#RKisRight… అడ్డెడ్డె… షర్మిల వార్త కవరేజీతో బాగా ముందుకెళ్లిపోయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… తను అంతకుముందు పెట్టుకున్న కొన్ని నిషేధాలు కూడా సడలించేసి, లేదా మరిచిపోయి ఏదేదో రాసేస్తున్నాడు… అబ్బే, సాక్షికి వ్యతిరేకంగా తమరి ఆగర్భ శతృత్వాన్ని వదిలేస్తే ఎలా సార్..? మీ ఫ్యాన్స్ ఏమైపోతారు..? మీ ట్రోల్ ఫ్యాన్స్ ఎటుపోవాలి..? హహహ… నిజం… ఆర్కే ఎప్పుడూ తన పత్రికలో సాక్షి అనే పత్రిక పేరు రాయడు, రాయించడు, రాస్తే అనుమతించడు, సహించడు… అందుకే రాయాల్సిన సందర్భం వస్తే, ఏదో తప్పదు అన్నట్టుగా… జగన్ పత్రిక అని రాస్తారు… లేదంటే బ్లూ మీడియా అని రాయాలంటాడు… తన కొత్త పలుకులో అదే రాస్తాడు… కానీ తన రాజ్యాంగాన్ని తనే ఉల్లంఘించాడు రాధాకృష్ణ… సాక్షి అసలు పేరు రాశాడు తన పత్రికలో… ఎహె, ఇదేం వార్త అంటారా.,.? అసలు వార్త చదువుకుందాం ఓసారి…
చూశారు కదా… జగన్ పత్రిక అనకుండా సాక్షి అని రాసుకున్నాడు… కనీకనిపించని వార్తే అయినా సరే, సాక్షికి వెక్కిరించే సందర్భం వచ్చింది కదా అని తన నిషేధాన్ని తనే మరిచిపోయాడు… గుడ్… నిజానికి సాక్షి కూడా ఆంధ్రజ్యోతి పేరు రాయదు… అసలు దాన్ని ఓ పత్రికగానే గుర్తించదు, జస్ట్, తోకపత్రిక అని రాస్తుంది… సరే, ఇదంతా మీడియా వార్… ఏవేవో రూల్స్, నిషేధాలు పెట్టుకుంటారు, మనం నవ్వుకుంటాం… కానీ… సాక్షిలో వార్తల ప్రయారిటీని కూడా గుర్తించి, విశ్లేషించి ఓ వార్త రాయడం విశేషమే… గుడ్, వెరీ గుడ్… ఇకపై సాక్షి కూడా అలాగే రోజూ ఆంధ్రజ్యోతి వార్తల ప్రయారిటీల మీద కూడా వార్తలు పబ్లిష్ చేయాలి… ఒకరి బట్టలు ఒకరు విప్పుకోవాలి… సగటు పాఠకుడు కోరుకునేది అదే… ఒక పత్రిక లోగుట్టు మరో పత్రికకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది… వాళ్లూ వాళ్లూ తన్నుకుని పాఠకులకు అసలు నిజాల్ని చెబుతుండాలి… వాళ్ల పాత్రికేయాల్ని వాళ్లే బరిబాతల బజారులో పెట్టుకోవాలి… ఇప్పుడంటే షర్మిల వార్తల కవరేజీ మీద రాశారు, దాన్నలాగే ఇతర వార్తల విషయంలోనూ విశ్లేషణల పరిధిలోకి తీసుకురావాలి ఆంధ్రజ్యోతి, ఆ స్పిరిట్‌ను సాక్షి అందిపుచ్చుకోవాలి… ఈనాడును వదిలేయండి, దాన్ని ఆ పత్రిక పాఠకుడే పట్టించుకోవడం లేదు… ఒక వెలుగు, ఒక నమస్తే తెలంగాణ పాత్రికేయ ఘర్షణలాగే… ఒక సాక్షి, ఒక ఆంధ్రజ్యోతి ఘర్షణ ఇలాగే నాలుగు కాలాలపాటు వర్ధిల్లి (వర్దెల్లి కాదు) పాఠకులకు మనోరంజకంగా కొనసాగుగాక..!! ఈ నిందాపూర్వక వార్తల్లో సత్యం నినదించుగాక..!!
Ads
Share this Article