పార్ధసారధి పోట్లూరి …….. వారిస్ దే పంజాబ్ నాయకుడు భీంద్రన్ వాలే-2 గా చెప్పుకుంటున్న అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ! 37 రోజుల నుండి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఎట్టకేలకి అరెస్ట్ అయ్యాడు ! గత మార్చి నెల 18 న నుండి పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ లోని మొగాలో పోలీసులకి లొంగిపోయాడు ! పంజాబ్ లోని మొగా జిల్లా, రోడే అనే గ్రామంలోని గురుద్వారాలో […]
దాసరి పార్టీ పుట్టకముందే గిట్టింది… ఆ కథాక్రమంబెట్టిదనిన…
Murali Buddha………… దాసరి పార్టీ పుట్టక ముందే అలా గిట్టిపోయింది… షాకిచ్చిన గొనె ప్రకాష్ … ఓ జ్ఞాపకం …. ఉదయం నాలుగు గంటలు కావస్తుంది … ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ కావడంతో ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు ? ఎందుకు చేసి ఉంటారు అని గాబరాగా ఫోన్ ఎత్తితే … అటు నుంచి గొనె ప్రకాష్ … మిమ్ములను నమ్మి వార్త చెబితే అలానేనా రాసేది .. సోర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి […]
ఎక్కడి గంగా పుష్కరాలు..? ఇక్కడ మంజీరలో ఆ పుష్కరాలేమిటి..? స్నానాలేమిటి..?
నది అంటే విడిగా ఉండే ప్రవాహం కాదు… ఉపనదులను కలుపుకునే ప్రవహించి, అంతిమంగా సాగరంలో కలుస్తుంది… అన్ని నదులకూ ఉన్నట్టే నదులకూ పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలు వస్తాయి… ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది… ఎన్నో వందలేళ్లుగా ఆ లెక్కల ప్రకారమే పుష్కరాలు వస్తున్నాయి… పుష్కర స్నానాలు చేస్తున్నారు… ఇది ఒక పద్ధతి… గోదావరి కూడా అంతే… దాని ఉపనదులకు వేరేగా, ప్రధాన నదికి వేరేగా పుష్కరాలు ఉండవు… ఉండకూడదు… అది శాస్త్ర సమ్మతం కాదు… సో, […]
ఏమిటిది జుంటా..? ఏమిటీ పని..? బర్మాకు భారత్ సీరియస్ వార్నింగ్..!
పార్ధసారధి పోట్లూరి ………. భారత్ మొదటిసారిగా బర్మా కి వార్నింగ్ ఇచ్చింది ! ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశమే ! ఎందుకంటే మొదటి నుండి పక్కనే ఉన్న బర్మా లేదా మియాన్మార్ దేశ అంతర్గత విషయాలలో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ! అక్కడ తరుచూ మిలటరీ జుంటా ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనని చేపట్టి తన ప్రజలని హింస పెడుతున్నా మన దేశం చూస్తూ ఊరుకుంది తప్పితే ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ! […]
ఇప్పుడు నరేష్ మూడో పెళ్లాం రమ్య ఏం చేయాలి…? ప్రశాంత్ నీల్‌ను సంప్రదించాలి..!!
బహుశా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి కావచ్చు… ఏమో, ఇతర భాషల్లో కూడా…!! తన సొంత సమస్యను ఒక హీరో తనే నిర్మాతగా మారి, తనే నటిస్తూ, తన సొంత కథను, అందులోనూ తన పెళ్లిళ్ల కథను సినిమాగా తీయడం… ఎంతైనా సీనియర్ నరేష్ ఓ చరిత్ర తిరగరాస్తున్నాడు… ఈమధ్య బూతు సినిమాలకు ఎగబడిన ఒకప్పటి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం అట… వావ్, అసలే నరేష్ తాజా ప్రియురాలు పవిత్ర… ఆమెను […]
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆశల్లో ఓ లీడర్… అప్పటి ఓ జ్ఞాపకం…
Murali Buddha………. ఇప్పుడంటే నేతలందరి ఇంటి పేరు సీఎం .. సీఎం అయిపోయింది గానీ… ఆ రోజుల్లో వేరు … ఓ డిప్యూటీ సీఎం కథ- ఓ జ్ఞాపకం.1995-96 లో ఓ రోజు అసెంబ్లీ క్యాంటిన్ లో టీడీపీ mla మల్యాల రాజయ్య నేను టిఫిన్ చేస్తున్నాం … ఓ mla వచ్చి రాజయ్యను హాయ్ డిప్యూటీ సీఎం బాగున్నావా ? అని భుజం తట్టి వెళ్లి పోయారు … ఒకరు కాదు, ఇద్దరు కాదు, అప్పటికి […]
‘‘కోతి నుంచి మనిషి పుట్టడం ఏమిటీ..? మనిషే కోతిగా మారిపోతుంటేనూ…’’
మనిషి పరిణామక్రమం ఏమిటి…? అబ్బే, ఇదొక ప్రశ్నా..? దేవుడు అన్ని జంతువులనూ సృష్టించినట్టే మనిషినీ సృష్టించాడు… అంతే… ఓహో, నెమలి సంతానక్రమం ఏమిటి..? ఇదీ ఈజీ జవాబే… దాని కన్నీళ్లు తాగి గర్భం ధరిస్తుంది, చాలా సింపుల్… మరి కోతి నుంచి మనిషి పుట్టాడు అంటారు కదా, నిజం కాదా..? ఎహె, ఎవరో కోతి మెదడు ప్రతిపాదించిన తిక్క పరిణామ సిద్ధాంతం అది… ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటివే జవాబులు మనం వింటూనే ఉంటాం కదా… వీటినే పిల్లలకు […]
BARC Ratings… టీన్యూస్ ఢమాల్… రేటింగులు ఓ భ్రమ… ర్యాంకులు ఓ మిథ్య…
ఏ చానెల్ చూసినా సరే… ఏదో ఒక పార్టీకి డప్పు… బయాస్డ్… న్యూట్రల్ జర్నలిజం అనేది ఎలాగూ కరువైన బ్రహ్మపదార్థం ఇప్పుడు… మరి కొన్ని చానెళ్లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి, కొన్ని ఢమాల్ అని చతికిలపడిపోతున్నయ్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి టాప్ త్రి పేపర్లు… ఐనాసరే, వాటికి అనుబంధంగా ఉండే చానెళ్లు పెద్దగా క్లిక్ కాలేదు… చానెళ్ల విషయానికి వస్తే టీవీ9, ఎన్టీవీ, టీవీ5 పేర్లు ప్రధానంగా స్ఫూరిస్తుంటయ్… మరి దాదాపు చానెళ్లన్నీ ఒకే టైపు ధోరణితో […]
థమన్, కార్తీక్ వెటకారం… ఎడ్డిమొహం వేసిన గీతామాధురి… నిత్యామేనన్ బెటర్…
అందుకే ఇండియన్ ఐడల్ తెలుగు షో చూస్తున్నవాళ్లు బలంగా ఫీలయ్యేది జడ్జి స్థానంలో నిత్యామేననే కొనసాగి ఉంటే బాగుండేది అని… గీతామాధురిని తీసుకొచ్చి షో ఉదాత్తతను చెడగొడుతున్నారు అని… ఆమె నిజానికి ఓ బిగ్‌బాస్ కేరక్టర్… పరిణతి, హుందాతనం ఉండవు… దట్టంగా మేకప్ వేసుకుని, తొడలు కనిపించేలా ఓ చెత్త డ్రెస్ వేసుకుని వచ్చిన తీరు ఓసారి మనమే చెప్పుకున్నాం తెలుసు కదా… విషయంలోకి వస్తే… ఇండియన్ ఐడల్ షోలో థమన్, కార్తీక్‌ల ప్రజెన్స్ బాగుంది… వాళ్ల […]
యజమాని తన్ని తరిమేస్తే… సొంతూరు చేరడానికి 1000 కిలోమీటర్ల నడక…
Pathetic Path: ”ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో? శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో?” అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరమో? కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో? అణగారిన అగ్ని పర్వతం కని పెంచిన ‘లావా’ ఎంతో? ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం యెంతో?” తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి ఆ చల్లని సముద్రగర్భం గేయ కవితలో కొంత భాగమిది. బహుశా డెబ్బయ్ ఏళ్ల కిందటి రచన. ఎన్ని యుగాలకయినా కాలదోషం […]
వావ్… కేసీయార్ ప్రధాని అభ్యర్థిత్వపు జాబితాలోకి ఎక్కాడు… ఇజ్జత్ దక్కింది…
హమ్మయ్య… కర్నాటక బరిలో దిగడానికి ధైర్యం చేయలేకపోయినా సరే… బీఆర్ఎస్ ఓ జాతీయ పార్టీ… కానీ గతంలో ఒకటీరెండు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేల సమయంలో అసలు కేసీయార్ పేరే వినిపించేది కాదు, కనీసం జాబితాలో తనను ఓ ప్రధాని అభ్యర్థిగానే కాదు, కనీసం ఓ జాతీయ నాయకుడిగా కూడా గుర్తించలేదు… థాంక్స్ టు టైమ్స్ నవ్… ఈ చానెల్ సర్వేలో కేసీయార్ పేరును కూడా ‘సర్వే చేయబడే పేర్ల’ జాబితాలోకి తీసుకున్నారు… పోతే పోనీ… […]
బలగం నిండా మూఢనమ్మకాలు సరే… మరి విరూపాక్ష మాటేంటి..? క్షుద్ర కథ కాదా..?!
ఎవ్వడూ ఏమీ మాట్లాడడు ఇప్పుడు… బలగం సినిమాలో పిట్ట ముట్టుడు అంశం మీద చాలామంది నోళ్లు పారేసుకున్నారు… ఆ సినిమా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తోందని తెగ కన్నీళ్లు కార్చేశారు… మరి ఇప్పుడు విరూపాక్ష మాటేమిటి..? మొత్తం క్షుద్ర శక్తులు, పూజలు, మంత్రాలు ఎట్సెట్రా… బలగం సినిమాను చీల్చి చెండాడిన కలాలు ఇప్పుడు విరూపాక్షుడిని ఏమంటాయో చూడాల్సి ఉంది… బలగం సినిమాకు ఒక న్యాయం, విరూపాక్షకు మరో న్యాయం ఉండకూడదు కదా… బలగం తెలంగాణ పల్లెకు చెందిన ఓ మట్టివాసన […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకూ దొరకని ఆ వార్త… వార్త డెయిలీ జర్నలిస్టుకు ఎలా తెలిసింది..?
Murali Buddha………. పీఎం, సీఎంల మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది..? జగన్ , నరేంద్ర మోడీల్లో ఎవరో ఒకరు ఆయన సోర్స్ కావచ్చు, ఆ సంగతి నాకు తెలియదు … కానీ ఆయన రిపోర్టర్ గా తిరిగేప్పుడు … ఆయనకు తెలియంది, ఓ సామాన్య జర్నలిస్ట్ కు తెలిసింది ఓ వార్త… ఓ జ్ఞాపకం ఉంది చెబుతాను… ఓ జ్ఞాపకం- కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి వద్ద… పొలిట్ బ్యూరో సభ్యులు, బాబు సన్నిహిత […]
పాత ఫ్లాపుల రీమేక్‌లో… సో సో కేరక్టర్ చేసి… పరువు పోగొట్టుకున్న వెంకటేశ్…
మొత్తం సౌత్ ఇండియా సినిమాను హిందీలోకి డబ్ చేసుకో… హిందీ ప్రేక్షకులు కూడా సంతోషంగా చూస్తారు… అది సౌత్ ఇండియా మూవీగానే చూస్తారు… కేజీఎఫ్, విక్రమ్, కాంతార, చార్లి, ఆర్ఆర్ఆర్, కార్తికేయ ఎట్సెట్రా సినిమాలు అన్నమాట… అదేసమయంలో ఈ ట్రెండ్‌ను తప్పుగా అర్థం చేసుకుని, సౌత్ ఇండియా మసాలాలు గుప్పిస్తే తప్ప హిందీ సినిమాను చూడరు అనుకుని, వాతలు పెట్టుకుంటే మాత్రం ఇటు సౌతూ సహించదు, అటు నార్తూ భరించదు… ఎస్, సల్మానుడి కొత్త సినిమా అందుకే […]
నేపథ్య సంగీతం నిలబెట్టింది విరూపాక్షుడిని… మిగతా అంశాలన్నీ సో సో…
మెగా క్యాంపులో సాయి ధరమ్ తేజ కాస్త డిఫరెంట్… మిగతా మెగా హీరోలకు భిన్నంగా ఉంటాడు… యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు వెనకబడిపోయాడు… విరూపాక్ష సినిమాలో కూడా డల్‌గా కనిపిస్తాడు ఎందుకో… గతంలో కూడా తను జాతీయవాద దృక్పథం కలిగిన హీరో పాత్రలు పోషించాడు… నటనలో మేటి అని చెప్పలేం గానీ, ఇంకా డెవలప్ కావాలి గానీ… మరీ విసుగు ప్రదర్శించేంత నాసిరకం నటుడు మాత్రం కాదు… అయితే ఒకటీరెండు అంశాల్లో ఈ విరూపాక్షుడిని మెచ్చుకోవచ్చు… మెగా హీరోలు […]
పొగడరా మన తల్లి భూమి భారతిని… చైనాపై గెలిచిన సంతానలక్ష్మి…!!
We are Top: నిన్నటి నుండి గాల్లో తేలినట్లుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఉబ్బి తబ్బిబ్బులుగా ఉంది. ఒకటే పులకింత. తుళ్లింత. మొన్ననే చైనా సరిహద్దు హిమాలయం కొండల దాకా వెళ్లి వచ్చాను. అప్పుడే ఈ వార్త తెలిసి ఉంటే…కనీసం హిమాలయం కొండ కాకపోయినా…గుట్ట అయినా ఎక్కి బిగ్గరగా అరచి ఉండే వాడిని. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో ఇన్ని శతాబ్దాలుగా అప్రతిహతంగా మొదటి స్థానంలో ఉన్న చైనాను కిందికి లాగి…భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి […]
‘నమస్తే ఈనాడు’… ఆ మూడో సింహం ఎటు పారిపోయింది మహాశయా…
కష్టకాలంలో రామోజీరావుకు కేసీయార్ చల్లని చూపు కావాలి… కేసీయార్‌కు కూడా అంతే… ఓ పెద్ద పత్రిక, టీవీ చానెళ్ల మద్దతు కావాలి… తన సొంత మీడియా ఉన్నా సరే, సొంత పార్టీ వాళ్లే పట్టించుకోరు దాన్ని… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ఉరుముతున్నాడు… అంతు చూస్తానంటున్నాడు… ఇంకోవైపు సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్స్ భూతం అలాగే జడలు విప్పుకుని ఉంది… జగన్ ప్రభుత్వం అందులోనూ ఇంప్లిడయింది… తనకు ప్రబల ప్రత్యర్థిగా మారిన ఈనాడుకు ఝలక్ ఇవ్వడానికి ఒక్క రోజైనా సరే […]
story behind the story… ప్రతి వార్తాకథనం వెనుక కూడా ఓ కథ ఉండును…
Murali Buddha………. ఒక వార్త రెండు పిట్టలు- ఓ జ్ఞాపకం … తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్, వరల్డ్ బ్యాంకుకు బదులు ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం తీసుకోవాలి అనుకుంటున్న ప్రభుత్వం … Ysr సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండు వార్తలు ఆంధ్ర ప్రభ మొదటి పేజీలో చూడగానే తోటి రిపోర్టర్లు , ప్రభుత్వం , రాజకీయపక్షాలు బుర్ర గోక్కోవడం మొదలు పెట్టారు … ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ysr బంధువు ఉండేవారు […]
‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’’ అధాటున ఎంత మాట అనేశావ్ బ్రదర్…
ఒక వ్యాపార ప్రకటన ఎలా ఉండకూడదు అని చెప్పడానికి పక్కా ఉదాహరణ ఇది… ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మార్కెటింగ్ ఉద్యోగి చదివి తీరాల్సిన ఓ ఉదాహరణ… ప్రత్యేకించి పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చేవారు, తీసుకునేవారు పరిగణనలోకి తీసుకుని, గుర్తుంచుకోవాల్సిన ప్రకటన ఇది… చదివేవారికి, చూసేవారికి చాయిస్ ఎలాగూ ఉండదు కాబట్టి, వాళ్ల ఖర్మ… వ్యాపార ప్రకటన అని ఎందుకు అంటున్నానూ అంతే… పత్రిక వాడికి ఇది వ్యాపారమే కాబట్టి…! ఆ వ్యాపారం మీదే పత్రిక మనుగడ […]
జగన్ చెడ్డవాడు… ఇది చెప్పడానికి ఆంధ్రజ్యోతి ఏ అవకాశాన్నీ వదలదు…
అసలు ఇది వాార్త అవుతుందా..? ఇందులో ప్రజల కోణం ఏముంది..? ఆంధ్రజ్యోతికి ఏమైంది..? మరీ మాస్ట్ హెడ్ పక్కన బొంబాట్ చేసింది..? ఫేస్బుక్ కమ్యూనిటీ స్టాండర్ట్స్ వంటి డొల్లేనా ఆంధ్రజ్యోతి ప్రొఫెషనల్ ప్రమాణాలు..? ప్రస్తుతానికి నెట్లో ఈ చర్చ బాగానే నడుస్తోంది… ఈ చర్చకు కారణం ఒక వార్త… హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలో ఏదో మొక్కుబడిగా వేశారు, ఎందుకంటే తెలంగాణలో ఆ వార్త ద్వారా వారు కోరుకున్న ఫాయిదా ఏమీ లేదు… కానీ ఏపీలో ఆ వార్త […]
- « Previous Page
- 1
- …
- 208
- 209
- 210
- 211
- 212
- …
- 447
- Next Page »