….. ఈ సారు గారి పేరు ప్రశాంత్ నాయర్… 2006 యూపీఎస్సీ ఫోర్త్ ర్యాంకు కొట్టాడు… కేరళ కేడర్ ఐఏఎస్… పెళ్లయింది, ఇద్దరు పిల్లలు… కానీ కాస్త తిక్క కేసు… ఎంత తిక్క అంటే తనకే లెక్క తెలియనంత తిక్క… కాకపోతే ఆ తిక్కకు ఓ వుమెన్ జర్నలిస్టు బజారుకెక్కాల్సి వచ్చింది… ఆమధ్య Sudden Sensorineural Hearing Loss (SSHL) ప్రాబ్లం తలెత్తి అకస్మాత్తుగా వినికిడి శక్తి కూడా కోల్పోయాడు… సరే, తన కెరీర్లో, తన సర్వీసులో ఇంకా ఏమేం ఘనకార్యాలు చేశాడో గానీ… ప్రస్తుతం కేరళ స్టేట్ ఇన్లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు… డీప్ సీ ఫిషింగ్‌కు సంబంధించి ఓ అమెరికా కంపెనీతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది… దాని మీద ప్రతిపక్షాలకు మస్తు డౌట్లున్నయ్… మాతృభూమి పత్రిక తరఫున పనిచేసే ప్రవిత ఒక న్యూస్ ఫైల్ చేస్తూ, ఈ సారు వివరణ కోసం ట్రై చేసింది… ‘అయ్యా, ఓ వార్త గురించి వివరణ కావాలి, మీతో ఇప్పుడు మాట్లాడొచ్చా’ అంటూ ఓ మెసేజ్ పెట్టింది…
…. 15 ఏళ్లుగా సర్వీసులో ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఎలా స్పందించాలి..? పైన ఫోటో చూశారు కదా… ఒకాయన వెక్కిరిస్తున్నట్టుగా ఓ స్టిక్కర్ పెట్టాడు… ఈమె కాస్త షాక్ తిన్నది… మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ వివరణ కోసమే ట్రై చేస్తున్నాను అంటూ మళ్లీ మెసెజ్ పెట్టింది… ఈసారి ఓ లేడీ వీపు చూపిస్తున్న స్టిక్కర్ పెట్టాడు… రిపోర్టర్‌కు కాస్త ఇబ్బంది అనిపించి, అయ్యా, ఇదేం స్పందన అని మెసేజ్ పంపించింది… అప్పటికీ మన సారు గారు సోయిలోకి రాలేదు… ఓ లేడీ కెవ్వున అరుస్తున్నట్టుగా మరో స్టిక్కర్ పెట్టాడు… దాంతో ఆమెకు తిక్కరేగి… ‘‘ఓ బాధ్యత కలిగిన ప్రభుత్వ హోదాలో ఉన్నవ్, ఇదేం అశ్లీలత..? నీ ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేస్తాను, ముందు మహిళలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో…’’ అంటూ ఓ ఘాటు మెసేజ్ పెట్టింది…
…. ఐననూ సారు గారి తెలివి చక్కబడలేదు… వార్తలు లాగడానికి భలే ఎత్తువేశావ్, కానీ సారీ, ఇలాంటివి తప్పు, నాదగ్గర కుదరవు అంటూ మెసేజ్ పంపించాడు… ఆమె హర్టయి తన ఎడిటర్‌కు చెప్పింది… అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిపెట్టింది… ఎడిటర్ ప్రశాంత్ సారు గారికి ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదు సరికదా, ఆ స్టిక్కర్లను డిలిట్ చేశాడు… స్కావెంజర్స్ అంటూ మరో చెత్తా కామెంట్ పెట్టాడు… ఇదంతా జరిగింది గత ఫిబ్రవరిలో… జర్నలిస్టు యూనియన్ ఎంటరైంది… చర్చించింది… ఢాంఢూం వాడి అంతు చూద్దామనుకున్నారు పెద్దలంతా… ఫిర్యాదులు, విజ్ఞాపనలు గట్రా చాలా నడిచినయ్… ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు…
Ads
…. ఒక లీడింగ్ డెయిలీ… ఓ సీనియర్ రిపోర్టర్, అందులోనూ ఓ లేడీ రిపోర్టర్… తనకు ఓ సీనియర్ ఐఏఎస్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఎదురైతే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన ఉండాలి కదా… లేదు… చీఫ్ సెక్రెటరీకైనా సోయి ఉండాలి కదా… లేదు… ఎట్టకేలకు జర్నలిస్టు యూనియన్లు ఉమ్మడిగా ముఖ్యమంత్రి పినరై విజయన్‌కు హెచ్చరిక వంటి చివరి విజ్ఞప్తిని ఈమధ్య ఇచ్చారు… హమ్మయ్య, సీఎం కదిలాడు… పోలీసులు ఆ ఐఏఎస్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… ఇది ఇంకా ముందుకు పోతుందా..? సదరు ఐఏఎస్‌కు శిక్ష పడుతుందా…? భలేవారే, మీకు మన సిస్టమ్స్ మీద బాగా భ్రమలున్నట్టున్నయ్…!!
Share this Article