సినిమా అనేది ఓ వ్యాపారం… ప్రజాసేవ కాదు, ఛారిటీ అసలే కాదు… అన్నింటికీ మించి ఇండస్ట్రీ పదే పదే చెప్పుకునే కళాసేవ అస్సలు కాదు… ఎంత పెట్టాం, ఎంతొచ్చింది… ఇదే లెక్క… సో, జయాపజయాలు వస్తుంటాయి, పోతుంటాయి… జనానికి అన్నీ నచ్చాలనేమీ లేదు… కొన్ని అడ్డంగా తొక్కేస్తారు, కొన్ని అనుకోకుండా లేపుతారు… గెలుపుతో ఎగిరిపడటం గానీ, ఫ్లాపుతో ఇంకెవరి మీదో పడి ఏడవడం గానీ తగవని గీతకారుడు ఉద్బోధించినట్టు గుర్తు… పెళుసు వ్యాఖ్యలకు, అనవసర వివాదాలకు పెట్టింది […]
అసలే ఎన్టీయార్ ట్రిపుల్ యాక్షన్… ఆపై జయంతి నాటకీయత…
Subramanyam Dogiparthi…. NTR త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సాంఘిక చిత్రం 1972 లో వచ్చిన ఈ కులగౌరవం సినిమా . తమ స్వంత బేనరయినా పేకేటి శివరాంకి దర్శకత్వం వహించే అవకాశాన్ని కలగచేసారు . మన తెలుగు సినిమాకు మాతృక 1971 లో వచ్చిన కులగౌరవ అనే కన్నడ సినిమా . దానికి కూడా పేకేటియే దర్శకుడు . కన్నడంలో రాజకుమార్ , జయంతి , భారతి నటించారు . తమిళంలో 1976 లో రీమేక్ చేసారు […]
బాగా చెప్పావ్ మమ్ముట్టీ భాయ్… హీరోలు అంటే ఏమైనా తోపులా..?!
దాదాపు 420 సినిమాల వరకూ చేసి ఉంటాడు… మమ్ముట్టి అంటే మాలీవుడ్ లెజెండ్… రీసెంటుగా ఏదో సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో… ‘‘నా చివరి క్షణం వరకూ నటిస్తూనే ఉంటాను… ఇంకా అలసిపోలేదు… నేను మరణించాక జనం ఎన్నాళ్లు గుర్తు పెట్టుకుంటారో నేను చెప్పలేను, ఐనా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి… నేనేమైనా తోపునా..? ప్రపంచంలో వేల మంది నటులున్నారు… ఏమో, నేను పోయాక మహా అయితే రెండేళ్లు చెప్పుకుంటారేమో…’’ ఇలా సాగిపోయింది తన ఇంటర్వ్యూ… స్థూలంగా పరికిస్తే తన మాటల […]
తన జర్నీకి పొసగదనే భావనతో… రాష్ట్రపతి పదవే వద్దనుకుంది…
భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పీఠం వరిస్తే ఎవ్వరు మాత్రం కాదంటారు..? స్థితప్రజ్ఞులనుకున్నవారు సైతం.. ఆ అవకాశం వస్తే వదులుకోలేకపోయినవారే. కానీ, ఓ శాస్త్రీయ నృత్య కళాకారిణికి అలాంటి అవకాశం వస్తే.. వదులుకుందన్న విషయం మనలో ఎందరికి తెలుసు..? ఆ పేరే.. రుక్మిణీదేవీ అరుండేల్. రండి కలియుగ రుక్మిణీ కథేంటో ఓసారి తెలుసుకుందాం. 1904, ఫిబ్రవరి 29- 1986 ఫిబ్రవరి 24 ఏ ఫోటో చూసినా.. ఆమె నాట్య భంగిమల్లో ఓ తన్మయత్వంలోనే కనిపిస్తారు. ఫోటోగ్రాఫర్స్ ఎంతగా […]
ఒకానొక దుర్దినం.., ఈ తాపీ మేస్త్రీ ఇక విషం తాగాలనుకున్నడు…
Kandukuri Ramesh Babu …… అందెశ్రీ మాతృగీతం : ‘జయ జయహే తెలంగాణ’ నాటి పాలబుగ్గల పిలగాడు, పశుల కాపరి, పల్లె కాపుల ఉరుములకు ఎక్కి ఎక్కి ఏడ్చినోడు, ఉసిక తెప్పల పాన్పుల్లో ఊరడిల్లిన జానపదుడు ఇయ్యాల మొనగాడైండు. తెలంగాణ తల్లిని తన భుజస్కందాల మీద ఊరేగించే పాట రాశిండు. ఎల్లన్నా నీకు వందనాలె! “నాది కవి గానం కాదు, కాలజ్ఞానం” అని చెప్పిన ఎల్లన్నా, జయ జయహే తెలంగాణమే! పదేళ్ళక్రితం ఆనాడు రాష్ట్ర గీతం అవుతుందనుకున్నప్పుడు […]
బాగా చేశావ్ ఇమ్మూ… సరే, వెన్నెల కిషోర్ సరేసరి… జై గణేషా…
ఏమో గానీ… కొన్ని సినిమాలు చూస్తే అనుకోకుండా… ఒకరిద్దరు యాక్టర్లు తమ ముద్ర వేసి కొసేపు మన ఆలోచనల్లో తచ్చాడుతూ ఉంటారు… శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ షోలో తెలంగాణ ఆవిర్భావ ప్రత్యేక స్కిట్‌లో అమరుల మీద పాడిన నూకరాజు అనే జబర్దస్త్ కమెడియన్ ఒకరకంగా పేరు తెచ్చుకోగా… తనతోపాటు రీసెంటుగా బాగా పాపులరైన మరో కమెడియన్ ఇమాన్యూయేల్ గం గం గణేష చిత్రంలో మెరిశాడు… నిజానికి వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాప్ స్టార్ కమెడియన్… ఒకప్పుడు […]
కొంతమంది డెస్టినీ… రాత రాసిన దేవుడికీ సమజ్ కాదేమో…
బాల్యంలో కిడ్నాప్ కు గురయ్యాడు… 22 ఏళ్లు కనిపించకుండా పోయాడు. ఇక తిరిగి రాడని… తమ బిడ్డ లేడని ఆ కుటుంబం శోకసంద్రమైంది. కానీ, మనిషికి దేవుడిచ్చిన ఓ వరం.. మరుపు! అలా కాలంతో పాటే… మానవ సహజంగా మర్చిపోయారు… అప్పుడప్పుడూ గుర్తుకొచ్చి ఆందోళన కనిపించినా.. చేసేదేమీలేదని తమకు తాము సర్ది చెప్పుకుని బతుకుతున్న ఆ కుటుంబానికి ఓ ఊహించని పరిణామమెదురైంది. అదే, తమ కొడుకు 22 ఏళ్ల తర్వాత… 29 ఏళ్ల వయస్సులో తిరిగిరావడం. మానవ […]
తోరణం తొలగింపు వెనుక అదా చరిత్ర..? రెడ్లు వర్సెస్ వెలమలా…!
తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పుల గురించి బీఆర్ఎస్ శ్రేణులు గాయిగత్తర చేస్తున్నాయి… కేటీయార్ చార్మినార్ దగ్గరకు వెళ్లి మరీ ఆందోళన నిర్వహించాడు… అదేమంటే చార్మినార్, కాకతీయ తోరణాలు గంగా జమునా తెహజీబ్, తెలంగాణ చరిత్ర అంటాడు… మరొక మిత్రుడు చార్మినార్ తెలంగాణ ప్రైడ్ అంటాడు… నిజానికి చార్మినార్, కాకతీయ తోరణం మతచిహ్నాలు కావు, వాటిని అధికార చిహ్నంలో ఉంచడం మతసామరస్యానికి సంకేతమూ కాదు… అవి రాచరికపు చిహ్నాలు కాబట్టి, ఆ ఆనవాళ్లను తొలగించడమే రేవంత్ రెడ్డి […]
రోహిణి సింధూరి… తెలుగు మహిళల పరువు తీశావు కదా తల్లీ…!!
ఒక పిచ్చి, ఒక పైత్యం…. కావు, ప్రజాధనంతో విలాసాన్ని, వైభోెగాన్ని అనుభవించడం అంటారు దీన్ని… ముఖ్యమంత్రులు, కీలక స్థానాల్లో ఉన్న బ్యూరోక్రాట్లు, మంత్రులకు, ఇంకొందరు పెద్దలకు ప్రభుత్వమే నివాస భవనాలు సమకూరుస్తుంది… అవి వాళ్లు ఆయా స్థానాల్లో ఉన్నన్ని రోజులకు మాత్రమే… కానీ కొందరు వాటిని ప్యాలెసులుగా మార్చేసుకుంటారు, సొంత డబ్బు కాదు కదా, జనం సొమ్మే, ఎలా తగలేస్తేనేం..? అఖిలేష్ యాదవ్ దాదాపు 60 వేల అడుగుల మేరకు ఓ ప్యాలెస్ నిర్మించుకున్నాడు… దాదాపు 100 […]
ఓహో… ఈటీవీ జబర్దస్త్ కుదింపు వెనుక ఈ ఆత్మసమీక్ష కూడా ఉందా..?!
అవును.., ఈటీవీలో జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ రెండు షోలనూ కలిపేసి ఒకటే జబర్దస్త్‌గా కుదించేసి ప్రసారం చేయబోతున్నారు… ఆ విషయం ప్రోమోల్లోనే స్పష్టం చేశారు… కానీ ఓ ప్రముఖ చానెల్ తన బూతు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్‌ను ఇన్నేళ్లు ఎవరెంత మొత్తుకున్నా, తిట్టిపోసినా కంటిన్యూ చేసి, హఠాత్తుగా ఇలా ప్రేక్షకులను కరుణించడం ఏమిటీ అంటారా..? సింపుల్, జనం దాన్ని చూడటం మానేశారు… అదే కాదు, ఆ టీవీ రియాలిటీ షోలను ఎవడూ దేకడం లేదు… అందుకే కొత్త […]
సుదూర ప్రయాణం… అరుదైన రక్తదానం… అక్షరాలా ప్రాణదానం…
ప్రాణం విలువ తెలిసినవాడు ప్రాణం కాపాడతాడు.. ప్రాణం విలువ తెలియనివాడు చెలగాటమాడుతాడు. మనిషంటే లెక్కలేనివాడు సాటి మనిషేమైపోయినా పట్టించుకోడు.. మనిషి విలువ తెలిసినవాడు సాటి మనిషిగా చేయూతనందిస్తాడు. ఇప్పుడీ కొటేషన్స్ ఎందుకంటే… ఓ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు 400 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి.! అందుకు!! అంతకుముందు మనమో బ్లడ్ గ్రూప్ గురించి చెప్పుకోవాలి. అదే హెచ్ హెచ్ బ్లడ్ గ్రూప్. దాన్నే బొంబాయి బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఇదొక అరుదైన రక్త నమూనా. […]
అందుకే అది పక్షిరాజు… వేటకు తననే ఆయుధంగా ఇలా మార్చుకుంటుంది…
Jagan Rao….. జీవితంలో క్రింద పడితే పక్షి రాజు గద్ద జీవితం నిజంగా ఒక పాఠం. బాగా బతికి చెడితే గద్ద జీవితమే ఒక భగవద్గీత. బద్దకం ఉంటే గద్ద జీవితమే ఒక బైబిల్. నేను ఒంటరి, నేను ఏమీ చేయలేను అనుకుంటే గద్ద జీవితమే ఒక ఖురాన్. నా రాత ఇంతే మారదు, నా కర్మ ఇంతే నేను ఏమీ చేయలేను అనుకుంటే మాత్రం గద్ద జీవితం చదవాల్సిన ఒక గ్రంధం నీరు నింగి నేల […]
అన్నీ అయిపోయాయ్… ఇక చిలక జోస్యాలు మాత్రమే మిగిలాయ్…
ఏపీ ఎన్నికల రిజల్ట్‌కు సంబంధించి అనేకానేక ఎగ్జిట్ సర్వేలు అంటూ సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి… నిజానికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చెబితే జైలుపాలు కావాలి… కానీ ఎవడికిష్టం వచ్చిన ఫిగర్ వాడు రాసేసి ప్రచారంలోకి తీసుకొస్తున్నారు… ప్రామాణికత ఏముంది..? అసలు సర్వే నిజంగా జరిగిందా లేదా ఎవడు చూడొచ్చాడు..? రాసేటోడి చేతికి మొక్కాలి, అంతే… కేంద్రం విషయానికివస్తే స్టాక్ మార్కెట్ ఆమధ్య ఫుల్లు డౌన్… అయిపోయింది, ఇదే సూచన, బీజేపీ పని మటాష్ అని […]
ఫాఫం, కేసీయార్ నిర్వాకాలు ఇన్నేళ్లూ సెంట్రల్ ఇంటలిజెన్స్‌కు తెలియవా..?
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలట… బీజేపీ అరివీర భీకర డిమాండ్ అట… ఎందుకు..? కేసు మన చేతుల్లోకి వస్తుంది కాబట్టి… రేవంత్ పాత కేసీయార్ బాగోతాలన్నీ తవ్వుతూ, ఎక్కడేం జరిగిందో చెబుతుంటే, సీబీఐకి ఇవ్వాలి, సీబీఐకి ఇవ్వాలనే ఓ తర్కరహిత డిమాండ్ తప్ప బీజేపీ నుంచి వేరే స్పందనే కనిపించదు… చాలా విచిత్రమైన రాష్ట్ర నాయకులు… ఒకవైపు కేసీయార్ యాంటీ బీజేపీ కూటమికి డబ్బులిస్తుంటాడు, ఇటు కవితను కాపాడుకోవడానికి ఏకంగా బీజేపీ కేంద్ర నాయకులనే బుక్ […]
ఒళ్లొంచాలి… చెమటోడ్చాలి… నేర్చుకోవాలి… ఈ షో అంత వీజీ కాదు…
నో డౌట్… బిగ్‌బాస్ కొందరు ప్రేక్షకులకైనా సరే నచ్చే ప్రోగ్రాం… అనేకానేక రియాలిటీ షోలలో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో హిట్టయిన కాన్సెప్టు అది… కాకపోతే తెలుగులోకి వచ్చేసరికి సరైన ఎంపికలు లేక, లోకల్ క్రియేటివ్ టీం పైత్యంతో దాన్ని మరీ ప్రశాంత్, శివాజీ, యావర్ వంటి చిరాకు కేరక్టర్లతో భ్రష్టుపట్టించి విసుగు పుట్టించారు… ప్రశాంత్ రైతుద్రోహి, ఎవ్వడికీ రూపాయి సాయం చేయలేదు అనే వార్తలు నవ్వొచ్చాయి… బిగ్‌బాస్‌లో వోటింగ్ కోసం లక్ష చెబుతారు, పైగా శివాజీ వంటి […]
పరధ్యానం కాదు… ఆత్మధ్యానం… రాజకీయ ప్రయోజన ధ్యానం…
ఇదొక ఆసక్తికరమైన వివాదం… బహుశా మనకు ప్రపంచంలో ఎక్కడా ఏ ఎన్నికల ప్రక్రియల్లోనూ కనిపించదు… అవును, మోడీ వంటి లీడర్ కూడా కనిపించడు కదా… వంద మంది ప్రశాంత్ కిషోర్ల పెట్టు ఒక్క మోడీ… జనం సెంటిమెంట్లను రాజేయడంలో సిద్ధహస్తుడు… మాటలు కాదు, ఫోటోలు దిగి ఫైట్ చేస్తాడు… చూడటానికి వింత గొలిపే ఆలోచనలు… కానీ ప్రత్యర్థుల్లో అవే వణుకు కారణాలు… జస్ట్, అలా లక్షద్వీప్ బీచ్‌లో కుర్చీ వేసుకుని ఫోటో దిగుతాడు… మాల్దీవులు అనే దేశం […]
వేగంగా క్షీణించిన నవీన్ పట్నాయక్ ఆరోగ్యం… అసలు ఏం జరుగుతోంది..?!
నన్ను దేవుడే పంపించాడు… నాతో కొన్ని పనులు చేయించదలిచాడు…. ఈ మాట అన్నది మోడీ… అసలు గాంధీ మీద సినిమా వచ్చేవరకు ఆయన ఎందరికి తెలుసు..? …… ఈ మాట అన్నది కూడా మోడీయే…. పెళ్లాల మెడల్లో పుస్తెలు కూడా లాక్కుని మైనారిటీలకు ఇస్తారు జాగ్రత్త… ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేసి మైనారిటీలకు ఇస్తారు కాంగ్రెసోళ్లు… ఈ మాటలూ మోడీవే… తనేం మాట్లాడుతున్నాడో తనకైనా తెలుసా..? చిప్ ఏమైనా తేడా కొడుతోందా..? ఈ విమర్శల మాటెలా […]
జై బాలయ్య… జై మాన్షన్ హౌజ్… భలే మందూ మార్బలం..!!
బాలయ్య సారు గారు జనంలో ఉన్నప్పుడు కూడా సోయి లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు… భోళాతనం అంటారు గానీ… తన బ్లడ్డు, తన బ్రీడు మీద విపరీతమైన అహం అది… సెల్ఫీలు దిగుతుంటే ఫోన్లు తీసుకుని విసిరేస్తారు… చెంప చెళ్లుమనిపిస్తారు… నెట్టేస్తారు… తిట్టేస్తారు… కొట్టేస్తారు… సారు గారు మరి అపర దైవాంశ సంభూతులు కదా… సరే, జై బాలయ్యకూ ఓ బ్రాండ్ ఉంది… ఫలక్‌నుమా, మైసూరు మాన్షన్లలో దావత్ ఇచ్చినా సరే మాన్షన్ హౌజే కావాలట సారు గారికి… […]
‘ఒకపరి’ శ్రావణ భార్గవి… ఏ వీడియో పెట్టినా హెవీ ట్రోలింగ్ ఫాఫం…
శ్రావణ భార్గవి… అందరికీ తెలిసిన గాయకురాలు… మంచి మెరిట్ ఉన్న సింగర్… డౌట్ లేదు… భర్త హేమచంద్రతో విడిపోయిందని వార్తలు… ఆ ఇద్దరూ ఖండించింది లేదు, అవునని అంగీకరించిందీ లేదు… సరే, చాలామంది విడాకులు తీసుకుంటారు, వీళ్లు తీసుకున్నారేమో, వదిలేస్తే… ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది.,. ఏవో వీడియోలు పెడుతుంటుంది… అడపాదడపా ఈవెంట్లు, సాంగ్స్, డబ్బింగులు… ఒకరే సంతానం అనుకుంటా… బిడ్డ పేరు శిఖర చంద్రిక అని గుర్తు… స్కాట్లండ్ విద్యార్థి ఆమె… ఆమధ్య […]
నో చార్మినార్, నో కాకతీయం… గన్‌పార్కు అమరవీరుల స్థూపమే..!?
ముందుగా చార్మినార్, కాకతీయ కళాతోరణాలు చిహ్నాలు ఉండటం మన గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక, అందుకే కేసీయార్ అలా ఎంబ్లమ్ చేయించాడు, రేవంత్ దాన్ని భగ్నం చేస్తూ, తెలంగాణ అస్థిత్వ ఆనవాళ్లను చెరిపేస్తున్నాడంటూ బీఆర్ఎస్ శ్రేణులు గోల స్టార్ట్ చేశాయి… అవి గత వైభవ సామ్రాజ్యాల ఆనవాళ్లనీ కీర్తించాయి… అయ్యా, బాబులూ… చార్మినార్, కాకతీయ కళాతోరణాలు మత చిహ్నాలు కావు, వాటి ఎంపికకూ ఈ గంగా జమునా తెహజీబ్ భావనకూ లింకేమీ లేదు అనే కౌంటర్లు రావడంతో […]
- « Previous Page
- 1
- …
- 173
- 174
- 175
- 176
- 177
- …
- 409
- Next Page »