.
Subramanyam Dogiparthi …… ఆగస్ట్ 15 అంటే 1947 కాదు ; 1980 ఆగస్ట్ 15 రాత్రి . ఆరోజు రాత్రి జరిగిన ఓ సంఘటన సినిమా కధకు ఆద్యం . బహుశా సెన్సేషనల్గా ఉంటుందని ఆ టైటిల్ పెట్టుకుని ఉంటారు . శరత్ బాబు ప్రెజెంట్స్ అని వేసారు . బహుశా నిర్మాణంలో భాగస్వామి అయి ఉంటారేమో !
కధనే బాగా ట్రిం చేసి ఉంటే ఇంకా బాగా ఆడి ఉండేదేమో ! పి యన్ రామచంద్రరావు దర్శకత్వం , సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు BGM , నటీనటుల నటన అన్నీ బాగుంటాయి . కధనే బాగా నేయలేదు . ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పారేమో అనిపించింది నాకు .
Ads
ఆగస్ట్ 15 రాత్రి ఓ బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక గృహిణిని మానభంగం చేయడం వలన ఆమె చనిపోతుంది . ఆమె కుమార్తె కాళ్ళు పోగొట్టుకుంటుంది . ఆమె భర్త శరత్ బాబు రెడ్ రోజ్ కిల్లర్ అయి ఓ క్రిమినల్ చేతిలో కిరాయి కిల్లర్ అవుతాడు . ఆ దాదా పురమాయించిన హత్యలన్నీ చేస్తుంటాడు .
ఆ హత్యలన్నీ దేశోధ్ధరణకు అనుకుంటాడు . తర్వాత తెలుస్తుంది తనను కిరాయి కిల్లరుగా వాడుకుంటున్నారని . దానితో ఆ క్రిమినల్ దాదాని మట్టుబెట్టి తానూ చనిపోతాడు . ఈ మొత్తం ఉదంతంలో అతని స్నేహితుడు పోలీస్ ఇనస్పెక్టర్ అర్జున్ చట్టం కోసం కష్టపడుతుంటాడు .
ప్రధాన పాత్ర శరత్ బాబుదే . అతని భార్యగా రాజ్యలక్ష్మి , కుమార్తెగా బేబీ షాలిని నటించారు . సినిమాలో బేబీ షాలినిది కూడా ప్రధాన పాత్రే . ఇనస్పెక్టరుగా అర్జున్ , అతని ప్రేయసిగా , డాక్టరుగా గౌతమి , శరత్ బాబుని ఆరాధించే టీచరుగా సింగపూర్ నటి రంజని బాగా నటించారు .
ఇతర ప్రధాన పాత్రల్లో పి యల్ నారాయణ , మా గుంటూరు వాడు ప్రదీప్ శక్తి , గిరిబాబు , కన్నడ నటుడు సుదర్శన్ , హేమసుందర్ , కుయిలీ , రాజ్యలక్ష్మి , రాళ్ళపల్లి , వై విజయ , ప్రసాద్ బాబు , సుధాకర్ , నర్రా , ప్రభృతులు నటించారు .
సినిమాలో సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా జేసుదాస్ , చిత్రలు పాడిన ఇది మధు మాసం మన్మధ రాగం చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఈ పాటను మాత్రం మిస్ కాకండి . యూట్యూబులో చూడండి .
మిగిలిన మూడు పాటలు అందాలే విరిసిన , భామా వద్దు పోమ్మా ఇక నావెంట రావద్దమ్మా , లస్కులబా అంటూ సాగేవి కూడా బాగానే ఉంటాయి . వేటూరి , జాలాది , సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర పాడారు .
కధను రాబిన్ వ్రాయగా ప్రభాకర్ డైలాగులను వ్రాసారు . ఈ రెండు పేర్లు మనకు సుపరిచితం అయినవి కావు . సినిమా యూట్యూబులో ఉంది . It’s a crime , action , masala movie + little confused story . అయిననూ చూడబులే శరత్ బాబు నటన అభిమానించేవారికి.
సినిమా బిర్రుగానే సాగుతుంది . కానీ అక్కడక్కడ ప్రశ్నలు మన బుర్రల్లో ఉదయిస్తూ ఉంటాయి . వాటిని కాస్త కంట్రోల్ చేస్తే గౌతమి గ్లామర్ , అర్జున్ ఏక్షన్ , బేబీ షాలిని ముద్దు ముద్దు మాటలు సినిమాను చూడనిస్తాయి . ట్రై చేయవచ్చునేమో . నేను పరిచయం చేస్తున్న 1161 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article