.
నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అన్నాడు కదా మొన్నామధ్య కేసీయార్… ఎందుకోగానీ హఠాత్తుగా గుర్తొచ్చాయి ఆ మాటలు… కాలేశ్వరం అక్రమాల మీద కేసు వేసిన రాజలింగం దారుణ హత్య వార్త చదివాక…
లింక్ ఉందో లేదో తెలియదు, కానీ అంతకుముందు హైకోర్టు అడ్వొకేట్ల దంపతుల హత్య… రేపు విచారణ అనగా దారుణ హత్య… ఈరోజుకూ అది తేలలేదు, తేలదు, తేలుతుందనే నమ్మకమూ లేదు ఎవరికీ… ఆరోజు కేసీయార్ బర్త్ డే…
Ads
ఇప్పుడు కేసీయార్ బర్త్‌డే జస్ట్, రెండు రోజులు… కాలేశ్వరం పిటిషనర్ నడిరోడ్డు మీద శవమయ్యాడు… అబ్బే, అది ఏదో భూతగాదా హత్య అన్నట్టుగా కవరింగు మొదలైంది… అది అసలే పుట్ట మధు సామ్రాజ్యం… నిజం చెప్పాలంటే కేసీయార్ కూడా మధు చెప్పినట్టు వినాల్సిందే, సమర్థించాల్సిందే… ఇలాంటివాళ్ల విషయంలో రేవంత్‌కు ఏదో చేతనవుతుందనే నమ్మకం అక్కడి జనంలోనూ లేదు… ఫాఫం… నువ్వు చివరి రెడ్డి పాలకుడివి అని చించుకునే గొంతులనే నువ్వు మూయించలేవు…
ఇక్కడ చెప్పుకోవల్సింది ఏమిటంటే..? ఈ రాజలింగం హత్యకు కారణాలు ఏమిటనేది రేపు కోర్టులు తేలుస్తాయా, తేల్చగలవా అని కాదు… రేవంత్ రెడ్డికి ఏం చేతనవుతుంది అని..! గవర్నర్ అన్ని రకాల క్లారిఫికేషన్లు, లీగల్ ఒపీనియన్లు తీసుకుని మరీ కేటీయార్ ఫార్ములా కేసు విచారణకు వోకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈరోజుకూ కేటీయార్ మీద ఈగ వాలలేదు…
రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, చేతకాదు, భయపడుతున్నాడు అనే సంకేతాలు జనంలోకి బలంగా వెళ్లాయి… నా మంత్రులే నన్ను పనిచేయనిస్తలేరు, ఈ కేంద్ర సర్వీసు అధికారుల్లో బాగా అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి వంటి ఏవో డొల్ల, డైవర్షన్ మాటలు తప్ప… గత ప్రభుత్వ అక్రమార్క బాధ్యుల్ని బుక్ చేయాలనే పట్టుదల, వ్యూహం లేవు తనలో… జస్ట్, మాటలేనా తనవి…? ఈ భావన జనంలోకి వెళ్తోంది బలంగా…
అనేక అక్రమాలు… కాలేశ్వరమే కాదు, థర్మల్ ప్రాజెక్టు, బాగోతాలు, ఎడాపెడా కరెంటు కొనుగోళ్లు, చత్తీస్‌గఢ్ కరెంటు, నమస్తే తెలంగాణకు యాడ్స్ స్కాం, ధరణి, గొర్రెల స్కీమ్ కుంభకోణాలు… వాట్ నాట్..? అనేకం… బోలెడు స్కీమలు, స్కాములు… ఏడాది దాటిపోయినా సరే, ఒక్కంటే ఒక్క అక్రమంపైనా రేవంత్ మార్క్ విచారణలు ఓ కొలిక్కి రాలేదు… ఎవరూ బోనులో నిలబడలేదు…
పక్కాగా అన్నీ ప్రిపేరైనా సరే ఎవరి అరెస్టూ లేదు… అందుకే నోటిదురుసు కాదు, ఇప్పుడు కావల్సింది తెలివైన ఎత్తుగడల రాజకీయం… బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్లు అంటారా..? సొంత పార్టీలోనే నిరసనలు, వ్యతిరేక పవనాలు… క్రెడిట్ కాస్తా కౌంటర్ ప్రాడక్ట్… చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు మస్తు ఇరకాటం… ఉంటామో ఊడతామో తెలియని దురవస్థ…
ప్రత్యర్థి శిబిరాన్ని కకావికలం చేయడం, తొక్కడం ఓ రాజకీయ కళ… అది కేసీయార్ చేసి చూపించాడు తన పాలనలో… ప్రజాస్వామిక స్పూర్తిని ఖండఖండాలుగా నరుకుతూ…! పైగా ఇంత జీవితాన్ని ఇచ్చిన ఇదే తెలంగాణ జనం మీద నన్ను ఓడిస్తారా అనే కోపంతో… తెలంగాణ ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే గంభీరంగా చూస్తూ ఉన్నాడట దొర… ప్రపంచంలోకెల్లా ఇంత స్పూర్తిమంతమైన అద్భుత ప్రజాజీవితం ఎవరికీ లేనట్టు ఆ ఫ్యాన్స్ చప్పట్లు…!
అబ్బే, కాంగ్రెస్ నచ్చి ఎవడూ వోటేయలేదు అనే ఓ తిక్క వ్యాఖ్య… ఇలాంటివి కేసీయార్ ఒక్కడికే సాధ్యం,,, కానీ తను చెప్పింది నిజమే… కాంగ్రెస్‌ను మెచ్చి, నచ్చి ఎవడూ దానికి వోటయలేదు, అది ఖచ్చితంగా నీ వ్యతిరేక వోటు, మళ్లీ నువ్వు కుర్చీ మీద అలాగే ఉంటావేమోననే జనం వెరపు, భయం… అంతేకదా దొరా..? కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది, నిజం…
కానీ అది పడిపోయి, రేవంత్ కూలిపోయి, మళ్లీ నువ్వు ఎక్కడ పగ్గాలు చేపడతావో అనేది కదా జనంలో అసలు భయం… ఆ భయమే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలకు దాస్యం అలవాటైన బీజేపీ పరమ దరిద్ర వైఫల్యాలు, నాయకత్వ రాహిత్యాల సాక్షిగా..!! అవునూ, ఇంతకీ రాజలింగం హత్య వెనుక అసలు కారణాలు కనిపెట్టి, జనానికి చెప్పగలవా రేవంత్ రెడ్డి సాబ్..?! కేసీయార్‌ను దించి, నువ్వేదో ఉద్దరిస్తావు అనుకున్న తెలంగాణ జనం ఆశలకు న్యాయం చేయగలవా..?!
Share this Article