Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనమే రెచ్చగొడుతూ, రచ్చ చేస్తూ… అశాంతి, ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నాం…

September 16, 2025 by M S R

h1b

. బ్రిటన్‌లో ఏం జరిగింది..? వలసదారులపై జనాగ్రహం పెల్లుబుకింది… అది మరింత పెరిగితే ఏమవుతుంది..? నాన్-బ్రిటన్ పౌరులపై దాడులు జరుగుతాయి… అంతే కదా… అక్కడ స్థిరపడిన ఇండియన్లకూ ప్రమాద సంకేతాలే ఇవి… అమెరికాలో కూడా కొన్నిచోట్ల ఇండియన్స్ వ్యవహార శైలి ఎలా ఉందంటే..? మన కింద మనమే గోతులు తవ్వుకుంటున్నట్టుగా ఉంది… ప్రత్యేకించి పలుచోట్ల మన తెలుగు జనం పోకడలు అక్కడి అమెరికన్లలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి… రాబోయే కాలంలో అవి మనవాళ్లకే ప్రమాదకరం అనే సోయి  మనవాళ్లకే […]

ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!

September 15, 2025 by M S R

seethakka

. మంత్రి సీతక్క… ఆమె జిల్లా ఎస్పీ శబరీష్ మోటార్ సైకిల్ వెనుక కూర్చుని మేడారం జాతర పరిసరాల్లో పర్యటించిన ఫోటో నిన్న వైరల్… గుడ్ టు సీ దట్ ఫోటో… కానీ ఎందుకు..? మంత్రుల దాకా ఎందుకు… చిన్న చిన్న ఊళ్ల సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, చోటా నాయకులు కూడా కాన్వాయ్స్ మెయింటెయిన్ చేస్తున్న రోజులివి… అట్టహాసం, ఆడంబరం, పటాటోపం… ఆమెకు కాన్వాయ్ లేక కాదు… కానీ మారుమూల అటవీ ప్రాంతాల్లో […]

ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?

September 15, 2025 by M S R

immigrants

. బ్రిటన్ స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది… కట్టలు తెంచుకుంటోంది… నిన్న లండన్ వీథుల్లో కనిపించిన జనప్రదర్శన అదే… కానీ ఎందుకు..? వలసదారులు… ఇదే బ్రిటన్ ఆందోళన ఇప్పుడు… అక్కడి ప్రభుత్వాలకు వలసలపై ఓ విధానం అంటూ లేకపోవడం… విశాల ప్రపంచం, గ్లోబల్ విలేజ్, జాతుల మధ్య సఖ్యత, ఔదార్యం, మానవత్వం భావనలతో ఇన్నేళ్లూ వలసదారులపై ప్రదర్శించిన మానవీయ ధోరణి చివరకు తమ సంస్కృతికి, తమ ఉపాధికి, తమ స్థానికతకే ఎసరు పెట్టే పరిస్థితి రావడం… ఇదే ఇప్పుడు […]

పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!

September 15, 2025 by M S R

modi

. వర్గకసి … సాధారణంగా మావోయిస్టు భాషలో చాలాసార్లు వినిపించే పదం ఇది… మన శత్రువు ఎవరో స్పష్టంగా తెలిసి, వాడి బలాలపై, బలహీనతలపై దెబ్బతీయడానికి సర్వవేళలా సన్నద్ధంగా ఉండాల్సిన మనోస్థితి ఇది… ప్రధానిగా ఉన్నది యోగి కాదు… మోడీ… తనలో ఆ జాతీయతాభావపు కసి కనిపించడం లేదు… మాటల్లో తప్ప పాకిస్థాన్‌కు చేతల్లో జవాబులు చెప్పే దూకుడు లేదు… ఎవడో ఆదేశించాడని అర్థంతరంగా ఆపరేషన్ సిందూర్‌ను, అదీ మన రక్షణ బలగాలు అద్భుతమైన ఆధిపత్యం సాధించిన […]

హఠాత్తుగా ఎందుకో గానీ హైదరాబాద్ మెట్రో నష్టాల పాట..!!

September 15, 2025 by M S R

metro

. హైదరాబాద్ మెట్రో అప్పుల కుప్పగా తయారయ్యింది. భారత దేశంలో మిగతా మెట్రోలన్నీ ప్రభుత్వాలే నిర్వహిస్తుండగా పబ్లిక్, ప్రయివేట్ పార్ట్ నర్ షిప్- పిపిపి మోడల్లో నడుస్తున్నది హైదరాబాద్ మెట్రో ఒకటే. ఏటేటా పేరుకుపోతున్న నష్టాల దెబ్బకు మెట్రోను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అప్పగించి నిర్వహణ నుండి పూర్తిగా పక్కకు తప్పుకోవాలని ఎల్ అండ్ టీ అనుకుంటోంది. నగరం నలుదిశలా రీజనల్ రింగ్ రోడ్డు దాకా మెట్రోను విస్తరించడానికి ప్రభుత్వం ఫ్యూచర్ కలలు కంటున్నవేళ… ఎల్అండ్‌టీకి ఇప్పుడున్న […]

నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…

September 15, 2025 by M S R

jeevitha

. Subramanyam Dogiparthi….  మరో లేడీస్ సెంటిమెంట్ పిక్చర్ ఈ తలంబ్రాలు . తలంబ్రాలు అనే టైటిల్ కన్నా ఆడది తలచుకుంటే వంటి ఇంకేదో టైటిల్ పెట్టి ఉంటే ఇంకా ఆప్ట్‌గా బాగుండేదేమో ! సక్సెస్ అయింది కాబట్టి తలంబ్రాలే కరెక్ట్ అని తేల్చాల్సి ఉంటుంది . సినిమాకు షీరో జీవితే . తమిళంలో అప్పటికే అరంగేట్రం చేసి ఉన్న జీవితకు తెలుగులో మాత్రం ఇదే మొదటి సినిమా . మొదటి సినిమాలోనే షీరో పాత్ర లభించటం […]

సీతాఫలం తినడం ఓ కళ..! చెంచాతో తింటే దాన్ని అవమానించినట్టే..!!

September 15, 2025 by M S R

custard

. Ramu Suravajjula  ( 94401 02154 )….. సీతాఫలం తినడం నేర్పాలి… ఊళ్ళలో చెట్ల వెంట, పుట్ల వెంట తిరిగి కందికాయలు, రేగ్గాయలు, నేరేడు పళ్ళు (గిన్నెపళ్ళు), సీమ చింతకాయలు (గుబ్బ కాయలు), జామకాయలు వగైరా లాగించడం మనలో చాలా మంది చేసే ఉన్నారు. ఏడో తరగతి దాకా ఈ రకంగా ఊరుమీదబడి నోరు ఆడిస్తూ బంగారం లాంటి చదువు అశ్రద్ధ చేసి కొద్దిగా నష్టపోయిన బ్యాచ్ మనది. గొల్లపూడి, రెబ్బవరం మధ్య రోడ్డు పక్క […]

కేటీఆర్ మగ రాజకీయ భాష… ఆడతనమంటే చేతగానితనమట…

September 14, 2025 by M S R

ktr

. కేటీయార్ విసురుతున్న మగతనం సవాళ్లు ఒకరకంగా ఆడవాళ్లను, ఆడతనాన్ని కించపరచడమే… ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అభ్యంతరకరమైన పదజాలమే… వివరాల్లోకి వెళ్తే… ఏపీ రాజకీయాలు ఎందుకూ పనికిరావేమో బహుశా… తెలంగాణ రాజకీయాల్లోనూ పరుషపదాల్ని యథేచ్ఛగా వాడేస్తున్నారు… చాన్నాళ్లుగా ఇది రాష్ట్రంలో చర్చనీయాంశమే… తాజాగా కేటీయార్ వ్యాఖ్యలు మళ్లీ డిబేటబుల్… ‘‘రేవంత్ రెడ్డీ, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే… ఆ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేపించు… ఎన్నికల్లో చూసుకుందాం… ఎవరి సత్తా ఏందో… ఎవరి పని […]

BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…

September 14, 2025 by M S R

bb9

. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్… ఓ బజ్ లేదు, ఎవరిలోనూ ఆసక్తి లేదు… అంతకుముందు రెండుమూడు సీజన్లు మొహం మాడిపోయిన బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్ ఈసారి ఏవేవో పిచ్చి ప్రయోగాలను పూనుకుంది… కామనర్స్‌కు పెద్దపీట మన్నూమశానం… అది మనం చెప్పుకున్నాం… కానీ సోకాల్డ్ నవదీప్, శ్రీముఖి, అభిజిత్ ఎట్సెట్రా జడ్జిలు కామనర్స్ కోసం పెట్టిన నానా పైత్యపు పరీక్షల గురించీ చెప్పుకున్నాం… నిజానికి అదే ఈ సీజన్‌కు పెద్ద మైనస్… చెత్తా టాస్కులు… అవి ఎంత […]

ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!

September 14, 2025 by M S R

mirai movie review

. ఫాఫం మిరయ్… నిర్మాతలు ఎవరో గానీ… తక్కువ ఖర్చుతోనే కల్కి, హరిహరవీరమల్లు, ఆదిపురుష్ తదితర సినిమాల క్వాలిటీలను మించిన గ్రాఫిక్స్ సినిమాను నిర్మించారు సరే… ఆ దర్శకుడు ఎవరో గానీ… గతంలో ఏం తీశాడో, ట్రాక్ రికార్డు ఏమిటో గానీ… గ్రిప్పింగ్ కథనం, కథనంపై గ్రిప్పు సూపర్బ్… ప్రతి సీనులోనూ తన ప్రతిభ కనిపించింది… ఈ దెబ్బకు మరికొన్ని సినిమాలు గ్యారంటీ, తన లైఫ్ సెటిల్… ఫాఫం అని ఎందుకు అన్నానంటే..? అమెరికా వంటి దేశాల్లో […]

టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!

September 14, 2025 by M S R

media

. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్న తీరును ‘ముచ్చట’ ఖండిస్తుంది… ఇలాంటి పోకడలు ఏ ప్రభుత్వం నుంచి కనిపించినా అవి ఖండనీయం… అందులో వేరే మాట లేదు, ఖండనకు వెనుకంజ కూడా అవసరం లేదు… ఐతే తమ వ్యతిరేక గొంతుల్ని మూయించడానికి ప్రయత్నించే పాలకుల్లో చంద్రబాబు మొదటి వాడు కాదు, చివరి వాడు కూడా కాదు… అంతెందుకు..? వైఎస్ ఏకంగా ఈనాడు ఆర్థిక మూలాల్నే పెకిలించే ప్రయత్నం చేయలేదా..? […]

నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…

September 14, 2025 by M S R

aj rk

. ఈమధ్య… కాదు, చాన్నాళ్లుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసాలు ఆవుకథలు అవుతున్నాయి… ఈరోజూ అదే ధోరణి… తనలోని పాత్రికేయుడి పాత్రికేయ విజ్ఞత కనుమరుగవుతూ పక్కా జగన్ ద్వేషి మాత్రమే బలంగా ప్రదర్శితం అవుతున్నాడు… సోమాలియా ఆకలిచావులు, ఉక్రెయిన్ యుద్దం, అమెరికా డ్రగ్ కార్టెల్స్, పాలస్తీనా కష్టాలు దగ్గర నుంచి… ప్రపంచంలో ఏం జరిగినా… దాన్ని అర్జెంటుగా జగన్‌కు ముడివేసి ఏవో జగన్ వ్యతిరేక కథలు చెప్పడం అలవాటైపోయింది ఫాఫం… ఎస్, జగన్ పార్టీ అడ్డదిడ్డం విధానాలు, పాలన […]

పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…

September 14, 2025 by M S R

amaravathi

. శాసనమండలి కొనసాగింపు వంటి పలు విషయాల్లోలాగే జగన్ పార్టీ మరో బిగ్ యూటర్న్ తీసుకుందా..? మొన్నటి 11 సీట్ల అత్యంత దారుణ వోటమి తీవ్రమైన విధాన గందరగోళంలోకి నెట్టేస్తోందా..? ఇది ఆత్మమథనమా..? లెంపలేసుకుని సవరించుకునే పాత రాజకీయ విధానమా..? సమయానుకూల పరివర్తనా..? లేక ఎటు వెళ్లాలో తెలియని గందరగోళమా..? ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోనివాడు పొలిటిషియన్ ఎలా అవుతాడు..? అచ్చం మన చంద్రబాబులాగే… గంటకో పాలసీ మాట్లాడగలిగేవాడే పొలిటిషియన్… మరీ ఈరోజుల్లో… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా… దాన్నే […]

‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…

September 14, 2025 by M S R

coolie

. ఈమధ్య ఒక సర్జరీ జరిగి దాదాపు వారంపాటు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పెయిన్ కిల్లర్లు, నిద్రపట్టే మందులు వాడడంవల్ల పగలుకూడా పడుకున్నట్లే ఉంటుంది. ఆసుపత్రి నుండి డిస్ చార్జ్ అయ్యేప్పుడు సాహిత్యశాస్త్రంలో కూడా అందె వేసిన చేయి అయిన నా శ్రేయోభిలాషి సర్జన్ సకల జాగ్రత్తలు చెప్పాడు. బరువులు ఎత్తవద్దు. కఠినమైన పదార్థాలు తినవద్దు. ఒక వారం తరువాత కట్లు తీద్దాం- అని. డాక్టర్ల మాటవింటే రోగులం ఎందుకవుతాం? ఒకరోజు సాయంత్రం నొప్పిగా, విసుగ్గా ఉండి […]

నాటకాలు, సినిమాలు… రచన, నటన… విసు ఓ తమిళ దాసరి…

September 14, 2025 by M S R

jayasudha

. Subramanyam Dogiparthi …. మనకు దాసరి నారాయణరావు ఎలాగో తమిళ నాటక , సినిమా రంగాలకు విసు అలాంటి వాడు . అయితే దాసరి విజయాలు విసు విజయాల కన్నా చాలా చాలా ఎక్కువ . విసు తమిళంలో చాలా నాటకాలను వ్రాసారు , వేసారు , వేయించారు . కొన్నింటిని సినిమాలుగా తీసారు , నటించారు కూడా . ఆ వరుస లోనిదే తిరుమతి ఒరు వెగుమతి అనే నాటకం . ఆ నాటకాన్నే అదే […]

కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…

September 13, 2025 by M S R

kcr

. స్వరాష్ట్ర సాధన తరువాత కేసీయార్ సాగించిన పదేళ్ల అరాచక, అక్రమ, అవినీతి, అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనలో ఇది మరో వికృతకోణం… ఈమాట హార్ష్‌గా అనిపించినా సరే… వరుసగా బట్టబయలవుతున్న విషఅధ్యాయాల్లో మరొకటి చెప్పుకోవాలి… వెయిట్, వివరంగానే చెప్పుకుందాం… ముందుగా ఈ ఫోటో చూడండి… 90 రోజుల్లో 84 మందిని దొరకబుచ్చుకుంది ఏసీబీ… సరే, టిప్ ఆఫ్ ఐస్ బర్గ్… ఐనా సరే, పదేళ్ల తరువాత కాస్త దూకుడు కనిపిస్తోంది… సీన్ కట్ చేయండి ఇక… కేసీయార్ […]

GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!

September 13, 2025 by M S R

genz

. Raghu Mandaati …. అప్పుడప్పుడు కామెడీగా వినపడే పదం ఇప్పుడు పవర్ సూచిస్తోంది. చాలా మంది వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. అదే Gen Z. ఒకసారి అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Gen Z అంటే ఒక తరం, ఒక తత్వం. మన చిన్ననాటి జ్ఞాపకాలు గాడ్జెట్ల కాంతిలో కాకుండా, ఆకాశంలోని నక్షత్రాల వెలుగులో రాసుకున్నవే. విద్యుత్ పోయిన రాత్రుల్లో, కొవ్వొత్తి చుట్టూ కూర్చుని అమ్మ చెప్పిన కథలు, నాన్న గళంలో వినిపించిన పద్యాలు అవే […]

Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…

September 13, 2025 by M S R

airbag

. ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో ఆటోమేటిగ్గా ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకునే సాంకేతికత చాలా దశాబ్దాలుగా అందుబాటులో ఉంది. అయితే సీటు బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకుని రక్షణగా నిలబడతాయన్న విషయం తెలియక చాలా మంది సీటు బెల్ట్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండి ప్రాణాలు కోల్పోతుంటారు. వెనుక సీట్లో కూర్చున్నవారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అలా వెనుక సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకోక వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, టాటా […]

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…

September 13, 2025 by M S R

life

. నిజానికి ఈ పోస్టు బాగా వైరల్… ఎవరు రాశారో తెలియదు గానీ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది… ఓసారి చదవండి… అందరికీ నమస్కారం ఇది చాలామందికి ఉపయోగపడే విషయం. ఇది ఒక భార్య తన భర్త అకాల మరణం తరువాత రాసిన భావోద్వేగభరితమైన, భావప్రదమైన, జీవితాన్ని నేర్పే ఉత్తరం… దయచేసి దీన్ని పూర్తిగా చదవండి మరియు అవసరమైన వారికి షేర్ చేయండి. — ఒక భార్య రాసిన ఉత్తరం – భర్త యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత […]

వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…

September 13, 2025 by M S R

archana

. Subramanyam Dogiparthi ….. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కధ . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయిఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు . మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా ఇది .‌ 1986 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా రాజేంద్రప్రసాద్ , వంశీ కెరీర్లలో ఓ మైలురాయిగా మిగిలి పోయిన […]

  • « Previous Page
  • 1
  • …
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • …
  • 390
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అక్కడ శ్రీచరణికి ఘన సత్కారం… ఇక్కడ అరుంధతిరెడ్డికి ఏది మరి..?!
  • ఏదీ పవన్ కల్యాణ్ ఫోటో..? ఏదీ ఆటల మంత్రి ఫోటో..? ఏం యాడ్స్ ఇవి..?!
  • ది గరల్ ఫ్రెండ్..! ఓ టాక్సిక్ లవ్ స్టోరీ… రష్మికను మరో మెట్టు ఎక్కించింది..!!
  • ఇప్పటి నగర ప్రణాళికలన్నా… త్రేతాయుగపు అయోధ్య ఎంతో నయం…
  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!
  • బ్యాట్లు, లెగ్ గార్డుల షేరింగు అప్పట్లో… మ్యాచుకు జస్ట్ రూ. 1000 ఫీజు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions