Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక సీఎంగా గుంపు మేస్త్రీ పనెలా ఉంది..? కేసీయార్‌కు ఏమిటి భిన్నం..?

May 24, 2024 by M S R

ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చాన్నాళ్ల తరువాత అనుకోకుండా మాట్లాడుతుంటే, తను గమనిస్తున్న కొన్ని విషయాలు చెప్పాడు… ఇంట్రస్టింగ్ అనిపించాయి… కొన్ని ముఖ్యాంశాలు…

‘‘రేవంత్‌రెడ్డిని అందరూ గుంపు మేస్త్రీ అని వెక్కిరిస్తున్నారు కదా, నిజానికి ఆ పదం సీఎం పనికి కరెక్ట్ ఆప్ట్… అదే గుంపు మేస్త్రీ ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నాడో పక్కన పెట్టండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో మనకు ప్రధానం…

నాకు తెలిసి ఒక దశలో కేసీయార్ దగ్గర పెండింగ్ ఫైళ్ల సంఖ్య అక్షరాలా 12 వేలు… సచివాలయానికి అసలే రాకపోయేవాడు, కీలకమైన ఫైళ్లు మాత్రమే కొన్ని తను ఎక్కడుంటే అక్కడికి వేగంగా వెళ్లి వచ్చేవి… ఇతర ఫైళ్లు గుట్టల్లా పేరుకుపోయేవి… సచివాలయం సరే, తనే స్వయంగా కొన్నిరోజుల తరబడీ బయటికే కనిపించేవాడు కాదు…

Ads

రేవంత్‌రెడ్డి దగ్గరకు పైల్ వచ్చిందంటే చాలు, రెండు మూడు రోజుల్లో క్లియరైపోతుంది… పెండెన్సీ లేదు, తొక్కిపెట్టడాలు లేవు… కాకపోతే ఆ స్పీడ్ అందుకోవడంలో నిజానికి తన టీం, మంత్రుల టీమ్స్ వెనకబడుతున్నట్టుగా ఉంది… సీఎం దగ్గరకు ఫైల్ చేరడానికి కొంత తాత్సారం జరుగుతోంది… ఫైళ్ల సమగ్ర పరిశీలన, వాటి ప్రభావాల మదింపు అవసరమే కానీ దాన్ని స్పీడ్‌గా చేస్తే బెటర్…

మీడియా మీద నాకు చాలా కంప్లయింట్స్ ఉన్నాయి.., కేసీయార్ 12 వేల ఫైళ్ల పెండింగ్ మీద ఒకరిద్దరు మాత్రమే రాశారు, మిగతావాళ్లు ఆయనకు కోపమొస్తుందని భయపడి సైలెంట్… మరి ఇప్పుడు రేవంత్ ఫైళ్ల క్టియరెన్స్ స్పీడ్ కూడా జనం దృష్టికి ఎందుకు రాలేదు..? కేసీయార్ తెచ్చి తగలేసిన లక్షల కోట్ల అప్పుల మీద బోలెడంత చర్చ జరిగింది సరే, కానీ ఆ ధోరణులకు భిన్నంగా అప్పులు తీర్చడంలో, రీషెడ్యూలింగ్‌లో రేవంత్ ప్రయత్నాల మీద పెద్ద చర్చ లేదు… (ఏదో ఇంటర్వ్యూలో తనే చెప్పుకోవాల్సి వచ్చింది… రాధాకృష్ణ ఇంటర్వ్యూ కావచ్చు…)

ఒక ముఖ్యమంత్రిగా రేవంత్‌కు, ఒక పొలిటిషియన్‌గా రేవంత్‌కు నడుమ ఓ విభజన రేఖ ఉంటుంది… అందుకే మోడీని పెద్దన్న అనగలడు, ఎన్నికల సభలో ప్రసంగిస్తూ రిజర్వేషన్ల దుమారం రేపగలడు… మమత, స్టాలిన్‌లు కేంద్రం- రాష్ట్రం సంబంధాల్లో కూడా రాజకీయాల్ని కలిపేస్తున్నారు… ఈ బాటలో రేవంత్ లేడు… అదొక రిలీఫ్…

తను ముఖ్యమంత్రిగా ఎలా పనిచేసినా సరే, తను గనుక ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించుకోలేకపోతే తనకే ఇబ్బంది… సీనియర్లు కాచుకుని ఉంటారు ఎప్పుడూ తనను బాధ్యుడిని చేయడానికి… చాన్స్ దొరికితే కూలదోయడం కాంగ్రెస్ మార్క్ పాలిటిక్సులో కామన్… కేసీయార్ క్రెడిబులిటీ ఏమిటో సరిగ్గా గుర్తించక అలుసిచ్చిన బీజేపీకి అసలు తత్వం అర్థమై ఇక కేసీయార్ కుటుంబం మీద దాడి స్టార్ట్ చేసింది… కానీ కాంగ్రెస్ వైపు నుంచి దాడి ఈరోజుకూ స్టార్ట్ కాలేదు…

తవ్వితే కేసీయార్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ముఖ్యులు బోలెడుమంది అనేక రాష్ట్ర వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి అడ్డంగా బుక్కవుతారు… బీఆర్ఎస్‌ను జీరో వైపు నెట్టేస్తేనే కాంగ్రెస్‌కు బెటర్… ఆ దిశలో అసలైన అడుగులు ఇంకా స్టార్ట్ కాలేదు… ఈలోపు కరెంటు సరఫరా, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాల్లో బీఆర్ఎస్ టీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసి, జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగింది ఇష్యూస్‌ను… నిజాలు ఏమిటో వదిలేస్తే జనంలోకి ఏ ఇష్యూ ఎలా వెళ్లిందనేదే రాజకీయాల్లో ప్రధానం…

జనానికి, రాష్ట్రానికి భారంగా కనిపించిన వ్యక్తులు కాంగ్రెస్ వైపు అవకాశవాదంతో రాగానే, వాళ్లకు కీలకమైన టికెట్లు దక్కడం రాజకీయంగా కరెక్టో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ… జనంలోకి మాత్రం తప్పుగా వెళ్లింది సంకేతం… బహుశా ఈ ఎన్నికల్లో ఆ తప్పు సంకేతాల ప్రభావం కనిపిస్తుందని నా అంచనా…

పేరుకు పెద్ద లీడర్లను పార్టీలో చేర్చుకుంటే ఆమేరకు బలం పెరుగుతుందనే భావన తప్పు… పార్టీలోనే కొత్త నాయకత్వాల్ని తయారు చేసుకుని, ప్రజలకు భారంగా మారిన ఆ పాత పెద్ద తలల్ని, అంటే జంపింగ్ జపాంగులను డిస్‌కార్డ్ చేయడం సరైన పద్ధతి… సరే, అదంతా రాజకీయం… ఆ లెక్కలు వేరు…

ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ ఫెయిలా, సక్సెసా అనేది ఇప్పుడే ఓ బ్లాంకెట్, స్వీపింగ్ కామెంట్ చేయలేను… తను వచ్చి చాన్నాళ్లు కాలేదు, ఈలోపు ఎన్నికలొచ్చి పడ్డాయి… అసలు ఆట జూన్ 4 తరువాత మొదలవుతుందేమో…! ఈ పదిరోజులే ఆటవిడుపు… ఆ తరువాతే అసలైన ఆట షురూ అని అనుకుంటున్నా…’’

revanth

సీనియర్ ఐఏఎస్ అభిప్రాయాలు రాస్తుంటే ఆంధ్రజ్యోతిలోని ఈ బ్యానర్ స్టోరీ కనిపించింది… కేసీయార్ అసమర్థ పాలన పుణ్యమాని రాష్ట్రం దరిద్రమైన ఆర్థిక స్థితికి జారిపోయింది… దాన్నిప్పుడు చక్కబెట్టడమే కాదు, అలవిమాలిన కాంగ్రెస్ హామీలకు డబ్బులు కావాలి… అదుగో అదీ రేవంత్ రెడ్డికి అసలైన అగ్నిపరీక్ష… ప్రతి చిన్న ఇష్యూను రాజకీయం చేసి, రచ్చ చేయడానికి, పెంట చేయడానికి బీఆర్ఎస్ స్ట్రాటజిక్ టీమ్స్ ఆల్వేస్ రెడీ… అందుకే చెప్పింది… రేవంత్‌కు అసలైన పరీక్షాకాలం ఈ ఎన్నికల ఫలితాల తరువాత అని..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions