బిగ్ ఫ్రాడ్..! నాగార్జున కూడా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు… అంతా ఫిక్సింగే……. ఇది నెటిజనం నుంచి బలంగా వినవస్తున్న విమర్శ… అంతెందుకు..? బిగ్‌బాస్ ఓటింగులో ఎవరికెన్ని వోట్లు పడ్డాయో ప్రకటించాలంటూ తెలంగాణ జాగృతి అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట ఆందోళన… రవికి అన్యాయం జరిగిందని విమర్శ… నిజానికి ఈ బైఠాయింపులు, ఆందోళనల్ని మనం సమర్థించనక్కర్లేదు… ఆ ఫిక్సింగ్ డ్రామా గేమ్ కోసం జాగృతి మరీ దిగజారాల్సిన అవసరం అంతకన్నా లేదు… ఇందులో తెలంగాణ, నాన్-తెలంగాణ అనే కోణం అస్సలు లేదు… (నిజానికి వాళ్ళు కేవలం రవి ఫ్యాన్స్ అయి ఉంటారు)… కానీ వారి ఆరోపణల నేపథ్యంలో మనమూ కొన్ని చెప్పుకోదగిన పాయింట్స్ ఉన్నయ్… 1) ఇన్ని వారాలుగా దాదాపు ప్రతివారం రవి నామినేట్ అవుతూనే ఉన్నాడు, కానీ ఎప్పుడూ లీస్ట్ వోట్లు రాలేదు… 2) తను టాప్ ఫైవ్ లిస్టులో ఉండాల్సిన బలమైన కంటెస్టెంట్… 3) అకస్మాత్తుగా అందరికన్నా తక్కువ వోట్లు ఎలా వచ్చినయ్..? 4) అసలు హౌజులో ఉన్నవాళ్లలో మరీ వీక్ కంటెస్టెంట్లు, వోట్ల రిగ్గింగు గట్రా వదిలేస్తే, జనం ఈసడించుకుంటున్న కేరక్టర్లు ప్రియాంక, సిరి, కాజల్, షణ్ముఖ్, సన్నీ… మరి రవి ఎలా ఒకేసారి వీక్ అయిపోయాడు…
5) అసలు బిగ్‌బాస్ వోటింగ్ వివరాలెప్పుడూ ప్రకటించబడవు, అదంతా ఓ ముందస్తు అగ్రిమెంట్లు, ఫిక్సింగుల ప్రకారం నడిచే ఓ గేమ్… డ్రామా… అందులో ఇప్పుడు బకరా రవి… 6) బిగ్‌బాస్ టీంలోని ముఖ్యులు ఏది అనుకుంటే అదే… రకరకాల రాగద్వేషాలు… 7) నిజానికి బిగ్‌బాస్ టీం గేమ్ ప్లాన్ ప్రకారమే అంతా నడుస్తుంది, కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం నాగార్జున కనిపిస్తుంటాడు… దీంతో రవి ఎలిమినేషన్ ద్వారా తన ఇజ్జత్ పోగొట్టుకున్నది నాగార్జున… 8) సన్నీని ముందుపెట్టి ఈసారి రవి ఎలిమినేషన్ గేమ్ నడిపించింది బిగ్‌బాస్ టీం… 9) సన్నీకి తెలియదా, కాజల్‌కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇస్తే, రవి వెళ్లిపోతాడని… ఇన్ని వారాలు ఫేక్ ఫేక్ అంటూ రవిని టార్గెట్ చేసి, ఇప్పుడేమో ఏడుస్తూ, తెగ ప్రేమ నటించడం అంతా స్క్రిప్టెడే కదా… 10) ఈ మొత్తం నాటకంలో కాస్త హుందాగా, పరిణతిలో కనిపించింది కేవలం శ్రీరామచంద్ర… తనకు అంతా అర్థమైనట్టుంది బహుశా…
Ads
నిజానికి చాలా వెబ్‌సైట్లు పోల్స్ నిర్వహిస్తూ ఉంటయ్… వాటిల్లో ట్రెండ్ ప్రకారం కాజల్, సిరి, ప్రియాంక… ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వెళ్లిపోతారని అందరూ గెస్ చేశారు… ప్రత్యేకించి సిరి అందరినీ చిరాకెత్తిస్తోంది… ప్రియాంక సరేసరి… ఎప్పుడూ బలమైన కంటెస్టెంట్ కాదు… కాజల్ గేమరే కానీ ఎందుకో నెటిజనానికి పెద్దగా నచ్చడం లేదు… ఇక అర్థం లేని ఆవేశానికి, మూర్ఖపు దూకుడు మాటలకు పేరొందిన సన్నీ… మొదటి నుంచీ హోప్‌లెస్ గేమ్ ఆడుతున్న షణ్ముఖ్… వాళ్లెవరికీ లేని ఎలిమినేషన్ రవిని ఎందుకు వరించింది..? అఫ్ కోర్స్, ఈ ఆఫ్టరాల్ గేమ్‌లో ఎవడు పోతేనేం, ఎవడు గెలిస్తేనేం… కానీ జనం సొమ్ముతో నడిచే ఆట అది… కొన్ని కోట్ల యాడ్స్ దందా అది… తెలుగు టీవీ తెర మీద అత్యంత కాస్ట్‌లీ రియాలిటీ షో… సో, విమర్శో, సమీక్షో జరిగితే తప్పులేదు… దాన్ని ఎవడు చూడమన్నాడు అంటారా..? అదీ నిజమే లెండి… మరీ ఈసారి సీజన్ చూసేవాళ్లకు ఇప్పుడు అనిపిస్తున్నది కూడా అదే…!!
Share this Article