సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలామంది నార్తరన్ ఫుడ్ లవర్స్‌కి వెటకారం… అబ్బే, ఏముందండీ… సౌత్ వెజ్ అంటే అవే ఇడ్లీలు, అవే దోశలు, అవే ఊతప్పం, అవే పెసరట్లు, కాదంటే ఉప్మా… అంతేకదా అని తేలికగా తీసిపారేస్తారు… ప్రత్యేకించి ఇడ్లీ మీద బోలెడు జోక్స్ కూడా వేస్తుంటారు… పొద్దున్నే డీప్ ప్రై చేయించిన పావ్ బజ్జీలు, కడక్ సుగర్ జిలేబీలు తినే మొహాలు… అఫ్కోర్స్, ఈమధ్య సౌత్ నగరాల్లో కూడా ఉదయమే మైసూరు బోండా, పూరీలు, […]
చాయ్ వోకే… కానీ కొన్ని గైడ్ లైన్స్ దాటొద్దట… దాటితే బుక్కయినట్టేనట..!!
ఫుల్లుగా బిర్యానీ పట్టించాక మాంచి మసాలా టీ గానీ ఇరానీ చాయ్ గానీ తాగుతారు చాలామంది… కొందరైతే ఒకవైపు బిర్యానీ లాగిస్తూనే మరోవైపు చాయ్ లేదా కాఫీ తాగుతుంటారు… (ఈమధ్య కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు…) ఐతే అది డేంజర్ అంటోంది ఐసీఎంఆర్… అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్… కొన్ని భారతీయ ఆరోగ్య విషయాల్లో క్లారిటీ ఇచ్చింది… లంచ్ లేదా డిన్నర్ తరువాత టీ తాగితే ఛాతీ, గొంతు నుంచి నూనెను అది తొలగిస్తుందనీ, […]
అమెరికా అధ్యక్షుడి నివాసం… అంతే, అంతకుమించి విశేషమేమీ లేదు…
కావచ్చు, మన ఆలోచనల ధోరణిని బట్టే… చూసే కోణం, అర్థం చేసుకునే తీరు మారతాయేమో… ఈ ప్రపంచపు నెంబర్ వన్ దేశాన్ని పాలించే అధ్యక్షుడి నివాస భవనం వైట్ హౌజ్… అంతేనా..? ఇంకేదైనా విశేషం ఉందా..? ఏమీ లేదు… అబ్బో, ఇది అమెరికా అధ్యక్షుడు ఉండే ఇల్లు అట అనే ఓ ఓవర్ రేటెడ్ ఫీల్‌తో వెళ్లడమే గానీ, నిజంగా అంత పెద్ద సీనేమీ లేదు… అది చూడగానే మొదట గుర్తొచ్చింది… అప్పట్లో మోడీ, కిషన్‌రెడ్డి తదితరులు […]
No to NOTA… వోటేద్దాం… ఐతే వాటేసుకోవడానికి… లేదా వేటు వేయటానికి…
థింక్ వన్స్… ఒకసారి భిన్నంగా ఆలోచించి చూద్దాం… ఎన్నికలు రాగానే నోటాకు వేద్దాం, చైతన్యం చూపిద్దాం అనే నీతిబోధలు మీడియాలో స్టార్ట్ అవుతాయి… అక్కడికే వోటరు ఎందుకు ఆగిపోవాలి… బిట్ బియాండ్ దట్… అంతకుమించి ఎందుకు ఆలోచించొద్దు..? నోటా దగ్గరే మనం ఆగిపోతే అది ఓ తప్పుడు అవగాహన కాదా..? ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు..? నిజంగా నోటాకు వోటు వేయడం అనేది ఓ చైతన్య సూచికా..? ఎవరో ఏదో దేశంలో ప్రవేశపెట్టిన ఈ నోటాకు వోటు […]
ఆ డ్రై రియాలిటీ షోను కూడా జనరంజకం చేశాడు ఈ గాలోడు..!!
ఈమధ్య ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షో ప్రోమోలు, ఆ ఓటీటీ సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టే వీడియో బిట్స్ చూస్తుంటే… ఆశ్చర్యం ఏమీ వేయలేదు, పైగా సుడిగాలి సుధీర్‌ను అభినందించాలని అనిపించింది… నిజానికి సర్కార్ షో అంటే ఏవేవో చిన్న చిన్న ప్రశ్నలు, సెలబ్రిటీలు, డబ్బు బెట్ కాస్తూ సమాధానాలు ఇవ్వడం, నడుమ నడుమ సరదా ముచ్చట్లు… టీవీ రియాలిటీ షోలలోనే ఇది కాస్త డ్రై సబ్జెక్టు… ఇక ఓటీటీలో ఎవరు చూస్తారు […]
రంగు పూసుకో… కానీ ఎర్రగా, దట్టంగా పూసుకున్నావో బుక్కయిపోతావ్…
వాడొక పిచ్చోడు… పేరుకు కమ్యూనిస్టు దేశం… కానీ అక్కడంతా నియంతృత్వమే… అదీ ఉన్మాదపు పోకడ… పిచ్చి ప్రభుత్వం… తలతిక్క రూల్స్… అనుమానమొస్తే వేటు వేయడమే… ఎవడూ దేశంలోకి రావొద్దు, ఎవడూ దేశం వదిలిపోవద్దు… అక్కడ ప్రజల పరిస్థితులేమిటో కూడా ఎవరికీ స్పష్టంగా తెలియవు… ఎవరైనా కష్టమ్మీద ప్రాణాలు అరచేత పట్టుకుని బయటికి వచ్చి ఒకటీ అరా నోరువిప్పితే కాస్త తెలిసేది… అదీ ఎంత నిజమో కన్ఫరమ్ చేసేవాళ్లు కూడా ఉండరు… ప్రజల మీద విపరీతమైన ఆంక్షలు, తన […]
ఈ పోలింగ్ ఆఫీసర్ గుర్తుంది కదా… ఆ ట్రెండీ లుక్కుల వెనుక ఓ ట్రాజెడీ స్టోరీ…
కొడుక్కి పాలిస్తూ… కళ్లల్లో నీళ్లు తుడచుకుంటూ… రెండేళ్లు అసలు నేను గది దాటి బయటికి రాలేదు….. ఈ మాటలు అన్నది ఎవరో కాదు… రీనా ద్వివేది… ఫోటో చూడగానే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా… పోలింగ్ సామగ్రి తీసుకెళ్తున్న ఆమె ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ రెండు సందర్భాల్లో… ఒకసారి 2019 జనరల్ ఎలక్షన్స్‌లో… మరోసారి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో… ఆమె మీద ఎన్ని చెణుకులు, జోకులు, మీమ్స్, వ్యాఖ్యలు, హాట్ పోస్టులు… మొదటి ఎర్ర చీరెలో […]
ఎన్నికల ఖర్చుకు దీటుగా బెట్టింగ్ టర్నోవర్లు… ధర్మరాజులు ఎందరో…
విజయవాడలో పదిమంది జర్నలిస్టుల మధ్య కూర్చున్నప్పుడు ఎన్నికల ఫలితాల బెట్టింగుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒకటికి- రెండు, మూడు; కోసు పందెం లాంటి పందెం పరిభాష నేనెప్పుడూ వినకపోవడంవల్ల… నిరక్షరకుక్షులకు అర్థమయ్యేలా సావధానంగా, స్పష్టంగా విడమరచి చెప్పాలని నేనడిగితే ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పడం ప్రారంభించాడు. నైమిశారణ్యంలో రావి చెట్టు కింద రాతి అరుగుమీద కూర్చుని సూతమహాముని చెబుతుండగా చుట్టూ నీడలో చేరి శౌనికాదిమునులు శ్రద్ధగా వింటున్నట్లు అందరూ వింటున్నారు. ‘‘అసలు మా ఊరంటే ఏమనుకుంటున్నారు? […]
ఈ విశేషమైన రోజున అమ్మలు చదవాల్సిన ఓ వాస్తవ కథ… హిర్కానీ బురుజు…
అప్పట్లో మరాఠీలో ఓ చిత్రం వచ్చింది… పేరు హిర్కానీ… నిజానికి అది రియల్ స్టోరీయే… కాకపోతే కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కథను ఇంకాస్త బరువుగా మలిచారు… ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లో దొరుకుతుంది… విషయం ఏమిటంటే, అందరూ అమ్మ దినం గురించి, సారీ, ఇది కటువుగా ధ్వనిస్తోంది కదా, మాతృదినోత్సవం, మదర్స్ డే సందర్భంగా చాలా రాస్తున్నారు కదా… ఇది కూడా గుర్తు చేయాలనిపించింది… హిర్కానీ… పాలమ్ముకునే ఓ పల్లె పడతి… రాయగఢ్ కోట సమీపంలో ఉండేది… […]
ఈ తిలోత్తమను గాయత్రి పాప చంపలేదు… రోడ్డు మింగేసింది పాపం…
పవిత్ర జయరాం… 42 ఏళ్ల ఈ కన్నడ టీవీ నటి కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది… ట్రాజెడీ… పవిత్ర జయరాం అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు… తెలుగు టీవీ సీరియల్ ప్రేక్షకులకు త్రినయని తిలోత్తమ అంటే చటుక్కున గుర్తొస్తుంది… నిజంగా తెలుగు టీవీ సీరియళ్లను శ్రద్ధగా చూసేవాళ్లకు షాకింగ్ న్యూసే… తెలుగు టీవీ సీరియళ్లలో అధికశాతం కన్నడ తారలదే హవా… చాలామంది ఫ్లయిట్లలో వచ్చిపోతుంటారు… కొందరు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు కార్లలో షటిల్ […]
ఈయన ఎవరో తెలుసా..? ఆ రతన్ టాటా తమ్ముడు… ఫుల్ కంట్రాస్ట్, అజ్ఞాతి…!!
రతన్ టాటా… జగమెరిగిన పేరు… వేల కోట్ల ఛారిటీ, విలువలతో కూడిన వ్యాపారం, క్రమశిక్షణ, నిలువెల్లా భారతీయత, విశ్వసనీయత, పరిపూర్ణ జాతీయతత్వం ఎట్సెట్రా… టీవీలు, పత్రికలు, సైట్లు, చానెళ్లు, బిజినెస్ సర్కిళ్లు, పొలిటికల్-బ్యూరోక్రటిక్ సర్కిళ్లు, ఇతర ఇండియన్ అత్యధిక ప్రభావశీల సమూహాల్లో ఎప్పుడూ నానే పేరు ఆయనది… ఈ కేరక్టర్‌కు పూర్తి భిన్నమైన నీడ ఒకటి ఉంది… ఫుల్ కంట్రాస్ట్ కేరక్టర్… ఆయన పేరు జిమ్మీ టాటా… ఆ రతన్ టాటాకు స్వయానా తమ్ముడు… అసలు ఈయన […]
డెమోక్రసీ అనేదొక డేంజరస్ నిషా… ఓటు పవిత్రమైంది సుమా, జాగ్రత్త..!
Taadi Prakash……. ఎవరు డబ్బిచ్చినా తీసుకో…. ఎవరు మందు పోయించినా తాగు… TO VOTE IS OUR SACRED DUTY… —————————————————- గంగా, గోదావరి లాంటి జీవనదులూ…. కన్నతల్లీ, కాశీపుణ్యక్షేత్రమూ మనకి ఎంతో పవిత్రమైనవి. గుళ్ళో హారతి, మెళ్ళో మంగళసూత్రం పవిత్రం! ఓటు మరింత పవిత్రమైనది! ఇలా పవిత్రతను మనం విచ్చలవిడిగా వాడుతుంటాం. డబ్బు పవిత్రమైనది అని మాత్రం అనం. డబ్బు విలువైంది. అవసరాలు తీర్చేది. అడ్డమైన సుఖాలూ తెచ్చి యిచ్చేది. పవిత్రమైన ఓటుని కొనగలిగే శక్తి […]
అక్షరాలా ఇది జగన్ వర్సెస్ రామోజీరావు ఎన్నికల యుద్ధం..!!
ఓ మిత్రుడు చెప్పినట్టు… ఈసారి ఎన్నికలు అక్షరాలా జగన్మోహన్రెడ్డికీ ఈనాడు రామోజీరావుకు నడుమ యుద్ధం… నిజమే… స్థూలంగా చెప్పుకోవాలంటే… ఇది వైసీపీ వర్సెస్ యెల్లో కూటమి పోరాటం కాదు… ఇది రెడ్డి వర్సెస్ కమ్మ-కాపు కూటమి పోరాటం కానే కాదు… ఇది జగన్ వర్సెస్ జగన్ చెల్లెలు షర్మిల పోరాటం అసలే కాదు… జస్ట్, జగన్ వర్సెస్ రామోజీ… కొద్దిరోజులుగా ఈనాడు బరితెగించి, బట్టలు విడిచిపెట్టి, పోతురాజులా బజారులో నిలబడి యెల్లో కొరడాతో ఛెళ్లుఛెళ్లుమని కొట్టుకుంటూ జగన్ […]
అప్పట్లో గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ… ఇప్పుడు కేసీయార్..!!
మీడియా ముందు ఒళ్లు మరిచి మాట్లాడకూడదని కేసీయార్ రేవంత్‌రెడ్డికి సూచించాడు… ఎక్కడ..? నిన్న ప్రెస్ మీట్లో..! నిజమే సారూ… మస్తు చెప్పినవ్… కానీ అదే నీతిసూత్రం కేసీయార్‌కు కూడా వర్తించాలి కదా… అవే గప్పాలు, అవే అబద్ధాలు, అవే ప్రగల్భాలు, అవే డొల్ల మాటలు… ఇంకెన్నాళ్లు..? ఎంతసేపూ జనం పిచ్చోళ్లు, నేను చెప్పింది నమ్మేస్తారు అనే పోకడేనా..? తెలంగాణ సమాజం తెలంగాణ తెచ్చినవాడిగా అమితమైన అభిమానాన్ని ఇచ్చింది, ఆకాశాన నిలిపింది… నీఅంతట నువ్వే వేగంగా జారిపోతూ, చేజేతులా […]
రామాయణంపై మేధోహక్కులట… సాయిపల్లవి రామకథకు అడ్డంకులట…
ఒక వార్త… రణబీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా నటించే రామాయణం సినిమా చిక్కుల్లో పడింది అని..! దాదాపు ఐదారువందల కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున ప్రతిష్ఠాత్మకంగా తీయబోయే ఈ సినిమాకు నితిష్ తివారీ దర్శకుడు… రావణుడిగా నటించడంతోపాటు కన్నడ హీరో యశ్ ఈ సినిమాలో డబ్బు కూడా పెట్టుబడి పెడుతున్నాడట… ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారుల రెమ్యునరేషనే వంద కోట్ల దాకా ఉండనుందనే కథనాలు వచ్చాయి గానీ అందులో నిజానిజాలు ఎవరూ కన్ఫరమ్ చేయరు కాబట్టి […]
రాజమౌళి… ఈ దర్శకుడు మరో ఇరవయ్యేళ్లూ ఇక దొరక్కపోవచ్చు…
ఈమధ్య వరుసగా రాజమౌళి వార్తలు కనిపిస్తున్నాయి… అవన్నీ క్రోడీకరిస్తే రాబోయే 20 సంవత్సరాల వరకూ అసలు రాజమౌళి మరే కొత్త హీరోకు టైమ్ ఇవ్వడం గానీ, ఇంకో కొత్త సినిమా అంగీకరించడం గానీ ఉండబోవేమో… సరదాగా చెప్పుకున్నా సరే, రాజమౌళి దొరకడం అంత సులభం కాదు… పాత సినిమాల్ని కాపీ కొడతాడా..? చరిత్రకు వక్రబాష్యాలు చెబుతాడా..? అనే ప్రశ్నలు వేరు… వాటిని కాసేపు పక్కన పెడితే రాజమౌళిది తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర… తాను చెప్పాలనుకున్న కథను […]
ఓ చుక్కా నవ్వవే… వేగులచుక్కా నవ్వవే… నావకు చుక్కానవ్వవే…
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా… అందానికి అందం ఈ పాట మొన్న ఒకరోజు మధ్యందిన మార్తాండుడు ఎండ ప్రచండంగా చల్లుతున్నవేళ హైదరాబాద్ ఇంట్లో బిసిబెళిబాత్, పెరుగన్నం తిని బండలు కూడా గుండెలు పగిలి ఏడవాల్సిన ఎండలకు పెట్టింది పేరైన విజయవాడ బయలుదేరాను. ఊరు దాటి బాటసింగారం బాట దాటగానే కనురెప్పలు వాటంతటవే పడిపోతున్నాయి. కునుకుపడితే మనసుకాస్త కుదుట పడుతుందని ఆత్రేయ సూత్రీకరించాడు కాబట్టి సీటు వెనక్కు వాల్చుకుని నిద్రలోకి జారుకున్నాను. లేచేసరికి నార్కట్ పల్లి బోర్డు కనిపిస్తోంది. కళ్లు నులుముకుని… […]
శ్రీదేవికి దీటైన అందం, అదే రక్తం… కానీ అనామకంగా ఉండిపోయింది…
నిజానికి ఈ వార్తలన్నీ పాతవే… కొన్ని జాతీయ మీడియా న్యూస్ సైట్లు మళ్లీ ఎందుకు ఈమధ్య తెర మీదకు తీసుకొస్తున్నాయో తెలియదు… శ్రీదేవి చెల్లెలి గురించి..! నేను డీఎన్ఏ సైటులో చదివినట్టు గుర్తు… బోనీకపూర్ తాటతీస్తాడేమో తెలియదు గానీ… ఒకవేళ తను అత్యంత అధికంగా పిచ్చిగా ప్రేమించిన శ్రీదేవి బయోపిక్ గనుక రాంగోపాలవర్మ తీస్తే… అందులో శ్రీదేవికి దీటైన పాత్ర, ప్రాధాన్యం బహుశా ఆమె చెల్లెలి పాత్రకు కూడా ఇవ్వాల్సి ఉంటుందేమో… నిజానికి చాలామందికి శ్రీదేవి చెల్లెలి […]
రివ్యూలు కూడా ఫార్ములాలోనే ఇమడాలా..? ఇలా రివ్యూలు రాయలేమా..?!
Priyadarshini Krishna….. ఇంతకుముందు చాలాసార్లు నేను అన్నాను, మళ్ళీ చెప్తున్నాను… సినిమా రివ్యూ అంటే సినిమాలోని ఇతివృత్తం లేదా కథని విశ్లేషించడం, పాత్రల పోకడను, దర్శకుడు ఆయా పాత్రలని మలిచిన తీరుని , ఆయా పాత్రలను పోషించిన నటుల నటనాచాతుర్యాన్ని చర్చించడం కాదు. ప్రేక్షకునికి ఆ సినిమాని పూర్తిగా పరిచయం చెయ్యడం. సినిమాలోని వివిధ విభాగాలు ఆ సినిమాలో ఎలా మెరుగైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి అనే అంశాలను చర్చించడాన్ని రివ్యూ అనాలి. ఇవాళ్టి వరకు తప్పడ్ సినిమాపై […]
పూజకు పనికిరాని పూలు… ఈ మొక్క నిలువెల్లా విషమే… నమిలితే పరలోకమే…
పూజకు పనికిరాని పువ్వు అంటూ ఏమి ఉంటుంది..? అన్నీ ఆ దేవుడు సృష్టించిన ప్రకృతి ప్రసాదాలే కదా అంటారా..? లేదు… దేవుడి నిర్ణయాలకన్నా దేవుడి పూజించేవాళ్ల నిర్ణయాలే అంతిమం… తిరుగు లేదు… విషయం ఏమిటంటే..? కేరళలో దాదాపు 2500 పైచిలుకు గుళ్లలో ఓ తరహా పూలను పూజకు నిషేధించారు… వాటి వాసన సోకకూడదు, ప్రసాదాల దగ్గర కనిపించకూడదు, దేవుడికి మాలలు వేయకూడదు… చివరకు విగ్రహంపై కూడా పడకూడదు… ఆ పూలే గన్నేరు పూలు… అదేమిటి..? గన్నేరు పప్పు […]
- « Previous Page
- 1
- …
- 101
- 102
- 103
- 104
- 105
- …
- 457
- Next Page »