Murali Buddha…….. ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం……. రెండు దశాబ్దాల క్రితం వరకు తన వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్ట్ ప్రతి రోజూ విన్న మాట ఇది …
ఆర్థిక సంస్కరణల తరువాత మీడియా వారు కూడా గుర్తించనంత మార్పులు మీడియాలో వేగంగా చోటు చేసుకున్నాయి . లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఎబియన్ ఛానల్ లో ‘‘లోకేష్ ను మనం తక్కువగా అంచనా వేస్తాం కానీ ఓ ప్రపంచ ప్రముఖ వ్యాపార వేత్త లోకేష్ తెలివికి మురిసి పోయి వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు’’ అని స్టోరీ… వేలల్లో దీన్ని చూస్తే సినీ నటుడు నాగబాబు దీనిపై వ్యంగ్యంగా ‘నా ఇష్టం’ అని ఛానల్ అప్పుడే ప్రారంభించి, ప్రసారం చేయగా లక్షల్లో చూశారు .
కాలం అన్నిటికన్నా శక్తి వంతమైంది ఏదీ శాశ్వతం కాదు …. మార్పును తట్టుకొని నిలిచిన జీవులే బతికి ఉంటాయి మిగిలినవి అంతరించి పోతాయి అంటుంది సైన్స్ …
Ads
***
ఈ తరం వాళ్ళు చెబితే నమ్మక పోవచ్చు ..
ఓ కార్టూనిస్ట్ సంగారెడ్డికి వస్తే ఇసుక వేస్తే రాలనంత జనం … ఆడ, మగ అతన్ని చూసేందుకు వెంటపడ్డారు … ఆంధ్రభూమి వీక్లి ఎడిటర్ కనకాంబర రాజు , కార్టూనిస్ట్ మల్లిక్ ఇతర రచయితలు 86-87 లో సంగారెడ్డి వస్తే అదీ అప్పటి వాళ్ల క్రేజీ … ఇప్పుడు కనకాంబర రాజు లేరు . ఆంధ్రభూమి వీక్లి లేదు . యూ ట్యూబ్ లో స్టాండప్ కామెడీ అని మల్లిక్ వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది .. 79 మంది చూశారు ఆ వీడియోను … ఇంకా పాతవి ఉన్నాయా అని చూస్తే ఏడాది క్రితం వీడియోను దాదాపు మూడు వేల మంది చూశారు … జనం ఆయన్ని చూసేందుకు 87 లో ఎగబడ్డారు ఇప్పుడు …?
కాల మహిమ … కాలానికి తగ్గట్టు మార్పు చెంది యండమూరి వీరేంద్రనాథ్ ఒక్కరు నిలిచారు … సినిమా యాక్టర్లకు ఉన్నంత క్రేజ్ ఉన్న ఆనాటి భూమి వీక్లి రచయితల్లో యండమూరి మినహా ఎవరూ నిలువ లేదు . మార్పును ఎవరూ ఆపలేరు …
Share this Article