మడత పెట్టి కుమ్మిన పాట! మడతోద్భవ సందర్భం:- రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని వెళ్లిపోతున్న త్రివిక్రమ్ ను సరస్వతీ పుత్ర రామజోగయ్య, సంగీత పుత్ర థమన్ రెండు చేతులు పట్టుకుని ఆపారు. సందర్భానికి ఉదాత్తమైన పాట కావాలని కోరుకున్న త్రివిక్రమ్ కు ఉదాత్తమైన సాహిత్యం ఇస్తానని సరస్వతీపుత్ర, అంతే ఉదాత్తమైన సంగీతం ఇస్తానని సంగీత పుత్ర ఇద్దరూ హామీ ఇచ్చారు. అప్పుడు పుట్టిందే మడత పెట్టి పాట! జ్ఞానం ప్రవచించిన మడత:- త్రివిక్రమ్ సైన్స్ చదువుకున్నవాడు. సాహిత్యం […]
అయోధ్య రాముడు ప్రపంచ దేవుడు… ఏచూరీ, ఇది ఫరూక్ అబ్దుల్లా మాట…
‘‘అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది… అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోరుకున్న ప్రజలకు, గుడి నిర్మాణానికి ప్రయత్నించిన వారికి నా అభినందనలు…. దేశంలో వర్గాల నడుమ సోదరభావం తగ్గిపోతోంది… అది పునరుద్ధరించాల్సిన అవసరం కనిపిస్తోంది… రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి దేవుడు… అదే నేను ఈ దేశ ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నది… అందరికీ దేవుడని పుస్తకాల్లో రాసి ఉన్నదే నేను చెబుతున్నాను… రాముడు ప్రజలందరి నడుమ సోదరభావమే కాదు, ఐక్యత, ప్రేమ, పరస్పర […]
ధన్యజీవి..! కిలోమీటర్ల కొద్దీ జనం కన్నీటి నివాళి… అపూర్వ వీడ్కోలు…
నువ్వు హీరోవా..? అసలు యాక్టర్ అవుతావా..? నీ కలర్ ఏమిటి..? ఆ కలలేమిటి..? ఫో… అని చీదరించుకోబడిన కెప్టెన్ విజయకాంత్ బోలెడు సినిమాల్లో హీరో అయ్యాడు… ఏదో నాలుగు సినిమాలు చేసి, తరువాత ఇంట్లో కూర్చోవాల్సిందే అనే విమర్శలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ద్వారా బదులిచ్చాడు… మొదట్లో అక్కడా ఫెయిల్యూర్, తరువాత అన్నాడీఎంకేతో కూడి గౌరవనీయ సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్నాడు… ప్రతిపక్ష నేత అయ్యాడు… ఒక హీరోగా… ఒక రాజకీయ నేతగా… తను ఎగిరి విరిగిన కెరటమే కావచ్చుగాక… […]
ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని ఏం కోరింది..? తన కోసం… ఆ శాఖ కోసం…
గుడ్… తెలంగాణ ఉద్యమ సమయంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉమ్మడి పాలనలో అనేక అవమానాలకు గురై, ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నళిని దోమకొండ గురించి ఈమధ్య అందరమూ చదువుతున్నాం, ఆమె వర్తమానం ఏమిటో కూడా తెలుసుకున్నాం… కేసీయార్ శకంలో ఆమె అడ్రస్ లేదు, ఆమెలో నెలకొన్న వైరాగ్యం ఆమెను ఆధ్యాత్మిక మార్గం పట్టించింది… ఆమెకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నాడు… కానీ ఆమె వద్దంది… మళ్లీ ఆ పోలీస్ లాఠీ […]
Kurchi song … సరస్వతీ పుత్రుడు పాట కంటెంట్ ‘మడతపెట్టేశాడు’…
వార్నీ… తమన్ సినిమా పాటల ట్యూన్లు యథేచ్ఛగా కాపీ చేస్తాడని అందరూ చెబుతుంటారు… కాకపోతే తన మార్క్ చిన్న చిన్న మార్పులు చేస్తాడు, ఎవరికీ దొరకకుండా… ఐనా దొరికిపోతుంటాడు… అది వేరే సంగతి,.. కానీ మరీ ఈ ట్యూన్ అయితే మక్కీకిమక్కీ దింపేశాడు… అదేనండీ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే ఓ బూతు పాట ఉంది కదా… దాని సంగతే… ఇప్పటికే ఆ బూతును యథాతథంగా వాడుకున్న తీరుపై విమర్శలు తెలిసిందే కదా… ఇక […]
బూతులకూ పేటెంట్ రైట్స్ ఉండును… సినిమాల్లో వాడితే డబ్బులూ రాలును…
మీకు తెలిసిన ఘాటు, వెరయిటీ బూతులు ఉంటే… ముందుగానే ‘‘కుర్చీ మడతపెట్టి… దెం–’’ తరహాలో ఏదో ఓ వీడియోలో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పెట్టేసుకొండి, పోనీ, యూట్యూబ్‌లోనే ఏదో ఓ పిచ్చి చానెల్ ద్వారా జనంలోకి తీసుకెళ్లండి… తలకుమాసిన చానెళ్లు బోలెడు, ఎవడైనా రికార్డు చేసి, అప్లోడ్ చేసేస్తాడు… ఎందుకు అంటారా..? భలేవారే… ఇప్పుడు బూతులకు కూడా డబ్బులొస్తున్నయ్… ఆశ్చర్యపడుతున్నారా..? భలేవారండీ మీరు… మొన్నామధ్య ఒక ముసలాయన… పేరు కాలా పాషా… ఏదో ఇంటర్వ్యూలో తన […]
Indira Canteen :: ఆకలితో ఉన్నవాడికే ఆహారం విలువ తెలిసేది…
మొన్నామధ్య సోషల్ మీడియాలో బాగా విమర్శలు వినిపించాయి… కనిపించాయి… కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మీద..! అదేమిటయ్యా అంటే..? బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం చౌక ఆహారం కోసం ఇందిరా క్యాంటీన్ పెడుతుందట… 5 రూపాయలకు టిఫిన్, 10 రూపాయలకు మీల్స్… రెండు క్యాంటీన్లు పెడతారు… ఠాట్, ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాళ్లు, విమానాల్లో తిరిగేవాళ్లు ఏమైనా పేదవాళ్లా..? వాళ్లకు ఎందుకు చౌక ఆహారం..? నాన్సెన్స్, అన్ని రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో పెట్టండి, గుడ్, కానీ ఈ ఎయిర్‌పోర్టులో […]
నిజంగా మనం ఓ సమాజంగా బతుకుతున్నామా..? ఈ విషాదం ఏం చెబుతోంది..?!
ముందుగా ఒక విభ్రాంతికర నేర వార్త చదవండి… ‘‘కర్నాటకలోని చిత్రదుర్గలో గురువారం రాత్రి పోలీసులు ఒక ఇంటి నుంచి అయిదు మృతదేహాలను కనుగొన్నారు… అవి దాదాపు అస్థిపంజరాల్లాగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి… వాళ్లందరూ నాలుగేళ్ల క్రితమే మరణించి ఉంటారని భావిస్తున్నారు… మృతదేహాలు కనిపిస్తున్న స్థితిని బట్టి అది సామూహిక ఆత్మహత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు… దాదాపు అయిదేళ్లుగా ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా ఇరుగుపొరుగు వారికి తెలియదు… అనుకోకుండా ఈమధ్య ఓ ఆగంతకుడు ఎవరో […]
Biggboss… చివరకు ఆ షో ఫినాలే రేటింగ్స్‌పైనా అబద్ధపు ప్రచారం…
మొదటి నుంచీ బిగ్‌బాస్ ఇదే ధోరణి… పిచ్చి స్ట్రాటజీలు, తిక్క ప్రచారాలు, దిక్కుమాలిన షో నిర్వహణ… ఈసారి మరీ ఘోరం… సోఫాజీ అనబడే శివాజీని మోసిన తీరు చిరాకెత్తించగా… పల్లవి ప్రశాంత్‌ను జనం మీదకు విన్నర్‌గా రుద్దడం ఏకంగా సొసైటీకే సమస్యగా మారింది… గత సీజన్ ఎలాగూ మట్టిగొట్టుకుపోయింది… దరిద్రమైన రేటింగ్స్‌తో జనం ఛీ అన్నారు… లైట్ తీసుకున్నారు… కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… గత సీజన్ దరిద్రానికి ఎన్నో కారణాలు… ఈసారి ఏదో పేరు మార్చి, […]
Pooja Hegde…! ఈమె కాళ్ల మీదేనా అంతటి సిరివెన్నెల కలం పారేసుకున్నది..?!
మొన్నొక వార్త… స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మహేశ్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందనీ… తరువాత రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తీసివేయబడిందనీ…! తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 40 శాతం వరకూ పూర్తయ్యాక మరీ అంతటి పాపులర్ హీరోయిన్ తప్పుకుందనే సమాచారం ఆశ్చర్యపరిచింది… సరే, ఏవో బలమైన కారణాలు ఉండే ఉంటాయి… అసలు గుంటూరు కారం సినిమా జర్నీయే అంత సజావుగా అనిపించడం లేదు… మరి రవితేజ సినిమా […]
అసలు ‘ఉదయం’ అనే ఆ కొత్త అగ్గి రాజేసిందే ఆ ఈనాడు రామోజీరావు…
Taadi Prakash……….. తెలుగు జర్నలిజంలో వికసించిన విద్యుత్తేజం.! ‘ఉదయం’ వచ్చి నేటికీ 40 ఏళ్లు ….. 1984 – డిసెంబర్ 29 … అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు `రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. నేటికి నలభై ఏళ్లు.! కొద్ది మందిని మినహాయిస్తే ఆ ఏడాది మొదటినించీ మేమంతా వేడి టీలు తాగి, సిగరెట్లు కాల్చీ, సాయంత్రాలు మందు తాగి, వేడివేడి చర్చలు జరపడం వల్లనేమో మరి, […]
అదుగో ద్వారక..! జలాంతర్భాగానికి వెళ్దాం సరే… ఇంతకీ అక్కడ ఏముంది..?
దేవీపుత్రుడు అనే పాత తెలుగు సినిమా గుర్తుందా..? వెంకటేశ్, సౌందర్య, అంజలా జవేరి నటించారు… అందులో ద్వారక ప్రస్తావన, దానికి లింకున్న కథ, కొన్ని సముద్ర అంతర్భాగ సీన్లు ఉంటాయి… సరే, ఆ కథ వేరు, కథనం వేరు… కానీ సినిమాలో ప్రధాన పాయింట్ ద్వారక… అదే ఆకర్షణ… ఇప్పుడే కాదు, ఏళ్లుగా మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రిక సాహిత్యాల్లో ద్వారక ఓ మిస్టరీ నగరం… నాడు శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం… మన పురాణాలు ఏం చెబుతున్నాయి..? […]
సింగరేణి ఘోర ఓటమి… ఈ ‘బతుకమ్మ’ ఆత్మమథనానికి ప్రాతిపదిక కావాలి…
Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ – ఇచ్క పోతున్న ‘బతుకమ్మ’ : సింగరేణి జిందాబాద్…. మలిదశ తెలంగాణా ఉద్యమంలో త్వరితంగా ఎదిగి వచ్చిన నేతల్లో కల్వకుంట్ల కవితకు విశిష్ట స్థానం ఉన్నది. నిన్న మొన్నటిదాకా బతుకమ్మ అంటే ఆమె మారుపేరుగా నిలిచారు. కానీ, వారి రాజకీయ ప్రస్థానంలో నిన్నటి సింగరేణి ఎన్నికల ఫలితం మామూలు కుదుపు కాదు. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సంస్థ చిత్తు చిత్తుగా ఓడిపోవడమే కాదు, ఒక డివిజన్ లో […]
తమన్‌కు సిగ్గు లేదు సరే… త్రివిక్రమ్‌కు ఏమైంది..? ఇదా మహేశ్‌కు ఇచ్చే పాట..?!
సైట్లను, యూట్యూబ్‌ను ఫాలో అయ్యే తెలుగు వాళ్లకు ఇది పరిచయమే… ఓ అనామక ముసలాయన ఏదో సందర్భంలో ‘‘కుర్చీ మడతపెట్టి దెం– మెడలు ఇరుగుతయ్…’’ పాఠకులకు అర్థమైంది కదా… రాసుకోవడానికి, అనుకోవడానికే ఇబ్బందికరమైన పదం, వ్యక్తీకరణ… కానీ చాలా పాపులరైపోయింది… మరి ఇప్పటి ట్రెండ్ అలా పాడైంది… మింగితే, గువ్వ వంటి పదాల్ని సోషల్ మీడియా బాగా పాపులర్ చేసింది… హైపర్ ఆది వంటి కమెడియన్లు ఇంకా ప్రాచుర్యంలోకి తెచ్చారు… అదొక పైత్యపు పిశాచ భాష… సరే, […]
దర్శకుడిని తరిమేసి… నిర్మాతే మెగాఫోన్ పట్టి… రీళ్లు చుట్టేసినట్టున్నాడు…
హేమిటీ… నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథా..? అబ్బే, ఆయన ఉన్నప్పటి కథ, ఆయనకు కాస్త లింకున్న కథ… ఆయన బయోపిక్కు కాదు… అంటే ఆ పాతకాలం సినిమాయా..? ఇంట్రస్టింగు… అవును, అప్పుడెప్పుడో 1945 బాపతు కథ… ఓహ్, అయితే కథేమిటో… ఓ జమీందారు బిడ్డ, ఆమె హత్య… అది చేధించడానికి డెవిల్ అనబడే ఓ ఏజెంట్‌ను నియమిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం… సదరు హతురాలి బంధువు తగుల్తుంది… తరువాత మరో ఆపరేషన్లోకి పయనం… అక్కడక్కడా కొన్ని ట్విస్టులు… గుడ్, […]
కొడుకు సంసారంలో కాళ్లూవేళ్లూ పెట్టకండి… చేతులు కాల్చుకోకండి…
ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు చెప్పిన రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారు…. (1) ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండ మనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి. (2) మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి. లేదా ఒక ఫ్రెండ్ గానే […]
వాటీజ్ దిస్ సుమా..? ఇదా నీ టేస్ట్..? ఇదేనా నీ కొడుకు లాంచింగ్ సినిమా..?!
పద్ధతి అంటే సుమ… సుమ అంటే పద్ధతి… అంటారు అందరూ… పద్ధతి లేని వాతావరణం గనుకే ఆమె సినిమాలు చేయదు, కానీ సినిమా ఫంక్షన్లు ఆమె తప్ప ఇంకెవరూ చేయరు ఆల్మోస్ట్… ఇన్ని వందల ప్రోగ్రామ్స్ చేసినా సరే ఒక్క పొల్లు మాట, ద్వంద్వార్థపు మాట రానివ్వదు తన నోటి నుంచి… అలాంటి పద్ధతి కలిగిన యాంకర్ సుమ ఎందుకు పద్ధతి తప్పింది..? తన కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్గమ్ సినిమా చూశాక అందరికీ […]
అత్యంత చెత్త రికార్డు… 2023లో సూపర్ డూపర్ బంపర్ డిజాస్టర్ సినిమా…
ఫలానా హీరో సినిమా వారం రోజుల్లో 500 కోట్లు కుమ్మేసింది… ఒక వార్త… రష్యా, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వందల కోట్లు సంపాదించింది… నెట్ ఇంత..? గ్రాస్ ఇంత..? ఇలాంటి వార్తలు బోలెడు చదువుతుంటాం కదా… వాటిల్లో అధికశాతం ఫేక్ ఫిగర్సే ఉంటాయి… చాలా సినిమాలకు సంబంధించి థియేటర్లకు ఇచ్చే వాటా పోను బయ్యర్‌కు మిగిలేది తక్కువే… మరీ హిట్టయితే తప్ప… థియేటర్ డబ్బు, శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్, పైగా పలు […]
చలిచలిగా ఉందిరా ఒయ్రామా ఒయ్రామా… ‘హుషారుగా వణికించే’ పాటలివి…
Bharadwaja Rangavajhala……. చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక… చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం అనేదేదైతే ఉందో […]
‘కంఠశోష’ల్ మీడియా… 2, 3 ఏళ్లలో సగం మంది దూరమవుతారట…
రీచ్ హఠాత్తుగా ఘోరంగా పడిపోతుంది… డబ్బులు కట్టు, రీచ్ పెంచుకో అంటాడు వాడు… పేరుకు 2 లక్షల ఫాలోయర్లు, కానీ ఎంత మంచి పోస్టు పెట్టినా నాలుగయిదు వేల రీచ్ ఉండదు… అంతేకాదు… ఒకప్పుడు ఉన్న వాళ్లలో మెజారిటీ ఇప్పుడు కనిపించడం లేదు… చాలామంది దూరమైపోయారు, లేదా నామ్కేవాస్తే ఖాతాలు మెయింటెయిన్ చేస్తున్నారు… వాళ్ల ప్లేసులో గలీజు గాళ్లు, ట్రోలర్లు, రాజకీయ పార్టీల వీర ఫ్యాన్స్, నాయకుల అనుచరులు, ఫేక్ ఖాతాలు… దీనికితోడు కంప్యూటరే లైకులు కొట్టి, […]
- « Previous Page
- 1
- …
- 147
- 148
- 149
- 150
- 151
- …
- 455
- Next Page »