Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రిరిలీజులు కుదరవు… ఈ ఇద్దరు సంక్రాంతి వీరులకూ జగన్ చెక్…

January 5, 2023 by M S R

chiru

నిజానిజాలు ఎలా ఉన్నా సరే… రాజకీయ కారణాల మీద చర్చ జరుగుతుంది… అది సహజం… అదసలే ఏపీ… రెండు దుర్ఘటనల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రోడ్ షోలను రద్దు చేసింది… సమస్యాత్మక మీటింగులకు అనుమతించకూడదని నిర్ణయించింది… జీవో విడుదల చేసింది… దీని మీద కుప్పంలో చంద్రబాబు మీటింగుకు సంబంధించి రచ్చ రచ్చ జరిగింది… ఇదే నేపథ్యంలో బాలయ్య, చిరంజీవి ప్రతిష్టాత్మకంగా పోటీపడుతున్న రెండు సినిమాల ప్రిరిలీజ్ ఫంక్షన్లకు కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది… ఒకటి వాల్తేరు వీరయ్య, […]

పాకిస్థాన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది… ఎన్నడూ ఎరగని రీతిలో విద్యుత్ పొదుపు…

January 4, 2023 by M S R

pak

పార్ధసారధి పోట్లూరి ….. తీవ్ర రూపం దాల్చిన పాకిస్థాన్ విద్యుత్ సంక్షోభం ! గత అయిదేళ్ళ నుండి తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కుంటున్న పాకిస్థాన్ నిన్న మరిన్ని పొదుపు చర్యలకి శ్రీకారం చుట్టింది! తీవ్ర విద్యుత్ కొరత వలన ప్రత్యామ్నాయంగా ప్రజలు డీజిల్ విద్యుత్ జనరేటర్స్‌ను వాడడం వలన అది పరోక్షంగా డీజిల్ దిగుమతుల మీద పడి ఆయిల్ దిగుమతి బిల్లు విలువ విపరీతంగా పెరిగిపోవడంతో, దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం […]

మతం మత్తు మందే..! కానీ బాధ నివారిణి…! గుడ్డి వ్యతిరేకత సబబేనా..?!

January 4, 2023 by M S R

ayyappa

Srini Journalist ……..    నా మిత్రుడు ఒకరు jagan mohan rao అనే leftist రాసిన ఒక పెద్ద వ్యాసం fb లో షేర్ చేశారు. అందులో నుంచి ఒకటి రెండు పేరాలు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా… ‘ప్రపంచం అనుభవిస్తున్న నిజమైన దుఃఖానికి మతం ఒక వ్యక్తీకరణ. అదే సమయంలో ఈ దుఃఖానికి వ్యతిరేకంగా ఒక నిరసన కూడా. మతం, అణచివేయబడుతున్న జీవి నిట్టూర్పు, హృదయంలేని ప్రపంచం యొక్క హృదయం. కరుణ కనుపించని పరిస్థితులలో కనుపించే […]

నాయుడు గారి గొంతులో ‘యువగ(ర)ళం’ !

January 4, 2023 by M S R

lokesh

పత్రి వాసుదేవన్ :: అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత నారా వారి ఫ్యామిలీకి అతికినట్టు సరిపోతుంది. చినబాబు గారి ‘ఒంటి గంట రామలింగం’ ఫిలాసఫీతో ఇప్పటికే తలబొప్పి కట్టిన చంద్రబాబుకు, తాజాగా పుత్ర రత్నం ఇచ్చిన షాక్ చూస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం నారా లోకేష్ పాదయాత్ర. ప్రస్తుత పరిస్తితుల్లో అసలు ఈ పాదయాత్రకు అనుమతులు లభిస్తాయా? లభించినా […]

ఎయిడ్స్‌కు టూ డ్రగ్ థెరపీ… కాకినాడ డాక్టర్ చెప్పిందే చలామణీకొచ్చింది…

January 4, 2023 by M S R

hiv

Yanamadala Murali Krishna…..   గుంపులోని వారికన్నా మెరుగ్గా వున్నా కష్టమే… కొంతకాలం క్రితం ఫార్మా కంపెనీల ప్రయోజనాల మేరకు వైద్య చికిత్స విధానం నడుస్తున్నదా అని ఒకరు ప్రశ్నించారు. నేను అవును అని చెప్పా. అక్కడున్న వాళ్లలో కొందరు అవుననీ, కొందరు కాదనీ చెప్పారు. చివరిగా ప్రశ్న అడిగిన వారు పేషంట్ కోలుకోవడం తప్ప మరేదీ వైద్యులకు ఎక్కువ కాదని, డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ ని తుచ్చమైన బుల్లి బుల్లి గిఫ్ట్స్ ప్రభావితం చెయ్యలేవని చెప్పారు. ప్రశ్నించిన […]

ఒక జ్ఙాన ప్రవచనకారుడి అంతిమ దర్శనం కోసం 20 లక్షల మంది..!!

January 4, 2023 by M S R

siddeswar

జ్జానయోగి సిద్దేశ్వర స్వామి… ఓ సంపూర్ణ సార్థక సన్యాసి… ఓ లింగాయత్ మఠాధిపతి… కోట్ల మందికి ‘నడిచే దేవుడు’… సిద్దేశ్వర అప్పవారు… 82 ఏళ్ల వయస్సులో నిర్యాణం పొందాడు… తన ఆశ్రమం ఎలాగూ సరిపోదని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు… కన్నడ మీడియా అంచనాల మేరకు అంతిమ నివాళి అర్పించినవారి సంఖ్య 10 నుంచి 15 లక్షలు… ఇక ఆయన ‘స్థాయి’ ఏమిటో వేరే చెప్పాల్సిన పని లేదు కదా… ఆయన […]

అసభ్య స్కిట్ల నడుమ… ఇకపై జబర్దస్త్‌ షోలో మసాలా డాన్సులు కూడా..!!

January 4, 2023 by M S R

etv

గత వారం హైదరాబాద్ బార్క్ రేటింగులు పరిశీలించినప్పుడు… ఈటీవీ జబర్దస్త్ షో రేటింగ్స్ 3.92 జీఆర్పీలు… ఎక్సట్రా జబర్దస్త్ రేటింగ్స్ 4.03… అసలు టాప్ 30 ప్రోగ్రామ్స్‌లో శ్రీదేవి డ్రామా కంపెనీ లేనే లేదు… డాన్స్ ప్రోగ్రాం ఢీ అయితే మరీ దారుణంగా 2.83… ఇక క్యాష్ షో 1.87… రియాలిటీ షోలన్నీ నేలచూపులు చూస్తుండటంతో ఈటీవీకి ఏం చేయాలో తోచడం లేదు… ఏదేదో చేసేస్తున్నారు… పక్కా సినిమా ప్రమోషన్ల ప్రోగ్రాంగా మారిన సుమ షో క్యాష్‌ను […]

ఐదు ‘మ’కారాలు… కామాఖ్య దేవికి అఘోరా తరహా అర్చన విధానాలు…

January 4, 2023 by M S R

kamakhya

దేవుడిని అర్చించడానికి అనేక మార్గాలుంటాయి… బోలెడు పద్ధతులుంటాయి… ఎవరి పద్ధతి వారిదే… ఉదాహరణకు అఘోరాలు శివుడిని అర్చించే పద్ధతి మనకు భీతావహంగా అనిపించవచ్చు… కానీ వాళ్లకు అది కామన్… అభిషేకం చేసి, నాలుగు మారేడు దళాలు లింగం మీద పెట్టి, విభూతి రాసుకుని మొక్కడం సాత్వికంగా కనిపించవచ్చు… ఎంత కంట్రాస్టు..! వామాచారం, దక్షిణాచారం, క్షుద్రం వంటి పేర్లు మనం తగిలించుకున్నాం గానీ ఆ శివుడికి ఏ పూజయినా ఒకటే… తాజా చితి భస్మంతో ఇచ్చే భస్మారతిని ఎలా […]

ఈ ఇద్దరు దోస్తులతో బాలకృష్ణ తదుపరి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..!

January 3, 2023 by M S R

nbk

నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో అనూహ్యంగా సక్సెస్… ఈ టాక్ షోలో ప్రతి ఎపిసోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ అవర్స్ సాధిస్తూ, ఓ సూపర్ హిట్ సినిమా స్థాయిలో రన్ అవుతోంది… ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే, వీక్షకుల ధాటిని తట్టుకోలేక ఆహా ఓటీటీ కొన్ని గంటలపాటు క్రాష్ అయిపోయిన సంగతి తెలుసు కదా… అఫ్‌కోర్స్, డిమాండ్‌కు తగినంత సాంకేతిక సన్నద్ధత, ఆమేరకు సర్వర్లు లేకపోవడం ఓ కారణం… […]

జింబాబ్వే భారీ డ్యామ్ సరే… మరి మన పోతిరెడ్డిపాడు పొక్కను వదిలేద్దామా..?

January 3, 2023 by M S R

brs

స్వర్ణ భారతం కోసం ఉద్భవించిన భారత రాష్ట్ర సమితిలోకి ఏపీ నాయకులు కూడా తండోపతండాలుగా, మందలుమందలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారట… మంచిదే… ఇన్నాళ్లూ రాష్ట్ర విభజనకు కారకుడని కేసీయార్‌ను నిందించే వాళ్లే కేసీయార్ నాయకత్వాన్ని కోరుకోవడం అంటే అంతకు మించిన గుణాత్మక మార్పు ఇంకేముంటుంది..? తోట చంద్రశేఖర్, కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు ఏ అవసరాల కోసం బీఆర్ఎస్‌లో చేరారనే చర్చ జోలికి వెళ్లాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… వాళ్లను తన పార్టీలోకి తీసుకురావడం మాత్రం కేసీయార్ […]

చంద్రబోసు, యండమూరీ… ఆ విరోధాభాసం వదిలి ఈ భాష చదవండి…

January 3, 2023 by M S R

vasava suhasa

Heights of Language: ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం గొప్పది అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1. వేదాలు, పురాణాలు […]

ఈ నటుడు ఏమిటి..? ఇలా అయిపోయాడు..? సీరియల్స్‌లో కనిపిస్తున్నాడు..!

January 2, 2023 by M S R

chittibabu

ఇప్పటితరంలో చాలామందికి ఒకప్పటి కమెడియన్ రాజబాబు గురించి తెలియకపోవచ్చు… ఏఎన్నార్, ఎన్టీయార్‌లతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు అతను ఒక దశలో… కానీ హీరో హీరోయే… కమెడియన్ కమెడియనే… అందుకే తను కూడా హీరో కావాలనుకున్నాడు… కుదరలేదు… 1983లో కావచ్చు తన మరణించాడు… ఆ తరువాత ఇద్దరు కొడుకుల్ని ఆయన భార్య చదివించుకుంది, ఇద్దరూ అమెరికాలో సెటిలయ్యారు… ఇవన్నీ చెప్పింది రాజబాబు తమ్ముడు చిట్టిబాబు… అవును, రాజబాబు తొమ్మిది మంది తమ్ముళ్లలో ఒకరు చిట్టిబాబు, మరొకరు అనంత్ […]

వైట్ అండ్ వైట్… ఫ్యాషన్, లుక్కు జానేదేవ్… నా స్టయిల్ నాది… యూనిక్…

January 2, 2023 by M S R

ajith

నిజానికి హీరో అజిత్‌ను చూస్తే అప్పుడప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది… ప్రత్యేకించి తన లుక్కు… మిగతా హీరోలు జుత్తుకు ఎడాపెడా నల్లరంగు పూసేసి, కవర్ చేసేసి, మెయింటెయిన్ చేయడానికి నానా అవస్థలూ పడుతుంటారు… ఇప్పుడు మరీ ఎర్లీ ఏజులోనే రంగు తెల్లవారడం, తెల్లబారడం స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కుర్ర హీరోలకూ తప్పడం లేదు ఫాఫం… కానీ అజిత్ మాత్రం అదేమీ పట్టించుకోడు… సహజంగా ఎలా పెరిగితే, ఎలా కనిపిస్తే అలా… అంతే… నో బ్లాకింగ్, నో కవరింగ్… అంటే […]

సాయిపల్లవి టోటల్లీ డిఫరెంట్ కేరక్టర్… కొత్త ఏడాది రాకను ఎలా సెలబ్రేట్ చేసుకుంది..?!

January 2, 2023 by M S R

saipallavi

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు గతంలో మస్తు హడావుడి ఉండేది… సెలబ్రిటీల సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉండేవి… ఈసారి అవేవీ పెద్దగా లేవు… కానీ సెలబ్రిటీలు ఎంచక్కా విదేశాలు, ఎక్కువగా మాల్దీవులు వెళ్లిపోయారు… కొందరు ఫోటోలకు చిక్కారు… కొందరు కాన్ఫిడెన్షియల్ ట్రిప్స్‌లా ఎంజాయ్ చేశారు… కానీ ఒక నిత్యా మేనన్, ఒక సాయిపల్లవి టోటల్లీ డిఫరెంట్ కేరక్టర్లు కదా… అందులో సాయిపల్లవి మనం ఊహించని రీతిలో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది… నిజానికి గార్గి సినిమా రిలీజు […]

ఇదీ అసలు పాయింట్… చిన్న లీక్ లేకుండా ఆర్‌బీఐతో 6 నెలల సంప్రదింపులు…

January 2, 2023 by M S R

demonetisation

పార్ధసారధి పోట్లూరి …….  కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సుప్రీం కోర్టు సమర్ధించింది! 1. 2016 లో కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సవాలు చేస్తూ మొత్తం 58 మంది సుప్రీం కోర్టులో పీటీషన్లు వేశారు. వీళ్లలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 2. అయితే ఈ పిటీషన్ల మీద 5 గురు సభ్యులు కల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం తుది తీర్పు […]

తాగారు, ఊగారు, దొరికారు… భాగ్యనగరం చెత్తా రికార్డు… భేష్ బెంగుళూరు…

January 2, 2023 by M S R

bglr

ప్రతి ఏటా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ… మందు ప్రేమికులు మద్యం తాగుతూనే ఉంటారు… ఈసారి కరోనా భయం లేదు కాబట్టి చిన్న చిన్న గెట్‌టుగెదర్స్ జరిగాయి… అయితే ఆంధ్రా ప్రజలు 142 కోట్లు తాగేశారు… తెలంగాణలో ఏకంగా 215 కోట్లు తాగేశారు… అని ఎడాపెడా పత్రికలు రాసిపారేశాయి… నిజానికి తాగడం కాదు వార్త… ఆ ఒక్కరోజు డిపోల నుంచి తీసుకొచ్చిన మద్యం విలువను రాశారు గానీ అంతకుముందే ఉన్న స్టాక్స్ విలువ మాటేమిటి..? పైగా తెలంగాణలో రెండుసార్లు […]

ఈ డజను సౌత్ సినిమాలతో ఈ ఏడాదీ బాలీవుడ్‌ బాక్సాఫీసు దోపిడీయేనా..?!

January 2, 2023 by M S R

pan India

సౌత్ సినిమా ఇండస్ట్రీ 2022 బాలీవుడ్ బాక్సాఫీసును శాసించింది… కొల్లగొట్టింది… యశ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, రాం చరణ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తదితరుల సౌత్ హీరోలకు ఇప్పుడు హిందీలో కూడా ఫ్యాన్స్ ఏర్పడిపోతున్నారు… కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, కాంతార సినిమాల్లాగే 2023లో ఓ డజన్ సౌత్ సినిమాలపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది..? అవి 2023లో హిందీ బాక్సుల్ని కొల్లగొట్టబోతున్నాయా..? పొన్నియిన్ సెల్వన్-2 :: బాహుబలి, కేజీఎఫ్ […]

సేమ్ మహానటి సావిత్రిలాగే… వైభోగం నుంచి ఓ అనామక మరణం వరకూ…

January 2, 2023 by M S R

bharat bhushan

భరత్ భూషణ్… 1920లో మీరట్‌లో పుట్టాడు… తండ్రి రాయ్ బహదూర్ మోతీలాల్ ఓ లాయర్… కొడుకు కూడా తనలాగే లాయర్ కావాలని కోరిక… కానీ భూషణ్‌కు సినిమా నటుడు కావాలని కోరిక… అలీగఢ్‌లో డిగ్రీ అయిపోగానే ముంబైకి వచ్చాడు… ఫేమస్ డైరెక్టర్ మెహబూబ్ ఖాన్‌కు ఇవ్వడానికి ఓ రికమండేషన్ లెటర్ కూడా పట్టుకొచ్చాడు… అలీబాబా్ చాలీస్ చోర్ అనే సినిమా పనిలో సదరు మెహబూబ్ ఖాన్ బిజీ… భూషణ్ కష్టమ్మీద ఆయన్ని పట్టుకుని ఈ లెటర్ చూపించాడు… […]

‘‘నో, నో… మా చంద్రబాబు పరమ పావనుడు… ఆ చావులతో సంబంధమే లేదు… ’’

January 2, 2023 by M S R

aj

ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది… మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా […]

మన ‘ఏడుకొండల్లా’గే జార్ఖండ్‌లో పార్శ్వనాథ్ గుట్టలు… అగ్గిపెట్టిన సర్కారు…

January 2, 2023 by M S R

sammed

సంఖ్యాబలమున్న మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి… వోటు బ్యాంకుగా చూసుకోవాలి… వాళ్లు చెప్పినట్టు సై అనాలి… ఇదేకదా, భారతదేశంలో ప్రతి సెక్యులర్ పార్టీ చేసేది… మరి మైనారిటీలు అంటే, నిజంగానే సంఖ్యాబలం లేని మైనారిటీలను ఎవడు పట్టించుకోవాలి..? అదే కదా మన దరిద్రం… మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాల అడుగులు అలా ఉంటాయి… మన దేశ మైనారిటీల్లో క్రిస్టియన్లు, ముస్లింలే కాదు… పార్శీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారనే సోయి రాజకీయ పార్టీలకు ఉండదు… ఇవి […]

  • « Previous Page
  • 1
  • …
  • 334
  • 335
  • 336
  • 337
  • 338
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions