ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను అవినీతి, అక్రమ మద్యం పాలసీల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగానే, నిజంగానే అందరి దృష్టీ ఒక్కసారి ఆయన గురువుగా భావించే అన్నా హజారే మీదకు మళ్లింది… 86 సంవత్సరాల వయస్సున్న ఆయన మొదటి నుంచీ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నాడు… ఇదే కేజ్రీవాల్ తనతో కలిసి పనిచేశాడు… తరువాత విడిపోయి, ఆప్ పార్టీ పెట్టుకుని, మొదట ఢిల్లీలో, తరువాత పంజాబ్‌లో కూడా అధికారాన్ని సాధించాడు… ఏ అవినీతిపై తను […]
రుద్రకరణ్ ప్రతాప్… ఈయన మరో వేణుస్వామి… ఈడీ అరెస్టులపై మరో చర్చ..!
జ్యోతిష్కులపై ఎప్పుడూ ఓరకమైన విమర్శల దాడి జరుగుతూ ఉంటుంది… సోషల్ మీడియా విజృంభణ తరువాత ఇదింకా ఎక్కువైంది… ప్రత్యేకించి సెలబ్రిటీల జాతకాలను చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్కులపై ఈ దాడి ఇంకా తీవ్రంగా ఉంటుంది… అదేసమయంలో ఆ నెగెటివ్ ప్రచారం కూడా వాళ్లు మరింత పాపులర్ కావడానికి ఉపయోగపడుతుంది… మరింత మందికి పరిచయం కావడానికి ఆస్కారమిస్తుంది… సరే, జోస్యాలు నిజమవుతాయ్, అబద్దమవుతాయ్… ఎవరూ ఖచ్చితమైన జోస్యాలు చెప్పలేరు… చెప్పిన జోస్యాల్లో ఎన్ని నిజమయ్యాయ్, స్ట్రయిక్ రేట్ ఎంత అనేదే […]
50 ఏళ్ల క్రితం… బాలీవుడ్ రేఖ తొలి సినిమా… ఆమె ఈమేనా అన్నట్టుగా…
Subramanyam Dogiparthi… ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం 1970 లో వచ్చిన ఈ అమ్మకోసం సినిమా . అప్పుడు ఆమెకు 15-16 సంవత్సరాల వయసు . కృష్ణంరాజు జోడీగా నటించింది . అప్పుడు గుండ్రటి మొహం ఆమె తల్లిలాగా . బొంబాయి వెళ్ళాక కోల మొహం అయింది . సినిమాలో చూసేటప్పుడు కూడా ఈమె రేఖనా అని అనుమానం వస్తుంది . బాలనటిగా రంగులరాట్నంలో కనిపించింది . చిన్ని బ్రదర్స్ […]
ఈ అమృతం అప్పాజీ గుర్తున్నాడా..? ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదేమో..!!
ఈ సినిమా ఎప్పుడొచ్చి పోయిందో గుర్తు లేదు గానీ… సినిమా పేరు సౌండ్ పార్టీ… బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ ఇందులో హీరో… సినిమా ఫ్లాపో, హిట్టో తెలియదు గానీ… బిగ్‌బాస్ పాపులారిటీ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్‌కూ పెద్దగా ఉపయోగపడదు… జస్ట్, కొన్నాళ్లు టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తారు… ఆమధ్య సొహెయిల్ వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూశాం కదా… ఈ సౌండ్ పార్టీ సినిమా కూడా సన్నీకి పెద్ద ఫ్లెచింగ్ అవుతుందని అనుకోలేం… […]
రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఆర్థిక యుద్ధం…
రామరావణ యుద్ధం జరుగుతోంది… రావణుడు రాముడి బాణాలకు నిర్వీర్యుడయ్యాడు… రథం నుండి తూలి భూమి మీదకు పడిపోయిన రావణుడిని చూసి రాముడు “భయంకరమైన యుద్ధం చేశావు రావణా, నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి. నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ […]
25 ఏళ్లుగా ప్రతిరోజూ యోగా… పూర్తి శాకాహారం… ప్రతి సోమవారం ఉపవాసం…
సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ సెలబ్రిటీల గురించి కథలు రాస్తాం మనం… చదువుతాం… ఇన్ స్పిరేషన్ అనుకుంటాం… కానీ పేరొందిన సైంటిస్టులు, కంపెనీ సీఈవోలు, చైర్మన్లు, ఖతర్నాక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రత్యేకించి జడ్జిల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదు… భిన్న రంగాల ప్రముఖుల జీవితాలు, జీవనశైలిపై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తోంది… గుడ్… మన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లీగల్ సర్కిళ్లలో మంచి పేరు ఉంది… సహజంగానే తన లైఫ్ స్టయిల్‌పై కూడా రీడర్స్‌కు ఆసక్తి ఉంటుంది… […]
కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన కొనసాగించగలడా..?
ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా..? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది… కేజ్రీవాల్ జైలులో నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా..? వరుసగా తొమ్మిదిసార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, హైకోర్టులో తనకు ఏమీ రిలీఫ్ దక్కలేదు… అర్ధరాత్రయినా సరే, తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్… అరెస్టుకు ఈడీకి అధికారాలున్నయ్, తొమ్మిదిసార్లు […]
ఇచ్చట చవకగా ఫోన్ ట్యాపింగ్ చేయబడును..!
విలేఖరి:- సార్! మీకు ఈ ఏటి మేటి ఫోన్ ట్యాపింగ్ నైపుణ్య ప్రతిభా పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు. ఈ సందర్భంగా మిమ్మల్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ నిపుణుడు:- తప్పకుండా. నా నైపుణ్యం లోకానికి తెలియాలి. నా నేర్పు ఇతరులకు స్ఫూర్తి కావాలి. ఊరూరా నాలా చవకగా, సులభంగా, వేగంగా ఎందరో ఫోన్ ట్యాపింగ్ నిపుణులు పుట్టుకురావాలి. వి:- ఫోన్ ట్యాపింగ్ ను ఒక వృత్తిగా ఎంచుకోవాలని […]
హమ్మయ్య… ఎవరు ఏం తినాలో ఆంధ్రజ్యోతి పూసగుచ్చేసింది…
మీరు బరువు తగ్గాలి లేదా కొంత పెరగాలి… ఏం తినాలి..? ఏం తినకూడదు..? మీకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది… ఏం తినాలి..? ఏం అవాయిడ్ చేయాలి..? ఇవి ఎవరు చెప్పాలి..? డాక్టర్ చెప్పాలి లేదంటే న్యూట్రషనిస్టు చెప్పాలి… అంతే కదా… కాదు, మీరు తప్పులో కాలేశారు… మీరు ముందుగా మీ రాశిని బట్టి ఏమేం తినాలో ఎవరైనా పండితుడిని అడిగి తెలుసుకోవాలి… మీ రాశిని బట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఆయన చెబుతాడు… వాటిని […]
మరీ ఆనందంగా ఏమీ లేం… కానీ అంత అధ్వానంగా బతుకుతున్నామా..?!
ఒక దేశవాసి ఆనందంగా ఎప్పుడుంటాడు..? పెద్ద పెద్ద సంక్లిష్ట ప్రాతిపదికలు, బోలెడన్ని శాస్త్రీయ సమీకరణాలు గట్రా లేకుండా… స్థూలంగా, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం… 1) దేశం బయట నుంచి, అంతర్గతంగా భద్రంగా ఉండాలి… 2) న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ బాగుండాలి… 3) అవినీతి రహిత అధికారగణం ఉండాలి… 4) ఉద్యోగాలు, సరిపడా జీతాలు ఉండాలి… 5) మౌలిక సదుపాయాలు బాగుండాలి… 6) ఆయుఃప్రమాణం బాగా ఉండాలి… 7) వైద్యం, విద్య ప్రభుత్వ పరిధిలో ప్రజలపై భారం పడని […]
నిస్సారంగా… నీరసంగా… ఓ సాదాసీదా నకల్ చిట్టీల కథ… తుండు…
మనం ఇంతకుముందే అబ్రహాం ఓజ్లర్ అనే మలయాళ సినిమా గురించి రాసుకున్నాం కదా… లెజెండరీ స్టార్ మమ్ముట్టి ఉన్నంత మాత్రాన అది చూడబుల్ సినిమా అయిపోదని కూడా చెప్పేసుకున్నాం కదా… ఫాఫం, ఈమధ్య మంచి పేరు తెచ్చుకున్న మలయాళ సినిమాల్లో ఇలాంటివి కూడా వస్తున్నాయనీ అనుకున్నాం కదా… అదేమో హాట్ స్టార్ ఓటీటీలో ప్రవహిస్తోంది… అనగా స్ట్రీమవుతోంది… ఆగండాగండి, నేనేం తక్కువ, నేనూ ఈ అన్ చూడబుల్ సినిమాల జాబితాలో ఉన్నాను అంటూ తాజాగా తుండు అనే […]
నల్గొండ గోర్కీ… కృష్ణమూర్తి దేవులపల్లి… తెలంగాణ కథల తంగేడు చెట్టు…
కృష్ణమూర్తి గారు ఈ రోజు గుర్తొస్తున్నారు అందుకే ఈ పాత ఆర్టికల్ మళ్లీ …. Moving tales of Telangana… ……………………………… రిటైరైపోయాడు… ఇరవయ్యేళ్ల క్రితం. ఊపిరి సలపని ఉద్యోగం నుంచి విముక్తి. పిల్లలు సెటిలైపోయారు. ఎమ్మార్వో పని గనుక ఏ లోటూ లేదు. సొంత ఇల్లు. నెల చివరి వారం గడవడం ఎలా అనే బాధల్లేవు. మానసికమైన ఒంటరితనం మాత్రం పేరుకుపోతోంది. తలుపు తట్టినట్టయింది. పెద్దాయన దేవులపల్లి కృష్ణమూర్తి లేచి, తలుపు తీసి, గుమ్మంలో నిలుచుని […]
మమ్ముట్టి ఉన్నంతమాత్రాన చూడబుల్ అనుకుంటే అది ‘భ్రమ’యుగమే…
ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాల వీక్షణం ఎక్కువైంది… తెలుగులోకి డబ్ చేసి, థియేటర్లలో రిలీజ్ చేయడం, తెలుగు ఆడియోతో ఓటీటీలో పెట్టేయడం ఎక్కువగా సాగుతోంది… పైగా మలయాళంలో ప్రయోగాలు, క్రియేటివ్ థాట్స్, ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే గట్రా మనవాళ్లకు అధికంగా నచ్చుతుంటాయి… యాక్టింగ్ స్టాండర్డ్స్ కూడా… ఆ హీరోలు మామూలు పాత్రల్ని కూడా చేయడానికి రెడీగా ఉంటారు… మన డొల్ల ఇమేజీ హీరోలకు భిన్నంగా… ప్రత్యేకించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్లను మాలీవుడ్ డైరెక్టర్లు, రచయితలు భలే డీల్ […]
రాహుల్ రొట్టె విరుస్తాడు… అది మోడీ చేతి నేతి గిన్నెలో పడుతుంది…
రాహుల్ సెల్ఫ్ గోల్ ‘శక్తి’ … మోడీ ప్రచారాస్త్ర ‘శక్తి’ మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి ఆధారం. మొత్తంగా వాక్కు అగ్ని రూపం. పెదవి దాటిన మాట వైఖరి- ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు. మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల […]
వండర్ బాయ్స్..! ఏకంగా ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నారు…!!
మొన్నీమధ్య వాల్‌మార్ట్ సీనియర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పలువురు స్కూల్ లెవల్, కాలేజీ లెవల్ సైన్స్ టాలెంట్ కంపిటీషన్లకు జడ్జిలుగా వెళ్లారు… అక్కడ పిల్లల ఐక్యూ లెవల్స్, క్రియేటివిటీ స్టాండర్డ్స్, టెక్నికల్ నాలెడ్జి, థింకింగ్ రేంజ్ చూసి ఆశ్చర్యపోయారు… పిల్లల్ని జడ్జ్ చేస్తున్నామా, మనల్ని మనం అప్డేట్ చేసుకుంటున్నామా అన్న స్థాయిలో… ఎస్, ఈతరం పిల్లల మేధస్సు ఖచ్చితంగా పెద్దది… పరిణామక్రమంలోని ఫిట్టెస్ట్ సర్వైవల్, జన్యు మార్పులు వంటి కారణాలు ఎలా ఉన్నా… గుట్టలకొద్దీ ఇన్ఫర్మేషన్కు యాక్సెస్ ఉండటం, […]
నియంత తన నీడనూ నమ్మడు… ఆంతరంగికుల ఫోన్లనూ వదలడు…
అందరికీ గుర్తుంది కదా… పెగాసస్..! ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన ఈ స్పై వేర్‌ను జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్ష నేతలు, బ్యూరోక్రాట్లు, ఇతర ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్‌కు మోడీ ప్రభుత్వం వాడినట్టు కదా రచ్చ…! స్పై వేర్ వేరు కావచ్చుగాక, దాదాపు ప్రతి రాష్ట్రమూ ట్యాపింగ్, ఫోన్ కాల్స్ స్పైయింగ్ చేస్తూనే ఉంటుంది… ఏపీలో కూడా ఈ స్పై పరికరాల కొనుగోలు అంశమే కదా చంద్రబాబు హయాంలోని ఇంటలిజెన్స్ చీఫ్ మెడకు చుట్టుకుంది…! తెలంగాణలో కూడా ప్రజలందరి […]
