాన్సర్లం కాబట్టి…’’ అని చెప్పింది మన్సియా దిన్యూస్‌మినట్ న్యూస్ పోర్టల్‌తో… సో, ఎవరూ తక్కువ కాదు… ఇదీ ఓ నాన్-హిందూ భరతనాట్యం కథ…