వైసీపీ ఆఫీసు కూల్చివేత, దినపత్రికల అలవెన్స్ రద్దు వంటివి చెప్పుకున్నాం కదా… ఇది రెడ్‌బుక్ రాజ్యాంగంలోని మరో చర్య… ఇది నేరుగా, అధికారికంగా ఉండదు… పరోక్షం అన్నమాట…
జగన్ దారుణమైన ఓటమి పాలై… కేడర్ మొత్తం నిశ్శబ్దంలోకి జారిపోయాక… హఠాత్తుగా ఏపీలోని చాలాచోట్ల కొన్ని టీవీ చానెళ్ల ప్రసారాలు ఆగిపోయాయి… అబ్బే, అలాంటిదేమీ లేదే అని ఎవరు ఖండించినా సరే, మా అనుకూల చానెళ్లుగా చెప్పబడే చానెళ్ల ప్రసారాల్ని ఎంఎస్ఓల మెడలపై కత్తులు పెట్టి మరీ ఆపివేయిస్తున్నారు అని వైసీపీ మొన్నటి నుంచే గగ్గోలు పెడుతోంది…
వాళ్ల అనుకూల చానెళ్లు అంటే ఏవి..? ఆర్థికబంధాలో, ఇంకేం సంబంధాలో గానీ… సాక్షి ఎలాగూ జగన్‌దే… టీవీ9, ఎన్టీవీ… సరే, టెన్ టీవీ ఎక్కడో జాబితాలో ఎనిమిదో ప్లేసు కాబట్టి దాన్నలా పక్కన పెడితే… ప్రసారాలపై ప్రభావం పడింది ప్రధానంగా ఈ మూడు చానెళ్లే అనుకుందాం…
Ads
విశేషం ఏమిటంటే..? ఈ మూడూ టాప్-3 చానెళ్లు… బార్క్ రేటింగ్స్ చెబుతున్నదీ ఇదే… అదే ఇది …
TV9 Telugu 94.8 99.5
NTV Telugu 72.6 73.9
Sakshi TV 45.1 38.4
TV 5 News 33.0 33.0
ABN 24.6 25.9
ETV Andhra 22.1 25.3
మరి తరువాత..? 4, 5, 6 ప్లేసుల్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అనుకూల చానెళ్లు అన్నమాట… మొదటి మూడూ జగన్ డప్పులు అయితే ఇవన్నీ బాబు డప్పులు… ఏవీ శుద్ధపూసలు కావు… కాకపోతే టీవీ9, ఎన్టీవీ మరీ బోరవిరుచుకుని, జగన్ రంగు దట్టంగా పులుముకున్నట్టు కనిపించేవి కావు… న్యూట్రల్ అనే కలరింగు అయితే తప్పకుండా ఉండేది…
సరే, ఇప్పుడు వైసీపీ ఏం చేసింది..? న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది… ఫాఫం, అదేం చేయగలదు..? లాఠీలు పట్టుకుని ప్రతి ఎంఎస్‌వోను అదిలించో బెదిరించో మళ్లీ వైసీపీ అనుకూల చానెళ్ల ప్రసారాల్ని పునరుద్దరింపచేయలేదు కదా… ఏదో ఓ రిక్వెస్ట్ చేసింది… వాక్ స్వాతంత్ర్యం, సమాచారహక్కు వంటి పదాల్ని వాడి చానెళ్ల ప్రసారాలు ఆపడం అప్రజాస్వామికం, కాబట్టి ఆ చర్యకు పాల్పడొద్దు అని విజ్ఞప్తి చేసింది…
చానెళ్ల ప్రసారాలు ఆగిపోవడం ప్రభుత్వ చర్య కాదు ప్రత్యక్షంగా… కాకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ల పరోక్ష చర్య… దాన్ని నిలువరించడం ఎలా సాధ్యం..? తమకు ఇష్టమైన చానెళ్లను ప్రసారం చేయని ఎంఎస్ఓల కనెక్షన్లను రద్దు చేసుకుని, ఆయా కస్టమర్లు వేరే ఎంఎస్ఓల వైపు మళ్లాలి… కానీ అనేక చోట్ల అలా పోటీ వ్యవస్థలు కూడా లేవు… ఎంఎస్ఓల గుత్తాధిపత్యం…
ప్రసారాలు ఆపకపోతే అధికార పార్టీ నుంచి చిక్కులు తప్పవు ఎంఎస్ఓలకు… ఇది సిట్యుయేషన్… సో, ఎంఎస్ఓల మీద ఆధారపడటం ఎప్పుడైనా ఇలాంటి అయిష్ట ప్రభావాలకు లోనవడమే… అందుకే డైరెక్ట్ టు హోమ్ శాటిలైట్ ప్రసారాలకు ఇంకా ఇంకా డిమాండ్ పెరుగుతోంది… (సరే, వాటి మీద కూడా కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి, కానీ ఎంఎస్ఓలను బెదిరించినట్టు బెదిరించడం కష్టం…)
ఈ కోణంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చాలా నయం… ఇదే రేవంత్ మీద రోజూ టన్నుల కొద్దీ విషాన్ని, విద్వేషాన్ని చిమ్మిన టీన్యూస్, నమస్తే తెలంగాణ జోలికి పోలేదు… టీన్యూస్ ఆఫీసు తరలింపుపైనా మొదట్లో హడావుడి చేశారు గానీ ఇప్పుడు అదీ లేదు… నమస్తే తెలంగాణకు ప్రభుత్వ యాడ్స్ ఆపేయడం మినహా మరే కక్షసాధింపు చర్య లేదు… ఆ విషం గుమ్మరింత అలా కొనసాగుతూనే ఉంది… ఎంఎస్ఓలను బెదిరించి టీన్యూస్ ఆపేయడం… జగన్, కేసీయార్ జాన్‌జిగ్రీలు కాబట్టి, ఏపీలోలాగే సాక్షి, టీవీ9, ఎన్టీవీవలపై కత్తికట్టడం వంటివి ఏమీ లేవు..!!
Share this Article