Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఛిఛీ… చివరకు అంతటి సుమ కూడా ఇలా తయారైందేమిటి ఖర్మ..?!

June 6, 2022 by M S R

జయమ్మ పంచాయితీ అనే సినిమా డిజాస్టర్ అయిపోయాక, వెటరన్ యాంకర్ సుమ బుర్ర బ్లాంక్ అయిపోయిందో, దారే తప్పిందో… తను హోస్ట్ చేసే క్యాష్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆ డౌటే వచ్చింది… గతంలో కాస్త చూడబుల్‌‌గా ఉండేది ఈ షో… పెద్దగా వినోదం, మన్నూమశానం ఏమీ లేకపోయినా తన స్పాంటేనిటీ, ఫన్నీ యాంకరింగుతో నెట్టుకొస్తోంది సుమ… తరువాత వరుసగా సినిమా ప్రమోషన్లకు వేదికగా మారింది… చివరకు ఎలా తయారైందంటే…

వచ్చే ఎపిసోడ్ కోసం కమెడియన్లను ఎంచుకుంది… ఆనంద్-మంజుల, కొమరం-రజిత, శాంతికుమార్-సుమ, నాగమాంబ-సత్తిపండు జంటలతో ఫన్నీ ఆటాపాటా… ఆ ప్రోగ్రాం కేరక్టరే కదా… ఇంకేముంటుంది..? రోత ఎక్కడనిపించిందీ అంటే… సుమ ప్రశ్నలు వేస్తుంటుంది… భార్య భర్త బుగ్గను కొరకాలి… గాటుపడితే జవాబు చెప్పక్కర్లేదట… గాటపడకపోతే జవాబు చెప్పాలట… ప్రోగ్రామ్‌కు వచ్చాక తప్పుతుందా..? ఏడస్తూనో నవ్వుతూనో ఈ బుగ్గలు కొరుకుడు ఘట్టాన్ని కొనసాగించాయి ఆ నాలుగు జంటలూ పాపం…

suma

Ads

ఈ బుగ్గలు కొరుకుడు వ్యాధి ఏమిటి సుమా..? చివరకు ఏ స్థాయికి పడిపోయింది నీ రేంజ్..? తెలుగు టీవీ ప్రోగ్రాములంటేనే ఓ వెగటు… కానీ దిక్కులేని ప్రేక్షకుడు చూస్తూనే ఉంటాడు మురికి ప్రసారాల్ని… కాస్తోకూస్తో నీ షోలలో ఈ వాసన తక్కువగా ఉంటుందని కదా అందరూ అనుకుంటారు… నువ్వు కూడా దాన్ని కాపాడుకున్నావు కదా ఇన్నేళ్లూ… మరి హఠాత్తుగా ఈ కొత్త వైరస్ ఎక్కడి నుంచి వచ్చి సోకింది నీకు..?

పోతే పోనీ, జయమ్మ పంచాయితీలో డబ్బు పోతే పోనీ… ఆ సినిమా రిలీజ్ టైమ్‌లోనే అందరికీ తెలుసు దాని భవిష్యత్తు… ఏదో ప్రయత్నించావు, దెబ్బ కొట్టేసింది… జానేదేవ్… ఎంత ప్రయత్నించినా కొడుకు హీరోగా లాంచయ్యేట్టు కనిపించడం లేదు… సరే, ఇంకా ఇంకా ప్రయత్నించొచ్చు… అంతేతప్ప ఒకేసారి మతి చెడగొట్టుకుని, ఇలా నీ షోలలో బుగ్గలు కొరుకుడు ఘట్టాలకు దిగిపోతే ఎలా..? ప్లీజ్… అక్కడే ఆగిపో… రెయిన్ డాన్సులు, లిప్ లాకులు గట్రా చేయించకు తల్లీ…

అవునూ, ఓ డౌటనుమానం… ఈటీవీ వాళ్లు తమ చానెల్‌ను గాలికి వదిలేశారా..? ప్రోగ్రాముల్లో నాణ్యతను పట్టించుకోవడం లేదు… ఎవడు వస్తున్నాడో, ఎవడు పోతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు… ఇప్పటికే మూడో ప్లేసుతో చానెల్ రేటింగ్స్‌లో వెలవెలపోతోంది… ఫాఫం, ఎలాంటి టీవీ… ఎక్కడికి పడిపోతోంది..?! ఈమధ్య ఆలీతో సరదాగా, వావ్ కూడా రేటింగుల్లో దెబ్బతిన్నాయి… ఇక ఢీ, జబర్దస్త్, డ్రామా కంపెనీలో గందరగోళం అందరికీ తెలిసిందే… ఈటీవీ యాజమాన్యం కొంపదీసి ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేసిందా చానెల్ నిర్వహణను..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions