Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!

June 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ఈ ఆత్మబలం ఆ ఆత్మబలం కాదు . అక్కినేని , బి సరోజాదేవి , జగ్గయ్యలు నటించిన ఆ ఆత్మబలంలో ఆత్మ అంటే Will . ఆత్మబలం అంటే Will Power… కానీ బాలకృష్ణ , భానుప్రియ , సిల్క్ స్మితలు నటించిన ఈ ఆత్మబలంలో ఆత్మ అంటే పునర్జన్మతో మళ్ళా వచ్చిన ఆ ఆత్మ …

హిందీలో 1980లో వచ్చిన కర్జ్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కర్జ్ అంటే బహుశా బాకీ , అంటే పగ , అనుకుంటాను . హిందీలో రిషికపూర్ , టీనా మునిం , సిమి గరేవాల్ , ప్రాణ్ , ప్రేమనాధులు నటించారు . హిందీలో కూడా బాగా ఆడలేదు .

Ads

అయినా మనవాళ్లు ధైర్యంగా రైట్స్ తీసుకుని రీమేక్ చేసారు . తాతినేని ప్రసాద్ దర్శకుడు . ఇక్కడ కూడా బాగా ఆడలేదు . ప్రధాన పాత్రలలో నటించిన బాలకృష్ణ , సిల్క్ స్మిత , భానుప్రియ బాగానే , కాదు బాగా , నటించారు …

జమీందార్ శరత్ బాబు సిల్క్ స్మితను ప్రేమిస్తాడు . విలన్ నంబియార్ స్మితను జమీందారుని పెళ్ళి చేసుకుని చంపేయమని హుకుం జారీ చేస్తాడు . పెళ్ళి అయి జమీనుకు వెళ్ళే మార్గంలో కాళీ మాత ఆలయం వద్ద జమీందారుని జీపుతో గుద్ది గుద్ది చంపేస్తుంది . జమీనుని హస్తగతం చేసుకుంటుంది . జమీందార్ తల్లిని , చెల్లెలిని బంగళాలో నుంచి బయటకు నెట్టేస్తుంది .

చంపబడిన జమీందార్ బాలకృష్ణగా తిరిగి పుడతాడు . పెద్ద పాప్ సింగర్ అవుతాడు . గత జన్మలోని బంగళా , ఇతర ప్రదేశాలను చూసాక బాలకృష్ణకు గత జన్మ గుర్తుకొస్తుంది . ప్రేయసి భానుప్రియ , కబీర్ పాత్రధారి సత్యనారాయణలతో కలిసి గత జన్మలో ఏ కాళీ మాత ఆలయం వద్ద తనను చంపిందో అక్కడే స్మితను చంపుతాడు . సినిమా ముగుస్తుంది .

సినిమాకు హీరోహీరోయిన్లు బాలకృష్ణ , భానుప్రియలు అయితే నెగటివ్ షీరో సిల్క్ స్మితే . కధంతా ఆమె , హీరో బాలకృష్ణ చుట్టే తిరుగుతుంది . హిందీలో ప్రాణ్ వేసిన పాత్రలన్నీ ఆల్మోస్ట్ సత్యనారాయణనే వరించాయి ఈ సినిమాతో సహా . ఇతర ప్రధాన పాత్రలలో శరత్ బాబు , అంజలీదేవి , దీప , మిక్కిలినేని , సారధి ప్రభృతులు నటించారు . 1985 జనవరిలో వచ్చింది .

The movie is a musical one . పాటలన్నీ చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాగుంటాయి . వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు . క్లైమాక్స్ సాంగ్ హైలైట్ . ఒక వన్నెల చిన్నెల అమ్మాయి అంటూ సాగే పాటలో గత జన్మలో జమీందారుని స్మిత ఎలా చంపిందో చూపుతూ సాగుతుంది .

మిగిలిన పాటలు చలిచలిగా , ఆకాశవీధిలో అందాల తారవో , కప్పుకుంటే దుప్పటేమిటో హుషారు హుషారుగా ఉంటాయి . ఓం శాంతి ఓం శాంతి శాంతి శాంతి పాట బాగా హిట్టయిన పాట . ట్యూన్స్ హిందీ సినిమా లోనివే వాడారు .

నేను హిందీ సినిమా కూడా చూసాను . సినిమా యూట్యూబులో ఉంది . బాలకృష్ణ , సిల్క్ స్మిత అభిమానులు ట్రై చేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…
  • గుల్ఫాం ఉప-ద్రవం… తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు…
  • మీ కడుపులు చల్లంగుండ… సన్నబియ్యంతో పాశం చేసుకున్నం సారూ…
  • ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మంచు కన్నప్ప నేర్పిన పాఠం ఏమిటి..?
  • సంగమానంతరం శ్రీవారి నవ్వులు ఆమె తలపై చల్లిన అక్షతలయ్యాయట..!
  • Aap Jaisa Koi …. రొమాంటిక్ ఫీల్స్ పురుషులకేనా..? స్త్రీలకు ఉండవా..?!
  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions