ఒక వార్త చదవగానే… పనిచేతకానోడు పానాాలు (టూల్స్-పరికరాలు) బాగా లేవని ఏడ్చాడట… ఈ వాక్యం గుర్తొచ్చింది… తిరుమల వెంకన్నకు చేసే సేవ ఏమీ ఉండదు, ప్రతి ఒక్కడూ అక్కడ పెత్తనాలు చేసేవాడే… రాజకీయాలు, అక్రమాలు, కొనుగోళ్లు, అమ్మకాలు, దర్శనాలు, వసతి, ఆడంబర ప్రదర్శన… అన్నీ కలుషితమే అక్కడ… సరే, వార్త ఏమిటంటే..? ఈవో ధర్మారెడ్డి పట్టు ఎక్కువ కదా తిరుమలలో… రాజకీయ నాయకుల తరహాలో డయల్ యువర్ ఈవో అని ఓ ప్రోగ్రాం పెడుతుంటాడు… చక్కగా తిరుమలలో […]
ఈ డేగ ఎందుకు భయపడింది..? ఫిబ్రవరి వైపు ఎందుకు ఎగిరిపోయింది..?
రవితేజ సినిమా విడుదలను వాయిదా వేశారు… సంక్రాంతి తేదీ అనుకున్నది కాస్తా దూరంగా, అంటే ఫిబ్రవరి 9కు వెళ్లిపోయింది… అవును, ఎన్నాళ్లుగానో సంక్రాంతి బరిలోనే ఉంటామని చెబుతున్న ఆ సినిమా మేకర్స్ ఎందుకు రాజీపడ్డారు… దూరంగా ఎందుకు వెళ్లిపోయారు..? హనుమాన్, నాసామిరంగ, సైంధవ్, గుంటూరుకారం సినిమాలతోపాటు రవితేజ సినిమా ఈగల్ కూడా బరిలో ఉండాల్సింది… కానీ అన్ని సినిమాలకూ థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమని నిర్మాతల మండలి చెప్పడంతో… ఈగల్ సినిమాను ఇండస్ట్రీ క్షేమం కోసం లేట్ రిలీజ్‌కు […]
సినిమా సంగీతం వీళ్లకు కామెడీ అట… రేటింగుల్లో ప్రేక్షకుడు ఈడ్చి కొట్టాడు…
అంతటి బిగ్‌బాస్ రియాలిటీ షోను అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించే స్టార్‌మాటీవీ… ఇతర రియాలిటీ షోలలో అట్టర్ ఫ్లాప్..! ఆ చానెల్ ఏ రియాలిటీ షోను కూడా విజయవంతంగా జనంలోకి తీసుకురాలేకపోయింది… ఈమధ్య మరీ భ్రష్టుపట్టించారు గానీ కాస్తో కూస్తో ఈటీవీ రియాలిటీ షోలకే ఆదరణ ఎక్కువ ఉండేది… చివరకు జీతెలుగు కూడా స్టార్‌మా బాటలోనే… దానికీ రియాలిటీ షోలు అచ్చిరావు… నిజానికి స్టార్ మా, జీతెలుగు టీవీల్లో క్రియేటివ్ టీమ్స్ మరీ అంత క్రియేటివ్ కాకపోవడమే […]
రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
నిజమే… చాన్నాళ్ల తరువాత ఒక పుస్తకాన్ని వేగంగా చదివేయడం ఇదే… ఎందుకు..? అది రేఖ జీవితానికి సంబంధించింది కావడం… ఆమె భారతీయ సౌందర్య ప్రతీక… యాభై, అరవైలలోని లక్షలమందికి ఈరోజుకూ ఆమె అంటే ఆరాధన… అప్పట్లో కోట్ల మందికి ఆమె కలలనాయిక… అంతేనా..? కాదు, ఆమె జీవితం ఓ సినిమా కథను మించి ఎన్నోరెట్లు అబ్బురం కాబట్టి… ఆమె గతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అలా పుస్తకాన్ని వేగంగా చదివేలా చేసింది… నిజానికి ఏడెనిమిదేళ్లుగా రేఖ బయట కనిపించింది […]
రియల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా… తన హిట్ల రికార్డు అనితరసాధ్యం…
ఎవరు ఇండియా సూపర్ స్టార్..? ఎవరు బాద్షా..? వందేళ్లు దాటిన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ ఎవరు..? అమితాబ్, రజినీ, షారూక్, ప్రభాస్… ఎవరూ కారు… ఆయన 400 హిట్స్, 50 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సూపర్ స్టార్లకే సూపర్ స్టార్… ఆ రికార్డు ఎవరికీ చేతకాదు… 20 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఒక ఇండస్ట్రీని శాసించిన ఆయన పేరు ప్రేమ్ నజీర్… వందేళ్లు దాటింది కదా ఇండియాలో సినిమా మొదలై… బోలెడు మంది సూపర్ స్టార్లు […]
బంగ్లా ప్యూన్… అధికారుల ఇళ్లు వెట్టి చాకిరీకి, పని దోపిడీకి ఆనవాళ్లు…
మనకు పోలీస్ ఆఫీసర్ల ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేసే ఆర్డర్లీ వ్యవస్థ తెలుసు… బానిసల్లా పనిచేయించుకుంటారు… పేరుకు జాతికి బోలెడు నీతులు చెప్పే ఉన్నతాధికారులందరూ ఇంతే… ఐఏఎస్ అధికారులు శుద్ధపూసలు ఏమీకాదు… ఈ దోపిడీ ఎన్లైటెన్ సర్కిళ్లు అన్నీ చేస్తున్నవే… వాళ్లందరి జీతాలూ మనమే పేచేయాలి, అంటే మన ఖజానా నుంచే… వశపడని జీతాలు, సౌకర్యాలు, అధికారాలు, అక్రమ సంపాదనలు, అడ్డమైన వేషాలు… ఈ నేపథ్యంలో నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ స్టోరీ కనిపించింది… రైల్వే ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ […]
హనుమంతుడు గెలవాలి… ఆ సిండికేట్ మొహాలు మాడిపోవాలి…
తెలుగు సినిమాలకు సంబంధించి ‘‘ఆ నలుగురు’’ అని ఓ సిండికేట్‌కు పేరు… అదొక మాఫియా… ప్రొడ్యూసర్స్ కమ్ బయర్స్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ కమ్ థియేటర్ ఓనర్స్… అన్నీ… వాళ్లు అనుకున్న సినిమాలే నడుస్తాయి… లేదంటే పడుకుంటాయి… కాదు, పడిపోతాయి… అలా తొక్కుతారు… ఆ మాఫియాను బ్రేక్ చేయడానికి వేరే శక్తులేమీ రంగంలోకి రావడం లేదు… ఈ నేపథ్యంలో… ఒక సినిమా ఆకర్షిస్తోంది… దాని పేరు హను-మాన్… హీరోగా మారిన ఓ బాలనటుడి సినిమా… పేరు సజ్జా తేజ… […]
12 th Fail… ఫెయిల్ కాదు, డిస్టింక్షన్ పాస్… ఆ సినిమా కథలోలాగే…
ఒక వార్త… ‘‘బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా థియేటర్లలోనే కాదు… ఓటీటీలోనూ రికార్డుల వర్షం కురిపించింది… డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబరు 29న విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 2023 ఏడాది రికార్డులు మొత్తాన్ని తుడిచిపెట్టేసి, అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన సినిమాగా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది…’’ నిజమేనా..? ఓటీటీలో ఎందరు చూశారు..? ఎన్ని నిమిషాల వ్యూయింగ్ టైమ్ రికార్డయింది..? ఆయా ప్లాట్‌ఫారాలు స్వయంగా ప్రకటించాల్సిందే తప్ప థర్డ్ పార్టీకి […]
‘కాపీ కొట్టు… కుర్చీ మడతపెట్టు… ఇప్పుడు ట్రెండ్ అదే మాస్టారూ…’
అబ్బే, సినిమా ఇండస్ట్రీలో… బ్యాక్ గ్రౌండ్, లక్కు, టైమ్, ట్రెండ్, సక్సెస్… ఇవే ప్రధానం… అంతే తప్ప మెరిట్‌కు, సెంటిమెంట్‌కు, ఎమోషన్‌కు పెద్ద విలువ లేదు… ఇదొక దిక్కుమాలిన ఇండస్ట్రీ అంటూ ఎంత సముదాయించుకుంటున్నా సరే, ఒక సంగీత దర్శకుడి బహిరంగ కోరిక కాస్త చివుక్కుమంటూనే ఉంది… Yanamandra Venkata Subrahmanya Sharma… అలియాస్ మణిశర్మ… వయస్సు 60… పెద్ద స్టార్లు ఒక సినిమా ఇవ్వండబ్బా… ఒకటి డీఎస్పీకి, ఒకటి తమన్‌కు, ఒకటి నాకు… వర్క్‌లో వైవిధ్యం […]
రుచిలో వంకలేని నంబర్‘వన్’కాయ… ఇష్ట వంటకానికి ఇంత అవమానమా..!!
మీకు ఏ వంటకం ఇష్టం అనడిగితే… బోలెడు వంటకాలు చకచకా మన బుర్రలో రీల్లా తిరుగుతాయి… ఒకటోరెండో సెలెక్ట్ చేసుకోవడం కష్టం… ఏ వంట అస్సలు ఇష్టం ఉండదు అనడిగినా సరే, అదే స్థితి… ఉప్మా ప్రియులకు నచ్చకపోవచ్చుగాక… ఉప్మాను చాలామందిని ఇష్టపడరు ఎందుకోగానీ… నిజానికి వండటంలో సౌలభ్యం, చౌక, టైమ్ తక్కువ ప్రాతిపదికల్లో అదే బెస్ట్ వంట… ఎట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో… అందుకే ఫంక్షన్లలో టిఫిన్ అనగానే, ఇంటికి బంధువులు రాగానే చటుక్కున ఉప్మాయే […]
ఓసోస్, ఈ ఉప్మా పాత్రకు నయనతారా…? స్త్రీముఖి, యాంకరాంటీలు సరిపోరా..?!
అనేక రకాల టీవీ షోలలో, ఓటీటీ షోలలో అట్టర్ ఫ్లాప్ షోలు ఏమిటో తెలుసా..? మాస్టర్ చెఫ్ వంటి వంటలపోటీల షోలు… కానీ యూట్యూబ్‌లో మాత్రం వంటల పోటీల వీడియోలు సూపర్ హిట్… మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పచ్చిపులుసు కాయడం ఎలా అనే వీడియోకు కూడా ఒకటీరెండు మిలియన్ల వ్యూస్… మన దేశంలో ఇలాంటి వీడియోల్లో, అంటే స్ట్రీట్ ఫుడ్, హోటల్ టూర్స్ వీడియోల్లో షార్ట్ వీడియోస్ దగ్గర నుంచి లెంతీ వీడియోస్ దాకా… అన్నీ […]
బ్రా-డ్ ‘బ్యాండ్’… Bad Band… నిద్ర లేచేసరికి ఒక జీవితకాలం వ్యర్థమై పోతుంది…!
Priyadarshini Krishna…. How the total generation is getting killed by unproductive activities: ఒక పదేళ్ళ క్రితం వరకు ఇంత విరివిగా లేని ఇంటర్నెట్ సౌలభ్యం, ఇంత చవగ్గా దొరికే చైనా వాడి స్మార్ట్ ఫోన్స్ ఒక జనరేషన్ మొత్తాన్ని ఎందుకు కొరగాకుండా మార్చేసింది. పదేళ్ళక్రితమే….. అప్పుడప్పుడే సామాన్యుని చేతిలోకి వచ్చివాలిన ఫోన్లు.. దానికి పదేళ్ళ క్రితం …అంటే దాదాపు 2005 లో అంబానీ పుణ్యమా అని ‘కర్లో దునియా ముట్టీ మే’ అని […]
అయోధ్య వార్తలు చదువుతూ ఉంటే… ఎందుకోగానీ ఈయన గుర్తొస్తున్నాడు…!!
ఆరోజు అయోధ్య కేసు విచారణ చివరిరోజు… 92 ఏళ్ల ముసలాయన రాముడి తరఫున వాదిస్తున్నాడు… నిలబడే తన వాదనలు వినిపిస్తున్నాడు… పర్లేదు, వయోరీత్యా మీరు కూర్చుని మీ వాదన చెప్పవచ్చు అని జడ్జి సూచించాడు… కానీ ఆయన వద్దన్నాడు… న్యాయవాది నిలబడే వాదించాలనే భావనతో కాదు, అది అయోధ్య రాముడి కేసు కాబట్టి, తను రాముడి తరఫు న్యాయవాది కాబట్టి… నిలబడే వాదించాడు… రాముడికి వ్యతిరేకంగా వాదించిన ధావన్ ఎట్సెట్రా కోపంతో పలుసార్లు ఊగిపోతున్నా సరే, వాళ్ల […]
అయోధ్య బాల రాముడికి నలుమూలల నుంచీ ‘భారీ కానుకలు’…
అయోధ్య రాముడిని జాతి ఓన్ చేసుకోవడం అంటే..? రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ పంపించిన అక్షితల్ని మనింటి పూజగదిలోని అక్షితలతో కలిపి రాముడికి మనసారా ఓ మొక్కు సమర్పించుకోవడం..! అంటే, జాతి యావత్తూ ఆ గుడిని స్వాభిమాన సంకేతంగా ఆమోదించడం, మనసులోకి ఆవాహన చేసుకోవడం…! బాలరాముడి ప్రాణప్రతిష్ట ముహూర్తం సమీపించేకొద్దీ… హిందూ సమాజంలో ఆ సందడి, జోష్, పండుగ వాతావరణం, భక్తి ఉద్వేగం పెరుగుతోంది… అనేక మంది విశిష్ట కానుకల్ని పంపిస్తున్నారు… వాటన్నింటినీ అయోధ్య దేవాలయం ఎలా స్వీకరించగలదనే […]
ఈనాడు – ఉపాధి హామీ… పొంతన లేని రెండు శీర్షికలు, కథన వాదనలు…
వచ్చె, వచ్చె… పాయె, పాయె… ఇవేం వార్తలు ఈనాడు వారూ…? అసలు ఈనాడులో పెద్దలు తమ పత్రికను తాము పొద్దున్నే ఓసారి చదువుతున్నారా అనే డౌట్ వస్తోంది… తమ పత్రికలో ఏం వార్తలు వస్తున్నాయో, అసలు తమ లైన్ ఏమిటో కూడా అర్థమవుతున్నట్టు లేదు… ఆంధ్రా ఎడిషన్‌లో రోజూ జగన్‌ను చంద్రబాబును మించి తిడుతున్నామా లేదానేదే ప్రధానం… అంతకుమించి ఇంకేమీ ఆలోచిస్తున్నట్టు లేదు ఫాఫం… మార్గదర్శి కేసులో హైదరాబాద్ నుంచి ఎత్తేద్దామనుకున్నారు కదా… రామోజీరావు లక్ష నాగళ్ల […]
మూడు వేర్వేరు శిలలు… వేర్వేరు శిల్పులు… అయోధ్య రాముడు వారిలో ఎవరు..?!
వేల ఏళ్ల నాటి చరిత్ర… వందల ఏళ్ల ఉద్రిక్తత… ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆకాంక్షసౌధం… అయోధ్య రామజన్మభూమి…! అనేక తరాలుగా ఈ జాతికి ఆదర్శపురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలి, యావత్ హిందూ జాతికి పవిత్రస్థలి… అనేకానేక చిక్కుముళ్లను విప్పుకుంటూ, అడ్డంకుల్ని దాటుకుంటూ ఇప్పుడొక భవ్యమందిరం నిర్మితమవుతోంది… మొదటి దశ పూర్తయ్యింది… 22న ప్రాణప్రతిష్ట… దేశంలో ప్రతి గడపకూ రాములవారి అక్షితలు చేరుతున్నయ్… వేల మంది సాధుసంతులు, దేశప్రముఖులతో ఆరోజున ఓ భారీ స్వప్నం సాకారం కానుంది… అయితే..? ఇంతకీ […]
మీ కక్కుర్తి సంపాదనకు… చివరకు పందులను కూడా వదల్లేదు కదరా…
అప్పట్లో నేనే రాసిన ఓ పోస్టు యాదికొచ్చింది… చట్టం అంటే ఏమిటి..? ధర్మం అంటే ఏమిటి..? న్యాయం అంటే ఏమిటి..? వ్యాపారంలో నష్టపోయి దిక్కుతోచకుండా ఉన్నప్పుడు నీ స్నేహితుడు ఎలాంటి ప్రామిసరీ నోటు కానీ గ్యారెంటీ కానీ లేకుండా నీకు ఎంతో కొంత అప్పు ఇచ్చాడు… దాంతో నువ్వు మళ్ళీ వ్యాపారం చేసి బాగా వృద్ధిలోకి వచ్చావు… ఈలోపు నీ స్నేహితుడు ఏదో ప్రమాదంలో మరణించాడు… సంపాదన మార్గం లేక అతడి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడింది. […]
జిలుకర ఎల్లిపాయలు వేసి గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్ర మిరుప కారం !
వెనుకటి తిండి~~~~~~~~~~ ఓమ, నువ్వులువేసి ఉప్పి, కొట్టిచేసిన.. తెల్లజొన్న రొట్టె ! జిలుకర ఎల్లిపాయలు వేసి గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్రమిరుప కారం !! అచ్చమైన తెలంగాణపల్లె సంప్రదాయకమైన తిండి. సాయజొన్న ముచ్చట: వెనుకట సాయజొన్న పంట పండుతుండే. చెరువుల కింద ఉన్న వందురు పొలంల తప్ప వరి పంటకు పెద్దగ విలువ లేని బంగారు కాలమది. వానకాలం, చలికాలం రెండు పంటలు జొన్నపంట పండేది. ఈ చలికాలంల కేవలం మంచుతో పండే జొన్నే సాయజొన్న. ఎనబై యేండ్ల […]
మల్లెమాల తప్పే అది… సుమది కాదు… హైపర్ ఆది ఒప్పుకోకుండా ఉండాల్సింది…
నిజంగానే నచ్చలేదు… హైపర్ ఆది మొహం మీద యాంకర్ సుమ ఉమ్మేయడం ఏమిటి..? అసలు హైపర్ ఆది ఆ సీన్ ప్రసారానికి ఎందుకు ఒప్పుకున్నట్టు..? ఇదీ ప్రశ్న… ఇక్కడ సుమను తప్పుపట్టడం కాదు, ఆది మీద జాలిపడటం కాదు… అసలు మల్లెమాల ప్రొడక్షన్స్ గానీ, ఈటీవీ గానీ దాన్ని అలాగే ఎందుకు ప్రసారం చేసినట్టు..? రేటింగుల కోసమా..? అదే నిజమైతే అంతకన్నా దరిద్రం లేదు… విషయం ఏమిటంటే..? ఈటీవీలో సర్కస్ ఫీట్ల డాన్స్ షో ఒకటి వస్తుంది […]
ఒకేరోజు ఐదు లక్షలు దాటిన మొక్కులు… గుడి నిర్వహణ భేష్…
ఒక వార్త బాగా ఆకర్షించింది… కొత్త సంవత్సరం ఆగమనవేళ… పూరి జగన్నాథుడిని 5 లక్షలకు మించి భక్తులు దర్శించారు… అవును, అక్షరాలా 5 లక్షల మంది… ఏదో సోషల్ మీడియాలో వచ్చిన పిచ్చి లెక్క కాదు ఇది… అక్కడి అధికారులు, పోలీసులను కోట్ చేస్తూ టైమ్స్ వంటి పత్రికలు రాసిన అంకె అది… అబ్బురం… ఎందుకంటే..? తిరుమలను తీసుకొండి… ఎప్పుడూ వీవీఐపీల గొడవ, బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు, మరీ వీవీఐపీ వస్తే క్యూ ఆపేయడం… చూశాం […]
- « Previous Page
- 1
- …
- 174
- 175
- 176
- 177
- 178
- …
- 482
- Next Page »