మొన్నామధ్య అనురాగ్ కశ్యప్ అనబడే ఓ వెకిలి దర్శకుడు హీరోయిన్ తాప్సి స్తనాలపై చేసిన వెగటు వ్యాఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ కశ్యపుడి కథేమిటా అని చెక్ చేస్తుంటే… మరో ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఒక్క కశ్యప్ మాత్రమే కాదు… తనతోపాటు రాజ్‌బబ్బర్, ఆయన భార్య నదిర, విశాల్ భరధ్వాజ్, నవాజుద్దీన్ సిద్దిఖి ఎట్సెట్రా 172 మంది బాలీవుడ్ పర్సనాలిటీలు ప్లస్ కొందరు ఇతరులు నెలనెలా 50 వేల పెన్షన్లు పొందారట… షాకింగ్‌గా ఉందా..? అంతేమరి… […]
బొడ్డు తాత రాఘవేంద్రరావు ఇజ్జత్ తీసేసిన ‘పండుగాడ్’…!!
తెలుగు దిగ్దర్శకుడిగా పేరొంది, ఒకప్పటి స్టార్ హీరోలందరికీ సూపర్, బంపర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు ప్రస్తుత ఆలోచన సరళి, వెళ్తున్న బాట తన మీద జాలేసేలా ఉంటోంది… ఎనభయ్యేళ్ల వయస్సులో తను ఎంత ఆదర్శంగా ఉండాలి ఈ తరానికి..? ఫాఫం… కొందరు అంతే… వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా చూస్తుంటే రాఘవేంద్రరావు మీద జాలివేయడం మినహా ఇంకేమీ ఫీలింగ్ కలగదు… జస్ట్, జాలి, సానుభూతి… ఈరోజుకూ రాఘవేంద్రరావు అనగానే జనం బొడ్డు-పండు అని వ్యాఖ్యానిస్తుంటే దాన్ని గొప్పతనంగా […]
ఫాఫం ఆది సాయికుమార్… ఓ శాపగ్రస్తుడు… తీస్మార్ఖాన్ తన తప్పిదమే…
ఇది ఖచ్చితంగా ఆది తప్పే… ఆది అంటే పినిశెట్టి ఆది కాదు… సాయికుమార్ కొడుకు ఆది… పుడిపెద్ది ఆది… పీజే శర్మ మనమడు… నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తనకు బాబాయ్… మంచి నటనకు, మంచి వాయిస్ ఓవర్‌కు పెట్టింది పేరైన ఆ కుటుంబంలో ఆది ఓ హిట్ కోసం తన్నుకుంటున్నాడు పదకొండేళ్లుగా… తను ఏదో తక్కువ చేస్తాడని కాదు… తన మ్యాగ్జిమం ఇస్తాడు… కానీ ఓ శాపగ్రస్తుడు… తీసిన సినిమాలన్నీ ఫట్… మరీ కొన్నాళ్లుగా ఇంకా […]
ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే… ఓ మరుపురాని ఫోటో… ఆ సందర్భమేంటంటే…
ఒక్క ఫోటో వంద పదాలకు సరిసమానమంటుంటారు.. కొన్ని ఫోటోలైతే అలా పదాల సంఖ్యతో కూడా పోల్చలేని స్థాయిలో అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తాయి… ఇక మరికొన్నైతే అంతే ఆవేదనకూ నిలువెత్తు నిర్వచనమైతాయి. కథలు కాలగర్భంలో కలిసిపోయినా… చరిత్రను మన ముందుంచే ఫోటో అది! ఆ కథే ఇది!! అది 1945.. రెండో ప్రపంచ యుద్ధం. జపాన్ లోని హిరోషీమా- నాగసాకిపై కురిసిన బాంబుల వర్షానికి ఆ నగరాలు ఇప్పటికీ కోలుకోలేకుండా పోయి… ఓ చేదు చరిత్రను మిగిల్చిన యుద్ధభూమికి […]
బీజేపీలో పనిలేదు సరే… వెళ్లిపోదామంటే వేరే పార్టీ ఏం మిగిలింది..?!
నిజమే… ఆమెకు పనిచెప్పడం లేదు, ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ ఇవ్వడం లేదు… ఆమెను ముఖ్య సమావేశాలకు పిలవడం లేదు… ఆమెను అసలు పార్టీ నాయకురాలిగానే చూడటం లేదు… ఆమెకు తగిన గౌరవం లేదు… ఎస్, విజయశాంతికి తను బీజేపీలోనే ఉన్నానా అనే డౌట్ రోజుకు వేయిసార్లు వస్తూ ఉండవచ్చు బహుశా… అన్నీ నిజాలే… నాణేనికి ఒక కోణం ఆలోచిద్దాం… అది బీజేపీ… ఎవరూ పిలిచి పీటలేసి, కిరీటాలు పెట్టరు… చొరవ తీసుకోవాలి… పైగా ఆమె […]
తెలుగు పత్రికల్లో ఏది పెరుగు..? ఏది మజ్జిగ..? మీరే తేల్చండి..!
తెలుగు టీవీలను కాసేపు వదిలేద్దాం… మరోసారి చెప్పుకుందాం… ట్యాంపరింగుకు అతీతం కాకపోయినా వాటి మంచీచెడూ కొలవడానికి బార్క్ రేటింగ్స్ వస్తుంటయ్ వారంవారం… మరి పత్రికలు, వాటికి అనుబంధంగా ఉండే వెబ్సైట్లు… వాటి పరిస్థితేమిటి..? అసలు పాఠకుడు దేన్ని విశ్వసిస్తున్నాడు..? దేన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు..? ఏది విశ్వసనీయ పత్రిక..? పోనీ, ఏ వెబ్‌సైట్‌ను పాఠకుడు ఆదరిస్తున్నాడు..? ఎందుకు..? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలే… గతంలో ఏబీసీ అనే సిస్టం ఉండేది… ఏ పత్రిక ఎన్ని కాపీలు అమ్ముతున్నదో ఆడిట్ చేసి, […]
డాక్టర్ దిల్‌రాజు వైద్యం… తెలుగు సినిమా రోగం వేరు, చికిత్స వేరు…
ఫాఫం తెలుగు సినిమా నిర్మాతలు…! ఇండస్ట్రీ అసలు సమస్య ఏమిటో వాళ్లకు అర్థం కావడం లేదా..? కానట్టు నటిస్తున్నారా..? ఎగ్జిబిటర్ల మాఫియాకు భయపడుతున్నారా..? ఇంకా ఇంకా ఊబిలోకి కూరుకుపోతున్నారా..? వేల కోట్ల టర్నోవర్‌కు రిస్క్ తీసుకుంటున్న పెద్ద పెద్ద నిర్మాతలతోపాటు చిన్న చిన్న బడ్జెట్లతో అదృష్టాల్ని పరీక్షించుకునే చిన్న నిర్మాతలూ ఉన్నారు… వాళ్లలో ఇక మాట్లాడేవాళ్లు, నిర్ణయాలు తీసుకోగల పరిణతి ఉన్నవాళ్లు ఎవరూ లేరా..? నిర్మాతలకూ దిల్ రాజే ప్రతినిధి… ఎగ్జిబిటర్లకూ దిల్ రాజే ప్రతినిధి… ఏ […]
చైనా మీద ఇండియా స్మార్ట్ వార్… ఆ చౌక ఫోన్లు నిషేధిస్తే జింతాక జితా…
ఆర్టికల్ :: పార్ధసారధి పోట్లూరి ….. చైనా మొబైల్ దిగ్గజం జియోమీ [Xiaomi] కష్టాలలో పడ్డది ! చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందా ? అవును కష్టాలలో ఉంది అని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనాతో సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ్మకాలు [స్మార్ట్ ఫోన్లు ] 14.7% పడిపోయాయి. ఇది వరుసగా గత 5 త్రైమాసిక అమ్మకాలతో […]
ఫాఫం నిత్యామేనన్… ఫాఫం ప్రకాష్‌రాజ్… ప్రేక్షకుడికి ‘తిరు’నామాలు…
అప్పుడెప్పుడో నువ్వేకావాలి అనే సినిమా వచ్చింది ఉషాకిరణ్ మూవీస్… ఎదురెదురు ఇళ్లలో ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… కలిసి చదువుకుంటారు… అల్లరి సరేసరి… దాపరికాల్లేవు… తమ నడుమ ఉన్నది ఉత్త స్నేహం కాదనీ, అది ప్రేమేనని తెలిసి ఒక్కటయ్యే కథే సినిమా… పాటలు బాగుంటయ్, కథనం సరదాగా సాగుతుంది… తరుణ్, రిచాల జంట బాగుంటుంది… వెరసి సినిమా అప్పట్లో సూపర్ హిట్… సీన్ కట్ చేయండి… తిరు అనే సినిమా ఒకటి రిలీజైంది… ధనుష్ హీరో, నిత్యా […]
జబర్దస్త్ తరహా బూతు టెండెన్సీలో బాలీవుడ్ పెద్ద మొహాలు..!!
నిజానికి తాప్సీ పన్ను మెంటాలిటీకి ఆ వెకిలి, కంపు వ్యాఖ్య విన్న వెంటనే పరుషంగా రియాక్టయి ఉండాలి… కాఫీ విత్ కరణ్ షోకు ఎందుకు పోలేదు అనే ప్రశ్నకు, నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు కాబట్టి పోలేదు అంటూ ఖతర్నాక్ రిటార్ట్, సెటైర్ వేసిన తీరు గుర్తుంది కదా… అంతేకాదు, మా చిన్న బడ్జెట్లో మేమే సొంతంగా ఓ షో ప్లాన్ చేస్తున్నాం, కటింగ్ విత్ కశ్యప్ తర్రా విత్ తాప్సీ పేర్లు ఆలోచిస్తున్నాం […]
ఈ పిరికి పెద్దన్నతో ఒరిగేదేంటి..? తమిళ కమలానికి ఫాయిదా ఏంటి..?
మోడీ, అమిత్ షా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ బీజేపీ పార్టీ, కాషాయ విభాగాలు, పలు రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు… వచ్చే ఎన్నికల నాటికి మరింతగా ఆ ఇద్దరి పట్టు పెరగొచ్చు కూడా..! కానీ వాళ్లకు ఏమాత్రం మింగుడుపడని రాష్ట్రాలు ప్రధానంగా రెండు… 1) ఏపీ 2) తమిళనాడు… ఈ రెండు రాష్ట్రాల రాజకీయాల సరళి వాళ్లకు అంతుపట్టడం లేదు… కాస్త డొక్కశుద్ధి, నాయకత్వ లక్షణాలున్న ఒక్క నాయకుడు లేడు… ఏపీని కాసేపు వదిలేయండి, ఆ రాజకీయాలంటేనే బూతులు, […]
లాల్‌సింగ్ దెబ్బ చిన్నది కాదు… అమీర్‌ఖాన్‌కు అసలు నష్టం వేరే…
రివ్యూయర్ :: పార్ధసారధి పోట్లూరి ……… అదన్న మాట సంగతి ! ఈ చిరంజీవికి ఏమయింది ? భారత దేశంలోనే అమీర్ ఖాన్ లాంటి నటుడు లేడు అంటూ పొగిడాడు హైదరాబాద్ లో, లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో… గతంలో కూడా ఉప్పెన సినిమా ప్రమోషన్ లో విజయ్ సేతుపతిని తెగ పొగిడేశాడు చిరంజీవి. సరే, ఉప్పెన అంటే స్వంత ఫామిలీ మెంబర్ హీరో కాబట్టి తెగ పొగిడేశాడు అనుకుందాం ! కానీ […]
సౌతిండియా హవాకు విరుగుడు మసాలాయేనట… ఏక్తాకపూర్ ‘డర్టీ ప్లాన్’…
ఏక్తాకపూర్ డర్టీపిక్చర్ సీక్వెల్ ప్లాన్ చేస్తోందని వార్త… కొన్ని ఆలోచనలు ముసురుకునేలా చేసింది… సదరు వార్తలో ఆకర్షించిన పాయింట్స్ ఏమిటంటే… సీక్వెల్ ప్లాన్స్ తెలియగానే కృతిసనన్, తాప్సీ పన్ను అర్జెంటుగా, విడివిడిగా ఏక్తాను కలిశారట… చాన్స్ మాకే కావాలని అడిగారట… ముందైతే కథ రెడీ కానివ్వండి, తరువాత చూద్దాం అని ఆమె అభయహస్తం చూపించిందట… నిజానికి మళ్లీ విద్యాబాలనే బెటర్ అనుకున్నారట గానీ, ఆమె కాస్త ఎక్కువ బరువు పెరిగి, డర్టీ మసాలాకు పనికిరాదేమో అనుకుని, కంగనా […]
నో.. నో.. ఝన్‌ఝన్‌వాలా సక్సెస్ స్టోరీ కాదు… ఓ ఫెయిల్యూర్ స్టోరీ…
హబ్బ… ఏం సక్సెస్ స్టోరీ..? జస్ట్, చేతిలో అయిదారు వేల రూపాయలతో మొదలుపెట్టి, స్టాక్ ఎక్స్ఛేంజీలతో, స్టాక్ మార్కెట్లతో ఆడుకున్నాడు… 40 వేల కోట్లు సంపాదించాడు… ఇది కదా సక్సెస్ అంటే… ఇది కదా లైఫ్ అంటే… ఇది కదా థ్రిల్ అంటే… ఇలా మీడియా, సోషల్ మీడియా మస్తు రాసేశాయి రాకేష్ ఝన్‌ఝన్‌వాలా గురించి… తను సంపాదించిన డబ్బును మాత్రమే చూశారు, కానీ ఎందుకు తను కేవలం 62 ఏళ్లకే చనిపోయాడో మాత్రం పట్టించుకోలేదు… ప్రస్తుత […]
రెండు ‘అనుపమ’ ఫ్యాక్టర్స్… కార్తికేయుడికి భలే కలిసొచ్చినయ్…
నిజానికి చిన్న సినిమా… పాన్ ఇండియా సీన్ ఊహించలేం… హీరో నిఖిల్ రేంజ్ కూడా సెకండ్, థర్డ్ లేయర్… స్టారిజం ఇంకా తలకెక్కలేదు… కానీ హిందీలో కలకలం క్రియేట్ చేస్తోంది… ఎందుకంటే..? అమీర్‌ఖాన్ వంటి సూపర్‌స్టార్ చతికిలపడ్డాడు… అక్షయ్‌కుమార్ బోల్తాకొట్టాడు… వాళ్లను దాటేసి, ఒకవైపు వందలాదిగా వాళ్ల సినిమా షోలను ఎత్తిపారేస్తూ, కార్తికేయ సినిమా షోల సంఖ్య పెంచుతున్నారు… ఇంకా పెరుగుతోంది… ఎందుకిలా..? ఈ సినిమాను తొక్కడానికి దిల్‌రాజు ప్రయత్నించాడు, తను తెలుగు ఇండస్ట్రీకి మంకీపాక్స్ వైరస్ […]
జగమెరిగిన యాంకరిణివి… నీకెందుకమ్మా ఆ ఈటీవీ బూతు భాష..?!
ఫాఫం, అదసలే టీవీ ఇండస్ట్రీ… అందులోనూ బూతు అంటే పిచ్చిపిచ్చిగా పడిచచ్చే ఈటీవీ… రేటింగ్స్ కావాలి… అవి ఉంటేనే యాడ్స్… అంటే డబ్బులు… ఇంకా ఫాఫం… ఈటీవీ అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటోంది… దాని బలమే గతంలో నాన్-ఫిక్షన్… సీరియళ్లు ఎవడూ చూడడు… దాన్ని నిలబెట్టేదే ఈటీవీ న్యూస్ బులెటిన్… ప్రపంచంలో బహుశా ఈటీవీ ఒక్కటే కావచ్చు న్యూస్‌తో నిలబడిన వినోద చానెల్… ఆ నాన్-ఫిక్షన్ కూడా ఎలా దెబ్బతినిపోయిందో మనం గతంలో చెప్పుకున్నాం… ఎడాపెడా సినిమా […]
సారీ, దానవీరశూరకర్ణ నేను రాయలేను… ఓ ఉద్దండుని పరిచయం చేస్తాను…
Bharadwaja Rangavajhala………… ‘‘కులము… కులము …. కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది. ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది. నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. వీడు నీ వరాల తండ్రి కాదు. తెలిసీ తెలియని పడుచుతనపు ఉన్మాదంలో దూర్వాసదత్తమైన మంత్ర శక్తిని […]
భేష్ ప్రశాంత్ నీల్… తెలుగు మూలాలతో బంధాలన్నీ అలాగే పదిలం…
ప్రశాంత్ నీల్… తను దర్శకత్వం వహించిన కేజీఎప్-2 ఎంతటి సంచలనమో తెలిసిందే కదా… 100 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసింది… శాండల్‌వుడ్ నుంచి ఈ రేంజ్ చిత్రం గతంలో ఎప్పుడూ లేదు… ఇంతకీ ఎవరు ఈ ప్రశాంత్ నీల్..? అంతకుముందు ఎవరికీ తెలియదు పెద్దగా, కేజీఎఫ్-2 తరువాత తెలిసింది అందరికీ… ఆయన ఎవరో కాదు, మన తెలుగువాడే అని… మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్న సుభాష్‌రెడ్డి కొడుకే ప్రశాంత్… […]
నాటి లాలూ మార్క్ గూండారాజ్ మళ్లీ ప్రత్యక్షమైనట్టేనా..? వ్యాపారుల్లో దడ..!!
నాలుగైదు రోజులు అయ్యిందేమో… కుర్చీ మీద ప్రేమతో నితిశ్ కుమార్ మళ్లీ క్యాంపు మార్చి, మళ్లీ ఆర్జేడీ పంచన చేరి, మళ్లీ చేతులు కలిపి, ఆర్జేడీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి, తన ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకుని, ఊపిరి పీల్చుకున్నాడు… ఒకప్పుడు సుశాసన్‌బాబు అనిపించుకున్న ఈ పెద్దమనిషి పదిహేడేళ్ల పాలనలో, ఎనిమిదిసార్లు సీఎం… ఐనా ఈరోజుకూ అది బీమారు రాష్ట్రమే… మానవాభివృద్ది, జీవననాణ్యత సూచికల్లో సోమాలియాతో పోటీయే… ఈ దిక్కుమాలిన పాలనలో బీజేపీ పాత్ర కూడా ఉందండోయ్… దానికీ […]
ఆ ఊరిలో రాయికి కూడా వర్గ స్పృహ ఉంటది… వెళ్లి బెంట్లీ కారుమీద పడ్డది…
Gurram Seetaramulu………. అనగనగా ఒక తెల్దారుపల్లి . వీరోచిత వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన నేల అది. తమ్మినేని సుబ్బయ్య గారు అని గొప్ప ప్రజానాయకుడు ఉండేవాడు. దళాలకు బువ్వ పెట్టి ఆదుకున్నాడు. మా పక్క ఊరే. ఆ ఊరికి ఒకనాడు ఒక ప్రజా కంటక తురక జమీందారు ఉండేవాడు. రాబందులా ఎండిన డొంకలు, డొక్కల మీద ఎగబడ్డ ఆ జమీందారుని సాయుధ పోరాట కాలంలో తరిమేసారు ……. అని పుస్తకాలలో చదువుకున్నాము. అప్పటి ఆ […]
- « Previous Page
- 1
- …
- 307
- 308
- 309
- 310
- 311
- …
- 466
- Next Page »