పదే పదే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి తెలంగాణలో… కేసీయార్ హైదరాబాద్ పాతబస్తీని పూర్తిగా విడిచిపెట్టేశాడు… ఒవైసీ మీద ప్రేమో, భయమో గానీ కరెంటు బిల్లులు ఎవరూ కట్టరు, నీటి బిల్లులు ఎవరూ కట్టరు… అసలు పాతబస్తీలో ప్రభుత్వమే లేదు అనేది వాటి విమర్శల సారాంశం… అంటే పాతబస్తీలో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి… బిల్లులు కట్టినా, కట్టకపోయినా… మజ్లిస్‌కు కోపం రాకూడదనీ, ముస్లిం వోట్లు పోకూడదని మొత్తానికి అధికార యంత్రాంగమే పనిచేయడం లేదని విపక్షాలు, ప్రత్యేకించి బీజేపీ పదే […]
ప్రేమ ఎంత మధురంలోకి ఓ తెలుగమ్మాయి… ఈమె కథ ఎన్నిరోజులో మరి…
తెలుగు సినిమాలు అంటే మలయాళ, తమిళ సినీతారలు… లేదంటే ముంబై భామలు… నటన కావాలంటే దక్షిణం… వైట్ స్కిన్, ఆరబోత కావాలంటే ముంబై, అనగా నార్త్… కానీ తెలుగు సీరియల్స్ అంటే కన్నడ తారలు… నిజంగా మంచి మెరిట్ చూపిస్తున్నారు… మీరు ఎప్పుడు బెంగుళూరు ఫ్లయిట్ ఎక్కినా సరే ఎవరో ఒకరు సీరియల్ నటి కనిపిస్తారు… మెల్లిమెల్లిగా సినిమాల్లోకీ వ్యాపిస్తున్నారు… నవ్య స్వామిలా..! ఆమె వదిన ఐశ్వర్య పిస్సె కూడా మంచి నటే… అయితే తెలుగు వాళ్లు […]
ఆస్కార్ బాట దొరికింది… డీఎస్పీ, థమన్ బీరెడీ… గుడ్ ఆర్గనైజర్‌ను వెతకండి…
తెలుగు పాట ‘నాటునాటు’ ఆస్కార్‌కు చేరువైనట్టే ఉంది… కీరవాణిని ఆస్కార్ అవార్డుల వేదికపై పర్ఫామ్ చేయమని అడిగారు అంటే… అది అవార్డు దక్కబోతోందనడానికి ఒక సూచికగా భావించాలట… ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా ఒక సూచికే అంటున్నారు… సరే, మంచిదే… కానీ పాపం, ఆ పాటకు ప్రాచుర్యమే ఆ స్టెప్పులతో వచ్చింది… లేకపోతే ఆ పాట కంటెంటులో ఏముందని..? ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బాగా బాధపడుతున్నాడని వార్తలు… ఎంతసేపూ కీరవాణి […]
నిజమా స్మితా… సినిమా సెలబ్రిటీలు నిజాలు చెబుతారా..? చెప్పారా..?
ఎక్కడో ఓ మీమ్… సోనీ లివ్ ప్లాట్‌ఫామ్ కోసం సింగర్-యాక్టర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అని ఓ టాక్ షో చేస్తోంది… కాదు, చేసింది… అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తయింది… తాజాగా ఇప్పుడు ప్రసారం ప్రారంభించారు… సో, పెద్దగా వర్తమాన అంశాలపై ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు… అయితే పవన్ కల్యాణ్‌ను ఈమధ్య ఓ రాజకీయ నాయకుడిగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కదా అన్నయ్య చిరంజీవి… పవన్ ఎప్పుడో ఓసారి ఏదో ఒక పెద్ద హోదాలోకి ఎదుగుతాడు, తన […]
ప్రపంచ వినోద రాజధానిలో ఓ మైనపు బొమ్మల కొలువు… చూస్తే అచ్చెరువు…
Akula Amaraiah……… మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా! బొమ్మకు ప్రాణం పోసిన టుస్సాడ్స్.. లాస్ వెగాస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఉందంటే….. చూపు చుక్కల్లో ఉన్నా కాళ్లు నేలమీదుండాలిగా.. లండన్ పోతానో లేదో, పోయినా కారల్ మార్క్స్ సమాధీ, మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో… మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు వొలకబోసుడెందుకు? ఉన్నది చూస్తే పోలా! అనుకుంటూ లాస్ వెగాస్ టుస్సాడ్స్ మ్యూజియం బిల్డింగ్ ముందాగాను. నా మది కనిపెట్టిన మమ్మాయి దీప్తి.. […]
నందమూరి కుటుంబసభ్యులకు వాహనగండం… తాజాగా మరొకటీ అదే…
సీన్ వన్……. చాన్నాళ్ల క్రితమే ఓ జ్యోతిష్కుడు ఏదో మాట్లాడుతూ, మాటల సందర్భంలో ఓ మాట చెప్పాడు… ‘‘ఈ నందమూరి ఎన్టీయార్ కుటుంబానికి కారు ప్రమాదాల గండం బాగా ఉంది, అంటే వాహన గండం… వాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది… ఐనా వాళ్లకు ఎవరు చెబుతారు లెండి…’’ అని నిష్ఠురమాడాడు… వాహనాలు లేకపోతే కదలికే లేని కాలం కదా, ఏం జాగ్రత్తగా ఉండాలి, కార్లు ఎక్కకుండా బతకడం ఎలా సాధ్యం అనుకుని నవ్వుకున్నాను… సీన్ టు……. ఎన్టీయార్ […]
రీల్ లైఫు జంటగా ఢోకా లేదు… త్వరలో రియల్ లైఫ్ జంటగానూ కనిపిస్తారు…
అయ్యో, ఇక ఈ జంట మళ్లీ తెరపై కనిపించదా అని బోరుమన్నాయి కొన్ని సైట్లు… ఒకడు ఏదైనా రాస్తే చాలు, ఇక కుప్పలుతెప్పలుగా అందరూ అదే గొర్రెదాటు… ఇంతకీ ఆ జంటపేరు చెప్పనేలేదు కదూ… విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన… కారణమేమిటీ అంటారా..? ఓ పొంతన లేని విషయానికీ దానికీ ముడిపెట్టేశారు… విషయం ఏమిటంటే..? పరుశురాం అనబడే దర్శకుడు గీతా ఆర్ట్స్ వారికి, అనగా అల్లు అరవిందుడికి ఓ సినిమా చేయాల్సి ఉంది… అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడట… […]
నా భర్తనే అవమానిస్తావా..? ఛిఫో… దోస్తీ కటీఫ్… ఇకపై నీతో నటించను…
AK62… ఇదీ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వాళ్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సినిమా… ఏకే47 మాదిరిగా ఏకే62 తుపాకీ కాదు… ఇది సినిమా పేరు కాదు, అజిత్ 62 వ సినిమా అని అర్థం… ఇప్పటికే మూడుసార్లు అజిత్‌తో జతకట్టిన నయనతార ఇందులో అజిత్ పక్కన హీరోయిన్గా నటించాలి… వాళ్లది హిట్ పెయిర్… నయనతార లేడీ సూపర్ స్టార్ కదా, అజిత్‌తో కలిస్తే ఇక ఢోకా ఏముంది..? సో, లైకా ప్రొడక్షన్స్ […]
ఈనాడు స్పూర్తితో క్షుద్ర అనువాద ‘గీతం’… మీకు ‘కార్యశాల’ అంటే తెలుసా..?
కొత్తగా చాట్‌జీపీటీ వచ్చింది కదా… అంతకుముందు నుంచే గూగుల్ ట్రాన్స్‌లేషన్స్ తరీఖ చూస్తున్నాం కదా… మరీ కొత్తగా బాడ్ రాబోతోంది కదా… ఇవి గాకుండా మైక్రోసాఫ్ట్ అనువాదం వంటివీ ఉన్నాయి… నిజానికి ఏదీ సరైన అనువాదం కాదు, పైగా నవ్వు పుట్టించే అనువాదాలు… అన్నీ ఈనాడు అనువాదాల తరహాయే… ఈనాడులో వచ్చే అనువాద పదాలను చదివి మనం ఎన్నిసార్లు పకపకా నవ్వుకున్నామో కదా… అప్పుడప్పుడూ ఈనాడును చూసి సాక్షి, ఆంధ్రజ్యోతి, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా వాతలు […]
ఈ ఉపనయన మరణాలు జలప్రమాదమా..? జెన్కో అధికారులు చేసిన హత్యలా..?
ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు… ఇదీ విషాదం… నిజానికి అది ప్రమాదం కాదు, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు చేసిన హత్యలే…. ఆశ్చర్యంగా ఉందా..? మొత్తం చదివాక మీరే అంగీకరిస్తారు… ముందుగా ఈ వార్తను కాస్త ప్రామినెంట్గా కవర్ చేసిన ఆంధ్రజ్యోతికి అభినందనలు, అదేసమయంలో ఉపనయనమే ఉసురు తీసిందనే తిక్క హెడింగ్ పట్ల అభ్యంతరాలు..! ఉపనయనం ఉసురు తీయడం ఏమిటి..? ముందుగా ఇన్సిడెంట్ ఏమిటో చూద్దాం… హర్షిత్ అలియాస్ వాచస్పతి ట్రిపుల్ ఐటీ గౌహతిలో చేస్తున్నాడు… […]
కరెంటు లేక రైతుల అరి గోస… సార్, ఇదేనా తెలంగాణ మోడల్ అంటే..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం చూస్తున్నారా..? ఈ తెలంగాణ సూపర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం….. ఇదేకదా బీఆర్ఎస్ పదే పదే చెబుతున్న మాట… నిజమేమిటో ఊళ్లల్లో రైతులకు తెలుసు… ఆ 24 గంటల కరెంటు కథేమిటో అనుభవిస్తున్నవాళ్లకు తెలుసు… మరీ కొన్నిరోజులుగా వ్యవసాయానికి కరెంటు సరఫరా పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది… మాట్లాడితే కేసీయార్ అసెంబ్లీలో అంటుంటాడు… ఎవరైనా కరెంటు విషయంలో ఆందోళనలు చేశారా, చేస్తున్నారా..? గతంలో ఉమ్మడి పాలనలో […]
దీన్నే లెక్కలేనితనం అంటారు… ప్రజలన్నా, ప్రజాధనమన్నా, ప్రభుత్వమన్నా…
బడ్జెట్ అనేది పెద్ద ప్రహసనమని మొన్న మనం చెప్పుకున్నాం గుర్తుందా..? నిజానికి బడ్జెట్ విషయంలో ప్రభుత్వాలు ఎంత కాజువల్‌గా వ్యవహరిస్తాయో.., సిన్సియరిటీ, సీరియస్‌నెస్ ఏమీ ఉండవని చెప్పే ప్రబల ఉదాహరణ రాజస్థాన్ సీఎం నిర్వాకం… తరచి చూస్తే మొత్తం సిస్టం ఫెయిలైన తీరు గమనించొచ్చు… రాజస్థాన్ సీఎం గెహ్లాట్ వయస్సు 71 సంవత్సరాలు… ఆమధ్య సచిన్ పైలట్‌ను తొక్కే క్రమంలో ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను కూడా ఎదిరించి, తిరుగుబాటు చేసేదాకా వెళ్లాడు… తెల్లారిలేస్తే రాజకీయాలు తప్ప మరొకటి […]
శివాయ విష్ణు రూపాయ- శివరూపాయ విష్ణవే..! ఔను, అన్నీ రూపాయల లెక్కలే..!
Pronunciation:దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం. “శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే” అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు […]
వ్యవసాయం అన్నదాత ప్రాణాలకే రిస్క్..!మరణాలకు ఇవండీ కారణాలు..!
రైతుల మరణాల గురించి వార్త లేని రోజు లేదు… మా హయాంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్ అని కేసీయార్ వేదికలెక్కి ఎంత చెప్పుకున్నా… అవి ఆగడం లేదు… నిజానికి ఆగవు… ప్రతి దశలోనూ రైతు దోపిడీకి గురవుతున్నాడు… అన్ని రిస్కులూ తనవే… నమ్మిన ఎవుసం తన ఖర్చుల నుంచి, అవసరాల నుంచి గట్టెక్కించడం లేదు… దీనికితోడు ప్రభుత్వ విధానాల్లో లోపాలు సరేసరి… ఉదాహరణకు వ్యవసాయంలో అందరికన్నా ఎక్కువ రిస్క్ తీసుకునేది, ప్రాణాలను పణంగా పెట్టేది కౌలు రైతు… […]
విశ్వనాథ్ పట్ల కమల్ హాసన్ అగౌరవం… సారు గారికి గురువు గారు గుర్తే లేరు…
ఊళ్లో ఓ పెద్ద మనిషి గారి పెంపుడు కుక్క ఆయుష్షు తీరి చనిపోతే ఊరివాళ్లంతా బారులు తీరతారు… మందలుమందలుగా వెళ్లి ఆ పెద్ద మనిషిని పరామర్శిస్తారు… అబ్బ, మీ కుక్క భలే ఉండేదండీ, పిక్కల్ని తప్ప మరొకటి పీకి ఎరుగదు అని కూడా మెచ్చుకుంటారు… పంచాయతీ ఖర్చులతో డీజే బ్యాండ్, ఊరేగింపుతో వెళ్లి, బాణాసంచా కాల్చి మరీ అంత్యక్రియలు నిర్వర్తించి గౌరవాన్ని చాటుకుంటారు… కానీ ఆ పెద్ద మనిషే చచ్చిపోతే..? కుక్కలు కూడా పట్టించుకోవు..!! ఇది అందరికీ […]
ఆరు బయట బహిరంగ గణేశుడు… అటవీమాత ఒడిలో కొలువైన దోస దేవుడు…
సాధారణంగా గుడి అంటే..? దేవుడు ఎవరైతేనేం..? సాధారణంగా గర్భగుడి, మంటపం, ప్రహారీ, ధ్వజస్థంభం, గంటలతోపాటు హుండీలు ఉంటాయి… పెద్ద గుళ్లయితే భక్తులను దోచుకోవడానికి స్పెషల్ టికెట్లు, కాస్త ప్రహారీ పక్కనే రకరకాల ఆర్జిత సేవల టికెట్లు అమ్మే ‘దుకాణాలు’ కనిపిస్తాయి… క్యూలైన్ల నిర్మాణాలు కూడా..! హనుమంతుడి గుళ్లూ అంతే… కాకపోతే హనుమంతుడు పేదవాళ్ల దేవుడు కదా, ఎక్కడైనా సరే వాటిని కట్టేస్తారు… ఎర్రగా చందనం పులిమిన విగ్రహం, రాముడికి దండం పెడుతున్నట్టుగా మూర్తి, ఓ చిన్న స్లాబుతో […]
ఈ డబ్బా సినిమాలో ఏముందని డబ్బు పెట్టుబడి పెట్టావమ్మా తల్లీ..!!
‘‘నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా… పాప్ కార్న్‌తో మొదలుపెట్టా… సినిమా భలే వచ్చింది, హీరో సాయి రోనక్‌తో నా రెండో సినిమా… థ్రిల్లింగ్ సినిమా అంటే సీన్ ఫార్వర్డ్ చేయకుండా చూసేలా ఉండాలి… మా సినిమా అలాగే ఉంటుంది… అందుకే ఓటీటీకి కూడా ఇంకా ఇవ్వలేదు… ఇకపైనా చిత్రాలు నిర్మిస్తాను… సినిమాను నాగచైతన్య, అఖిల్, నాగార్జున మెచ్చుకున్నారు…’’ అని చెబుతూ పోయింది నటి అవికా గోర్… ఫాఫం… ఏదో చెబుతోంది గానీ అసలు ఎందుకు ఈ […]
మూడు పాత్రలు… మూడు రెట్ల వాయింపు… బింబిసారతో వచ్చిన ఇమేజ్ ఫట్…
1992లో బాలకృష్ణ, దివ్యభారతి ధర్మక్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అని ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయిన పాట… ట్యూన్ బాగుండి, పైకి క్లాస్‌గా వినిపించినా సరే… ఊర మాస్ పాట అది… వేటూరి అంత త్వరగా దొరకడు గానీ పచ్చిదనం పులుముకున్న పాట… పెదవి కొరికే పెదవి కొరకే వంటి భేషైన పదప్రయోగాలు ఒకటీరెండు బాగున్నా… వేడి చెమ్మ, తొడిమ తెరిచే తొనల రుచికే వంటి చాలా కథలు పడ్డాడు… ఈ సినిమా పాటతో కథనం మొదలుపెట్టేందుకు కారణముంది… […]
బింబిసారతోనే పునర్జన్మ… అదే ఊపులో మరిన్ని సినిమాలు చకచకా…
కళ్యాణరామ్… ఎన్టీయార్ నట వారసుల్లో తన తరువాత మొదటితరంలో బాలకృష్ణ మాత్రమే, ఇంకెవరూ లేరు… అప్పుడెప్పుడో మొదలు పెట్టిన ప్రస్థానంలో ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నాడు… ఆమధ్య చాన్నాళ్లు గ్రాఫ్ ఘోరంగా పడిపోయినవేళ అఖండతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు… రెండో తరంలో జూనియర్ సూపర్ హిట్టయ్యాడు… నిజంగా సరైన పాత్రలు పడాలే గానీ తనను కొట్టేవాడు లేడు టాలీవుడ్లో… ఆ ఎనర్జీ, ఆ మెరిట్, ఆ ఈజ్, ఆ డిక్షన్, ఆ డాన్స్ అన్నీ ఉన్నాయి […]
సాక్షి vs ఈనాడు… కోర్టుకెక్కిన మీడియా వార్… జగన్ జీవోపై రుసరుస…
ఓసారి రామోజీరావును జగన్ కలిశాడు… అంతే… ఆ మధ్యలో కొన్నాళ్లు సైలెన్స్… అంతే, ఇక మళ్లీ మొదలైంది… సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయితీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది… సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది… సాక్షి, ఈనాడుల ద్వంద్వ యుద్ధంలో ఇది మరో అధ్యాయం… వివరాల్లోకి వెళ్దాం… వలంటీర్లు, గ్రామ-వార్డు సెక్రెటేరియట్ స్టాఫ్ దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా […]
- « Previous Page
- 1
- …
- 347
- 348
- 349
- 350
- 351
- …
- 379
- Next Page »