జొమాటో వెజ్..! కులవాదం అట, మతవాదం అట… భారీ ట్రోలింగ్ షురూ…
రాజ్యసభకు మొన్న నేరుగా నామినేటైన సుధామూర్తి… అలియాస్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ అత్తగారు, రచయిత, మోటివేటర్, సంఘసేవకురాలు సుధామూర్తి.., గుర్తుందా..? ఆమధ్య కునాల్ విజయకర్ అనే ఫుడ్ రైటర్, టీవీ పర్సనాలిటీ చేసిన ‘ఖానే మే క్యా హై’ అనే ఓ ప్రోగ్రాం వీడియోలో మాట్లాడుతూ… ‘‘నేను ప్యూర్ వెజిటేరియన్… గుడ్లు కూడా తినను, అంతెందుకు వెల్లుల్లి కూడా తినను… ఏ దేశమైనా వెళ్తే రెస్టారెంట్లలో వెజ్, నాన్-వెజ్ వంటకాలకూ సేమ్ […]
ఆ కేసీయార్ హిస్టరీని రిపీట్ చేయడం రేవంత్‌కు ఎందుకు తప్పనిసరి..!!
2014… కేసీయార్‌కు అత్తెసరు మెజారిటీయే… తెలుగుదేశం, కాంగ్రెస్ ఏవో కుట్రలు పన్ని, తెలంగాణ ఏర్పాటుకు ఓ విఫల ప్రయోగంగా చేస్తాయనే భయం కూడా ఉండింది… కేసీయార్ గేట్లు ఎత్తాడు… నిలబెట్టి ఒక్కొక్కరికి ఏం కావాలో అడిగి మరీ అప్పటి టీఆర్ఎస్లోకి లాగేసిండు… ఒక్క కాంగ్రెసో, ఒక్క తెలుగుదేశమో కాదు… టీడీపీ 12, కాంగ్రెస్ 5, వైసీపీ 3, సీపీఐ ఒకటి, బీఎస్పీ ఇద్దరు… గేట్లు దాటి జంప్… ఎందుకు..? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం… ఎలాగూ ప్రజెంట్ రాజకీయాల్లో […]
అవినీతి కూపంలో ఓ కుటుంబ ఉద్యమ పార్టీ… హబ్బా… ఇది జార్ఖండ్ కథ..!!
ఉద్యమ పార్టీ… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు చిరునామాగా నిలిచి, పోరాటంలో నిలిచి, తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి, పదవుల కోసం పాకులాడి… అవినీతి అక్రమాలకు పేరుపడి… ఓ కుటుంబసభ్యుడు అవినీతి కేసుల్లో జైలుపాలై… పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది..! హబ్బా… కేసీయార్ పార్టీ గురించి కాదండీ బాబూ… శిబూ సోరెన్ కుటుంబ పార్టీ గురించి..! జార్ఖండ్ ముక్తి మోర్చా… ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడింది… పోరాడింది… తరువాత కేసీయార్ పార్టీలాగే మారిపోయింది అది వేరే సంగతి… […]
ఎస్బీఐపై సుప్రీం కోర్టు కొరడా… గుర్తొస్తున్న నాటి జస్టిస్ వేటూరి పాట…
మరీ ఇంత అన్యాయమా! ఎస్ బి ఐ? ఇదొక గంభీరమైన సమస్య. ఇదొక ధర్మ సందేహ సందర్భం. ఇదొక న్యాయాన్యాయ విచికిత్స. ఇది జస్టిస్ చౌదరి సినిమాలో పెద్ద ఎన్ టీ ఆర్ కోటు వేసుకుని, సిగార్ పైపు నోట్లో పెట్టుకుని “చట్టానికి- న్యాయానికి జరిగిన ఈ సమరంలో…” అని వేటూరి రాతకు, బాలసుబ్రహ్మణ్యం పాటకు అభినయించినట్లు న్యాయదేవత మూగగా అయినా పాడుకోవాల్సిన సందర్భం. ఎలెక్టోరల్ బాండ్లలో పేర్లేవీ? తేదీలేవీ? అని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం అడిగినా […]
- « Previous Page
- 1
- …
- 149
- 150
- 151
- 152
- 153
- …
- 483
- Next Page »