మొన్న హీరోల రెమ్యునరేషన్ల మీద చిరంజీవి మాట్లాడుతూ ‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏమిటి..? పెద్ద పెద్ద విషయాలు మానేసి ఇండస్ట్రీ మీద మాటలేమిటి..? మేం నటిస్తున్నామంటే ఇండస్ట్రీలో పదిమందికీ ఉపాధి దొరుకుతుందని మాత్రమే…’’ అని ఏదేదో చెబుతూ పోయాడు… ఇండస్ట్రీ కార్మికుల మీద పెద్ద ఔదార్యం కనబరుస్తూ… ఇండస్ట్రీ పచ్చగా ఉండటం కోసమే తాము నటిస్తున్నట్టుగా, సినిమాలు చేస్తున్నట్టుగా… రాజకీయ నాయకులు అకారణంగా తమ మీద ద్వేషాన్ని చిమ్ముతున్నారన్నట్టుగా… నిజానికి ఇండస్ట్రీలో శ్రమ మాత్రమే దోపిడీకి గురికావడం […]
రచయితకు చేరని పాఠకుడి ఉత్తరం… ఓ కథ… ఓ స్వీయానుభవం…
నేను చాలా కాలంగా కథలు రాస్తున్నాను. కానీ, కథా స్వరూపం గురించి, కథ యొక్క ప్రయోజనాన్ని కార్పొరేట్ ప్రపంచం ఏ విధంగా వాడుకుంటుందన్న విషయం ఈ మధ్యే, ఒక ‘టాక్’ లో పాల్గొనడం వలన మరింత నిర్దిష్టంగా తెలిసింది. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే నా జిఙ్ఞాస కారణంగానే డబ్బులు కట్టి, ఈ ‘టాక్’లో పాల్గొన్నాను. కథలు రెండు రకాలనీ, ఒకటి స్వీయ అనుభవాల సారాంశమనీ, రెండవది మనం సమాజాన్ని పరిశీలించడం ద్వారా కలిగిన ఆలోచనలను ఒక […]
ఈలయరాజా తక్కువేమీ కాదు… ఓ గాయని కెరీర్ నాశనం చేశాడు…
Sai Vamshi…. గాయని జీవితానికి తీరని షాక్… (‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు గాయని మిన్మిని. 1993లో లండన్‌లో ఒక స్టేజ్ షోలో ఉన్నట్టుండి ఆమె గొంతు పోయింది. ఆ కారణంగా కొన్నేళ్లపాటు ఆమె సరిగా మాట్లాడలేకపోయారు. పాటలు పాడలేని స్థితికి చేరారు. కొన్నాళ్లకు మళ్లీ గొంతు వచ్చినా పాటలు తగ్గిపోవడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఇటీవల ఓ మలయాళ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇవి…) […]
కావ్య కల్యాణరాం… ఈ పొట్టిపిల్లకు భవిష్యత్తు ఉంది… ఉస్తాద్‌లో మెరిసింది…
ఉస్తాద్ అనే సినిమా వచ్చింది… శ్రీసింహా హీరో… పెద్ద సినిమా కుటుంబం నుంచే వచ్చాడు… ఏవేవో సినిమాలు చేస్తున్నాడు గానీ ఫలితం రావడం లేదు… తనలో నటనాపరంగా కూడా పెద్దగా ఎదుగుదల లేదు… పండితపుత్రుడు అని స్వీపింగ్ కామెంట్ చేయలేం గానీ మంచి నటుడు అనే కోణంలో తను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది… సినిమా సంగతికొస్తే బోర్… ఎత్తులంటే భయపడే ఓ సాదాసీదా పిరికి యువకుడు ఏకంగా పైలట్ ఎలా అయ్యాడు..? తన ప్రేమకథేమిటి అనేదే […]
లేట్ విపక్షాలు… కేసీయార్ ఆల్రెడీ ‘పోలింగ్ కసరత్తు’లోకి దిగిపోయాడు…
కొన్ని పత్రికల్లో వార్తలు చదువుతుంటే నవ్వొస్తుంది… అన్ని పార్టీలూ ఫస్ట్ లిస్టు రెడీ చేసేశాయనీ, త్వరలో ప్రకటించబోతున్నాయనీ, బహుశా ఈ పేర్లు ఫస్ట్ లిస్టులో ఉండవచ్చుననీ రాబోయే తెలంగాణ ఎన్నికల మీద తెగరాసేస్తున్నాయి… టీవీలు, సినిమాల వార్తలకే ప్రాధాన్యం కాబట్టి పెద్దగా వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాజకీయాల్ని లైట్ తీసుకుంటున్నాయి, టీవీల్లో పెద్దగా రాజకీయ విశ్లేషణలు చేయగల రిపోర్టర్లకు కొరత కాబట్టి వాటిల్లోనూ పెద్దగా కనిపించడం లేదు… కానీ పత్రికల్లో చాలా వార్తలు వస్తున్నాయి… అవన్నీ […]
ఈ విషయంలో మోడీ ప్రభుత్వ అడుగులు సరైనవే… ప్రతిపక్షాలకూ మాటల్లేవ్…
కాలం చెల్లిపోయిన, పురాతన నేరచట్టాల్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, కొత్త శిక్షా స్మృతులను తీసుకొస్తున్నందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి… అన్నింటికీ మించి 313 సవరణల్ని కొత్త బిల్లుల్లో ప్రస్తావిస్తే అందులో అధికశాతం బీజేపీని వ్యతిరేకించే సెక్షన్స్‌కు కూడా ఆమోదయోగ్యంగా కనిపించడం… ప్రత్యేకించి రాజద్రోహం సెక్షన్ రద్దు, శిక్షల్ని ప్రభుత్వాలు తగ్గించడంపై నిషేధం వంటివి ప్రగతిశీల- ప్రజాస్వామిక శక్తులూ ఉపశమనం… నిజానికి ఈ చట్టాల సవరణపై ఎంత భారీ కసరత్తు జరిగిందో తెలియదు, కసరత్తు లేకుండా అల్లాటప్పాగా పార్లమెంటులో […]
నెవ్వర్… మోడీ తన విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టుకు అప్పగిస్తాడా..?
Highhandedness: “Democracy is an anarchy; but there is no better alternative for democracy- ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు” అని ఎవరన్నారో కానీ…ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ “అరాచకం” విమర్శలో ఎంత లోతు ఉందో అర్థమవుతోంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిగల ఎన్నికల సంఘం ఉంది. దానికి కొన్ని విధి విధానాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ స్వయం ప్రతిపత్తి […]
గాలి ముద్దు… అనగా ‘ముద్దొచ్చే ప్రజాస్వామ్యం’ అని అర్థం…
Kiss-Chaos: రాజ్యాంగ రచనలో అణువణువునా ప్రజాస్వామ్యమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం వేళ్లూనుకుని…ఎదిగి… శాఖోపశాఖలై విస్తరించి…పూచి…కాయ కాచి…పంట ప్రజల చేతికి అందడమే పరమ ప్రయోజనం. ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్ట సభలు దేవాలయాల్లాంటివి. అక్కడ చర్చలు; చర్చోపచర్చలు; ప్రశ్నలు- సమాధానాలు; పార్టీల బాలాబలాలు…అన్నీ ప్రజలకు సంబంధించినవే అయి ఉంటాయి. ఇంతకంటే లోతుగా వెళితే అది ఎన్నికల ప్రక్రియ, చట్టసభల కూర్పు, స్వరూప, స్వభావాలు; విధి విధానాల మీద పోటీ పరీక్షల పాఠం అవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం. ప్రజాస్వామ్యంలో ముద్దు ముచ్చట గురించి విడిగా ఎక్కడా […]
మెహర్ రమేశ్… భోళాశంకర్‌ను ఇరవై ఏళ్లు వెనక్కి నడిపించాడు…
చిరంజీవి అంటే తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్… తను తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షమే… అలాంటిది చిరంజీవి మరో నటుడిని అనుకరించడమా..? అదీ తన తమ్ముడిని..! అంటే తన పని ఐపోయిందని తనే అనుకుంటున్నాడా..? ఒక సినిమాలో ఎవరో హిందీ హీరో కావల్సి వచ్చాడు… ఆమధ్య రవితేజ కావల్సి వచ్చాడు… మరో సినిమాలో కొడుకు కావల్సి వచ్చాడు… తను ఒంటి చేత్తో సినిమాను మోసే రోజులు పోయాయా..? ఏమండీ చిరంజీవి గారూ… రజినీకాంత్ అజిత్‌ను ఇమిటేట్ […]
అప్పట్లో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అనే సుందరమైన రాష్ట్రం ఉండేది…
Amarnath Vasireddy….. పులిని చూసి నక్క వాత పెట్టుకొంటే ? హిమాచల్ ప్రదేశ్ . కొండల రాష్ట్రం . కొండ ప్రాంతాల భౌగోళిక స్థితిగతులు, మైదాన ప్రాంతాలతో పోలిస్తే భిన్నం . భారీ పరిశ్రమలు మైదాన ప్రాంతాలకే అనేక చిక్కుల్ని తెస్తాయి . కొండ ప్రాంతంలో అయితే వంద రెట్ల సమస్యలు . ఒక ప్రాంతం/ రాష్ట్రం అభివుద్ది సాధించాలంటే, అది సంతులితాభివృద్ధి అయ్యేలా చూసుకోవాలి . పర్యావరణాన్ని కాపాడుకొంటూ ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులననుసరించి పారిశ్రామీకరణ […]
హీరో అజిత్ 100 శాతం ఓ డిఫరెంట్ కేరక్టర్… ఏకంగా ఆర్మీ కంట్రాక్టే దక్కింది…
రెండేళ్ల క్రితం మనం ముచ్చటలోనే చెప్పుకున్నాం… హీరో అజిత్ గురించి… ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మళ్లీ వచ్చినట్టుంది… ఆ పాత పోస్టు యథాతథంగా ఓసారి చదవండి ముందుగా… అజిత్… అసలు ఈయన హీరో ఏమిటో అర్థం కాదు… ఎందుకు చెప్పుకుంటాడో కూడా తెలియదు… అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? అందులోనూ ఓ ఇండియన్ హీరో… అదీ సౌతిండియా హీరో అంటే ఏ రేంజ్ ఉండాలి… ఫ్యాన్స్ గీన్స్ హంగామా రెచ్చిపోవాలి, చచ్చిపోవాలి… కానీ తనకు […]
సోనియాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ… లక్ష్మి సరస్వతి, దుర్గల రూపాలట…
Siva Racharla…… ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వం… ఇది చదివే ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లోక్ సభలో జరిగే విశ్వాస లేదా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయొచ్చా?. సమాధానం అలోచించి చదవండి. ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు ఎన్నికల ముందు చర్చకోసమే ప్రవేశ పెడుతున్నారు. కానీ సంకీర్ణ కాలంలో ముఖ్యంగా 1996-2008 మధ్య అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం అంటే రాజకీయ, వ్యాపార , మీడియా వర్గాలు కాళ్ల బొటన వేళ్ల మీద నిల్చునేవి. అవిశ్వాస తీర్మానం […]
ఈమె టీవీ సీరియల్ పిశాచి అత్త కాదు… అమ్మలా కడుపులో పెట్టుకున్న అత్త…
మన డర్టీ టీవీ సీరియల్స్ సంగతి తెలిసిందే కదా… అత్త అంటే పైశాచికత్వానికి ఐకాన్ చేసేశాయి… ఏ సీరియల్ చూసినా అవే కథలు… కోడల్ని చంపేయడానికి కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాలు, కడుపులు పోగొట్టడం, మరీ కొన్ని సీరియల్స్లోనైతే పాత తెలుగు సినిమాల్లాగా ఫ్లోర్ మీద నూనె పోయడాలు… అబ్బో, ఏ సీరియల్ చూసినా అది హైదరాబాద్, జవహర్‌నగర్ డంపింగ్ యార్డే… ఈ పైత్యాలకు తోడు కథలు, నవలలు, వెబ్ సీరీస్, సినిమాలు… ప్రతి క్రియేటివ్ ప్రక్రియా […]
రెండు దండలు… రెండు సంతకాలు… ఒక్కటైన రెండు జీవితాలు…
అట్టహాసాలు, ఆడంబరాలతో… ఎడాపెడా అప్పులు చేసి మరీ ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి, కొత్త కృతక తంతులను కూడా కొందరు నెత్తిన మోస్తున్న తరుణంలో… ప్రతి దండల పెళ్లి, ప్రతి స్టేజ్ మ్యారేజ్, ప్రతి రిజిష్టర్ వివాహమూ అభినందనీయమే… వధువు తండ్రికి మనసులో ఉంటుంది, సింపుల్‌గా పెళ్లి చేసేద్దామని… కానీ బంధుగణం సారీ, రాబందుగణం ఊరుకోదు… అసలు ఇంట్లోనే ఎవరూ పడనివ్వరు… తప్పులు తీస్తారు, చీప్‌గా చూస్తారు, చీదరించుకుంటారు… అందుకే ఐనకాడికి డబ్బు సమకూర్చుకుని అడ్డగోలు రేట్లతో పెళ్లి […]
అయ్యయ్యో… నెత్తిల జుత్తూ పోయెనే… అయ్యయ్యో… మొగడు తన్నీ తరిమేసెనే…
Heavy Loss: అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి… బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి. బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. “ఊరుకున్నంత ఉత్తమం లేదు; బోడి గుండంత సుఖం లేదు” అన్న […]
జైలర్ సినిమాకు ఇద్దరు హీరోలు… 1) రజినీకాంత్ 2) అనిరుధ్…
జాకీష్రాఫ్, శివరాజకుమార్, మోహన్‌లాల్… హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాపులర్ హీరోలు… స్టార్లు… ఇదంతా ఆయా భాషల్లో మార్కెటింగ్, వసూళ్ల అడ్వాంటేజ్ కోసం, ఆయా రాష్ట్రాల నేటివిటీని కృత్రిమంగా అద్దే ప్రయాస… సరే, తెలుగులో, తమిళంలో సేమ్ రజినీకాంత్ చాలు… అఫ్కోర్స్ సునీల్ ఉన్నాడు… రమ్యకృష్ణ ఉంది, తమన్నా ఉంది… ఐతేనేం… సినిమా మొత్తం రజినీకాంత్ హీరోయిజం చుట్టూ తిరుగుతుంది… మిగతావాళ్లు ఆయా భాషల్లో హీరోలు కావచ్చు, ఈ సినిమాకు వచ్చేసరికి జీరోలు… ఎవరికీ పెద్ద ప్రాధాన్యమున్న […]
బాగుంది… అదే ఈటీవీ వేదికపై మళ్లీ రష్మి, సుధీర్ జంట… కలిసి హోస్టింగ్…
ఎందరు వచ్చినా, ఎవరెన్ని కామెంట్లు చేసినా, ఎంతగా కుళ్లుకున్నా, ఎందరు అనుకరించే విఫలప్రయత్నాలు చేసినా… తెలుగు వినోద చానెళ్లలో అత్యంత హిట్ పెయిర్ రష్మి, సుధీర్… అబ్బే, మామధ్య ఏమీ లేదు, కేవలం స్నేహమే, వృత్తిపరమైన బంధమే అని వాళ్లిద్దరూ ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద చెప్పుకున్నా సరే, ఆ జంట ఎప్పుడు కనిపించినా ప్రేక్షకులకు ఆసక్తే… దాదాపు తొమ్మిదేళ్లుగా వాళ్లను ప్రేమికులుగా చూపిస్తూనే ఉన్నారు… ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్… షో […]
నిఖార్సైన నాయకుడంటే ఇదుగో… ఈ ధీశాలి… ఈ ఫైటర్… ఈ బిజినెస్ మాగ్నెట్…
కోడిగుడ్డంత చేస్తే.. కొండంత చెప్పే మహామహులు ఎందరో ఉంటే.. కొండంత చేసినా కోడిగుడ్డు మాత్రం కూడా ప్రచారం చేసుకోని మహానుభావులు కొందరు. సవాళ్లకు ఎదురెళ్లిన ఉక్కు పిడికిలై.. తన వారసత్వానికీ సింప్లిసిటీ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను చెప్పిన నిరాడంబరతై.. వ్యాపార దక్షతలో ఓ మేనేజ్ మెంట్ గురువై.. వారసత్వ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తే దేశంలో.. తన వారసత్వం మాత్రమే తన ప్రాంతానికి న్యాయం చేయగలదన్న జన విశ్వాసమైన.. ఓ మాజీ ముఖ్యమంత్రి.. ఫైటర్ పైలట్.. ఓ బిజినెస్ మ్యాగ్నైట్ […]
చిరంజీవి మాటల్లో తప్పులేదు సరే… కానీ ఖండనకు జర్నలిస్టుల అత్యుత్సాహం దేనికి..?
ముందుగా ఓ ప్రకటన చదవండి… యథాతథంగా… వాట్సప్ గ్రూపుల్లో కనిపించింది… వాల్తేరు వీరయ్య వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన అసలు మాటలు. 👉 సినిమా నటుల రెమ్యునరేషన్స్ గురించి ఢిల్లీ పెద్దలు రాజ్యసభలో మాట్లాడటం నాకు చాలా బాధ కలిగింది.. 👉 మేము నటించేది సినిమా ఇండస్ట్రీలో కార్మికులు ఆనందంగా జీవించడం కోసం.. ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది మా ఉద్దేశం.. 👉 నేను దేశ రాజకీయాలు చూశా, వాటి […]
గుళ్లు లేని దేవుళ్లు… ప్రతి పేద గుడిసెలో కొలువు దీరిన సార్థకజీవులు…
గుడి అవసరంలేని దేవుళ్ళు ! వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా ఉన్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి. 1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న బావూరావ్ కోళే చాలా […]
- « Previous Page
- 1
- …
- 242
- 243
- 244
- 245
- 246
- …
- 451
- Next Page »