Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వర్మే గెలిచాడు… లారా క్లీన్ బౌల్డ్…! నేహా ఔట్… ఇనయ సేఫ్…!!

September 25, 2022 by M S R

bb6

రాంగోపాలవర్మ గెలిచాడా..? బ్రియాన్ లారా గెలిచాడా..? సీరియస్ ప్రశ్న కాదులెండి… జస్ట్ ఫర్ ఫన్… నిజానికి వర్మకూ, లారాకు సాపత్యం ఏమిటసలు..? పోలిక పెట్టకూడని రెండు వేర్వేరు కేరక్టర్లు… ఎక్కడి వర్మ..? ఎక్కడి లారా..? లారా పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండదు… తనది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లెజెండ్ స్టేటస్… వర్మ ప్రస్తుత దురవస్థ మనం చూస్తున్నదే, కొత్తగా చెప్పుకునేది ఏముంది..? అయితే… ఓ పోటీలో లారా మీద వర్మ గెలిచాడు… నిజం… మాటీవీలో బిగ్‌బాస్ షో […]

ఆపరేషన్ మిడ్‌నైట్..! క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్‌లా ఓ న్యూస్ ప్రజెంటేషన్…!!

September 25, 2022 by M S R

pfi

ఈ కథనాన్ని మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం… ఇదంతా నిజమేననీ నేనేమీ చెప్పడం లేదు… ఒక వర్తమాన వార్తాంశం మీద ఎవరు రాశారో గానీ… ఓ క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్ కథనంలాగా ఉంది… ఆ ప్రజెంటేషన్ విభిన్నంగా, సంప్రదాయిక కథనశైలులకు విరుద్ధంగా ఓ పాపులర్ సస్పెన్స్ నవలలాగా రాయబడింది… అదే ఇక్కడ చెప్పదలిచింది… ఈ కథనంలో పేర్కొన్న పీఎఫ్ఐ ఆర్గనైజేషన్, అరెస్టులు నిజమైన వార్తలే… అయితే ఈ ఆపరేషన్ ఇలాగే సాగిందా అనేది తెలియదు… […]

అరె చుప్..! లాజిక్స్ లేవు, ఒక సిల్లీ స్టోరీ లైన్… సోవాట్, దుల్కర్ ఉన్నాడుగా…

September 25, 2022 by M S R

chup

హిందీ సినిమా… పేరు చుప్… సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి, పూజా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులూ కనిపిస్తారు ఇందులో… వావ్, ఇంతకీ ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అని అడక్కండి… జస్ట్, 10 కోట్లు… చిన్న నావెల్ పాయింట్ పట్టుకుని, దాని చుట్టూ కథ రాసుకుని, ఎవరికి ఎంత పాత్ర ఇవ్వాలో అంతే స్పేస్ ఇచ్చి దర్శకుడు బాల్కి చాలా చాకచక్యంగా మేనేజ్ చేశాడు… సీతారామంతో దుల్కర్ ఈమధ్య పాపులారిటీ ఇంకా పెంచుకున్నాడు […]

ఆ చైనా ఇనుప గోడల వెనుక ఏదో కుట్ర..! ఎవరికి స్పాట్ పెట్టారు..?!

September 25, 2022 by M S R

china

పార్ధసారధి పోట్లూరి ………… కమ్యూనిజం అంటే ఎదురుతిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపడమే ! మావో, స్టాలిన్ లు అదే చేశారు. ఇప్పుడు జింగ్పింగ్ కూడా అదే చేస్తున్నాడు. మీకు గుర్తుందా ఒక పాత యాడ్… అమ్మమ్మ తో మనవరాలు పాప ఏడుస్తున్నదని అంటుంది… యితే గ్రైప్ వాటర్ పట్టు, మీ అమ్మకి నేను అదే పట్టాను. మీ అమ్మ కూడా నీకు గ్రైప్ వాటరే పట్టింది అంటుంది అమ్మమ్మ… జింగ్పింగ్ శాశ్వత అధ్యక్షుడుగా మరోసారి ఎన్నిక జరగాల్సింది […]

