తెలంగాణ వాళ్లం.. మేం అంత Uncultured ఆ..? హీరో విజయ్ దేవరకొండని తన యాస మార్చుకొమ్మని ఓ వీడియో చేశారని చెబుతూ, ఆ వీడియోను ఖండిస్తూ ఓ మిత్రుడు ఒక పోస్ట్ రాశారు. ఆ వీడియో చేసినవాళ్లు కొన్ని సినిమాలకు ఆ యాస సరికాదని అన్నారా? లేక పూర్తిగా ఆ యాసను వదిలేయమని ఉచిత సలహా ఇచ్చారా అనేది తెలియదు. కొన్ని సినిమాలకు ఆ యాస కరెక్ట్ కాదని నేనూ ఒప్పుకుంటాను. ఒక యాక్టర్ అన్ని పాత్రల్లో […]
తెలుగు మ్యాగజైన్లే లేవు… ఇక ఈ రేంజ్ ప్రజెంటేషన్ ఏం ఆశించాలి..?!
టైమ్… అమెరికన్ ఫేమస్ మ్యాగజైన్… అఫ్ కోర్స్, ఇండియా మీద విపరీత ద్వేషంతో వ్యవహరిస్తుంటాయి అమెరికన్ మీడియా… సేమ్, బీబీసీలాగే..! సరే, బీబీసీ అయితే మరీ భారత వ్యతిరేకతతో చెలరేగిపోతుంటుంది… మన తెలుగు పత్రికల్లాగే ఉచ్చం నీచం ఏమీ ఉండవు… తన పొలిటికల్ లైన్‌ను బట్టి రెచ్చిపోవడమే… తాజాగా వార్తాంశం ఏమిటంటే..? అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీద ఓ కవర్ పేజీ వేసింది… తను ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు… సింపుల్ ఫోటో… కానీ ఎన్ని […]
పదేళ్లు కావొస్తున్నా… మళ్లీ మళ్లీ అదే సుధీర్ అదే రష్మి లవ్ ట్రాక్..!!
జబర్దస్త్ సరే, భ్రష్టుపట్టిపోయింది, చివరకు రేటింగ్సులో కూడా… ఢీ ఎప్పుడో నాశనం… కొత్తగా అంతన్నాడే ఇంతన్నాడే అన్నట్టుగా సుడిగాలి సుధీర్‌ను తీసుకొచ్చి ఇంకేదో కిట్టీ పార్టీ షో స్టార్ట్ చేశారు, దానికీ రేటింగ్స్ లేవు… సుమ అడ్డా గురించి చెప్పుకోవడమే దండుగ… ఫాఫం హేమిటి ఈటీవీ ఇలా తయారైంది చెప్మా, కనీసం ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలా ఉందో చూద్దామని ట్యూన్ చేస్తే… బుక్కయిపోయా… మొనాటనీ… ఆ డైరెక్టర్లకు క్రియేటివిటీ అడుగంటినట్టుంది… కొత్తదనాన్ని ఇంజక్ట్ చేయాలనే […]
మీరు చూడటమే కాదు… పిల్లలకు చూపించాల్సిన సినిమా… దేనికంటే..?!
కల్కి సినిమా చూశాను. సినిమాగా ఓ గొప్ప ప్రయత్నం. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకి సీఈఓ లుగా పనిచేసి ఈ దేశ మేధా సంపత్తిని నిరూపిస్తే, యూనివర్సల్ కళ అయిన సినిమా రంగంలో కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తీయగలరని, అది కూడా హాలీవుడ్ తో పోలిస్తే పదో వంతు కూడా లేని మార్కెట్, బడ్జెట్ తో అని నిరూపించిన సినిమా. పూర్తి సినిమా కోణం లో చెప్పుకోవాలంటే రెగ్యులర్ సినిమా లు చూసే వాళ్లకి ఫస్ట్ […]
రాధాకృష్ణ సరిగ్గా రాశాడు… ఖజానా డబ్బుతో రామోజీ సంస్మరణ ఏమిటి..?!
‘‘ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి […]
ట్రెండ్ అదేగా… మైథాలజీ ప్లస్ ఫిక్షన్… ఇప్పుడిక లేడీ అవతార్..!!
డౌటేమీ లేదు… కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలో ట్రెండ్ ఫాంటసీ, ఫిక్షన్, అదీ మైథాలజీకి లింక్ చేసి ఓ కథ చెప్పడం… లేదా ఇతిహాసాల్లోని కొన్ని పార్టులను తమకిష్టమొచ్చినట్టు రాసుకుని తెరకెక్కించడం..! మరీ దరిద్రంగా ప్రజెంట్ చేస్తే, ఆదిపురుష్‌లాగా ఫ్లాపవుతాయి, తప్ప ఏమాత్రం జాగ్రత్తగా తీసినా సూపర్ హిట్టే… ఆమధ్య కార్తికేయ అందుకే హిట్టు… నార్త ఇండియన్స్ బాగా కనెక్టయ్యారు… వసూళ్లు కురిపించారు… అంతెందుకు, హనుమాన్ చిత్రం కూడా అంతే కదా… పాన్ ఇండియా హిట్… ఇక రీసెంటుగా […]
విస్కీ మార్కెట్‌కు కిక్కిచ్చే వార్త… లిక్కర్ హేటర్స్ కూడా చదవొచ్చు…
Amrut Distilleries from Bengaluru wins “World’s Best Whiskey” title at 2024 International Spirits Challenge in London…. అని ఓ వార్త కనిపించింది పొద్దున్నే… లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్పిరిట్స్ చాలెంజ్ పోటీలో వరల్డ్ బెస్ట్ విస్కీ అవార్డు కొట్టేసిందట… సరే, మంచిదే… రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి, జరిపిస్తూ ఉండాలి, అదే స్పిరిట్ అంటే… ఎందుకంటే..? ప్రచారం కోసం, మార్కెటింగ్ కోసం ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉండాలి కదా… అప్పట్లో దట్టమైన […]
అక్కడంత అసభ్యంగా ఏముందని..? అనవసరంగా అనసూయపై ట్రోలింగ్..!
కిరాక్ బాయ్స్, ఖిలాడీ గరల్స్… అని ఓ టీవీ షో… హైపిచ్ అరుపులు, కేకల శ్రీముఖి హోస్ట్… ఏదో ఓ సాదాసీదా టీవీ చిట్‌చాట్ షో… ఇలాంటి షోలతో ఈటీవీ ఎంతోకొంత రనవుతోంది కదాని స్టార్ మావాడు కూడా వాతలు పెట్టుకుని ఈ షో స్టార్ట్ చేశాడు… సరే, తెలుగు టీవీ షోలు అంటేనే అసభ్యత, అశ్లీలం బాపతు కదా… రెండుమూడు రోజులుగా అనసూయను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు… ఒక ఎపిసోడ్లో ఏదో పోటీలో శేఖర్ మాస్టర్ […]
గాలి ఈలలు వేసేననీ… సైగ చేసేననీ… అది ఈరోజే తెలిసింది…
చూసారా ఈ సినిమా ?! 1973 లో వచ్చిన ఈ శ్రీవారు మావారు సినిమాకు నిర్మాత – దర్శకుడు బి యస్ నారాయణ . అనగనగా ఓ కోటీశ్వరుడి కుమారుడు హీరో కృష్ణ . మేనత్త అంజలీదేవి అతి క్రమశిక్షణతో పెంచుతుంది . విసుగెత్తిన హీరో లోకం చూడటానికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు , హీరోయిన్ వాణిశ్రీ కలుస్తుంది, ఇద్దరూ ప్రేమించుకుంటారు . హీరో తండ్రిని మేనత్త మొగుడు విలన్ నాగభూషణం చంపుతాడు . ఆ విలన్ […]
కేసీయార్ మంచి కథకుడు… కల్కి రేంజులో ఓ సినిమా కథ చెప్పాడు…
అందరికీ తెలిసిందే కదా… కేసీయార్ మంచి కథకుడు అని..! తను రాజకీయాల్లోకి వచ్చాడు గానీ సినిమాలకు గనుక కంట్రిబ్యూట్ చేసే పక్షంలో కల్కి రేంజ్ కథలు అందించగలడు… రాజమౌళి తండ్రి వీరకథకుడు విజయేంద్రప్రసాద్ కూడా ఎందుకూ కొరగాడు… ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకులోని అంశాలు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది… ఈమధ్య ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టుకుని, కాంగ్రెస్‌లోకి వెళ్లకండి, వెళ్లకండి అని కేసీయార్ చెబుతున్న వార్తలు చదువుతున్నాం కదా… మస్తు సీక్రెట్స్ మాట్లాడుకున్నం అని మల్లారెడ్డి కూడా అన్నాడు […]
ఇక్కడా ఓ అర్జునుడు… తోడుగా ఓ కర్ణుడు… కానీ అశ్వత్థామ లేడు…
ఒక పాత్ర కర్ణుడు… అలియాస్ కరణ్… మరో పాత్ర అర్జునుడు… అలియాస్ అర్జున్… ఇవి రెండూ ప్రధాన పాత్రలు… అన్నదమ్ములే…. అరెరె, ఆగండి అక్కడే… కల్కి గురించి కాదు, ట్రోలింగ్ ఇక్కడా స్టార్ట్ చేయకండి… ఆ సినిమా వేరు, అందులో కర్ణుడు ప్రభాస్, అర్జునుడు విజయ్ దేవరకొండ… రెండురోజులుగా ట్రోల్ తీస్తున్నారు… కానీ ఇక్కడ చెప్పుకునేది కల్కి కాదు, అసలు ఇది సినిమాయే కాదు… హాట్‌స్టార్‌లో వస్తున్న వెబ్ సీరీస్… ఇందులో అశ్వత్థామ పాత్రే లేదు… వోకేనా…! […]
ఆలీ తెలివైనోడు… అక్కడే ఉంటే తన పరిస్థితేమిటో తెలుసుకున్నోడు…
సరైన నిర్ణయం తీసుకున్న అలీ … అలీ రాజీనామాతో ysr కాంగ్రెస్ కు ఒక ఓటు పెరిగేది లేదు … తగ్గేది లేదు … పార్టీపై ప్రభావం ఉండదు . కానీ అలీ జీవితంపై చాలా ప్రభావం ఉంటుంది … రాజీనామా చేయకపోతే తన సినిమా జీవితానికి వీలునామా రాసుకోవలసి వచ్చేది … కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నటులు, సినిమా వాళ్ళు తమకు ఇష్టం ఉన్న పార్టీలో ఉండేవారు . అంటే దాదాపు మొత్తం టీడీపీలోనే … […]
Information Obesity …అతి సమాచారం సర్వత్రా వర్జయేత్…
ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒబేసిటీతో ఉన్నారు. దానికన్నా అతి పెద్ద సమస్య “ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ”. ప్రపంచం లో ప్రతి ఇద్దరు లో ఒకరు ఇన్ ఫర్మేషన్ ఒబేసిటీ తో బాధ పడుతున్నారు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచాన్ని పీడించే సమస్యల్లో ఇది ఒకటి. రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి అనే సింపుల్ టాపిక్ తీసుకుంటే – ఒకతను […]
నీట్ మీద దుమార ప్రచారంలో స్పీకర్ బిర్లా బిడ్డనూ లాగుతున్నారు..!!
సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది… అదేమిటంటే..? లోకసభ స్పీకర్ బీఎం బిర్లా చిన్న బిడ్డ అంజలి బిర్లా గురించి… ఆమె ఒక మోడల్ అట… హఠాత్తుగా యూపీఎస్సీ (సివిల్స్)కు హాజరైందట, దేశంలోకెల్లా అత్యంత క్లిష్టమైన, కష్టమైన ఆ పరీక్షలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాసైపోయి ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖలో కొలువు చేస్తోందట… ‘ఇదంతా చదివితే ఆమె ఇంటలిజెంట్ అనిపిస్తోంది కదా’… అని ముగించి… అబ్బే, ఇది నీట్ స్కామ్, పేపర్ లీకతో సంబంధం లేని […]
Madhuri Dixit … డబ్బు కోసం ఇదేం పని శ్రీమతి మాధురీ దీక్షిత్..?
సినిమా తారలు… కాస్త హార్ష్‌గా ధ్వనించినా ఒక మాట… డబ్బు కోసం ఏదైనా చేస్తారు… ఎంత దిగజారమన్నా సరే… అందరూ కాదు, కాకపోతే మెజారిటీ..! వయస్సు మీద పడినా సరే, ఇంకా ఇంకా డబ్బు కావాలి… దాని కోసం ఏదైనా చేసేయాలి… ఒకప్పటి అందాల తార మాధురీ దీక్షిత్ దీనికి మినహాయింపు ఏమీ కాదు… ఏక్ దో తీన్ చార్ పాంచ్ అంటూ గంతులేసి జనాన్ని వెర్రెక్కించిన మాధురీ దీక్షిత్ గిరాకీ తగ్గిపోయాక నేనే అనే ఓ […]
నిజంగానే ఆదానీకి ‘పవర్’ ఇచ్చేస్తారా..? ఉచిత విద్యుత్తు గల్లంతేనా..?
ఇంకేముంది..? తెలంగాణ రాష్ట్ర విద్యుత్తును ఆదానీ పరం చేయబోతున్నారు… అని నిన్నటి నుంచీ ఒకటే రచ్చ… బీఆర్ఎస్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ ఓ ఫస్ట్ పేజీ స్టోరీ పబ్లిష్ చేసేసి అయ్యో, అమ్మో, ఇంకేమైనా ఉందా..? పంపుసెట్లకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు ఉండదు, ఇక వేల కోట్ల వ్యవస్థలపై ఆదానీ గుత్తాధిపత్యం, కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం, సేవలపై అదనపు భారమూ పడొచ్చు అని మొత్తుకుంది… నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తున్నదా..? […]
‘‘మూడు రోజులుగా భారతం గురించే ఏదో ఒకటి మాట్లాడుతున్నాం మా ఇంట్లో…’’
నిజంగా సినిమా ప్రభావం చాలా ఉంటుంది… నిన్న రాత్రి నా బిడ్డ నుంచి వీడియోకాల్… ఎంతో ఎగ్జయిటెడ్ గా… అమ్మా, కల్కి బాగుందమ్మా… నాకైతే ఎంత నచ్చిందో… నేను అర్జెంటుగా మహాభారతం చదవాలి అంటోంది… హహ ఎన్నిసార్లు చెప్పానో చదువూ చదువూ అని… సినిమా చూస్తేనే చదవాలనిపిస్తోందా అని అడిగా నవ్వుతూ… సరే, సులభంగా అర్థమయ్యే రాజాజీ వచన భారతం ఎక్కడో ఉండాలి… వెదికి పంపిస్తాలే అన్నాను… నాన్న కాల్ లిఫ్ట్ చేయటం లేదు, పడుకున్నాడేమో… నాన్నను […]
Prabhas… ప్రస్తుత భారతీయ సినిమాకు ప్రభాసే ‘రాజు’… ఇదుగో ఇలా…
ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్… నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకు రాజు… అతిశయోక్తి అనిపించినా ఇది వర్తమానానికి నిజం… ఒక మిత్రుడి మాటలో చెప్పాలంటే… తను ఒంటి కాలి మీద ఇండియన్ సినిమాను మోస్తున్నాడు… ఇదీ అతిశయోక్తి కాదు, నిజం… ఎందుకంటే..? చాన్నాళ్లుగా తన ఆరోగ్యం స్టడీగా లేదు… ఆయుర్వేద చికిత్సలు, కాలికి సర్జరీలు… బాహుబలి తరువాత తన హెల్త్ ఎప్పుడూ సరిగ్గా లేదు… కొన్నిసార్లు నెలల కొద్దీ విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండిపోయాడు… ఆదిపురుష్ […]
లీకుల కాలంలో… ఈ అగ్ని పరీక్షల్లో అందరూ పరాజిత పరీక్షిత్తులే…
లీకు పరీక్షల కాలంలో అందరూ పరాజిత పరీక్షిత్తులే! అగ్ని పరీక్ష అప్పుడు సీతమ్మకు ఒకసారే అగ్నిపరీక్ష. ఇప్పుడు చదువుకునే పిల్లలకు రోజూ అగ్ని పరీక్షలే. వారి తల్లిదండ్రులకు ప్రతిక్షణం విషమ పరీక్షలే. సహన పరీక్షకు పరీక్ష వెయ్యి ఉద్యోగాలకు పది లక్షల మంది పోటీపడే నోటిఫికేషన్ల కోసం పడిగాపులు పడడం సహన పరీక్షకు పరీక్ష. స్వీయ పరీక్ష అప్పులు చేసి కోచింగులకు వెళ్లడం; నిద్రాహారాలు మాని దీక్షగా చదవడం మనకు మనమే పెట్టుకునే స్వీయ పరీక్ష. శల్య […]
ఆ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావల్సిందే…
A great classic from K Viswanath . మంచి సినిమా . మంచి సినిమా అంటే సినిమాలో పాత్రలన్నీ మంచితనానికి ప్రతీకలే . ఈ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావలసిందే . సత్యనారాయణకు ఈ సినిమా ఓ పెద్ద మలుపు . విలన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న సత్యనారాయణ అన్నగా , మంచివాడిగా గొప్పగా నటించారు . సత్యనారాయణలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఆరోజుల్లో . […]
- « Previous Page
- 1
- …
- 109
- 110
- 111
- 112
- 113
- …
- 484
- Next Page »