త్వరలో కార్తీకదీపం ముగియబోతోంది… దీపా పాత్రధారి ప్రేమి విశ్వనాథ్ ఏ కారణాల చేత టాప్ టీవీ స్టార్ అయ్యిందో పక్కనపెడితే… ఇక ఆమె తెలుగులో ఇప్పట్లో వేరే టీవీ సీరియల్లో రాకపోవచ్చు… ఆమె సినిమాల్లో నటించనుంది… వదినమ్మలోని సుజిత పని అయిపోయింది… దాని రేటింగ్స్ ఘోరంగా పడిపోయినయ్… గృహలక్ష్మి కస్తూరి, దేవత సుహాసిని ఎట్సెట్రా ఒకరిద్దరు ఏ రేటింగుల మాయ పుణ్యమో వెలుగుతున్నారు… కానీ అశిక పడుకోన్ గురించి చెప్పుకోవాలి ఓసారి…
ఒక సీరియల్లో నటిస్తూ… మొదటిసారి పది రేటింగ్స్ దాటేందుకు ఆమే కారణం… వెలిగిపోతోంది… ఆ సీరియల్ పేరు త్రినయని… నాగార్జున వారి అన్నపూర్ణ ప్రొడక్షనే అది… ఆ పాత్రకు ఆశిక ఎంపిక కూడా నాగార్జున చాయిసేనట… సగటు తెలుగు టీవీ సీరియల్‌కు ఉండబడే అన్నిరకాల అవలక్షణాలూ ఉన్నాయి ఆ సీరియల్‌కు కూడా… వాటి గురించి చర్చ ఇక్కడ అనవసరం కానీ… మాటీవీ పోటీలో జీటీవీ సీరియళ్లు దూసుకొస్తున్నాయి… అందులో ముందువరుసలో ఉంది త్రినయని… దానికి కారణం ఈ అశిక పడుకోన్ అనే లీడ్ ఫిమేల్ రోల్…
Ads
ఇంతకుముందు చెప్పుకున్నదే మనం… ఈ పిల్ల కాస్త మూడునాలుగు ఇంచుల అదనపు ఎత్తు ఉండి, మూడునాలుగు కిలోల బరువు తక్కువ ఉంటే ఇంకా అవకాశాల్లో అదరగొట్టేదేమో… త్రినయని అనే సీరియల్ ఏదో బెంగాల్ సీరియల్‌కు మక్కీకి మక్కీ… చివరకు ఆ దర్శకుడికి ఎంత మజ్జు… అనగా ఎంత కదల్లేనితనం అంటే… బెంగాలీ సంప్రదాయాల్ని కూడా యథాతథంగా ఈ రీమేకులో దింపేస్తున్నాడు… తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు కూడా చేతకావడం లేదు… ఐనా జనం చూస్తున్నారు… కారణం, ఇది సతీ త్రినయని టైపు కేరక్టర్… కథ…
ఇందులోనూ మూడునాలుగు నల్కా మేల్ కేరక్టర్లున్నయ్… సరే, కథే అలాంటిది అనుకుందాం.,. అనేకానేక తలతిక్క ట్విస్టులు, లాజిక్ లేని సీన్లు, పిచ్చి కేరక్టరైజేషన్లు, బోలెడుమంది విలన్లు గట్రా ఉన్నా సరే… అశిక తన యాక్టింగ్ మెరిట్‌తో భలే నెట్టుకొస్తోంది… ఈ రేటింగ్స్ చూడండి ఓసారి…
మాటీవీలో వదినమ్మ, కస్తూరి, మౌనరాగం సీరియళ్ల పని అయిపోయింది… జీటీవీలో దాదాపు ఆరేడు సీరియళ్లు పోటాపోటీగా నడుస్తున్నయ్… అదుగో ఆ కారణంగానే జీటీవీ అర్బన్ కేటగిరీలో రేటింగ్స్ దండిగా సంపాదించింది… ఆ కేటగిరీలో 30 శాతం షేర్ సంపాదించి, నంబర్ వన్ అయ్యింది… జీ, మా పోటీ సంగతి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా… ఇదుగో అర్బన్ కేటగిరీలో రేటింగ్స్ వివరాలు…
ఫిక్షన్ అనే కేటగిరీలో మాటీవీకి దాదాపు సమానంగా జీటీవీ నిలబడింది… అంటే సీరియళ్లు… వీటి విషయంలో ఇన్నాళ్లూ కనిపించిన మాటీవీ గుత్తాధిపత్యం ఇకపై ఉండబోవడం లేదు… నాన్-ఫిక్షన్, అంటే రియాలిటీ షోలలో ఇక ఎవరు క్లిక్కవుతే వాళ్లు తెలుగుటీవీ నంబర్ వన్ కిరీటాన్ని దక్కించుకున్నట్టే… ఇలా…
ఇక త్వరలోనే కార్తీకదీపం సీరియల్ ఆగిపోయి, గృహలక్ష్మి పంపింగ్ ప్రమోషన్ కూడా డౌనయిపోతే… మాటీవీకి ఫిక్షన్ విభాగంలోనూ దెబ్బలు తప్పవు… అదేసమయంలో త్రినయని అశిక పడుకోన్ వంటి కొత్త స్టార్లు రెచ్చిపోతే… ప్రేక్షకులు మా నుంచి జీ వైపు మళ్లడం ఖాయం… అప్పుడు ఆకులు పట్టుకున్నా వేస్ట్…!! అవునూ, అన్ని సీరియళ్లలో పేరున్న తారలు కష్టపడుతూ ఉంటే… ఒక్క ఆశికకు మాత్రమే ఎందుకు అభినందనలు అంటారా..? ఆ చానెల్లో ఆ సీరియల్ టాప్ వన్… అందులో లీడ్ స్టార్‌కు సహజంగానే ప్రశంసలు దక్కుతాయి… ఆమె అర్హురాలే…!!
Share this Article