మనం ఉత్త(ర) కుమారులమబ్బా! … ఒక పిట్టకథ! సాక్షి ఆదివారం ఫ్యామిలీ పేజీలో ఇందిర పరిమి గారు ‘డబుల్ ధమాకా’ కాలమ్ నిర్వహించే కాలం అది! (What a Memorable Days). వివిధ రంగాల్లోని ఇద్దరు వ్యక్తుల్ని ఒక చోట చేర్చి వాళ్ల జీవితాల గురించి, వారి స్నేహం గురించి ఇంటర్వ్యూ చేసేవారు. వివిధ రంగాలు అన్నాను కానీ, అందులో సినీరంగ ప్రముఖులే ఎక్కువగా ఉండేవారు. … ఒకసారి దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ గార్ల ఇంటర్వ్యూ […]
ఎవరు ఇంటికి..? ఎవరు అంతిమ పోరుకు…? వరల్డ్ కప్‌లో ఏ దేశం స్థితి ఏమిటి..?
Nationalist Narasinga Rao………. #iccworldcup2023 వరల్డ్ కప్ సెకండ్ ఫేజ్ లో 3,4 స్థానాల కోసం కొద్దిగా ఆసక్తికరమైన పోటీ ఉండబోతుంది… అదెలాగంటే మొదటి రెండు స్థానాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే భారత్ కు సౌతాఫ్రికాకు రెండేసి మ్యాచ్ లు ఉన్నాయి… భారత్ ఒక మ్యాచ్ సౌతాఫ్రికాతో మరోకటి నెదర్లాండ్స్ తో తలపడాలి.. సౌతాఫ్రికా ఒకటి భారత్ తో మరోకటి ఆఫ్ఘన్ తో ఆడాలి…. భారత్ రెండు మ్యాచ్ లు గెలిస్తే 18 పాయింట్లతో నెంబర్ 1 లో […]
హీరో ఎంట్రీ అంత వీజీ కాదు… నెత్తురు పారాలి, దుమ్ము రేగాలి, దేహాలు తెగాలి…
Paresh Turlapati….. ఎంట్రీలో హీరోలకు భారీ ఎలివేషన్ ఇవ్వటం సినిమాల్లో అనాదిగా వస్తున్న ఆచారమే ! గతంలో ఎన్టీఆర్.. కృష్ణ లాంటి హీరోల ఎంట్రీ కెమెరా యాంగిల్ ముందు కాలి బూటుతో మొదలై తలకు చేరేది ! అభిమాన హీరో ముఖం కనిపించగానే హాలంతా కెవ్వు కేకలు ! ఈమధ్యలో వెనక మైదాన సంగీతం (అదేలేండి ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) అంటున్నారుగా ) అదరగొట్టేది ! ఆ రోజుల్లో దాదాపు చాలామంది హీరోల ముఖ […]
ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్ ఎంట్రీ…! రాకపోతే ఆశ్చర్యం గానీ…!!
కంగనా రనౌత్ అధికారికంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇన్నాళ్లూ బీజేపీ సానుభూతిపరురాలు, ఇప్పుడు బీజేపీ నాయకురాలు… తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మండీ నియోజకవర్గం నుంచి హైకమాండ్ టికెట్టు ఖరారు చేసింది… ఇదీ ఆమె కృతజ్ఞతా ప్రకటన… Kangana Ranaut @KanganaTeam My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of […]
నిప్పులురిమిన ఆ గొంతు తప్పు చేసి తుప్పుగా మారింది… పైగా పిచ్చి సమర్థనలు…
పార్లమెంటులో ఆమె వాగ్ధాటి చూస్తే ముచ్చటేసేది… సబ్జెక్టు డీవియేట్ గాకుండా.., కాస్త చదువుకుని, ప్రిపరేషన్ వర్క్ చేసుకున్నట్టు కనిపించేది… చేసే వ్యాఖ్యల్లో కూడా సీరియస్‌నెస్ ఉండేది… బీజేపీ విధానాలు, వైఫల్యాల్ని ఎఫిషియెంట్‌గా ప్రశ్నిస్తున్న గొంతు అనిపించేది… కానీ ఏమైంది..? ఒక్కసారిగా బురద పూసుకున్నట్టయింది… ఏ పార్లమెంటులో ఆమె ప్రతిభ ఎక్స్పోజ్ అయ్యిందో అదే పార్లమెంటు ప్రమాణాల్ని, విలువల్ని పాతరేస్తూ… ఎవరికో లాగిన్ ఇచ్చేసి, ఏవేవే ప్రశ్నలు, అవీ ఎవరి స్వార్థం కోసమే ఉపయోగపడే ప్రశ్నలు ఆన్లైన్లో సంధించడానికి […]
పొలిమేర-2… సినిమా సోసో… కానీ మన తెలుగు కామాక్షి కాస్త మెరిసింది…
సత్యం రాజేష్ ఇంటర్వ్యూ… అదేనండీ, ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది పొద్దున్నే… సినిమాలో ఓచోట నేను నగ్నంగా కనిపిస్తాను అంటాడు… నవ్వొచ్చింది… ప్రధాన పాత్రధారులు బరిబాతల నటిస్తే పెద్ద ఫాయిదా ఏమీ ఉండదోయ్… అప్పట్లో అల్లరి నరేష్ ఏదో సినిమాలో అలాగే కనిపించాడు… నయాపైసా ఫాయిదా రాలేదు సినిమాకు… అంతెందుకు..? అమలాపాల్ కూడా ఏదో సినిమాలో చాలాసేపు నగ్నంగా కనిపిస్తుంది… ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… కథలో ఆ సీన్ అత్యంత బలంగా డిమాండ్ చేస్తే, దాన్ని అంతే […]
ఓహ్… నాటి పాపులర్ టీడీపీ ప్రముఖులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారా..?
ఓ రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో నా చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలంలో నా చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ . కానీ ఆ పార్టీ అభ్యర్థుల మూడవ […]
కేసీయార్ చరిత్రకే ఓ భారీ మరక… కాళేశ్వరం ఇలాగే ఉంటే ఇంకా డేంజర్…
దేనికైనా ఓ టైమ్ రావాలి… ఆ టైమ్ వచ్చింది… కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్… ఏ కోణంలో చూసుకున్నా సరే అతి పెద్ద ఫెయిల్యూర్ అని సాక్షాత్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీయే తేల్చేసింది… ఇక ప్రాజెక్టులో అవినీతి ఏమిటో ఎవరు తేల్చాలి..? తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ అని పిలవబడుతున్న కేసీయార్ నిజానికి తెలంగాణకు చేసిన నష్టం ఏమిటో ఇప్పుడు బట్టబయలు అయిపోయింది… మేడిగడ్డ బరాజ్ కుంగిపోయి, […]
భారీ ఖర్చు, ప్రయాస తప్ప ఇంకేం మిగల్లేదు… షర్మిల రాజకీయాల కథ ఖతం…
మొత్తానికి కాంగ్రెస్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా, స్టబ్బరన్గా ఉంది.,. కోదండరాం ఏవో సీట్లు అడిగితే స్పందించలేదు, ఇక విధిలేక ఆయనే బేషరత్తు మద్దతు అంటున్నాడు… నో సీట్, నాటెటాల్… లెఫ్ట్ ఏకంగా పదేసి సీట్లు అడిగినా కొన్నాళ్లు నాన్చీ నాన్చీ ఇక సైలెంట్ అయిపోయింది… పేరుకు ఇండియా విపక్ష కూటమిలో సహభాగస్వాములే, ఐనా డోన్ట్ కేర్ అంటోంది… బీజేపీకి మద్దతు ఇవ్వలేరు, అవమానించిన బీఆర్ఎస్ పంచన చేరలేరు, అనివార్యంగా తాము పోటీచేయనిచోట్ల ఇక కాంగ్రెస్‌కు మద్దతు పలకాల్సిందే… […]
ఫాఫం బ్రహ్మి… అంతటి స్టార్ కమెడియన్ కోలాలో కీడా అయిపోయాడు…
కీడాకోలా… ఈ సినిమా చూస్తుంటే బ్రహ్మానందం మీద జాలి కలుగుతుంది… ఎలాంటి కమెడియన్ ఎలా అయిపోయాడు అని… నిజంగా బ్రహ్మ మంచి నటుడు… (మొన్నటి రంగమార్తాండ ఉదాహరణ…) కానీ కామెడీకి పరిమితం చేసింది ఇండస్ట్రీ ఇన్నేళ్లుగా… ఇదే బాగుంది అని దానికే ఫిక్సయిపోయాడు… తను లేనిదే తెలుగు సినిమా లేదు అనేంత సీన్ ఉండేది ఒకప్పుడు… వందల సినిమాలు, అగ్రతారలకు దీటుగా సంపాదన… కానీ..? మొనాటనీ… ఇది ఎవరినైనా చంపేస్తుంది… బ్రహ్మీ కూడా నచ్చడం మానేశాడు… ఒకే […]
ఆదానీ, అంబానీ… అన్ని వ్యవస్థల్ని శాసిస్తారు, అడ్డగోలు సంపాదిస్తారు… కానీ..?
దానకర్ణులు… దాతృత్వంలో పెద్దమనసులు… ఉదారశీలురు… ఇలా బోలెడు విశేషణాలతో మీడియా మొత్తం ఓ దిక్కుమాలిన సంస్థ చేసిన సర్వే, లేదా ఓ క్రోడీకరణను ప్రచురించింది,.. ఒక ప్రశ్న… ఈ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిదీ పెద్ద మనసేమీ కాదు… పిల్లికి బిచ్చం పెట్టరు, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు… మహా కక్కుర్తి, సంకుచిత తత్వాలు… మరి ఈ పొగడ్తలేమిటి..? కార్పొరేట్ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబులిటీ కింద తమ వార్షికాదాయంలో కొంత శాతాన్ని సమాజం కోసం వెచ్చించాలి… […]
ఓ సీఎం రాజీనామా చేయాల్సి వచ్చిన లాకప్ డెత్ కేసు… పిరవి…
1977 – ఒక ఎమర్జెన్సీ – ఒక లాకప్ డెత్ … మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ అనేది వచ్చి, 1977 దాకా కొనసాగింది. ఆ కాలంలో ప్రజల హక్కులు హరించబడ్డాయి. రాజన్ అనే యువకుడ్ని పోలీసులు తీసుకెళ్లి లాకప్‌లో నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చెట్టంత కొడుకు బతికి ఉన్నాడో, వస్తాడో రాడో అన్న వేదన ఆ తల్లిదండ్రులకు మిగిలింది. మలయాళ […]
వయస్సును రివర్స్ చేయొచ్చా…? కృత్రిమ మేధ దీన్ని సాధించగలదా..?
Age Via AI: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) వినోదరంగానికి ఎంత అనుకూలంగా ఉందో…అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. గూగుల్ చాట్ బోట్ కృత్రిమ మేధ తనకు తాను కవిత్వం రాసినట్లు…ఫలానా గ్రాఫిక్, యానిమేషన్ వీడియో ఫలానా రంగులు, ఫలానా ఎఫెక్ట్స్ తో కావాలి అని అడిగితే క్షణాల్లో చేసి పెట్టే కృత్రిమ మేధలు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల వేగం పెరిగింది; ఖర్చు బాగా తగ్గింది అని వినోద పరిశ్రమ మొదట ఎగిరి గంతులేసింది. నెమ్మదిగా దీనితో […]
ఫాఫం చిరంజీవి… టీవీక్షకులు పెదవి విరుస్తున్నారంటే ప్రమాద హెచ్చరికే…
వాల్తేరు వీరయ్య… చిరంజీవికి మళ్లీ ప్రాణం పోసిన సినిమా… అంతకుముందు పాదఘట్టం ఆచార్య అనే ఓ డిజాస్టర్… వాల్తేరు వీరయ్య తరువాత భోళాశంకర్ అనబడే మరో సూపర్ డిజాస్టర్ చిరంజీవి సినిమాల ఖాతాలో పడ్డయ్… రిస్క్ లేకుండా వేరే భాషల్లో హిట్టయిన కథల్ని రీమేక్ హక్కులు కొనిపించి, తన ఇమేజీకి (సూపర్ హీరోయిక్ కేరక్టర్స్) అనుగుణంగా నానా మార్పులు చేయిస్తున్నాడు… ఐనా సరే, తను మారడు… పోనీ, ఒరిజినల్స్ అలాగే ఉంచుతాడా..? ఉంచడు… చిరంజీవి నమ్ముకున్న సోకాల్డ్ […]
పర్ సపోజ్… జగన్ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే..?
మొన్నటి 30వ తారీఖున నారా లోకేష్ హైదరాబాద్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ (సీబీఎఫ్సీ) కు ఓ లేఖ రాశాడు… అది కంప్లయింట్… జగన్‌ను కీర్తిస్తూ, ఓ మోస్తరు బయోపిక్ తరహాలో రాంగోపాలవర్మ వ్యూహం అనే సినిమా తీశాడు కదా… రెండో భాగం కూడా తీయబోతున్నాడు కదా… దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని, పబ్లిక్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని లోకేష్ లేఖ సారాంశం… వైఎస్ పాదయాత్ర మీద అప్పట్లో ‘యాత్ర’ అనే సినిమా వచ్చింది… తరువాత కూడా […]
అబ్బే, తెలంగాణ రుచి వాసన ఏమీ లేని ‘తెలుగు వంటకాల’ జాబితా…
ఎవరో క్రోడీకరించారు తెలుగువారి వంటలు అని… తెలుగువాణ్ని తిండిలో కొట్టగలరా అని… ఇంత మెనూ ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఉండదట… సరే, దీన్ని వ్యతిరేకించే పని లేదు… ఇన్ని వంటలు ఒక్కచోట గుర్తుచేయడం ఓ మంచి ప్రయత్నమే… కాకపోతే తెలుగు వంటలు అని ముద్రవేయడమే సబబుగా లేదు… (దిగువన ఇచ్చిన ఫోటో చదవడం కష్టం… జూమ్ చేస్తే చదువుకోవచ్చు.,. ఒక్కసారి లుక్కేయండి…) . . ఈ జాబితాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ వంటకాలు లేవు… […]
నువ్వేమైనా బాలాకుమారివా..? హీరో తల్లిగా చేస్తే ఏం పోయిందట ఫాఫం…!!
అమ్మా షఫాలి…. కొంత ఫేమ్ రాగానే అవాకులు పేలడం Actors కి అలవాటే… మొన్నామధ్య ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో చేసిన సినిమాలపైన కొంత కాంట్రవర్సీగా మాట్లాడుతావా… ‘‘వక్త్ అనే సిని మాలో హీరో అక్షయ కుమార్ కి తల్లిగా చేయాల్సి వచ్చింది. తెరపై హీరో తల్లులు నిజానికి వారికంటే చిన్న ఏజ్ వారు. నేను ఇకపై అలాంటి పాత్రలు చెయ్యను అంటావా…?!’’ సర్లే, అది నీ అభిప్రాయం, నిన్ను నువ్వు హీరోయిన్ […]
మొన్న మేడిగడ్డ… నేడు అన్నారం… ఇప్పటికీ నోరువిప్పని ‘‘బాధ్యులు’’…
నిన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఓ పోస్ట్ పెట్టింది… మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు మీద మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమ్మీద నాణ్యత పరీక్షలు జరగాలనీ, లేకపోతే మొత్తం ప్రాజెక్టే ప్రమాదకరంగా మారొచ్చుననీ, కానీ కేంద్రం అడుగుతున్న వివరాల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనీ ఆ పోస్ట్ సారాంశం… ఆ పోస్ట్ మరీ జనాన్ని ఎక్కువ భయపెట్టేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు… ఇప్పుడు కేసీయార్ తమ రహస్య స్నేహితుడు కాబట్టి బీజేపీ నేతలు పెద్దగా […]
బీఆర్ఎస్ నోరుపారేసుకుంది… పోలీస్ వెర్షన్ పూర్తి భిన్నంగా ఉంది…
దుబ్బాక అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసుల ప్రకటన ఆశ్యర్యపోయేలా చేసింది… వీళ్లు మనకు తెలిసిన తెలంగాణ పోలీసులేనా అనేది ఆ విస్మయం… అందరూ అని కాదు, కానీ చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికార్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్న కాలమిది… ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా సరే… ఒకరిద్దరు కేసీయార్ కాళ్లను మొక్కుతున్న సీన్లు, ఒకాయన ఏకంగా పార్టీలో చేరి రిచ్చెస్ట్‌గా అవతరిస్తున్న సీన్లూ చూశాం, చూస్తున్నాం… అనేక సందర్భాల్లో నిజాల్ని దాచేసి, కేసీయార్ […]
అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
Taadi Prakash……… బాసు భట్టాచార్య ‘ఆస్తా’… A contagious disease Called consumerism… సరళీకృత అక్రమప్రేమ – స్టోరీ 5 1996…పీవీ నరసింహరావు, మన్మోహన్సింగ్ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్ చేస్తోంది. అమెరికన్ డాలర్లూ, గల్ఫ్డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్ మార్కెట్ ప్రపంచదేశాల్ని వూరిస్తోంది. మార్కెట్ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. మనిషి సరుకుగా మారుతున్నాడు. అటు కలకత్తాలో దర్శకుడు బాసూ భట్టాచార్య. ‘ఆస్తా’ సినిమాకి కథ […]
- « Previous Page
- 1
- …
- 161
- 162
- 163
- 164
- 165
- …
- 451
- Next Page »