Prasen Bellamkonda……. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా! వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది.. నిజానికి ట్వంటి ట్వంటి వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా.. అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా.. సముద్రపు ఒడ్డున అలల అంచున నిలబడి, బంతిని సముద్రంలోకి కొడతారు… అలలతో బంతి తిరిగొచ్చే వ్యవధిని బట్టి, అది వెళ్లిన దూరాన్ని […]
లక్కీ కార్తి..! పొన్నియిన్ సెల్వన్ సంబురాల్లోనే తాజాగా సర్దార్…!!
నటి లైలా పదహారు ఏళ్ల తరువాత మళ్లీ రంగు పూసుకుంది… సర్దార్ సినిమా కోసం..! హిందీ నటుడు చుంకీ పాండే తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… మొన్నమొన్ననే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో తమిళంలో బ్రహ్మాండమైన ఫేమ్ సంపాదించిన కార్తికి ఇది మళ్లీ వెంటనే ఓ స్పై థ్రిల్లర్… డబుల్ రోల్… చెప్పుకోదగిన హీరోయిన్లే… రాశిఖన్మా, రాజీష విజయన్… మంచి అభిరుచి కలిగిన దర్శకుడు మిత్రన్ దీనికి దర్శకుడు… సర్దార్ సినిమా రిలీజుకు ముందు విశేషాలు ఇవే… అవన్నీ […]
ఓరి దేవుడా… చిన్న హీరో ఐతేనేం… పెద్ద హీరో ఐతేనేం… అన్ని బాటలూ రీమేకులే…
విష్వక్సేన్ అయినా అంతే… చిరంజీవి అయినా అంతే… మనకు తెలుగులో సొంత కథల్లేవు, మనకు ప్రయోగాలు అక్కర్లేదు… ఏదో భాష నుంచి మన హీరోయిజానికి అనువుగా మల్చుకుని, ఓ రీమేకును జనంలోకి వదలడమే… ఓరి దేవుడా అనే సినిమా పోస్టర్ చూడగానే గుర్తొచ్చే నిజం ఇదే… పోనీ, అదైనా నిన్నటిదో మొన్నటిదో కూడా కాదు… ఏళ్ల క్రితం నాటి సినిమాలైనా సరే, రీమేకడమే… తమిళంలో రెండున్నరేళ్ల క్రితం వచ్చింది ఓ మై కడవులే అనే సినిమా… దాన్ని […]
జిన్నా..! అంతటి పోర్నరికి కూడా కథాప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చారు…
ఏడు కొండల వెనుక నుంచి జిన్నా అనే టైటిల్ వస్తుంటే… అది ఏమైనా వివాదానికి దారితీస్తుందేమో అనుకున్నారు… ఐనా అనితర సాధ్యమైన మరో షిర్డి గుడిని కట్టించి, ఇక భక్తులు షిర్డికి వెళ్లనక్కర్లేదన్న అత్యంతాతి హిందూ భక్తిపరుడు మంచు మోహన్‌బాబుతో పెట్టుకోవాలంటే హిందూ సంస్థలకు కూడా అంత ధైర్యమెక్కడ ఉంటుంది..? పైగా ఇంట్రడక్షన్లో జైశ్రీరాం అనిపిస్తే సరి… అంతేనా..? హీరో చేతి మణికట్టుకు మూడు ఓంకారాలు చెక్కిన ఓ బ్రేస్లెట్, దానికి హనుమంతుడి బొమ్మ… ఇంకేం కావాలి..? […]
సిల్లీ కామెడీ..! మళ్లీ జాతిరత్నాలు తీయబోతే ఈ పంటికింద రాళ్లు తగిలాయ్…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమిటి..? ఒక సినిమాను జస్ట్ తనే నిర్మించి, మిగతా అంశాల్లో వేలుపెట్టకపోవడం, ఓ చిన్న దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇవ్వడం ఏమిటి… అని అప్పట్లో ఓ చిన్న ఆసక్తి… హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఆ సినిమాకు ప్రాణంగా నిలిచి… 4 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకు 40 కోట్లు వచ్చిపడ్డయ్… అందుకని ఆ దర్శకుడు కేవీ అనుదీప్ తదుపరి ప్రాజెక్టు మీద ఆసక్తి… తాజాగా విడుదలైన ఆ సినిమా పేరు […]
బీహారర్ రాజ్ సంకేతాలు మళ్లీ… అదే, పాత జంగ్లీరాజ్… దేశం నడుమ కొరివి…
లాలూప్రసాద్… రాజకీయాల్లో అసలు ఉండకూడని కేరక్టర్… కారణాలు తవ్వుతూ పోతే నాలుగైదు గ్రంథాలూ సరిపోవు… నితిశ్ అంతకుమించిన దరిద్రం… కుర్చీ కావాలి… అంతే, అటూఇటూ ఎటైనా జంప్ చేస్తాడు… అభివృద్ధి, ప్రణాళిక, పరిపాలన మన్నూమశానం అనే పదాలేవీ తను వినడు, వినిపించుకోడు, తనకు అక్కరలేదు… ఆ జంగిల్‌రాజ్ బీహార్‌కు ఒక్క మంచి లీడర్ వస్తే ఎంత బాగుండు..? ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్జేడీ చేరడంతో మళ్లీ పాత జంగిల్ రాజ్ జడలు విప్పుకుంటోంది… అదీ ఆందోళనకారకం… ఇంకొన్ని వివరాలు […]
చేతి చిటికెన వేళ్లు కలిపితే కళ్యాణమై… కాలి బొటన వేళ్లు కలిపితే నిర్యాణమై…
Bharadwaja Rangavajhala……….. భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు. దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే జాషువా గబ్బిలం రాస్తే, జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని జాలాది రాసేశారు గానీ… ఎవరి వల్లకాడు వారికే ఉంది. అగ్రవర్ణాలనే ఆదరించే చిత్ర సీమలోకి దళితుడుగా కాలుపెట్టి గౌరవం అందుకున్నాడు జాలాది. జాలాది పుట్టింది కృష్ణాజిల్లా దోసపాడు. తండ్రి […]
4 సినిమాలు… చదివి తీరాల్సిన పోలిక… కాంతార ఇంకేదో కథ చెబుతోంది…
కాంతారకు ఎందుకింత ప్రశంస..? అంధవిశ్వాసాలను పెంచి పోషించే సినిమాకు ఏమిటీ అభినందనలు..? ఇవీ వినిపించే ప్రశ్నలు… అవి పరిమిత, సంకుచిత జ్ఙానం వేసే ప్రశ్నలు… అయితే ప్రజలపై బలమైన ప్రభావం చూపించగల సినిమాను ఒకే చట్రంలో పరిశీలించడం మూర్ఖత్వం అవుతుంది… చూసే కోణం, విశ్లేషకుడి రాగద్వేషాలు, జ్ఙానపరిధి, విశ్లేషణ సామర్థ్యం వంటి ఎన్నో అంశాలుంటయ్… జస్ట్, ఊరకే కొట్టేస్తే ఎలా..? సింపుల్‌గా నాలుగు సినిమాల్ని పరిశీలిద్దాం… ఐఎండీబీలో టాప్ ర్యాంకు కాంతార… చాలా అరుదైన రికార్డు.,. గుడ్… […]
అన్‌స్టాపబుల్ షోపై చంద్రబాబు దెబ్బ… బభ్రాజమానం భజగోవిందం…
కొన్ని అలా చదువుకోవాలి… అంతే… బయటికి ప్రచారం వేరు, అసలు కథలు వేరు… సినిమాల వసూళ్ల లెక్కల్లాగే…! పిచ్చి అభిమానులు ఉంటారు కదా, వాళ్లు ప్రచారం చేసుకోవడానికి ఫేక్ కలెక్షన్లను లీక్ చేస్తుంటారు, లేదా రిలీజ్ చేస్తుంటారు… ఫ్యాన్స్ అంటేనే అరబుర్రలు కదా, ఓ ఓ అంటూ మొత్తుకుంటూ ఉంటారు… విషయం ఏమిటంటే… ఆహా అనే తెలుగు ఓటీటీలో బాలయ్య నిర్వహించే చాట్‌షో అన్‌స్టాపబుల్ సూపర్ హిట్ అనీ, 40 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్తో రికార్డులు బద్దలు […]
అమెరికాకు ఇంకా ముందుంది… తాజాగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌదీ అరేబియా…
పార్ధసారధి పోట్లూరి …………. సౌదీ అరేబియా అమెరికా, యూరోపుల నుండి దూరంగా జరుగుతున్నదా ? జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది ! అక్టోబర్ 2, 2022 న అమెరికాలో స్థిరపడ్డ సౌదీ జాతీయుడు అయిన సాద్ ఇబ్రాహీం అల్మాది [Saad Ibrahim Almadi] కి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా ! సాద్ ఇబ్రాహీం అల్మాది వయస్సు 72 ఏళ్లు. జైలు శిక్ష పూర్తయిన తరువాత మరో 16 ఏళ్ల […]
అడవి సమస్తం శిగమూగే అద్భుత కాంతార ఇది… లక్షల స్త్రీలు దేవతలవుతారు…
Kandukuri Ramesh Babu……… #కాంతారా #మేడారం #సామాన్యశాస్త్రం శిగమూగే దేవత…. ‘కాంతారా’ చిత్రం గురించిన అనేక సమీక్షలు చదువుతుంటే ‘మేడారం ఒక దేవత, కనువిప్పు’ పేరిట రాసిన వ్యాసం పంచుకోవాలనిపించింది…. విశ్వాసాల ఆధారంగా దైవత్వం ప్రధానంగా ఒక కళా రూపం నేపథ్యంలో ఆ సినిమా చిత్రించినట్లు చదువుతుంటే ఈ వ్యాసం పంచుకోవాలి అనిపించింది. అలాగే మన దగ్గర కథలను తీసుకుని దర్శకులు అద్భుతమైన సినిమాలు తీయడంలో ఎందుకు విఫలం చెందుతున్నరని కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం ఎందుకైనా పనికి […]
‘‘ఓ మంచి స్పిరిట్యుయల్ ఎక్స్‌పీరియెన్స్ పారితోషికంగా ముట్టింది…’’
హమ్మయ్య, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అనుకుంటూనే ఉన్నాను… బొడ్రాయి పండుగను, బతుకమ్మ పండుగను కూడా బీజేపీయే పుట్టించి, అగ్రవర్ణ మనువాద మతవాద వ్యాప్తికి, రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తోంది అనే డొల్ల బుర్రల్ని చూస్తున్నాం కదా… కశ్మీరీ ఫైల్స్లాగే కాంతార సినిమా కూడా ఇదే మనువాద ఎజెండాలో భాగంగా నిర్మింపజేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తోందని ఇంకా రచ్చ మొదలుపెట్టలేదేం అనకండి..? పెట్టేశారు… అటువైపే తీసుకెళ్తున్నారు… కర్ణాటక ఎన్నికల్లో లబ్ది దాకా వెళ్ళిపోయారు అప్పుడే… గాడ్ ఫాదర్లు, ఘోస్టులు, […]
అడ్డెడ్డె… బిగ్‌బాసోడు భలే చాన్స్ మిస్ చేశాడు… అలా చేస్తే ఓ రికార్డు దక్కేది…
ఆనందంగా ఉందిరా బిగ్‌బాస్… ఈసారి సీజన్ పరమ చెత్త అని నీఅంతట నువ్వే అంగీకరించడం బాగుంది… ఐనా అంగీకరించక చచ్చేదేముందిలే గానీ… ఛి, నా సెలక్షన్స్ పాడుగాను, ఛిఛీ, ఒక్కడికీ ఆట చేతకావడం లేదు, వీళ్లనేం చేయాలో అర్థం కావడం లేదు అని చేతులెత్తేసి, ఆత్మమథనంలో పడ్డావు చూడు, అది ఆనందంగా ఉంది… కానీ పిచ్చోడా… మంచి చాన్స్ మిస్ చేశావు… బిగ్‌బాస్ ప్రేక్షకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేశావు… ఏదో కెప్టెన్సీ టాస్క్ అన్నావు… ఈసారి […]
అదీ చంద్రబాబు అంటే… చేతికి ఏమాత్రం తడి అంటని రాజకీయం…
Murali Buddha……… అది 1999… ఎన్నికల సమయం… చంద్రబాబు నివాసంలో బీజేపీ పొత్తుపై పార్టీ ముఖ్యులతో సమావేశం జరుగుతోంది… పొత్తు ఉండాలా వద్దా అని అభిప్రాయ సేకరణ… (నిజానికి చంద్రబాబు ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకున్నాకే అభిప్రాయం అడిగే తంతు జరుపుతారు …. ముఖ్యమైన పరిణామం కావడంతో తెలుగు మీడియాతో పాటు పెద్ద ఎత్తున అక్కడ జాతీయ మీడియా తిష్ట ….) అప్పుడు బీజేపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీ పంపితేనే మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి వచ్చారు […]
కాంతార..! ఇదీ నిఖార్సైన టెక్నికల్ రివ్యూ..! ఇది రొటీన్ ఫార్ములా రివ్యూ కాదు…!!
కాంతార సినిమా రివ్యూ ఓ ఫార్ములాలో ఇమడదు… ప్రత్యేకించి రొటీన్ ఫార్మాట్లో ఏదో ఒకటి రాసేసే ప్రొఫెషనల్ (?) రివ్యూయర్లకు అస్సలు చేతకాలేదు… చాలామంది ఓ సగటు తెలుగు సినిమాను సమీక్షించినట్టే రాసి వాళ్లే సిగ్గుపడ్డారు… కొందరు అసలు ఏమీ రాయలేక, రాయకుండా గౌరవాన్ని పాటించారు… ఎస్, ఈ సినిమా రివ్యూ రాయాలంటే సినిమా సాంకేతికాంశాల మీద కూడా అవగాహన, సూక్ష్మ పరిశీలన… అన్నింటికీ మించి ఓ ఫీల్ అవసరం… అది లేకుండా వందల పేరాలు రాసినా […]
పవన్ తప్పేముంది ఫాఫం… ఏపీ పాలిటిక్సులో అందరూ సంస్కార పురుషులే కదా…
నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు… ఒకడిని మించి మరొకడు… వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలున్నారు… బూతులు తప్ప మరో భాష రాదు… పీకేదేమీ ఉండదు, ఆ భాషలో వాగడం తప్ప…! సాక్షాత్తూ నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు భోరుమని ఏడవడం ఏపీ బురద రాజకీయాల్లో ఓ మరుపురాని ఘట్టం… అంతకుముందు జగన్ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది… సో, ఎవరూ తక్కువ కాదు… […]
రోజాపై అసమ్మతి మంటలు… జగనే కదా పెట్రోల్ పోసి, చల్లారకుండా చూసేది…
వేలకువేల కేసులతో ఊరూరా తెలుగుదేశం కేడర్‌ను తొక్కుతూ, ఇదే నాకు మార్క్ రాజకీయం అంటున్న జగన్… అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనను చూసి వెనుకంజ వేస్తున్నాడా..? షూటింగుల నడుమ ఖాళీ వెతుక్కుని, ఇక్కడే కూర్చుంటా, తాట తీస్తా, తేల్చుకుని వెళ్తా అంటూ ఒక సినిమా నటుడు మాట్లాడుతుంటే, ఆ పార్టీని సరిగ్గా ‘టాకిల్’ చేయలేకపోతున్నాడా..? చివరకు లాఅండ్ఆర్డర్ సమస్యగా మారినా సరే, కదలిక లేదా..? పవన్ కల్యాణ్ మీద చేయిపడితే వెంటనే మోడీకి మస్తు […]
అందరికీ పాలన నీతులు చెప్పే బ్రిటన్ బల్లి… మళ్లీ కుడితె తొట్టెలో పడింది…
పార్ధసారధి పోట్లూరి ………. భారతీయులకి స్వాతంత్ర్యం ఇచ్చినా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు-విన్స్టన్ చర్చిల్ ! ఆర్ధిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ని సరిగా పాలించలేకపోతున్నది అంటూ ఇటీవలే ఇంగ్లాండ్ ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ ని రాజీనామా చేయమని వత్తిడి తెస్తున్న స్వంత పార్టీ సభ్యులు! 2016 లో యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటికి రావాలని [బ్రేక్జిట్] సమర్ధించిన తరువాత ఇప్పటి వరకు ముగ్గురు బ్రిటన్ ప్రధానులు మారారు ! ఇప్పుడు నెల రోజులు […]
మళ్లీ పొద్దుతిరుగుడు నూనె మంట… ఇండియన్ కిచెన్‌పై రష్యా డ్రోన్ల దాడి…
పార్ధసారధి పోట్లూరి ………. సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు మళ్ళీ ఆకాశానికి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ! అక్టోబర్, 17, 2022 సాయంత్రం ,ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మికొలైవ్ [Mykolaiv] దగ్గర ఉన్న పొద్దుతిరుగుడు నూనెని నిల్వ ఉంచిన పెద్ద టాంక్ మీద రష్యా దాడి చేసింది! ఈ పోర్ట్ సిటీ మికొలైవ్ నుండి విదేశాలకి సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఎగుమతి చేస్తుంది. దాని కోసం ఆయిల్ ని నిల్వ చేసి ఉంచడానికి పెద్ద […]
ఈ సెన్సేషన్ సరే, కానీ ఈ ‘కాంతార’కు ముందు..? అదే ఈ చదవదగిన కథ…!
17 రోజులుగా దేశమంతా కాంతార సినిమా మీద చర్చ సాగుతోంది… అదొక సంచలనం… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తాలూకు సమీక్షలు, కథా చర్చల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన జాతీయ అవార్డుల మీద కూడా వార్తలు కనిపిస్తున్నాయి… తెలుగు కీర్తి కెరటాలు విష్ణు బాబు సినిమా జిన్నా, అభిరామ్ సినిమా అహింస తదితరాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రిషబ్ శెట్టి అవార్డుల మీద ఏం జోస్యాలు చెప్పగలం..? 16 కోట్లు పెట్టి […]
- « Previous Page
- 1
- …
- 306
- 307
- 308
- 309
- 310
- …
- 482
- Next Page »