Subramanyam Dogiparthi….. ప్రతి భారతీయుడిని కట్టేసయినా చూపించాల్సిన సినిమా . 1968 ప్రాంతంలో ఇదే పేరుతో చో రామస్వామి నాటకం వ్రాసి , తమిళనాడు అంతా సంచలనం సృష్టించారు . 1971లో సినిమాకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసి తానే తుగ్లక్ పాత్ర వేసి మరోసారి సంచలనం సృష్టించారు . 1972 లో మన తెలుగులోకి రీమేక్ అయింది . తమిళంలో సృష్టించినంత సంచలనం తెలుగులో సృష్టించలేదు . కారణం తమిళంలో చో రామస్వామి కరుణానిధిని మనసులో […]
కేజ్రీవాల్ ఇంటర్నల్ ఇష్యూస్… బెడిసిన ప్లాన్స్… క్రమేపీ బలంగా ఫిక్స్…
Pardha Saradhi Potluri …. కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోయాడు… బెయిల్ పొడిగింపుకి కోర్టు అంగీకరించలేదు… రూల్స్ ప్రకారం సూర్యాస్తమయం లోపే లొంగిపోవాలి కాబట్టి తప్పనిసరై వెళ్లాడు… ఇండి కూటమికి మెజారిటీ వస్తుంది, తను మళ్లీ జైలుకు వెళ్లే పనే ఉండదు అని ఏదో చెప్పాడు కదా… అందుకని ఏవో ఆరోగ్య సాకులు చెప్పి బెయిల్ పొడిగించాలన్నాడు… కోర్టు నో అనేసింది… జైలుకు తిరిగి వెళ్లేముందు పార్టీలోని తన ముఖ్యులతో సమావేశమై, పార్టీలో అందరూ సమైక్యంగా […]
సుడిగాలి సుధీర్… ప్లే బాయ్ షో కాదు… పక్కా ఫ్యామిలీ షో… గుడ్ హోస్టింగ్…
మామూలుగా ఈటీవీలో రియాలిటీ షోలంటేనే ఓరకమైన విరక్తి వచ్చేసింది అందరికీ… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆలీతో సరదాగా, సుమ అడ్డా, పాడుతా తీయగా… ఏది తీసుకున్నా అలాగే ఉంది… సరే, ఏవేవో మార్పులు చేస్తున్నారు… ఆ ముచ్చటను పక్కన పెడితే… ఈటీవీ తను గతంలో వదిలించుకున్న అదే సుడిగాలి సుధీర్‌ను పిలిచి, ఫ్యామిలీ స్టార్స్ అనే ఓ ప్రోగ్రాం హోస్ట్ బాధ్యతను ఇచ్చింది… గతంలో అయితే ఆ ప్లేబాయ్ ఇమేజీ ఉన్న […]
ఆహా ఒడిశా అసెంబ్లీ బరి… ఇది కదా అసలు సిసలు కీన్ ఫైట్ అంటే…
ముందుగా ఓ పేద్ద డిస్‌క్లయిమర్… ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావాలనేమీ లేదు… అలాగని పూర్తిగా తోసిపుచ్చలేం కూడా… అవి ఓవరాల్‌గా ఓ మూడ్ పట్టిస్తాయి… ఒడిశాకు సంబంధించి ఇండియాటుడే మై యాక్సిస్ సర్వే అబద్ధం కావాలనే కోరుకుంటున్నా… ఎందుకంటే, ప్రస్తుత భారత దేశ రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ వంటి రాజకీయ వేత్తలు అరుదు… టవరింగ్ పర్సనాలిటీ… ఆ కారణాలు , విశ్లేషణల జోలికి వెళ్లడం లేదిక్కడ… 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో 112 బీజేడీ గెలిస్తే కేవలం […]
ఏపీలో ఏడుపులట… తెలంగాణలో సంబురాలట… కానీ ఎవరు బాధ్యులు..?!
మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలా ఉండాలట… ఎవరో ఏపీ నాయకుడు చెబుతున్నాడు… ఎందుకు తండ్రీ..? ఇక వదలరా మమ్మల్ని..! మీఅంతట మీరు ఎదగరా..? మీ అసమర్థత కొనసాగుతూ ఉండాల్సిందేనా..? మీకు పదేళ్లలో నామమాత్రం రాజధాని రాలేదు, మీ నాయకులు అలాంటోళ్లు… పోలవరం కథ ఎక్కడికక్కడే ఆగింది… ఇప్పుడు మీ రాజధాని ఏది అనడిగితే ఒక వేలు వైజాగ్ వైపు, ఒక వేలు అమరావతి వైపు చూపిస్తుంది… ఇప్పుడు చంద్రబాబు మళ్లీ కుర్చీ ఎక్కితే మళ్లీ అమరావతి […]
ప్రజెంట్ టెక్ తరానికి కనెక్టయ్యే కథ… హీరోయిన్ సెంట్రిక్ మూవీ…
క్రైం స్టోరీలకు సోషల్ ఇష్యూస్ ముడిపెట్టి… మరీ సినిమాటిక్ గాకుండా రియలిస్టిక్ దర్యాప్తు కోణంలో కథనం నడిపిస్తూ… థ్రిల్లర్ జానర్ ప్రజెంట్ చేయడం మలయాళ దర్శకులకు బాగా అలవాటు… అదీ తక్కువ ఖర్చుతో.., ప్రధానంగా కంటెంట్, తమ కథన సామర్థ్యాలపై ఆధారపడి వర్క్ చేస్తారు… గ్రిప్పింగ్‌గా, లాగ్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకుంటారు… కీడం అని రెండేళ్ల క్రితమే మలయాళంలో రిలీజైన ఓ సినిమా… పైన చెప్పుకున్న బాపతే… దాన్ని ఇప్పుడు కీచురాళ్లు పేరుతో తెలుగులోకి తీసుకొచ్చి […]
కర్నాటక, కేరళ ప్రభుత్వాల నడుమ అఘోరా జంతుబలి లొల్లి..!!
ఇండి కూటమి… కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి మునుపెన్నడూ లేని రీతిలో అనేక భాగస్వామ్య పార్టీలతో ఓ పక్కా కూటమిని నిర్మించినా సరే… బీజేపీ మళ్లీ విజయఢంకా మోగించబోతున్నదనేది నిజం… ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి… కానీ ఈ కూటమి విశ్వసనీయత ఎంత..? బెంగాల్‌లో ఈ కూటమి సభ్యులే టీఎంసీ, సీపీఎం ప్రత్యర్థుల్లా కాట్లాడుకుంటారు… కేరళలో సీపీఎం, కాంగ్రెస్ కూటముల నడుమే పోటీ… అంతెందుకు కూటమి నాయకుడు రాహుల్ గాంధీ మీద వయనాడ్‌లో కూటమి మరో […]
బాలయ్య తోపుడు భాగ్యంపై అంజలి రియాక్షన్ అక్షరాలా కరెక్టు..!!
Murali Buddha…. బాలయ్య వ్యవహారంలో అంజలి చేసింది కరెక్ట్… ఎందుకంటే, ఒకసారి వేరే స్టోరీలోకి వెళ్దాం… అరిజీత్ సింగ్ బాలీవుడ్ లో టాప్ గాయకుడు … ఒక్కో పాటకు 18 లక్షలు తీసుకుంటాడు … బోలెడు సంపాదించాడు … సింపుల్ గా బతుకుతాడు . రబ్బర్ చెప్పులు … పంజాబ్ లోని తమ సొంత గ్రామంలో ఉంటాడు … పిల్లలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు … ఊరిలో స్కూటర్ మీద తిరుగుతాడు … సింపుల్ గా […]
ఔటర్ ఎక్కారో… తాట వలుస్తారు… అనగా టోల్ పిండేస్తారు… జాగ్రత్త…
ఒక వార్త… మళ్లీ టోల్ ఛార్జీలు పెరగబోతున్నాయి… ఇప్పటికే టోల్ తీస్తున్నారు ప్రతిచోటా… మరి గడ్కరీ నాయకత్వమా మజాకా..? వాయింపు, వడ్డింపు మాత్రమే తనకు తెలిసిన విద్యలు… సగటున 5 శాతమే అని మళ్లీ ఏదో బుకాయింపు, సమర్థింపు… అసలు ఏ రోడ్డుకు ఎంత ఖర్చయింది, ఇప్పటికి ఎంత వసూలైందనే లెక్కలు చూసే అధికారి ఒక్కడూ లేడని అనిపిస్తుంది… సరే, అది కాదు అసలు వార్త… హైాదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ చార్జీలు పెంచుతున్నట్టు […]
పీవోకే వేరే దేశమే అయితే… పాకిస్థాన్ సైన్యం, రేంజర్లు ఎందుకు వెళ్లినట్టు..?!
పాకిస్థాన్, ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కయానీ ఆ దేశ అడిషనల్ అటార్నీ జనరల్‌కు సూటిగా ఓ ప్రశ్న వేశాడు… అదీ ఈ కేసులో ఇంట్రస్టింగ్… ‘‘కశ్మీర్ అనేది ఓ విదేశం అంటున్నారు కదా.., దానికి సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయంటున్నారు కదా… మరి పాకిస్థాన్ సైన్యం, రేంజర్లు ఎందుకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు..? ప్రజల్ని పాక్ గూఢచార సంస్థలు బలవంతంగా అపహరించడమనేది ఆగకుండా నడుస్తూనే ఉంది దేనికి..?’… ఇదీ జస్టిస్ కయానీ అడుగుతున్న వివరణ… […]
ప్చ్, కనెక్ట్ కావడం లేదు కీరవాణీ… ఎక్కడో ఆత్మను మిస్సయిపోయావ్…!!
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, పోరు తెలంగాణమా… అని గద్దర్ పాడిన పాటలోని జోష్ ఒక్కసారిగా నరాల్లో ఎంత చైతన్యం నింపేదో కదా… సాహిత్యం వదిలేయండి కాసేపు… ఆ గొంతు అలా పరవళ్లు తొక్కిస్తుంది పాటను… పోనీ, వందేమాతరం శ్రీనివాస్ పాడిన వందేమాతర గీతం వరస మారుతున్నది అనే పాట ఓసారి గుర్తుతెచ్చుకొండి… ఆయన పాట పాడుతుంటేనే జానపదం గజ్జె కట్టినట్టుంటుంది… ఖంగున మోగి నేరుగా గుండెను కనెక్టవుతుంది… ఓ రాములమ్మా అనే పాట కూడా… […]
ఏక్‌సేఏక్… ఎగ్జిట్ పోల్స్‌ను మరీ ‘పంచాంగ శ్రవణాలు’ చేశారు కదరా…
పొద్దున్నే నమస్తే తెలంగాణలో ఈ ఎగ్జిట్ పోల్స్ వార్త ఎలా వస్తుందో చూడాలని అనుకున్నాను… అచ్చం అలాగే… ఎగ్జిట్స్ ఏకపక్షమట, ఫీల్డ్ రియాలిటీ పట్టలేదట… సరే, ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే… సేమ్ మాట, సేమ్ ఏడుపు… అన్నింటికన్నా నవ్వొచ్చింది ఏమిటంటే… తెలంగాణ రిజల్ట్ విషయానికొచ్చేసరికి అదేదో సీప్యాక్ (ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తరహాలో ఓ పేరు) సంస్థనట… ఎగ్జిట్ పోల్ నిర్వహించిందట… అందులో బీఆర్ఎస్‌కు 11 వస్తాయట, ఫాఫం, కాంగ్రెస్ పార్టీకి […]
అశ్వత్థామ మ్యూజిక్… ఆపై సినారె రాత… ఆ పాటతో సినిమా సూపర్ హిట్…
Subramanyam Dogiparthi….. లవర్ బాయ్ , సాఫ్ట్ బాయ్ ఇమేజిలో నుండి రెబల్ , నెగటివ్ షేడున్న పాత్రలోకి దూరి హీరోగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్న సినిమా ఇది శోభన్ బాబుకు … వీరాభిమన్యు , కాలం మారింది , చెల్లెలి కాపురం వంటి చక్కని చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న శోభన్ బాబు ఈ సినిమా ద్వారా మాస్ హీరోగా అవతరించాడని చెప్పవచ్చు . సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ … అఖల్ & […]
నాకు వేదికపై దక్కిన తోపుడు భాగ్యం చూసి… మీడియాకు ఒకటే కుళ్లు…
ఆయన తాగింది మందు కాదు… నన్ను తోసింది తోపుడు కాదు యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:- మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని… తప్ప తాగి వేదిక మీదికి వచ్చి… స్పృహ లేని మైకంలో నన్ను తోస్తే… నేను దబ్బున పడబోయి… నిభాయించుకుని… నిలబడి… ఏడవలేక… నవ్వానని… మీరు వైన వైనాలుగా, చిత్రవిచిత్రాలుగా, దృశ్య విదృశ్యాలుగా, రకరకాల కామెంట్లతో ఆ వీడియోను […]
కేసీయార్ సార్… ఢిల్లీలో దిగిన ఈ గ్రూప్ ఫోటో యాదికున్నదా..?
నీ పాలన దుర్మార్గం, నువ్వు ప్రజావ్యతిరేకంగా పాలిస్తున్నవ్, నీ పార్టీ అనేక బలిదానాలకు కారణం, తెలంగాణ అనేది నీ పార్టీ దయాభిక్ష కాదు, అస్తిత్వ చిహ్నాలను అవమానిస్తున్నవ్….. ఇలా అనేకానేక నిందారోపణలతో మాజీ సీఎం కేసీయార్ సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాశాడు… తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీయారే… అందులో డౌట్ లేదు, ఎవడూ వ్యతిరేకించరు… కానీ ఓ రేంజ్ క్రెడిట్ సొంతం చేసుకున్న తను కీలకమైన దశాబ్ది ఉత్సవం సందర్భంలో… రాజధాని […]
రహస్యంగా… మనం రెండు లక్షల కిలోల బంగారం కొన్నాం అప్పట్లో…
1991లో భారత ప్రభుత్వం దగ్గర నిధులు పూర్తిగా అడుగంటిపోయినప్పుదు మన దగ్గరున్న బంగారం నిల్వల మొత్తాన్ని తనఖా పెట్టి నిధులు తేవాల్సి వచ్చింది. అలాంటి రోజుల్లో – 2009 లో రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉన్న ఒక తెలుగువాడు మార్కెట్లో బంగారం భవిష్యత్తుని పసిగట్టి, సాహసం చేసి, అతి రహస్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి 200 టన్నుల (రెండు లక్షల కిలోల) బంగారాన్ని కొని, ఇంగ్లాండుకి చేర్చేదాకా ప్రపంచానికి తెలియనివ్వకుండా చూశాడు. ఆ తరువాత కాలంలో […]
ప్రచార యావ కాదు… మొక్కలు నాటడం అంటే ఇదీ ఓ పద్ధతి…
మొక్కలు పెంచడం అంటే… అలా ఓ మొక్క నాటేసి, ఫోటోలు దిగేసి, తరువాత ఏమైందో కూడా పట్టించుకోరు అనేకమంది… గ్రీన్ చాలెంజులు, ఫారెస్టు చాలెంజులు, సెలబ్రిటీ చాలెంజులు గట్రా అసలు మొక్కలు నాటడాన్నే అపహాస్యం చేస్తుంటాయి… ఫోటో కోసం మొక్కనాటడం కాదు, పబ్లిసిటీ కోసం మొక్కనాటడం కాదు… దాన్ని ఓ సిన్సియర్ ఎఫర్ట్‌లాగా తీసుకోవాలి… అబ్బే, అంత సీన్ లేదండీ, మొక్క నాటామా, ఫోటో దిగామా, మీడియాలో కనిపించామా, అంతే… అంతకుమించి మేం పట్టించుకోం అంటారా..? ఈ […]
డీకే భాయ్… తగ్గొద్దు… మనం వేణుస్వామితో కామాఖ్యలో చేయిద్దాం…
ఒక వార్త… ఏదో పత్రికలో కనిపించింది… నన్ను గెలిపించకపోతే నా అంత్యక్రియలకు రండి, నన్ను బొందపెట్టండి, నన్ను కాలబెట్టండి తరహా నాయకుల ఎమోషనల్ బెదిరింపుల వార్తలు చదివీ చదివీ మనమూ అఘోరాల్లాగా ముదిరిపోయి ఉన్నాం కదా… సో, ఈ వార్త కూడా పెద్దగా కదిలించలేదు… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే… ‘‘రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తాంత్రిక పూజలు చేయిస్తున్నారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివరామయ్య ఆరోపించాడు… తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కేరళలోని […]
అది పాత తాకట్టు బంగారం కాదు… అక్కడ భద్రపరిచిన మన బంగారమే…
RBI Gold is Back: భారత్‌కు చేరిన లక్ష కిలోల బంగారం.. ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్.. పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై దిగింది.. ఒకేసారి వంద టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారత్‌లో మళ్లీ స్వర్ణ యుగం మొదలైంది. ఇప్పుడు స్వర్ణ భారత్.. 24 కేరట్స్ బంగారంలా మెరిసి పోతోంది. కొత్త బంగారు లోకంగా మారిన […]
ఎగ్జిట్ పోల్స్, మీడియా స్టోరీస్ మాత్రమే కాదు… పల్స్ పట్టించేవి ఎన్నో…
Nationalist Narasinga Rao…. లోకసభ ఎన్నికలకు సుమారు నాలుగు ఐదు నెలల ముందు నుండి ( 2024 జనవరి) ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన అన్ని రకాల సర్వేలు ఫాలో అయ్యా… కేవలం ఈ సర్వేల మీదనే మాత్రమే ఆధార పడకుండా…. 15 రాష్ట్రాల్లో (ఒక్కొక్క రాష్ట్రమ్ లో పది మందికి తక్కువ కాకుండా ) నాకు ప్రత్యక్ష పరిచయం ఉన్న ఫ్రెండ్స్ / కొలీగ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు… వీళ్ళతో ఈ 5 నెలలలో […]
- « Previous Page
- 1
- …
- 172
- 173
- 174
- 175
- 176
- …
- 409
- Next Page »