Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎట్టకేలకు రాష్ట్రపతి సర్వాధికారాల్ని సుప్రీంకోర్టు గుర్తించి వెనక్కి తగ్గింది..!!

November 20, 2025 by M S R

.

నిజానికి జాతి మొత్తం ఎదురు చూసింది ఈ తీర్పు ఎలా ఉంటుందీ అని..! కొలీజియమే అల్టిమేట్, నువ్వు తెచ్చిన జుడిషియల్ కమిషన్ మేం గుర్తించముపో అంటే మోడీకి తదుపరి చర్య ఏమీ చేతకాలేదు…

పైగా సుప్రీంకోర్టు చాలా విషయాల్లో తన పరిధి దాటి వ్యవహరిస్తుందనే భావన నెలకొంటోంది… సుప్రీంతో డీల్ చేయడంలో మోడీ వైఫల్యమూ విమర్శలకు గురవుతోంది… ఈ స్థితిలో ఏకంగా రాష్ట్రపతికే బిల్లుల ఆమోదానికి గడువు పెట్టింది…

Ads

రాష్ట్రపతి నా అధికారాలకు, నా విచక్షణాధికారానికి స్పాట్ పెడుతున్నారా అని నేరుగా అనలేక క్లారిటీ అడుగుతూ కొన్ని ప్రశ్నలు సంధించింది… ఒకవేళ సుప్రీంకోర్టు గనుక ఎస్, మేం చెప్పిందే ఫైనల్ అని ఉంటే కథ వేరేగా ఉండేది…

ఒకరకమైన రాజ్యాంగ, పాలన సంక్షోభం తలెత్తేది… అఫ్‌కోర్స్, మోడీ కిక్కుమనకపోయేవాడేమో… కానీ రాజ్యాంగ వ్యవస్థల నడుమ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎవరి అధికారాలేమిటో సుప్రీం ఎట్టకేలకు గుర్తించి… బిల్లుల ఆమోదానికి గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి, గడువు లేవని స్పష్టం చేసింది…

“Deemed Assent లేదు… గవర్నర్/రాష్ట్రపతికి టైమ్‌లైన్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం!” అని తేల్చేసింది… భారత రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్, రాష్ట్రపతి పాత్రలపై ఎన్నో సంవత్సరాలుగా చర్చ సాగుతోంది… ముఖ్యంగా, కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులు అలాగే ఆమోదం చెప్పకుండా నిలిపి ఉంచడం, ఆలస్యం చేయడం, తిరిగి పంపకపోవడం వంటి విమర్శలు వస్తుండడంతో — తరువాత సుప్రీం తీర్పుల నేపథ్యంలో రాష్ట్రపతి ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టుని వివరణ కోరింది…

అందుకు సుప్రీంకోర్ట్ ఇచ్చిన సమాధానం భారత రాజ్యాంగ వ్యవస్థకు చాలా కీలకమైనది… కొన్ని రాష్ట్రాలయితే గడువులోపు ఆమోదం పొందలేదు అని చెప్పేసి, అదే ఆమోదంగా భావించి కొన్ని చట్టాల అమలుకు నోటిఫికేషన్లు కూడా జారీ చేసేస్తున్నాయి… మరీ తెగబడే టీఎంసీ, డీఎంకే ముందువరుస ఇందులో…

  • నిజానికి దేశంలోని వ్యవస్థల నడుమ సమన్వయమే కాదు… అధికారాలకు పరిమితులున్నాయి… ఒకరి జూరిస్‌డిక్షన్‌లోకి మరొకరు వెళ్లకూడదు… కాగ్, ఎన్నికల సంఘం, సుప్రీం, పార్లమెంటు… ఇలా… కొన్ని రాష్ట్రాలు భావించినట్టుగా “గవర్నర్ నిర్ణీత టైమ్‌లో సైన్ చేయకపోతే బిల్లు ఆటోమేటిక్‌గా ఆమోదించబడింది” అన్న కాన్సెప్ట్ రాజ్యాంగంలో లేదు…

సుప్రీంకోర్ట్ మాటల్లో… “Deemed assent అనేది గవర్నర్ అధికారాన్ని కోర్టు స్వాధీనపరుచుకోవడమే… ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం…” చాలా ఇంపార్టెంట్ తీర్పు ఇది…  కోర్టు ఏమంటున్నదీ అంటే..?

‘‘రాజ్యాంగం Articles 200, 201 ద్వారా గవర్నర్/రాష్ట్రపతికి ఒక elastic, discretionary space ఇచ్చింది… కోర్టు “10 రోజుల్లో సైన్ చేయండి / తిరస్కరించండి” అనే విధంగా టైమ్‌లైన్ ఇవ్వదు… ఇలా చేస్తే జ్యూడిషియరీ – ఎగ్జిక్యూటివ్ మధ్య balance దెబ్బతింటుంది… మరి గవర్నర్ బిల్లులు పట్టుకుని అలాగే పెండింగులో ఉంచితే…?

  • సుప్రీంకోర్ట్ సమాధానం కూడా చాలా బ్యాలెన్స్‌డ్… ‘‘గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా నెలలు, సంవత్సరాలు గడిపితే… ప్రజాస్వామ్య ప్రక్రియ తనంతటతాను అపహాస్యం పాలవుతుంటే, లెజిస్లేచర్ పనిలో పక్షపాతం కనిపిస్తే… అప్పుడు కోర్టు పరిమిత హద్దుల్లో జోక్యం చేయవచ్చు…’’

“మీరు నిర్ణయం తీసుకోండి —అనుమతి ఇవ్వండి అనో, తిరస్కరించండి అనో, రిజర్వ్ చేయండి అనో…
కానీ నిర్ణయం తీసుకోకుండా ఉంచడం మాత్రం సరైంది కాదు… కానీ కోర్టు బిల్లు గురించి వ్యాఖ్యానం చెయ్యదు… గవర్నర్ నిర్ణయం ఎలా ఉండాలి అనేది కూడా చెప్పదు…

గవర్నర్‌కు రాజ్యాంగం ఇచ్చిన మూడు ఆప్షన్లు (Article 200)… బిల్లు గవర్నర్‌కి వెళ్ళిన తర్వాత ఆయనకు…:

1️⃣ Assent ఇవ్వడం
2️⃣ Assent ఇవ్వకుండా, కారణాలతో తిరిగి పంపడం
3️⃣ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం

“Hold చేయడం” (indefinite delay) technically possible కానీ constitutionally ideal కాదు — అందుకే కోర్టు limited mandamus అనుమతించింది… రాష్ట్రపతికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది… Article 201 కింద రాష్ట్రపతికి కూడా timeline లేదు…

.
కోర్టు ఏమంటున్నదీ అంటే… రాష్ట్రపతి/ గవర్నర్ constitutional authorities… వీరి అధికారాలను కోర్టు నియంత్రించదు… timelines impose చేయడం separation of powers కి విరుద్ధం.. ఇది భారత ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగ సంస్థల మధ్య సమతుల్యత‌ను కాపాడిన కీలక తీర్పు…..

  • చివరగా… సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు ఆమోదం, ప్రమాణస్వీకారం మాత్రమే గాకుండా… ప్రతి చట్టానికీ ఆమోదం తెలపాల్సింది రాష్ట్రపతి… ఆ పోస్టుకు అల్టిమేట్ పవర్ ఉంది… మొదట్లో ఉపేక్షించినా చివరకు సుప్రీంకోర్టు ఆ అధికారాన్ని గుర్తించి వెనక్కి తగ్గింది…

Inputs from  ఉపద్రష్ట పార్ధసారధి    #PardhaTalks #SupremeCourt #Governor #President #BillsAssent #IndianConstitution #Judiciary #Federalism #SeparationOfPowers #Article200 #Article201

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎట్టకేలకు రాష్ట్రపతి సర్వాధికారాల్ని సుప్రీంకోర్టు గుర్తించి వెనక్కి తగ్గింది..!!
  • కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్…! ఏం జరుగుతోంది..?!
  • కృత్రిమం కృత్రిమమే… ఏఐతో జర జాగ్రత్త… గుడ్డిగా నమ్మొద్దు…!!
  • ‘‘రాజమౌళిని మించి తెలుగు హీరోకు ఎలివేషన్ ఇవ్వాలి ఎప్పటికైనా…’’
  • సుదీర్ఘ నక్సలైట్ల ప్రస్థానానికి తెలంగాణ పోలీసుల ఫినిషింగ్ పంచ్..!!
  • నాస్తిక రాజమౌళి వారణాసి సినిమాలో… ఓ తాంత్రిక దేవత..!!
  • అండ పిండ బ్రహ్మాండ జ్ఞానబోధ…! ఉపాసనపై భారీ ట్రోలింగ్ ఎందుకంటే…!!
  • తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లు పునర్జన్మల్లోనూ అలాగే పుడతారు..!!
  • నా పేరు ఇందిర… లోపలకు రావచ్చా… తినడానికి ఏమైనా ఉందా..?
  • చెల్లి పెళ్లికూతురు… అక్క ఈ ఇంట్లో బందీ… రక్తికట్టిన ఓ ఎపిసోడ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions