.
శివసేన నాయకుడు సంజయ్ రౌట్‌ను ఉద్దవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీలోనే కొందరు కార్యకర్తలు తోమారనీ, గంటలపాటు ఓ గదిలో బంధించారని ఓ వార్త…
ఊహిస్తున్నదే… శివసేన భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కారకుల్లో సంజయ్ రౌట్ ఒకడు… శివసేనలోనే అంతర్గతంగా తన మీద కోపం పెరిగిపోతూ ఉంది… శివసేన చీలికకు కూడా తనే కారకుడనే భావన పార్టీలోనే బలంగా వ్యాపిస్తున్నది…
Ads
అధికారం మీద, కొడుకు ఆదిత్య ఠాక్రేకు కుర్చీ మీద ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మి ఠాక్రే మరో కారణం… ఆమెను పూర్తిగా తప్పుదోవ పట్టించేదీ సంజయ్ రౌటే… శివసేన అధికార పత్రిక మాజీ ఎడిటర్ సంజయ్‌కు నేరుగా ఏ పర్మిషనూ అక్కరలేకుండా మాతోశ్రీలోకి ప్రవేశించగల స్వేచ్ఛ ఉంది…
ఆ కుటుంబానికి అంత సన్నిహితుడు అయిఉండీ… ఎన్సీపీ శరద్ పవార్‌కు కోవర్టుగా పనిచేశాడనే విమర్శలు ఉన్నాయి… దానికితోడు శివసేన అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లకుకోట్లు దండుకున్నాడని ఈడీ పీఎంఎల్‌ఈ కేసులు, దాడులు, సోదాలు, దర్యాప్తులో బయటపడింది…
బినామీ ఆస్తుల యవ్వారాలు కూడా బయటపడ్డాయి… తన లేడీ ప్రెండ్ ఒకామె పేరిట బినామీ ఆస్తులు రిజిష్టర్ చేస్తే, ఇప్పుడామె అవన్నీ తనవే అంటోందని ఆమధ్య కొన్ని వార్తలు కనిపించాయి… ఒక్క ముక్కలో చెప్పాలంటే తను ఉద్దవ్ ఠాక్రేకు నమ్మకస్తుడిగా కనిపిస్తూనే… డిఫాక్టో సీఎంగా వ్యవహరించాడనీ, పార్టీ విధానాల్ని శాసించాడని పార్టీలోనే ఓ అసంతృప్తి ఉంది…
వీటికితోడు నోటిదురుసు చాలా ఎక్కువ… తరచూ పిచ్చి కామెంట్లతో వార్తల్లోకి ఎక్కుతుంటాడు… శివసేన బేసిక్ సిద్దాంతాలైన మరాఠీ ఆత్మగౌరవం, హిందుత్వలకు పార్టీ దూరం కావడానికి, తద్వారా పార్టీ గుర్తు, పార్టీ పేరు, పార్టీ కేడర్ షిండే వర్గానికి మళ్లేలా నష్టపరిచింది సంజయ్ రౌటే అంటారు విమర్శకులు…
ఇంత జరుగుతున్నా సరే ఉద్ధవ్ ఠాక్రేలో ఆత్మసమీక్ష, మథనం లేవు… కానీ కేడర్ కోపంతో సంజయ్ మీద దాడి చేస్తుంటే ఉద్దవ్, ఆదిత్య ఠాక్రేలు అక్కడే ఉండి కూడా కేడర్‌ను ఆపలేదని వార్తలు చెబుతున్నాయి… మరి తను కూడా జరిగేది జరగనీ అన్నట్టుగా ఉన్నప్పుడు… పార్టీలో ఇంకా తనను ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నట్టు..? అంతగా సంజయ్‌కు ఎందుకు లొంగిపోతున్నాడనేది ఓ మిస్టరీ..!
మొన్నటి ఎన్నికల్లో మరీ ఘోరంగా 20 సీట్లకు తమ బలం పడిపోవడం… కాంగ్రెస్, ఎన్సీలతో దోస్తీ ఏకంగా పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారిపోవడం నేపథ్యంలో… రాబోయే ముంబై నగరపాలక ఎన్నికల్లో ఏ వ్యూహంతో వెళ్లాలో చర్చించడానికి మాతోశ్రీలో ఓ సమావేశం నిర్వహించాడు ఉద్ధవ్ ఠాక్రే… ఆ సందర్భంగానే ఈ దాడి జరిగినట్టు వార్తల సారాంశం…
సంజయ్ వంటి కోవర్టులను తరిమేయడం, ఎన్సీపీ-కాంగ్రెస్ దోస్తీని కత్తిరించుకోవడం వంటి చర్యలే ఉద్దవ్ ఠాక్రేకు ప్రథమ కర్తవ్యం… అలా చేస్తే పాత వైభవం తెచ్చుకోగలదో లేదో తెలియదు గానీ… మరింత నష్టం నుంచి మాత్రం తప్పించుకుని, పార్టీ ఉనికికి ఢోకా లేకుండా ఉంటుంది..!!
Share this Article