Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హుర్రే… ఎట్‌లాస్ట్ కేసీయార్ మొబైల్ ఎలా వాడాలో నేర్చుకున్నాడోచ్…

January 28, 2025 by M S R

.

ఓ చిన్న వార్త… తొలుత ఆశ్చర్యం వేసింది… తరువాత నవ్వొచ్చింది… విషయం ఏమిటంటే…?

కేసీయార్ తన మనవడు హిమాంశు దగ్గర సెల్ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకున్నాడట… ఇప్పటివరకు తనకు సెల్ ఫోన్ వాడటం తెలియదట…

Ads

ఇప్పుడిప్పుడే కొందరి నంబర్లు ఫోన్‌లో సేవ్ చేయడం ఎలాగో కూడా తెలుసుకున్నాడట… ఫాఫం మొన్నటివరకూ ‘ఎవరితో మాట్లాడాలి, ఫోన్ కలిపి ఇవ్వు, మాట్లాడతా’ అంటూ ఎవరో ఒకరి మీద ఆధారపడేవాడట…

kcr

తన వద్దకు వచ్చిన వారిని, వెంట ఉండేవారిని అడిగేవాడట… హమ్మయ్య ఎట్టకేలకు ఫోన్ వాడటం ఎలాగో నేర్చుకున్నాడట… అదే ఆ వార్త… ఆంధ్రజ్యోతిలో కనిపించింది…

ఈ వార్త వెనుక అజ్ఞానం ఉందా..? అలవిమాలిన నిర్లక్ష్యం ఉందా..? అంతకుమించి ఆంధ్రజ్యోతి బాపతు మార్మిక దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా..? ఇన్ని ప్రశ్నలు కందిరీగల్లా ముసురుకున్నాయి ఆ వార్త చూడగానే…

చిన్న సింగిల్ కాలమ్ బిట్… నిజానికి దానికి ఏ ప్రాధాన్యమూ లేదు… అసలు చదువు రానివాళ్లు, ముసలోళ్లు, చిన్న పిల్లలు… ఎవరైనా సరే సెల్ ఫోన్ వాడటం అత్యంత సులభం… అన్ని యాప్స్, మెయిల్స్ గట్రా ఆపరేట్ చేయడం వేరు… ఆఫ్టరాల్ కాల్స్ చేయడం వేరు…

పైగా కేసీయార్… తను అంతటి మహా కాలేశ్వరం ప్రాజెక్టును విశ్వశ్వరయ్య స్థాయిలో డిజైన్ చేసినవాడు… విద్యుత్తు ప్రాజెక్టులకు రూపకల్పన చేసినవాడు… అసెంబ్లీలో స్వయంగా కాలేశ్వరం ప్రజెంటేషన్ ఇచ్చినవాడు… ఈ సెల్ ఫోన్స్ వాడటం రాదా తనకు..?

పోనీ, ఎప్పుడూ తన వెంట ఉండి మందు గోలీలు అందించే సంతోష్ ఫోన్ నంబర్స్ కలిపి ఇవ్వడానికి ఈమధ్య సరిగ్గా తనతో ఉండటం లేదనే అనుకుందాం… ఇన్నేళ్లూ కవిత లేదా కేటీయార్ కనీసం సెల్ ఫోన్ ఎలా వాడాలో నేర్పించలేదా..? చివరకు మనమడు పూనుకుని నేర్పించాల్సి వచ్చిందా..?

నాకు తెలిసి… కాల్స్, మెసేజులు పక్కన పెట్టండి… తను మొబైల్‌లో ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చూస్తాడు.., కొన్ని సైట్లు ఫాలో అవుతాడు.., మరి మనవడు ఏం నేర్పించాడబ్బా… రాధాకృష్ణ పత్రిక ఇలా ఎందుకు మారిపోయిందబ్బా… కొత్త సంపాదకత్వ నైపుణ్యమా..? కాలగతిలో కొన్ని వార్తావిపత్తులు చూడాల్సి వస్తుంది అంటే ఇలాంటివేనా..?

విశాలమైన తన ఫామ్ హౌజులో మనవడికి మొక్కలు ఎలా నాటాలో, వ్యవసాయం ఏమిటో నేర్పిస్తున్న ఫోటోలో చూసినట్టు గుర్తు… మొత్తం రకరకాల పంటలు మానేసి 150 ఎకరాల్లో వెదురు సాగుకు పూనుకున్నాడనే వార్త కూడా చదివినట్టు గుర్తు… అది ఆంధ్రజ్యోతిలోనా, వేరే పత్రికా గుర్తులేదు… పోనీ, ఈ సెల్ ఫోన్ వార్తకు మాస్ట్ హెడ్ పక్కన బాక్సు కట్టలేకపోయావా మాస్టారూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions