. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన… ఎవరైనా సరే తమ పాత క్రెడిబులిటీని, మంచి పేరును పణంగా పెట్టాలా..? బీఆర్ఎస్లో చేరగానే కేసీయార్ పాలనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనా..? తనే చేసిన పాత ఆరోపణల్ని డిలిట్ కొట్టేయాలా..? ఫోన్ ట్యాపింగు కేసుకు సంబంధించి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చూస్తే విస్మయం కలిగింది… కేసీయార్ పట్ల ‘బారా ఖూన్ మాఫ్’ అనే ధోరణిని తీసుకోవడమే ఈ ఆశ్చర్యానికి కారణం… అంతేకాదు, ఓ పోలీస్ అధికారి బీఆర్ఎస్లో […]
70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
. సౌత్‌లో విజయవంతమైన సినిమాల్ని హిందీలోకి… హిందీ సక్సెస్ఫుల్ సినిమాల్ని సౌత్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే… కాకపోతే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేసారి డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేసేసి, పాన్ ఇండియా ముద్ర వేసేసి, మార్కెటింగ్ చేసేస్తున్నారు… కానీ మన తెలుగు సినిమాయే… 70 ఏళ్ల క్రితమే ఓ జబర్దస్త్ పాన్ ఇండియా మూవీ వచ్చింది… సేమ్, ఒకేసారి దేశమంతా రిలీజ్ చేశారు… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసిన […]
బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
. Subramanyam Dogiparthi ……….. మల్లాది వారు పెద్దలకు మాత్రమే అనే టైటిల్‌ని తన నవలకు కరెక్టుగానే పెట్టుకున్నారు . ఇది A సర్టిఫికెట్ నవలే . నాన్ వెజిటేరియన్ కధాంశం . దాని ఆధారంగానే జంధ్యాల తన హాస్య రసాన్ని జోడించి వెజిటేరియన్ సినిమాను చేసి U సర్టిఫికెట్ పొందారు . బూతుకూ హాస్యానికీ నడుమ… అశ్లీలానికీ ఆహ్లాదానికీ నడుమ గీతను జంధ్యాల గౌరవించారు . ప్రేక్షకులు కూడా కామెడీగానే తీసుకున్నారు . ఇలా విశృంఖల […]
కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
. చదువుల గొడ్ల చావిళ్ళలో మోతుబరి అయ్యవార్లు మార్కుల కోసం దుర్మార్గమయిన హింస పెడుతున్నారని; ఎంత చదివినా బాగా మార్కులు రాలేదని; మార్కులు బాగా వచ్చినా సరైన ర్యాంక్ రాలేదని; మంచి ర్యాంకే వచ్చినా కోరుకున్న చోట సీటు రాలేదని ఇలా అనేకానేక కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన కొంగొత్త విషయాలు దిక్కులేనివి అవుతున్నాయి. వారు బతికి ఉండి తుళ్లుతూ… గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం […]
ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
. అతడు సినిమా అనుకున్నంత రేంజులో లాభాలు ఇవ్వలేకపోయిందనీ, కానీ టీవీల్లో మాత్రం బంపర్ హిట్ అనీ, ఇప్పుడు 4కే, 6 కే రిజల్యూషన్‌తో రీరిలీజ్ చేస్తున్నాం, ప్రేక్షకులు ఆదరిస్తారనీ మురళీమోహన్ ఈమధ్య ఎక్కడో చెప్పినట్టు గుర్తు… నిజమే… సినిమా బాగుంటుంది… ఖలేజా, అతడు సినిమాల్లో ఏది ఎక్కువసార్లు టీవీల్లో వేశారో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి షో’లో అమితాబ్ అడిగాడో లేదో గుర్తులేదు గానీ… మహేశ్ బాబును ఎప్పుడూ ఇంట్లో కట్టేసుకున్నట్టే కనిపిస్తుంటాడు ఎప్పుడూ… ఇక ఆగస్టు […]
సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…
. సంతానభాగ్యం…! గొడ్రాలు…! మాతృత్వం కోసం ఆశ, ఓ తపస్సు… గొడ్రాలు అనే ఆ పదం వినిపించకుండా ఉండటం కోసం… పిల్లల్లేనివాళ్లు ఎన్నెన్నో మార్గాలు వెతుకుతారు… ఎవరేం చెప్పినా వింటారు… ఆచరిస్తారు… ఆశ, ఆశ, ఆశ… అదే చాలామందికి సంపాదన మార్గం… ఇప్పుడు ఓ డాక్టరమ్మ సరోగసీ అని నమ్మించి, 35 లక్షలు మింగి, చివరకు 90 వేలకు కొన్న ఓ శిశువును చేతులో పెట్టిన ‘సృష్టి’ మోసం గురించి చదువుతున్నాం కదా… అలాంటివి బోలెడు… ఇప్పుడిది […]
ఓహ్… స్టార్లను తీసుకోకపోవడానికి అదా కారణం..? బాగు బాగు..!!
. మొదటి రోజు, శుక్రవారం, జస్ట్ 1.35 కోట్లు… మరుసటి రోజుకు 150 శాతం జప్, 3.25 కోట్లు… ఆదివారం మరో 110 శాతం జంప్, 6.50 నుంచి 7 కోట్లు… 3 రోజుల్లో 11.5 కోట్లు… అంటే 3 రోజుల్లో దాదాపు 400 శాతం జంప్… మరో కలెక్షన్ల సైట్ లెక్కప్రకారం 4 రోజుల్లో 22 కోట్లు… ఒక్క ఆదివారంనాడే 11.5 కోట్లు వచ్చాయని సినిమా టీం చెబుతోంది… ఇందులో హిందీ 15 కోట్లు… తెలుగులో […]
ఫుడ్ లవర్స్ జంట… నవ్వుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ…
. ఒక టైమ్ వస్తుంది… జాతకం మళ్లీ వెలుగుతుంది… నిత్యా మేనన్ కథా ఇలాంటిదే… లావైపోయి, వచ్చిన పాత్రల్ని తిరస్కరిస్తూ… మంచి నటసామర్థ్యం ఉండీ, కెరీర్లో నష్టపోయిన ఆమెకు ఇప్పుడు ఓ మంచి హిట్ దక్కింది… విజయ్ సేతుపతితో కలిసి నటించిన సార్ మేడమ్ (తమిళంలో తలైవాన్ తలైవి) మంచి వసూళ్లు సాధిస్తోంది తమిళంలో… 34 కోట్లు నాలుగు రోజుల్లో… శాటర్ డే, సండే వసూళ్లు 17 కోట్లు… నిజానికి ఇది చిన్న చిత్రమే… ఐతేనేం, తమిళులకు […]
కుక్కలే కదా కూస్తే కుదరదు… డాగ్స్ కేర్టేకర్లకు వేల కోట్ల ఉపాధి..!!
. కుక్కలను నడిపిస్తూ నెలకు 5 లక్షల సంపాదన …. ఏమిటీ నమ్మడం లేదా..? “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి […]
దుల్కర్ కొత్త మూవీ ‘కాంత’..! తమిళ తొలి సూపర్ స్టార్ బయోపిక్..!!
. ఒక మోహన్ లాల్, ఒక మమ్ముట్టి… సూపర్ స్టార్లు అయినా సరే, అంతులేని సంపదను, కీర్తి ప్రతిష్టలను సంపాదించినా సరే… ఈ వయస్సులోనూ ప్రయోగాలకు రెడీ అంటారు… తమలోని నటులకు ఇప్పటికీ పరీక్షలు పెట్టుకుంటారు… అది స్పిరిట్… మన వెటరన్ హీరోలు..? వద్దులెండి, ఆ పోలికే వేస్ట్… నో టేస్ట్… తమలోని నటుల్ని చంపుకున్న హీరోలు… మలయాళంలో యంగ్ హీరోలు కూడా ప్రయోగాలకు రెడీ అంటారు… భిన్నమైన కథాంశాలకు వోకే చెబుతారు… మనసు పెట్టి పనిచేస్తారు… […]
తెలంగాణ రాజకీయాలు కదా… ఎవరికైనా, ఏ పోకడకైనా ఇది ఇష్టా‘రాజ్యం’…
. తెలంగాణ పాలిటిక్స్… ఎవరికైనా సరే, టేకిట్ ఫర్ గ్రాంటెడ్… తెలంగాణ సమాజం అంటే పోరాటం, ధిక్కారం, చైతన్యం అని అన్నీ చెప్పుకుంటాం… కానీ నాయకుల ఇష్టా‘రాజ్యం’ ఇది… అన్నతో ఆస్తుల కొట్లాట పెట్టుకుని, ఏదో పార్టీ పెట్టి, నేను ఉద్దరిస్తా అని పాదయాత్ర చేసింది షర్మిల చెల్లె… తిరిగీ తిరిగీ, మళ్లీ అదే ఏపీకి వెళ్లి, ఏ అన్నను జైలుపాలు చేసిందో అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయ్యింది… ఐరనీ… ఇంకా అక్కడ రాజన్నరాజ్యం రావల్సి […]
భారీ నెగెటివిటీ మోస్తున్న అనసూయ… మళ్లీ ట్రోలింగ్ షురూ…
. నటి అనసూయ మళ్లీ వార్తల్లోకి వచ్చింది… మళ్లీ ట్రోలింగు షురూ… సైలెంటుగా ఉండటం అనేది ఆమెకు నచ్చదు… ఏదో ఇక ఇష్యూతో చర్చల్లో ఉండాల్సిందే… గోక్కుని మరీ లైవ్ డిస్కషన్స్‌లో ఉండటం అలవాాటై పోయినట్టుంది… రీసెంటుగా ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదు… 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను బ్లాక్ చేశాను… నెగెటివ్ కామెంట్స్ భరించను, సమాధానం ఇస్తాను, కొంతమందిని భరించలేక బ్లాక్ చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చింది… బహుశా ఈ రేంజులో ఫాలోవర్స్‌ను […]
రక్షించలేని ఆ అసమర్థ మొగుడికన్నా ఆ కామాంధుడే నయం.,.!!
. Subramanyam Dogiparthi ……… సుహాసిని నట జీవితంలో అద్భుతంగా నటించిన మరో సినిమా ఈ శిక్ష సినిమా . At her best . ఈ సినిమాకు కూడా ఆవిడే షీరో . చాలా విప్లవాత్మక ముగింపు . బహుశా ఆ ముగింపు ప్రేక్షకులకు మింగుడు పడి ఉండకపోవచ్చు . మింగుడు పడటం కష్టమే . గోదావరి ఒడ్డున ఓ చిన్న గ్రామంలో ఓ కీచక , దుశ్శాసన వారసుడు కిరీటం లేని మృగాడుగా భాసిల్లుతూ ఉంటాడు […]
మిస్టర్ కరణ్ థాపర్… మరి ఆ ఉగ్ర బాధితులకు న్యాయం మాటేమిటి..?!
. ప్రసిద్ధ జర్నలిస్టులు అనిపించుకుంటున్న వాళ్ల ఆలోచనలు, రాతలు కూడా కొన్నిసార్లు విభ్రమను కలిగిస్తాయి… కరణ్ థాపర్ రాసే వ్యాసాలు కూడా కొన్నిసార్లు తేడా అనిపిస్తాయి… సాక్షిలో ఓ గెస్ట్ కాలమ్ ఇలాంటి ఆశ్చర్యాన్నే కలిగించింది… అప్పట్లో ముంబై రైలు పేలుళ్లు తెలుసు కదా… ఉగ్రవాద చర్య… అనేక మంది మరణించారు, గాయపడ్డారు, జీవచ్ఛవాలు అయ్యారు… ఆ బాధితుల మీద కించిత్ సానుభూతి లేదు గానీ… ఆ కేసులో నిందితుల మీద మాత్రం ఎనలేని సానుభూతిని ప్రదర్శించడమే […]
అమ్మాయి కనిపించగానే అలా పొట్ట లోపలికి లాగి, ఊపిరి బిగబట్టి…
. Director Devi Prasad.C… ఓసారి ఒకాయన ఓ ప్రముఖ హిందీ హీరోయిన్ని ఓ ప్రముఖ వ్యక్తికి పరిచయం చేయటానికి తీసుకొచ్చారు. కొంచెం ఎక్కువ పొట్టతోనే దిట్టంగావుండే మధ్యవయసు దాటిన ఆ ప్రముఖ వ్యక్తి ఆమెని చూసీచూడగానే ఠక్కున తన పొట్టని లోపలికి లాగేసి, ఊపిరి బిగబట్టి మరీ నవ్వుతూ మాట్లాడటం నా కంటపడింది. ఆమె అక్కడున్న పదిహేను నిమిషాలూ ఆయన అలాగే ఊపిరి బిగపట్టే వున్నారు. ఆమె వెళ్ళగానే ఒక్కసారిగా పొట్టని వొదిలేసి రిలాక్స్ అయ్యారు. అప్పుడే […]
రేయ్, ఎవుర్రా మీరంతా..? ఇవేం బూతులు, డర్టీ పెడపోకడలు..?!
. విజయ్ దేవరకొండా…. రౌడీ స్టార్ అనో రౌడీ హీరో అని పిలిపించుకోవాలంటే… మరీ డర్టీ కూతలు అక్కర్లేదు… వేల మంది పాల్గొన్న బహిరంగ వేదిక మీద… లక్షల మంది చూసే పబ్లిక్ ఫంక్షన్లో… ఆ కూతలేమిటి..? మాటల్లో కాస్త సంస్కారం కనిపించాలి కదా…! అసలు ఆ డర్టీ పదాలకు అర్థం తెలుసా..? పైగా మీరు హీరోలు… సమాజానికి పద్దతులు నేర్పిస్తారు… నీతులు చెబుతారు… ఈమధ్య సినిమా సెలబ్రిటీలు వేదికల మీదకు రాగానే నానా పిచ్చి కూతలకు […]
ఆహా… అదే ప్లేసులో గనుక కోహ్లీ ఉండి ఉంటే… కథ రక్తికట్టేది…!!
. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు అస్సలు క్రీడాస్పూర్తి లేదు, బాజ్ బాల్ కాదు, బాడీ బాల్, స్లెడ్జింగ్, కుళ్లుబోతుతనం, కోతి బుద్ది అని చాలా చెప్పుకున్నాం కదా… ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ మనస్సులో మెదులుతున్న ఓ ప్రశ్న… ఈ టైమ్‌లో కోహ్లీ గనుక కెప్టెన్‌గా ఉండి ఉంటే..? భలే ఉండేది కదా..? మన కెప్టెన్ శుభమన్ గిల్ జూనియర్ అయిపోయాడు… జడేజా స్టోక్స్ వ్యాఖ్యలకు ఏవో కౌంటర్లు ఇచ్చాడు గానీ అవి సరిపోలేదు… స్టోక్స్‌ను కోహ్లీ […]
ప్రివెడ్ షూట్స్… ఈ దిక్కుమాలిన తంతును అర్జెంటుగా బహిష్కరిద్దాం…
. పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు నిర్వహించేవారు. కలమే గొప్పదని నిరూపించడానికి పిల్లలు నానా అగచాట్లు పడేవారు. పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించేది పురోహితుడు. మాంగళ్యధారణకు శుభలగ్నం నిశ్చయించేది పురోహితుడు. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది పురోహితుడు. అగ్నిసాక్షిగా తాళి కట్టించేది పురోహితుడు. తలంబ్రాలు […]
కుట్ర సిద్ధాంతాలు… వింత వ్యాఖ్యానాలు… అప్పట్లో KCR… ఇప్పుడు KTR…
. కాళేశ్వరం, మేడిగడ్డ పదాల్ని తమ ప్రసంగాల్లో పదే పదే ప్రస్తావించడం… అర్థరహిత, అనుచిత వ్యాఖ్యలకు దిగడం వల్ల తమకే నష్టం అనే సోయి కోల్పోతున్నారు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎందుకో మరి..! చేజేతులా జనంలో తామే మేడిగడ్డ కుంగుబాటు చర్చను లైవ్‌లో ఉంచుతున్నారు… అది రాజకీయంగా కూడా తమకే నష్టం అనే నిజాన్ని గుర్తించడం లేదు… నేడోరేపో కాళేశ్వరం కమిషన్ తన నివేదికను సమర్పించబోతోంది కూడా… ఈ సమయంలోనే కాదు… విపత్తులో, ప్రమాదాలో సంభవించినప్పుడు మాటల్లో సంయమనం […]
భేష్ సుహాసినీ..! మనసుల్ని చెమ్మగిల్లజేసే ఓ అనురాగ స్రవంతి…!!
. Subramanyam Dogiparthi …… జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారాన్ని పొందిన గుండెల్ని పిండేసే ఆర్ద్రతా పూర్వక సినిమా ఈ స్రవంతి … మరో ఆమె కధ . మరో అంతులేని కధ . క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సినిమాలలో స్వాతి , ఈ స్రవంతి , సీతారామయ్య గారి మనుమరాలు సినిమాలంటే నాకెంతో ఇష్టం . హృదయంతో చూసే సినిమాలు . హౄదయాలను తట్టే సినిమాలు . ఈ సినిమాకు షీరో సుహాసినే […]
- « Previous Page
- 1
- …
- 31
- 32
- 33
- 34
- 35
- …
- 382
- Next Page »