బిగ్ బి… అంటే బిగ్ బి… అంతే… వేరే సుదీర్ఘ వివరణలు, విశ్లేషణలు అక్కర్లేదు… ఎనభై సంవత్సరాల ఈ వృద్ధ నటుడే ఈరోజుకూ ఈ దేశం అమితంగా అభిమానిస్తున్న నంబర్ వన్, సూపర్ స్టార్… వేరే ఏ కుర్ర హీరోలు, ఉర్రూతలూగించే హీరోలు, తన సమకాలీనులు… ఎవరూ జాబితాలో లేరు… అమితాబ్ మీన్స్ అమితాబ్, దట్సాల్… మూడ్ ఆఫ్ ది నేషన్ ముక్తకంఠంతో అమితాబే స్టార్ స్టార్ అని ఘోషించింది… గ్రేట్… ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఈ […]
సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్లో పోలీస్ ఆఫీసర్… ఎన్కౌంటర్ స్పెషలిస్ట్…!
చాన్నాళ్లుగా ఆమె వార్తల్లో లేదు… అసలు చాలామందికి ఆమె గురించి తెలియదు… మొన్న రిపబ్లిక్ దినోత్సవం రోజు సోనీ ఇండియన్ ఐడల్ వేదిక మీద కనిపించింది… ఆమెతోపాటు అనేకమంది ఆర్మీ, సీఆర్పీఎఫ్, నేవీ అధికారులు కూడా వచ్చారు… సింగర్స్ ఆరోజున దేశభక్తి గీతాలను ఆలపించారు… అదంతా వేరే సంగతి… ఆమె గురించి చెప్పనేలేదు కదూ… ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ… పేరు షాహిదా పర్వీస్ గంగూలీ… కల్లోలిత పూంచ్ జిల్లాలో ఏదో మారుమూల పల్లెలో పుట్టింది… మొత్తం ఆరుగురు […]
గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
మంథర ——– చక్కగా, వేగంగా సాగిపోతున్న రథచక్రానికి చీల జారిపోతుందని తెలిసి, వెంటనే పరుగెత్తి ఆ చీలను సరిచేసి, చక్రం ఊడిపోకుండా, రథం పడిపోకుండా చేసే మంచి వాళ్లు ఉన్నట్లే- ఎక్కడో ఒక మూల దాగి, చక్రానికున్న చీలను ఊడబెరికి, రథాన్ని పడదోయడానికి ప్రయత్నించే చెడ్డవాళ్లు కూడా లోకంలో ఉంటారు. శ్రీమద్రామాయణంలో మంథర ఒక దాసి. కైక పుట్టింటి నుండి అరణంగా వచ్చిన దాసి. కైక అంతఃపురంలోనే ఉండే దాసి. ఈ దాసి చాటు మాటుగా అంతటి […]
వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!
వివేక్ అగ్నిహోత్రి… ఈ పేరు వినగానే మనకు ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు గుర్తొస్తాయి… మరీ ప్రత్యేకంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు… ఈ సినిమాతో తనపై జాతీయవాది, కాషాయవాది ముద్రలు చకచకా పడిపోయాయి… తను బీజేపీ ప్రయోజనాల కోసమే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడనేది తనపై ఉన్న ఛార్జ్ ఇప్పుడు… దర్శకుడు, రచయిత, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఫిలిమ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డు (సీబీఎఫ్సీ) సభ్యుడు… […]
కాంతార, విక్రమ్, దృశ్యం… ఈ మూడూ ఒకే మలయాళ సినిమాలో కలిస్తే…
ప్రేక్షకులకు ఏదో కొత్తదనం కావాలి… కథలో, కథనంలో, తారాగణంలో, సంగీతంలో, డాన్సుల్లో, యాక్షన్ సీన్లలో… ఏదైతేనేం..? భిన్నంగా ఉండాలి… ఆకట్టుకోవాలి… కొత్తకొత్తగానే కాదు, వేగంగా కథ నడవాలి… గ్రిప్పింగుగా సాగాలి… తదుపరి సీన్ ఏమిటో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు… మరి ఇలా ఉంటే తప్ప పాన్ ఇండియా ఆదరణ పొందలేం… అసలే ఇప్పుడు పాన్ ఇండియా అంటే హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, తెలుగు మాత్రమే కాదు, ఇంగ్లిషు, ఒడియా, మరాఠీ భాషల్లోనూ డబ్ చేయాల్సి వస్తోంది… […]
చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
ఆమధ్య కల్యాణ్‌రాం నటించిన బింబిసార సినిమాకు టీవీల్లో 8.6 రేటింగ్స్ వచ్చినయ్… (హైదరాబాద్ బార్క్)… ఈ వారం రేటింగ్స్‌లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు జస్ట్, 7.13 రేటింగ్స్ మాత్రమే వచ్చినయ్… పాటలకు హైప్… స్టెప్పులకు హైప్… వసూళ్ల లెక్కల్లో హైప్… విపరీతంగా ప్రయత్నించారు ఆచార్య తాలూకు ఘోర పరాజయం తాలూకు పరాభవం నుంచి బయటపడేందుకు…! కానీ ఇదీ ఎక్కడో లెక్క తప్పింది… ఓవరాల్‌గా చూస్తే సినిమా మీద పెట్టిన పెట్టుబడికీ, పెట్టుకున్న ఆశలకీ, వేసుకున్న అంచనాలకి […]
అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
ఎప్పుడో రాసిన కథనం… అదితిరావు హైదరి హీరో సిద్ధార్థ్‌తో కలిసి తిరుగుతున్న వార్తల నేపథ్యంలో… సదరు హీరోగారి చంచల మనస్తత్వం మీద హైదరిని హెచ్చరించిన హితవు..! నిన్నో మొన్నో శర్వానంద్ నిశ్చితార్థానికి ఆ ఇద్దరూ జంటగా కలిసే వచ్చారు… తమ ప్రేమ, లివ్ ఇన్ ‘సహజీవనం’ నిజమేనని లోకానికి పరోక్షంగా చెప్పేశారు… త్వరలో పెళ్లి అని తాజా వార్తలు… కొందరికి అనుభవంతో గానీ తత్వం బోధపడదు… ఎందుకో… కలకాలం కలిసి ఉండండి అని కొందరి మీద అక్షింతలు […]
జమున ముక్కు మీద నీడ… ఆమెది సునిశిత పరిశీలన… అందుకే ‘నిలబడింది’…
Suma Bala ……… #jamuna ……. వెండితెర సత్యభామ – ముక్కుమీద నీడ… ఏబీఎన్ లో పనిచేస్తున్న రోజులు.. ఓ ప్రోగ్రాం కోసం అలనాటి నటి జమున ఇంటర్వ్యూ కోసం వెళ్లాం. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన ఇది.. చిన్నప్పటి నుంచి పాత సినిమాలు చూడడం బాగా అలవాటు. అది మా నాన్నద్వారా అబ్బిందని చెప్పాలి. ఆయన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడడమే కాదు. వినేవాడు కూడా. అంటే ఇంట్లో ఆ సినిమాల […]
ములాయం పద్మవిభూషణ్‌పై… వాట్సప్ యూనివర్శిటీ తప్పుగెంతులు…
ఇది సోషల్ మీడియాలోనే ఎక్కడో దొరికింది… ఈ బీజేపీ వాట్సప్ యూనివర్శిటీకి ఏం ప్రచారం చేయాలో, ఏం చెప్పుకోకూడదో తెలియదని మరోసారి స్పష్టమైంది… నిజంగా చెప్పదగిన విషయాల్ని జనంలోకి తీసుకువెళ్లడం వీళ్లకు చేతకాదు, అభూతకల్పనల్ని ప్రచారం చేసుకుంటూ మరింత అభాసుపాలు అవుతుంటారు… మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దానికి ఓ జస్టిఫికేషన్ అవసరమా..? అలాంటప్పుడు రైతు చట్టాన్ని వాపస్ తీసుకుని, జాతికి క్షమాపణ చెప్పిన అవమానకర నిర్ణయంపై జస్టిఫికేషన్ ఏది… జస్ట్, ఉదాహరణ అది… సరే, […]
ముక్కు మీద కోపం… బుంగమూతి చందం… జమున అంటేనే ఓ డిఫరెంట్ బ్యూటీ…
Abdul Rajahussain ….. *ఆ ‘ముక్కుమీది కోపం’.. ఆ ‘బుంగమూతి చందం’… అభినవ “సత్యభామ” ఇక లేదు..!! *జనహృదయాలను దోచుకున్న” జమున “! *నట యమున..ఈ జమున మాతృభాష కన్నడం అంటే మీరు నమ్మగలరా! * జమున బుర్రకథ నాజర్ శిష్యురాలు..!! * పగలే వెన్నెల.. ఆమె నటన..!! * ఆమె అందం గోదారి గట్టు… * నటన… ఆమె చిరునామా..!! * కుక్కలంటే…ఆమె కెంతో ఇష్టం..!! * పుంభావ చిత్రరంగంలో ఆత్మాభిమాన అభినేత్రి, సత్య ధిక్కారం రూపెత్తిన జమున నిత్య […]
NTR, ANR… ఐతే ఏంటట..! జమునలో అందం తలెగరేసిన ఆ ధిక్కారమే…
అనారోగ్య ఛాయలేమీ కనిపించలేదు… నిశ్శబ్దంగా కన్నుమూసింది… చికిత్సలు, హాస్పిటళ్ల జాడలేదు, లేకపోతే మన చానెళ్లు, మన మీడియా ఇప్పటికి ఆమెను వందసార్లు చంపేసి ఉండేవి… ఇంకా చావదేమి అని పిట్టకుపెట్టినట్టు ఎదురుచూసేది… ఈ పెంట వాసనలేమీ లేకుండా గౌరవంగా, తలఎత్తుకుని, సగర్వంగానే, సంపూర్ణ జీవితాన్ని అనుభవించి 86 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది తెలుగు వెండితెర సత్యభామ జమున… ఆమె ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, సినిమాల్లోకి ఎలా వచ్చింది, సత్యభామ పాత్రకు ఫేమసే అయినా ఇంకా మరవలేని […]
కేసీయార్‌ను లైట్ తీసుకున్నారు… కేజ్రీవాల్, మమతలపైనే ‘విపక్ష విశ్వాసం’…
ఒడిశాలో మాజీ సీఎం గొమాంగో బీఆర్ఎస్లో చేరుతున్నాడు, ఇక ఒడిశా రాజకీయం కేసీయార్ చేతికి వచ్చినట్టే…. తోట చంద్రశేఖర్ చేరాడు, ఇక ఏపీ కేసీయార్ బాక్సులో పడిపోయినట్టే… మహారాష్ట్రలో ఛత్రపతి వారసుడు శంభాజీరాజే చేరుతున్నాడు, ఇంకేం మహారాష్ట్రం బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చిేనట్టే… ఇలా పిలవగానే మొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు వాలిపోయారు… రేపు మరో ఇద్దరు వస్తున్నారు… దేశ్‌కీనేతా కేసీయార్, కాబోయే ప్రధాని కేసీయార్……. ఇలాంటి ప్రచారం జోరుగా సాగుతోంది కదా తెలంగాణలో… కానీ అంత సీనేమీ లేదని […]
మోడీ, అమితాబ్ కూడా వెళ్లే పాపులర్ స్వామి… యాంటీ- హిందూ సెక్షన్ల తాజా టార్గెట్…
బాగేశ్వర ధామ్ సర్కార్‌ను హతమారుస్తామని బెదిరింపులు…. ఇదీ వార్త… ఒకసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని కలిసి కర్తవ్యం ఆలోచించాలని బాగేశ్వర ధామ్ సర్కార్ ఆలోచన… ఇదీ ఫాలో అప్ వార్త… అకస్మాత్తుగా తన వీడియోలు వైరల్ అయిపోయాయి… తను మాయలు, లీలల నిజానిజాల జోలికి ఇక్కడ మనం వెళ్లడం లేదు కానీ తనను పరిచయం చేయాల్సిన అవసరమైతే ఉంది… ఎందుకో కూడా చెప్పుకుందాం… జస్ట్, 26 ఏళ్ల వయస్సు…. మధ్యప్రదేశ్‌లోని ఛతార్పూర్ వాళ్ల ఊరు… తమ పూర్వీకుల […]
రామాయణంలో అసలు ప్రతినాయకి కైకేయి… చివరకు ఆమె ఏమైంది..? (పార్ట్-2)
కైకేయి ——– సాగర సంగమమే చరమ గమ్యంగా సాగిపోతున్న ఒక ఏటి ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ అడ్డుతగిలితే, ఆ ప్రవాహం చిందర వందర అవుతుంది. పాయలు పాయలుగా చీలిపోతుంది. చిత్ర విచిత్రాలైన మలుపులు తిరుగుతుంది. ప్రవాహ వైశాల్యం కూడ పెరుగుతుంది. అడ్డుపడిన కొండ వల్ల ఆ ప్రవాహానికి ఇలా జరిగినా, దాని వల్ల లోకానికి మేలే కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రవాహం పాయలుగా చీలి, మలుపులు తిరిగి, విశాలమైనందువల్ల అనేక ప్రాంతాల నీటి సమస్య తీరుతుంది. […]
అసలే సిధ్ శ్రీరాం కర్ణకఠోరం… పైగా శ్రీమణి రచనాకఠోరం… కుదిరింది భలే శృతి..!!
శాకుంతలం సినిమాకు సంబంధించి మొదటి పాట విని మెచ్చుకున్నాం కదా… చప్పట్లు కొట్టాం కదా… సరళంగా హృద్యంగా ఉందనీ అభినందించాం కదా… రెండో పాట రిలీజ్ చేశారు, మొదటి పాట తాలూకు ఉత్సాహానికి పంక్చర్ కొట్టింది ఈ పాట… సినిమా జాప్యమయ్యేకొద్దీ, త్రీడీ సహా హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఆశ్రయించడం, పాన్ ఇండియా మార్కెటింగ్ గట్రా బిజీలో మునిగిపోయి దర్శకుడు గుణశేఖర్ పాటలు ఎలా దెబ్బతిన్నాయో చూసుకోనట్టున్నాడు… మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట విడిచిపెట్టిపోయి, మళ్లీ […]
అంగట్లో అన్నీ ఉన్నా… ఈ హీరోకు ఒక్క హిట్టూ లేదు… ఈ హంట్‌తో సహా…
సుధీర్ బాబు… ఇప్పటికీ కృష్ణ అల్లుడనీ, మహేశ్ బాబు బావ అనీ సంబోధిస్తున్నాం… కారణం, తను హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ కాకపోవడం… చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో పడకపోవడం..! నిజానికి చాలామంది కొత్త హీరోల్లాగా లాంచింగుతోనే మాస్ ముద్ర కోసం ఏమీ ప్రయత్నించలేదు… సూపర్, సుప్రీం హీరో వేషాల కోసం ప్రయత్నించలేదు… తనదంటూ ఓ భిన్నమైన స్టయిల్… పాత్రల ఎంపికలో కొంత వెరయిటీగా ఉంటాడు, టేస్టు ఉంది… కాకపోతే అవేవీ క్లిక్ కాలేదు… నటనలోనూ మరీ తీసిపారేయదగిన […]
పట్టించుకుంటే చెలరేగిపోతారు… ఎహె, పొండిరా అంటే ట్రోలర్లు కిక్కుమనరు…
‘‘అంటే ఏమిటి..? అసలు నాతో మీకు ప్రాబ్లమేంటి..? సినిమాలు వదిలేసి వెళ్లిపొమ్మంటారా..? ఏమిటీ ట్రోలింగ్..?’’ అని బాధపడిపోతోంది రష్మిక… ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో బరస్ట్ అయిపోయింది… నిజంగానే ఆమె మీద ట్రోలింగ్ ఒక రేంజు దాటిపోయింది… ఆమె ఆగ్రహంలో ఆవేదన ఉంది… జరుగుతున్న నష్టమేమిటో తెలిసొచ్చి, సరిదిద్దుకునే ప్రయత్నాలేదో చేస్తోంది… కానీ ట్రోలర్స్ మాత్రం విడిచిపెట్టలేదు… నిజంగా ఆమెను విమర్శించాల్సిన అంశాల్లో గాకుండా… చిన్న చిన్న అంశాల్లో కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు… ప్రత్యేకించి కాంతార సినిమా […]
ఎస్వీరంగారావు మనమళ్ల స్పందన భేష్… కావల్సింది ఈ సంయమనమే…
తప్పో ఒప్పో …. అక్కినేని వారసులకన్నా ఎస్వీ రంగారావు వారసుల స్పందనే బాగున్నట్టనిపించింది… అలాగని నేనేమీ బాలకృష్ణను వెనకేసుకురావడం లేదు… ఎక్కడ ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో కూడా తెలియని ఒకరకమైన బ్లడ్డు, బ్రీడు తాలూకు పైత్యం తనది… మొన్ననే చెప్పుకున్నాం కదా, తనకే కాస్త ‘పదునైూర్న బుర్ర’ ఉండి ఉంటే, బాబు బావ గుప్పిట్లో ఎందుకు చిక్కుకునేవాడు..? తన నుంచి అంతకుమించి ఆశించడం వేస్ట్… సరే… వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో ఏదో కూశాడు… అది జనరల్ […]
కమాన్ వెంకీ కమాన్… దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? యాక్షన్‌లోకి దిగిపో…
యూట్యూబ్‌లో నంబర్ టూ ట్రెండింగ్… సైంధవ మూవీ ట్రెయిలర్… నిజానికి ఆ ట్రెయిలర్లో ఏమీ లేదు… వెంకీ ఓ తుపాకీ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటాడు… అంటే ఇది ఫుల్ యాక్షన్ సినిమా అని చెబుతున్నాడు… అంతే… ఐనాసరే, మస్తు వ్యూస్ కనిపిస్తున్నయ్… అంటే, వచ్చెయ్ వెంకీ… ఇంకా ఆ దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? మనం కూడా ఫుల్ యాక్షన్ మూవీ చేసేయాల అని ఫ్యాన్స్, ఇండస్ట్రీ చెబుతున్నట్టుంది… నిజమే… ఎవరెవరో కుర్ర హీరోలు కూడా […]
ఎంగిలి పళ్లు తినిపించింది సరే… తరువాత శబరి ఏమైపోయింది… (పార్ట్-1)
రామాయణం అనగానే…. రాముడు, సోదరులు, తండ్రీ తల్లులు… విలన్లు… అంతేనా..? మరి ఇతర కీలక పాత్రలు జటాయువు, శబరి, గుహుడు, తార, మంథర… వీళ్ల మాటేమిటి..? చివరకు వాళ్లంతా ఏమయ్యారు..? అసలు వాళ్ల పాత్ర చిత్రణ మాటేమిటి..? వాళ్లేమయ్యారు..? ఎవరైనా పట్టించుకున్నారా..? జగనానంద కారకా, జయజానకీనాయకా అని పాడుకోవడమేనా, జనం వాళ్లను పట్టించుకున్నారా..? అసలు కథారచయిత వాల్మీకి పట్టించుకున్నాడా..? కీలకపాత్రలేమయ్యాయి..? అసలు ఆ పాత్రల వైశిష్ట్యం ఏమిటి..? అవి కదా…! పోనీ, మనం ఓసారి ముచ్చటించుకుందామా..? చిన్న […]
- « Previous Page
- 1
- …
- 240
- 241
- 242
- 243
- 244
- …
- 449
- Next Page »