హమ్మయ్య… ఎట్ లాస్ట్… చిరంజీవి తమ్ముడు నాగబాబుకు మళ్లీ ఓ కొలువు దొరికింది… అదే నవ్వే ఉద్యోగం… కామెడీ షోలో జడ్జిగా కూర్చుని, పకపకా నవ్వడమే… కామెడీ స్టార్స్ అని మాటీవీలో ఓ కామెడీ షో వస్తుంది తెలుసు కదా… నిన్నమొన్నటిదాకా శేఖర్ మాస్టర్ ఒక జడ్జిగా ఉండేవాడు… ఆ ప్లేసు ఖాళీ అయినట్టుంది… తనే ఇక భరించలేక పారిపోయాడో, మళ్లీ ఈటీవీ వాళ్ల ఢీ షో రారమ్మని పిలిచిందో జంప్… ఆ కుర్చీలోకి నాగబాబు చేరిపోయాడు… ప్రోమోలు కనిపిస్తున్నయ్… ఆ శ్రీముఖి ‘టీవీ ఆడియెన్స్ మిమ్మల్ని చాలా మిస్సయ్యారు, ఎందుకింత టైం పట్టింది సార్..?’ అని అడగడం, ‘కొన్నిసార్లు అలా లేటవుతుంది, మనమేం చేయలేం’ అని నాగబాబు రిప్లై ఇవ్వడం కూడా కనిపిస్తోంది… అంటే టెంపరరీ జడ్జి కాదన్నమాటే… ఇక ఫిక్స్ అన్నమాటే… ఆ ప్రోమో ట్యాగ్ లైన్లో మాటీవీ వాడు ‘ఇక పీక్స్‌లో ఎంటర్టెయిన్మెంట్ ఫిక్స్’ అని కూడా రాసేశాడు…
నిజానికి తనకు ఈటీవీ జబర్దస్త్‌లో మంచి కొలువు ఉండేది… తనున్నన్ని రోజులూ రోజా పెత్తనమేమీ లేదు… అంతా నాగబాబు పెత్తనమే నడిచేది… కానీ మల్లెమాలతో పడనట్టుంది… మీ జబర్దస్త్ అంతు చూస్తాను అన్నట్టుగా కొందరు కమెడియన్లను, అక్కడి ఇద్దరి డైరెక్టర్లను పట్టుకుని జీతెలుగులోకి వచ్చి పడ్డాడు… ఇద్దరుముగ్గురు పాత కమెడియన్లూ జతకలిశారు… అదిరింది అని స్టార్ట్ చేశారు… ప్చ్, అది కాస్తా బెదిరింది, జీటీవీ వాడి కల చెదిరింది, ఎక్కడో ముదిరింది… నాగబాబు బయటికి వచ్చేశాడు, ఆ దెబ్బకు ఆ షోయే ఆగిపోయింది… తరువాత యూట్యూబ్‌లో ఏదో స్టాండప్ కామెడీ పోటీలు అని కొన్నిరోజులు కాలం గడిచింది… మధ్యలో కొన్నిరోజులు రాజకీయానికి సరిపోయింది… మరి వాట్ నెక్స్ట్..?
Ads
ఆ నెక్స్ట్ పేరే కామెడీ స్టార్స్… ఆ జడ్జిల్లో ఒకరు మాజీ నటి శ్రీదేవి… ఆమెకు నవ్వడమూ తెలియదు, స్పాంటేనిటీ లేదు… ఈమధ్య శ్రీముఖి వచ్చి చేరింది… ఇప్పుడిక నాగబాబూ వచ్చాడు… నిజానికి అక్కడ స్కిట్లలో చేసేవాళ్లకు మెరిట్ ఉంది, కానీ సరిగ్గా ఆ ప్రోగ్రాంను జనరంజకంగా తీర్చి దిద్దలేకపోతున్నారు ఎందుకో మరి… అన్నట్టు, ఓ విషయం చెప్పాలి కదా… రీసెంటు బార్క్ రేటింగుల్లో ఈ ప్రోగ్రాం పొజిషన్ తెలుసా..? మరీ హాశ్చర్యపోకండి… జస్ట్, 1.82… (హైదరాబాద్ కేటగిరీ)… అంటే దారుణాతి దారుణమైన ఫ్లాప్ అని లెక్క… ఈ సిట్యుయేషన్లో నాగబాబు ఎంటరయ్యాడు… చూడాలిక… రీసెంట్ ప్రోమోలో ఓ కేరక్టర్ కనిపించింది… బిగ్‌బాస్ నుంచి అనారోగ్యంతో బయటికి వచ్చిన జెస్సీ అనే మోడల్… బిగ్‌బాస్ టీం అంతా కొన్నాళ్లు మాటీవీకి సేవ చేయాల్సిందే కదా… అదేదో ఒప్పందం కూడా ఉంటుందట… రీసెంట్ ఎపిసోడ్లో ‘‘సిరి-షణ్ముఖ్’’ చెత్త రొమాన్స్ మీద సెటైర్లు కూడా వేసినట్టున్నారు… నిజమే, ఆ జంట మరీ అసహ్యం పుట్టిస్తోంది ఆ హౌజులో… కానీ అదే మాటీవీలో, కామెడీ షోలో సెటైర్ వేయించడం మాత్రం భలే అనిపించింది…!! అవునూ, ఇంతకీ శేఖర్ మాస్టర్ ఢీ షోకు ఫిక్సయిపోయినట్టేనా..? గణేష్ మాస్టర్ కొలువు ఉన్నట్టా, పోయినట్టా..?!
Share this Article