యుగపురుష్… మూలపురుష్… జాతిపురుష్… వీళ్లతోనే ఆంధ్రాశకం ఆరంభం…

September 25, 2022 by M S R

ntr ysr

ఎన్టీయార్ అన్నది పేరు కాదు, ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక… ఇది ఎన్టీయార్ కొడుకు బాలయ్య ఉవాచ… హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు తీసేస్తే, ఆ పెద్ద మనిషిని అవమానిస్తే అది కోట్ల మందిని అవమానించినట్టే…. ఇది జగన్ చెల్లె షర్మిల ఉవాచ… ప్రపంచం ఆరాధించే పేరు ఎన్టీయార్… ఇది ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు ఉవాచ… నిజంగా జగన్ నిర్ణయం తిక్కతిక్కగా ఉందని చీదరించుకున్న తటస్థులు కూడా ఇదుగో, ఈ ఎన్టీయార్ అత్యాంతి తీవ్ర […]

బిచ్చపు రేటింగ్స్‌లో మరో బంపర్ హిట్..! ఇది మరీ ఘోరం… ఎందుకంటే..?

September 24, 2022 by M S R

vikram 2

ఆమధ్య మనం ఓ ముచ్చట చెప్పుకున్నాం… ఎంతటి థండర్ స్ట్రయిక్ సినిమాలైనా సరే, టీవీ ప్రసారంలో బోల్తా కొడుతున్నయ్… చేతులు ఎత్తేస్తున్నయ్… అవీ మామూలుగా కాదు, టీవీ సర్కిళ్లు- ఫిలిమ్ సర్కిళ్లు విస్తుపోతున్నయ్… ఈ పరిణామం రాబోయే రోజుల్లో టీవీ ప్రసార హక్కుల రేట్లను దారుణంగా ప్రభాావితం చేయబోతోంది… మీకు గుర్తుంది కదా… ఆర్ఆర్ఆర్ రేటింగ్స్ సాధనలో ఫెయిలైందని రాసుకున్నాం… తరువాత కేజీఎఫ్-2 రేటింగ్స్ అయితే మరీ ఘోరం… ఇప్పుడు తాజాగా కమల్‌హాసన్ బ్లాక్ బస్టర్ సినిమా […]

పర్సులో యాలకులు, దిండు కింద లవంగాలు..! ఏది సైన్స్, ఏది సెన్స్…?!

September 24, 2022 by M S R

tech news

( ……. ఆకుల అమరయ్య ……… ) బీకాంలో ఫిజిక్స్‌.. జంతుశాస్త్రంలో బోటనీ.. ఆకాశం నుంచి రుదిరం.. టెంపులంటే కణతనే మరో అర్థముందనే తెలియక ఆలయమేనని బలంగా బల్లగుద్ది మరీ చెప్పే నడమంత్రపు కాలమిది. అటువంటి కాలంలో ఉసిళ్లు (వర్షాకాలంలో వచ్చే రెక్కల పురుగులు), పుట్టకొక్కులు (ముష్రూం), ఖగోళ శాస్త్రం (స్పేస్‌ సైన్స్‌), బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide), విషావరణం (పొల్యూషన్‌), శ్వాసించే గృహం (ఎయిర్‌ కండిషన్డ్‌ హౌస్‌), తొవ్వోడు (డ్రెడ్జర్‌) అంటే ఎవరికి తెలుస్తుంది, చెప్పండి.. […]

కొమ్మూరి సాంబశివరావుతో దర్శకుడు వంశీ ఇంట్రస్టింగు సంభాషణ…!

September 24, 2022 by M S R

vamsy

మలయాళ సినిమా పేరు తంత్రం… బాగానే ఆడుతోంది… మలయాళం వాళ్లు కథల్లో భలే ప్రయోగాలు చేస్తారు… ఆ హీరోలు కూడా నిక్షేపంగా అంగీకరిస్తారు… ఓ పిరికి లాయర్ మమ్ముట్టి, పక్కన హీరోయిన్ ఉండదు, పాట ఒక్కటీ లేదు… కామెడీ మచ్చుకైనా కనిపించదు… సో, అవి యాడ్ చేసుకుంటే ఓ మంచి సినిమా అవుతుందిలే అనుకున్నాడు దర్శకుడు వంశీ… కామెడీ యాడ్ చేయాలి కదా, రాజేంద్రప్రసాద్ బెటర్ అని కూడా అనుకున్నాడు… రాజమండ్రి దగ్గర బొమ్మూరు నుంచి ఓ […]

మైండ్ ఖరాబ్… ఆ స్టేడియంలో మ్యాచ్ చూస్తే మజా ఏముందిరా ..?

September 24, 2022 by M S R

hca

హమ్మయ్య… కాస్త సద్దుమణిగింది… హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల తొక్కిసలాట, పోలీసుల లాఠీ ఆట, నిర్వాహకుల డబ్బుల ఆట… మీడియా కన్నులపంట… గంటల తరబడీ చూపించే చూపి, వాగిందే వాగి, పెంటపెంట చేశారు… ఆమె ఎవరో తన బిడ్డ ఈ దేశం కోసం గాయాలపాలైనట్టు విలపిస్తోంది… ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టీవీ చానెళ్లలో ఎండగడుతోంది… ఈరోజు కాస్త హడావుడి తగ్గింది… మనకు ఎలాగూ పీఎఫ్ఐ ముప్పులు, ఖలిస్థానీ ముప్పులు పనికిరావు, కనిపించవు కదా… మళ్లీ ఎన్టీయార్, […]

థియేటర్ దొరకదు… ఓటీటీ కొనదు… సో వాట్… ఇదొక రిలీజ్ మార్గం…

September 24, 2022 by M S R

mangalyam

సినిమా… షూటింగుకు ఆర్టిస్టుల కష్టాలు, డబ్బు కష్టాలు, పర్మిషన్ల కష్టాలు… అంతా అయ్యాక సెన్సార్ కష్టాలు… బూతులు, అసభ్య సీన్లుంటే నో అనేస్తారు… రియాలిటీకి దగ్గరగా తీసినప్పుడు కొన్ని తప్పవు సార్ అంటే ఎవడూ వినడక్కడ… తరువాత థియేటర్ కష్టాలు… అదొక పెద్ద సిండికేటు… థియేటర్లు సాధించడం అంటే నోబెల్ ప్రయిజ్, ఆస్కార్ అవార్డు గెలిచినంత పెద్ద టాస్కు… ఒకవేళ దొరికినా మౌత్ టాక్ ఉంటే జనం వస్తారు, లేకపోతే దేకరు… ఓటీటీ వాళ్లు కూడా స్టార్ […]

బండ్ల పాల్ సుహాసిని..! తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడేసింది..!

September 24, 2022 by M S R

suhasini

సుహాసినిని ఒకతరం తెలుగు సినిమా ప్రేక్షకులు బాగా ఇష్టపడేవాళ్లు… ఈతరానికి ఆమెతో పెద్దగా కనెక్షన్ లేదు… అకడమిక్‌గా ఆమె చారుహాసన్ బిడ్డ, కమలహాసన్ అన్న బిడ్డ, మణిరత్నం భార్యగానే తెలుసు… ఆమె నటనలో దిట్ట… ఎంతయినా హాసన్ కుటుంబం కదా… అయితే, చాన్నాళ్లుగా ఆమె తెలుగు తెరపై లేదు… అరవయ్యేళ్లు వచ్చాయి కదా, తన యాక్టివిటీస్‌ను బాగా పరిమితం చేసుకుంది, ఎక్కువగా తమిళంకే కుదించుకుంది… ఆమధ్య ఎన్నికలవేళ కమలహాసన్ పార్టీ ప్రచారం కోసం శృతిహాసన్‌తో కలిసి సుహాసిని […]

అసలే ఆడ బౌన్సర్ కథ… అందులోనూ తమన్నా… ప్చ్, సాదాసీదాగా చుట్టేశారు…

September 23, 2022 by M S R

tamannah

ఫతేపూర్ బేరి… బబ్లీ బౌన్సర్ సినిమాలో చూపించిన ఈ గ్రామం నిజంగానే ఉంది… ఢిల్లీ పరిసరాల్లో ఉంటుంది… అక్కడి యువకులు రోజూ బాగా వ్యాయామాలు అవీ చేసి, కండలు పెంచి, ఫుల్ ఫిజికల్ స్టామీనాతో ఢిల్లీలో బౌన్సర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా కొలువులు సంపాదిస్తారు… ఆ ఊరు దీనికి చాలా ఫేమస్ కావడంతో పలు సెక్యూరిటీ సంస్థలు కూడా వాళ్లకు ఇట్టే కొలువులు ఇచ్చేస్తాయి… నమ్మకస్థులు… యువకులు మాత్రమే బౌన్సర్లు కావాలా..? మేమేం తక్కువ అని సవాల్ చేసి, […]

ఆయన చెబుతాడు… బిగ్ బాస్ పాటిస్తాడు… ఇప్పుడు మరీ బహిరంగమే…

September 23, 2022 by M S R

rgv

రాంగోపాలవర్మ… కడుపులో వోడ్కా పడితే తనేం చేస్తాడో తనకే తెలియదు… ఏం కూస్తాడో, ట్విట్టర్‌లో ఏం రాస్తాడో, సినిమా ఏం తీస్తాడో అసలే తెలియదు… అంతేనా..? పెగ్గు ఎక్కువైతే ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తాడో కూడా కొన్ని వీడియోలు చూశాం కదా… అసలు తను ఓ బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్‌కు వోట్లు గుద్దేయాలంటూ ఓ బహిరంగ అప్పీల్‌కు పాల్పడ్డాడంటేనే హాశ్యర్యంగా ఉంది… అదిప్పుడు చర్చనీయాంశం అయ్యింది కూడా… బిగ్‌బాస్ ఇన్నర్ సర్కిళ్లు, తెలుగు టీవీ-సినిమా సర్కిళ్లలో చాలామందికి […]

దాదాపు మొత్తం సినిమా ఆ కారులోనే… ఇంట్రస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్…

September 23, 2022 by M S R

survival

శరత్ కుమార్ చింత…..   దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌.. ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. రెండు రోజుల ముందే ఈ మూవీని రామానాయుడు స్టూడియోలో చూశాను. ఈ మూవీ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి చిన్న కొడుకు సింహా కోడూరి అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ ఈ మూవీకి డైరెక్టర్ స‌తీష్ త్రిపుర రామానాయుడు ఫిల్మ్ స్కూల్ 2008 బ్యాచ్ స్టూడెంట్.. సురేష్ ప్రొడక్షన్ లో కొన్ని […]

సాక్షి ఖాతాలోకి మరో క్రెడిట్… INS అధ్యక్షుడిగా KRP Reddy…

September 23, 2022 by M S R

krp

సాక్షి దినపత్రిక ఖాతాలోకి మరో క్రెడిట్ వచ్చిచేరింది… నిజంగా విశేషమే… సాక్షి డెయిలీలో ప్రస్తుతం అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న కె.రాజప్రసాదరెడ్డి… అలియాస్ కేఆర్పీ రెడ్డి ఐఎన్ఎస్ (ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ) కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు… ప్రిస్టేజియస్ పోస్ట్… ఇది ఎందుకు విశేషం అంటే..? ఐఎన్ఎస్ 1939లో ఏర్పడింది… అంటే 83 సంవత్సరాల క్రితం… తెలుగు పత్రికల తరఫున ఇంతకుముందు ఎవరూ దీని అధ్యక్ష పదవిని పొందలేదు… ఇది తొలిసారి… అన్ని భాషల్లో కలిపి 1,10,851 […]

ఆ ముగ్గురి సొగసులే మణిరత్నం భారీ సినిమాకు ఇంధనం…

September 23, 2022 by M S R

trisha

రోజూ వంద మంది స్టార్స్ వస్తుంటారు… పోతుంటారు… సినిమా ఇండస్ట్రీ ఓ దీపం… మిడతలు ఆకర్షింపబడుతూనే ఉంటాయి… ఒక లేడీ స్టార్ ఎన్నేళ్లు తెరపై తన సొగసును, తన పాపులారిటీని, తన మెరిట్‌ను, తన జీల్‌ను కాపాడుకుంటూ ఉండగలదు… మహాఅయితే ఆరేడేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు… అది చాలా ఎక్కువ పీరియడ్… కొన్ని మినహాయింపులు ఉంటాయి… వారిలో త్రిష ఉంటుంది… ఐశ్వర్యారాయ్ ఉంటుంది… సేమ్, అదే లుక్కు… ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగో… అలాగే… వీరిద్దరిలోనూ ఐశ్వర్య భిన్నమైన స్టోరీ… […]

సచిన్ పైలట్… బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే మరో ఏకనాథ్ షిండే…

September 23, 2022 by M S R

sachin pilot

ప్రజలు ఏం తీర్పు చెప్పారు అనేది బీజేపీకి అవసరం లేదు… ఏం చేస్తే గద్దెనెక్కగలం..? స్ట్రెయిట్‌‌గా గెలిస్తే వోకే, లేదంటే ఏం చేద్దాం..? ఇదొక్కటే ఫోకస్… యుద్ధంలో, శృంగారంలో ఏదీ తప్పు కాదు, సేమ్, రాజకీయాల్లో కూడా..! ఇదేమీ వాజపేయినాటి కాలం కాదు, ఇది మోడీషా జమానా… కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని కూలదోసిన తమకు రాజస్థాన్ మింగుడుపడకపోవడం బీజేపీకి నచ్చడం లేదు… జీర్ణం కావడం లేదు… మహారాష్ట్రలో కూడా బలమైన దెబ్బ తీయగలిగింది ప్రత్యర్థుల […]

అల్లూరి వారు ఆకట్టుకోలేకపోయారు… మరోసారి శ్రీవిష్ణు వృథా ప్రయాస…

September 23, 2022 by M S R

lohar

మొన్నోసారి చెప్పుకున్నాం… కాయదు లోహార్ గురించి… ఎవరీమె అంటారా..? అస్సలు ఇండియన్ సినిమా ఇండియన్ లేడీస్‌గానే గుర్తించని, ప్రోత్సహించని ఈశాన్య రాష్ట్రాల అమ్మాయి, అందులోనూ అస్సామీ సొగసు అని చెప్పుకున్నాం కదా… ఆమె పేరు పలకడానికి అల్లు అర్జున్ అల్లూరి సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో అవస్థలు పడ్డారని కదా చెప్పుకున్నాం… ఈ సినిమా చూడటానికి అంతకన్నా చాలా చాలా అవస్థలు పడాలి… ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ కాయదు లోహార్ మాత్రమే… ఉన్నంతసేపు […]

Krishna Vrinda Vihari :: ఒక ప్లెయిన్, క్లీన్ కామెడీ లవ్ ఎంటర్‌టెయినర్…

September 23, 2022 by M S R

shirley

నాగశౌర్య… అదేదో లక్ష్య అనే సినిమా కోసం, బాడీ ఎక్స్‌పోజర్ కోసం తొమ్మిదిరోజులు మంచినీళ్లు తాగలేదు అని చేసిన ప్రకటన నవ్వు పుట్టించింది… కృష్ణ విృంద విహారి సినిమా కోసం సాగించిన పాదయాత్ర మరీ అబ్సర్డిటీ… అప్పట్లో ఏదో రిసార్ట్ కేసులో ఇరుక్కున్నాడు… అప్పట్లో సాయిపల్లవితో గొడవలు… సినిమాలు వరుస ఫ్లాపులు… నిన్న ఎవరో జర్నలిస్టు వేసిన బ్రాహ్మణ భాష సంబంధ ప్రశ్నకు జవాబు లేక తత్తరపడిపోయాడు… తన కెరీర్ గమనిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది… ఐనాసరే, తన్లాడుతూనే […]

ఫాఫం… రమ్యకృష్ణతో స్టెప్పులు వేయించినా ఫాయిదా లేకపాయె…

September 23, 2022 by M S R

ramya krishna

కొన్నాళ్లు తెలుగు టీవీల్లో, ఓటీటీలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పోటీ నడిచింది… ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ బాగా క్లిక్కయింది… అదేసమయంలో టీవీ చానెళ్లలో, ప్రత్యేకించి జీతెలుగులో వచ్చిన సరిగమప పెద్దగా ఆకట్టుకోలేదు… బోలెడు మంది జడ్జిలు, మెంటార్లు, హంగామా, ఖర్చు అసలు సంగీతం అనే కాన్సెప్టును గంగలో కలిపేసింది… దాన్నొక రెగ్యులర్ టీవీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రోగ్రాంగా మార్చారు… సేమ్, స్టార్ మాటీవీ… సూపర్ సింగర్ అని స్టార్ట్ చేసి, దాన్ని కూడా సరిగమపను మించిన నాసిరకం ప్రోగ్రాంగా […]

  • « Previous Page
  • 1
  • …
  • 350
  • 351
  • 352
  • 353
  • 354
  • …
  • 420
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions