Neelayapalem Vijay Kumar……… అవునూ … మా చిత్తూరు పక్కనుండే “అరుణాచలం” లో కొత్త దేవుడేమైనా వెలిసాడా ?
Do you know what is the new fad in Andhra right now? తిరువన్నామలై “అరుణాచలం” గుడికి పోవడం …! వీలైతే పౌర్ణమి నాడు పోవడం …!
అప్పుడెప్పుడో శబరిమలైలో దేవుడు ‘జ్యోతి’ ని కనిపింప చేస్తాడు అని లక్షల కొద్దీ పరిగెత్తే వాళ్ళు గుర్తుందా … ఇప్పుడు ‘అరుణాచలం’లో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణం …కు తండోప తండాలుగా వెళ్తున్నారు
పౌర్ణమి రోజు హోటళ్లలో రూము కాదు కదా, భోజనాలు కూడా త్వరగా అయిపోతున్నాయి అంట … విపరీతమైన జనాలు …కొత్త హోటళ్లు, లాడ్జీలు , ఆటో వాళ్ళు, బస్సులు,…. ఒక కొత్త ఇంప్రూవ్డ్ ఆర్ధిక వ్యవస్థ ఏర్పడింది …అక్కడ …!
మా పక్క జిల్లానే కాబట్టి అరుణాచలం మాకేమీ కొత్త కాదు. కార్తీక పౌర్ణమి రోజు కొండ చుట్టూ తిరగడం , కొండపైన కొన్ని మైళ్ళ దూరం వరకు కనిపించే పెద్ద దీపం ఇవన్నీ చాలా పాత విషయాలే …
కానీ ఇప్పుడు కొత్తగా ఏమి కనిపించిందో తెలీదు …. అక్కడ వుండే చిత్తూర్ ఫ్రెండ్స్ ని అడిగితే …” ఎల్లా నమ్మ తెలుగు ఆళు దా మామా ” అని చెప్పారు …
నిజానికి ఆ నాలుగు గుడి గోపురాలు ఎంత సేపు చూసినా బోర్ కొట్టని శిల్ప సంపద … ! మనం గర్వించదగ్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వం …!
కొన్నేళ్ల క్రితం UNESCO గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి . ఎంతవరకు వచ్చిందో మరి! కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఇంట్రెస్ట్ శిల్ప సంపద గురించి కాదేమో …
పౌర్ణమి రోజు కొండ చుట్టూ కాలి నడకన ప్రదక్షిణ – గిరి ప్రదక్షిణ – చేస్తే పుణ్యం అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకొంది …! కానీ ఈ కొత్త ఇంట్రెస్ట్ మన తెలుగోళ్లకు ఎందుకొచ్చిందో ? ఒక్క తిరుమల తప్ప డెబ్భై ఎనభై ల దాకా కొత్త గుళ్ళు అంత ప్రాముఖ్యత లోకి రాలేదు స్వాతంత్య్రం తర్వాత…
మన తెలుగోళ్లు … అలా చేయి పెడతారు… ఆ రోజు నుంచి ఆ గుళ్లకు జనమే జనం … మన తెలుగోళ్లు లేట్ సెవెంటీస్ , అర్లీ ఎయిటీస్ లో అయ్యప్ప స్వామీ దగ్గరకు పోటెత్తకు ముందు తమిళనాడు , కేరళకే దాదాపుగా ఆయన పరిమితం …
ఎనభై , తొంబైల్లో, తెలుగోళ్లకు షిరిడీ సాయిబాబా మీద భక్తి తెలిసిందే … తొంబయిల్లో కాణీపాకం, కాళహస్తి రాహుకేతువుల పూజ… ఇలా ఒక్కొక్క ఇంట్రెస్ట్ మొదలయింది … గుళ్లకు పోవడంలో తప్పేమీ లేదు. మంచిదే. మన హిందూ మతం ఇంకొక నాలుగు కాలాలు పాటు సుభిక్షంగా ఉంటుంది …. కానీ చిత్రమేమిటంటే, ఏ కొత్త విషయమైనా ముందు మన తెలుగోళ్లు మొదలు పెట్టేస్తారు ….!
Ads
Share this Article