Rajan Ptsk…………. తెలుగు “కోరా”లో ఓ అపరిచిత వ్యక్తి అడిగిన ప్రశ్న: నేను (25) ఇప్పటి వరకూ మద్యం సేవించలేదు. మానసిక ఒత్తిడి తో ఆరోగ్యం చెడగొట్టుకునే కన్నా మద్యం సేవించి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా. నేను దేనితో (మద్యం రకం) మొదలు పెడితే మంచిది? . రాజన్ పి.టి.ఎస్.కె సమాధానం: మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందుగా […]
నచ్చింది వార్త..! పెళ్లిళ్ల భారీ ఖర్చులపై ‘క్యాంపెయిన్’ ఇలాగే సాగాలి..!!
కొన్ని వార్తలు అసలు ఎందుకు మెయిన్ స్ట్రీమ్‌కు కనిపించవో, అవి వార్తలుగా ఎందుకు పరిగణనలోకి తీసుకోరో అర్థం కాదు… సొసైటీకి మంచి జరిగే ఆలోచనలు, వార్తలు మెయిన్ స్ట్రీమ్‌కు అస్సలు అక్కరలేదా..? ఈ వార్త ఫేస్బుక్లో ఓ మిత్రుడి వాల్ మీద కనిపించింది… వేములవాడలో ముస్లిం కమ్యూనిటీ ఓ భేషైన నిర్ణయం తీసుకుంది… అదేమిటో మీరే చదవండి… Mujahid Pasha…………. అమ్మాయి పెళ్లిలో విందు భారం వద్దు వేములవాడ గ్రామస్థుల తీర్మానం నికాహ్ (పెళ్లి) ఖర్చు అమ్మాయి తల్లిదండ్రులకు […]
ఆ అక్క కన్నీటిలాగే… ఆంధ్రజ్యోతి జర్నలిజమూ ఎండిపోయినట్టుంది…
ఒక హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తను ప్రజల్ని కనెక్టయ్యేలా రాయడం ఒకెత్తు… దాన్ని బరువైన హెడ్డింగ్‌తో, మంచి శైలితో రీరైట్ చేసి, పాఠకులకు ప్రజెంట్ చేయడం మరో ఎత్తు… మొదటిది రిపోర్టర్ పని… రెండోది డెస్కులో సబ్ఎడిటర్ పని… ప్రస్తుతం జర్నలిజం ప్రమాణాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి, ఆ చర్చలోకి వెళ్లకుండా… ఈ ఒక్క వార్త సంగతే ఆలోచిద్దాం… నిజానికి మనల్ని కదిలించే వార్త… గుండెల్ని కొన్నివార్తలు మెలితిప్పుతాయి… ఇదీ అలాంటిదే… విధివంచిత కుటుంబాలు, జీవితాలు… […]
చెన్నైలో రజినీ బిడ్డ ఐశ్వర్య… హైదరాబాదులో చిరంజీవి బిడ్డ శ్రీజ… ఒకేరోజు..?!
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ విడాకుల వార్త ఇప్పుడు గాసిప్ కాదు, రూమర్ కాదు… హఠాత్తుగా అది అధికారికం అయిపోయింది… ధనుషే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు కాబట్టి…. కానీ ఒకవైపు తమిళ సుప్రీం మెగా స్టార్ రజినీకాంత్ బిడ్డ విడాకుల వార్త టాంటాం అయినరోజే… తెలుగు సుప్రీం మెగా స్టార్ చిరంజీవి బిడ్డ విడాకుల వార్త కూడా ఒక్కసారిగా టాంటాం అయిపోతోంది… సరే, ధనుష్ విడాకుల వార్త అధికారికం… మరి చిరంజీవి బిడ్డ సంగతి..? […]
ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయినట్టు..? 18 ఏళ్ల బంధం ఎందుకు తెగినట్టు..?!
పెద్ద విశేషం ఏమీ అనిపించదు కొన్నిసార్లు… టీవీ, సినిమా, మోడల్ రంగుల రంగాలే కాదు… సాధారణంగానే విడాకుల కేసులు పెరిగిపోతున్నయ్… ఏళ్లపాటు కాపురాలు చేసి, పెద్ద పిల్లలు ఉన్న దంపతులు సైతం విడిపోయి, ఎవరి బతుకులు వాళ్లు బతకడానికి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు… అడ్జస్ట్మెంట్ అనేది లేదిప్పుడు… కటీఫ్ అనేస్తున్నారు… అయ్యో, రేపు పిల్లల మెదళ్లపై పడే ప్రభావం ఏమిటి అనే సున్నితమైన భావన కూడా ఎవరినీ ఆపలేకపోతోంది… కానీ కొన్ని విడాకుల వార్తలు వినగానే విభ్రమ, షాక్ […]
నాగ బాబుగారొచ్చారు కదా… శ్రీముఖి ఎగిరిపోయింది… దీపిక పిల్లిలా వచ్చి చేరింది…
1.67 …. ఏదైనా టీవీలో రియాలిటీ షోకు, అదీ భారీగా ఖర్చుపెడుతున్న షోకు ఈ రేటింగ్ వచ్చిందంటే… మూసుకోవోయ్, ఇక చాలు అని ప్రేక్షకుడు స్పష్టంగా తిరస్కరించినట్టు లెక్క… ఆ షోలో నాణ్యత లేదని తేల్చేసినట్టు లెక్క… బ్రహ్మాండమైన రీచ్, సాధనసంపత్తి ఉన్న చానెల్లో ఓ షోకు ఆ రేటింగ్ వస్తే ప్రేక్షకుడు అభిశంసించినట్టు లెక్క… ఈటీవీ వాడి జబర్దస్త్‌కు పోటీగా స్టార్‌మాటీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే షో దుర్గతి అది… హైదరాబాద్ బార్క్ రేటింగులు […]
రండి… రియల్ దోస్త్ ఒమిక్రాన్‌ను ఆహ్వానిద్దాం… పర్లేదు, కోవర్జినిటీ కోల్పోదాం…
ఏమిటి ఈ దారుణమైన స్టేట్మెంట్ అనిపిస్తోందా..? ప్రపంచంలో కొన్ని లక్షల కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన చైనా వాడి నీచ వైరస్‌ను ఆహ్వానించడం ఏమిటి అని ఆశ్చర్యమేస్తోందా..? కానీ నిజంగానే ఓసారి ఆహ్వానించాలి… అది వచ్చి అలుముకుంటే ఆనందించాలి… హమ్మయ్య, దేవుడిచ్చిన బూస్టర్ డోస్, అసలైన వేక్సిన్ అని ఆనందపడాలి… అవును, ఒమిక్రాన్ వేరియంట్ వస్తానంటే అస్సలు వద్దనకూడదు… అడ్డుకోకూడదు… ఛల్ హట్, ఇంకా ఇంకా దిక్కుమాలిన బూస్టర్ డోసులు, దానికి డప్పుపాడే వుహాన్ బిడ్డల వంటి మీడియా […]
ఈ చిన్న వీడియో బిట్… మనల్నీ ఓ అవ్యక్త ఉద్వేగానికి గురిచేస్తుంది…
అతను జన్మత బ్రిటిషర్… అతని తల్లి పేరు హన్నా… ఆమెవి స్పానిష్, ఐరిష్ రూట్స్… తండ్రి చార్లెస్వి ఫ్రెంచి రూట్స్… ఇద్దరూ వృత్తిరీత్యా నటులు… ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలతో డబ్బులు బాగానే వచ్చేవి… కానీ వచ్చిందంతా తండ్రి తాగుడుకే తగలేసేవాడు… ఇంట్లో అదే పేదరికం… ఆ తండ్రి కొన్నాళ్లకు ఆ కుటుంబాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు… మరికొన్నాళ్లకి చనిపోయాడు… తల్లి అష్టకష్టాలు పడి, పిల్లలను పెంచింది… కొన్నాళ్లకి ఆమెకి మతి చలించింది.., ఉన్మాదిని కావడంతో […]
అపర్ణ యాదవ్… ఈమెది ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ… ఆ కుటుంబం మీద కులప్రభావం…
అపర్ణ… అపర్ణ యాదవ్… అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బలమైన పార్టీ సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ చిన్న కోడలు… అఖిలేష్ యాదవ్ మరదలు… మళ్లీ ముఖ్యమంత్రి పీఠం కావాలని నానా ప్రయత్నాలూ చేస్తున్న ఆ కుటుంబం నుంచి ఓ మహిళ బీజేపీలోకి వెళ్లనుందనే వార్త ఖచ్చితంగా ఇంట్రస్టింగు… ఒకవైపు బీజేపీలో టికెట్లు దొరకని వాళ్లను ఎస్పీ అక్కున చేర్చుకుంటుంటే… ఏకంగా ఎస్పీ బాస్ ఫ్యామిలీ మెంబరే బీజేపీలోకి పోవడం విశేషమే… వెళ్తే…!! అసలు ఈమె నేపథ్యమేంటి..? […]
ఆంధ్రజ్యోతి ఆర్కే, దీన్నే థర్డ్ రేట్ ఇంటర్వ్యూ అంటారు… ఎందుకీ దిగజారుడు..?!
సినిమా టికెట్ల ధరల తగ్గింపు, చిరంజీవి రాయబారం, హీరోల రెమ్యునరేషన్ల రచ్చ, వైసీపీ నేతల విమర్శలు, సినిమావాళ్ల ఎదురుదాడి, తెలుగుదేశం వైఖరి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ధోరణి, రాంగోపాలవర్మ దౌత్యం……. వీటి జోలికి పోవడం లేదు ఇక్కడ… అన్ని వైపులా తప్పుంది… ప్రత్యేకించి ప్రభుత్వ ఆలోచనల ధోరణిలోనూ తప్పుంది… దాన్నలా వదిలేద్దాం… రాంగోపాలవర్మ పేర్ని నాని దగ్గరకు దౌత్యానికి వెళ్లాడు… ఏం జరిగింది..? ఏమీ జరగదు… అక్కడ జగన్ ఆలోచనల్లో మార్పు రాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో వీసమెత్తు తేడా, […]
ఇప్పటి నిర్మాతలకు ‘‘అన్ని విద్యలూ తెలుసు’’… ఒకప్పటి నిర్మాతలు వేరు ఫాఫం…
Bharadwaja Rangavajhala………… పాపం నిర్మాతలు … ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయనా … మరి ఆ యొక్క 1975 మార్చి పదహారో తారీఖున మద్రాసు పాండీబజార్ లో ఉండినటువంటి రాజకుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు కదా … దరిమిలా నిర్మాతా … అంతకు ముందు డిటెక్టివ్ నవలల పత్రిక నడిపేవాడూ అతనూ … రోటీ అని మన్మోహన్ దేశాయ్ తీసిన .. రాజేశ్ ఖన్నా మరియూ ముంతాజూ […]
ఓ పాత పరుపు, నాలుగు వంటపాత్రలు… బయటపడేసి బజారులో నిలబెట్టాడు ఓనర్…
అనామకంగా… ఓ సాదాసీదా అపార్ట్మెంట్… ఒక్కడే బతుకుతూ ఉండేవాడు… నియమబద్ధ జీవితం… మధ్యతరగతి జీవనం… ఎవరి మీదా ఆధారపడి బతకడం ఇష్టం లేదు… ఓనర్ తరచూ విసుక్కునేవాడు… అద్దె సరిగ్గా కట్టడం లేదంటూ నిందించేవాడు… ఇల్లు ఖాళీ చేసి, వెళ్లిపో అని అరిచేవాడు… ఆయన మౌనంగా భరించేవాడు, మీ అద్దె అణా పైసలతో సహా చెల్లిస్తాను అని చేతులెత్తి ఓ దండం పెట్టేవాడు… డబ్బు ఎక్కడ ఎలా కాస్త అడ్జస్టయినా ముందుగా అద్దె కట్టేవాడు… ఐనా కొన్నినెలలు […]
మీ చుట్టూ కరోనా కేసులు పెరుగుతున్నాయా..? ఓసారి ఇది తప్పక చదవండి..!
Amarnath Vasireddy……. కరోనా ఓమిక్రాన్ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా విసరిస్తోంది . భయపడాల్సిన అవసరం లేదు . బాగా చదివి అర్థం చేసుకొని పాటించండి . ఓమిక్రాన్ సోకిన వారికి కనిపించే లక్షణాలు . 1 . జలుబు , గొంతు గరగర; ఒక్కోసారి దగ్గు . ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి . 2 . జ్వరం .. కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తోంది . ఎక్కువ మందికి జ్వరం రావడం […]
ఎంత తిట్టిపోసినా సరే.., మళ్లీ నాడిచూసి, గోలీలు ఇచ్చేది ఆ అమెరికావాడే…
నిజానికి నాయకుల వ్యక్తిగత అనారోగ్యం, జబ్బులు, వాటి చికిత్సలకు సంబంధించిన విమర్శలు నీచస్థాయి… ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడి ఆరోగ్యం కోసం ఆ రాష్ట్ర ఖజానా నుంచి నాలుగు రూపాయలు ఖర్చు చేస్తే దాన్ని ఖండించి, తమ రాజకీయ విధానాలతో కలగలిపి, ఏవేవో మాట్లాడేసి, రచ్చ చేయడం థర్డ్ రేట్ ధోరణి… కానీ సోషల్ మీడియాకు ఆ సంస్కారాలు ఏమీ పట్టవు… తిట్టిపోయడమే… కడుక్కోవడం నీ వంతు… అంతే… అయితే అసలు విషయం ఏమిటంటే..? కేరళ […]
పండుగపూట… మరీ ఉప్పూకారం లేని పథ్యం చప్పడి తిండి వడ్డించారు కదరా…
పండుగపూట ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న చౌక వినోదం టీవీ… థియేటర్లకు వెళ్తే నిలువుదోపిడీ… మన ధనిక ప్రభుత్వ అత్యంత తీవ్ర ఔదార్యం పుణ్యమాని ఈ థియేటర్ల వాళ్లు నిలబెట్టి జేబులు కత్తిరిస్తారు… పైగా ఒమిక్రాన్ భయం ఉండనే ఉంది… వేరే బయట వినోద కార్యక్రమాలు, పర్యటనలకు వెళ్లేంత సీన్ లేదు… సో, టీవీయే శరణ్యం… కానీ ఈసారి భోగి, సంక్రాంతి పండుగ వంటల్ని మన ప్రధాన టీవీలు ఈటీవీ, జీతెలుగు, స్టార్‌మా మరీ చప్పిడి పథ్యం […]
‘‘మీ తమ్ములుంగారికి సంగీత జ్ఞానం ఉందిట, చేయించుకొండి, మేమెంత..?’’
Bharadwaja Rangavajhala……….. దానవీరశూర కర్ణ విడుదలై నలభై ఐదు ఏళ్లయ్యిందని టీవీ 9 ఛానల్లో ఉదయం చూశాను. బానే ఉంది కానీ … ఆ సినిమాకు మొదట అనుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అనే విషయం చెప్తూ అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు అన్నారు . రాజేశ్వర్‌రావు గారు చేసిన ఓ ట్యూన్ వరుస కొంచెం సవరిస్తే బాగుండు అని త్రివిక్రమ రావు గారు అభిప్రాయపడడంతో సాలూరి వారు విరమించుకున్నారు… మర్నాడు ఎన్టీఆర్ ఫోన్ చేసి, […]
పేద్ద గన్ను పట్టుకుని… వాయించడానికి వచ్చేశాడు మరో ‘హీరో’…
నిఖిల్ గౌడ… మాజీ ప్రధాని దేవగౌడ మనమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు… ఆ కుటుంబ రాజకీయానికి వారసుడు… ఆమధ్య సుమలత మీద జనతాదళ్ (ఎస్) తరఫున పోటీచేసి, ఓడిపోయాడు… పొలిటిషియన్ మాత్రమే కాదు, సినిమా హీరో… 4 సినిమాల్లో హీరో… జాగ్వార్ అని తెలుగులో కూడా వచ్చింది… రెండు పడవల మీద కాళ్లు వేసి, కథ నడిపిస్తూ ఉంటాడు… ఉదయనిధి స్టాలిన్… ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, కరుణానిధి మనమడు… ప్రస్తుతం ఎమ్మెల్యే, డీఎంకే యూత్ వింగ్ […]
‘గీతలు’ చెరిపేసుకున్న విశ్వమానవులు వీళ్లు… ఐకన్స్ ఆఫ్ ఇండియన్ రూట్స్ కూడా…
మనకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురించి ఎంతో కొంత తెలుసు కదా… తల్లి శ్యామల గోపాలన్ తమిళురాలు… తన రూట్స్ మరిచిపోలేదు… తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందినవాడు… భర్త డగ్ ఎమ్హాఫ్ అమెరికన్… ఇప్పుడు మరో ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తున్నయ్… 1) ప్రీతి పటేల్… 2) రిషి సునక్… ఈ ఇద్దరూ బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో కనిపిస్తున్నారు… వీరిలో ప్రీతిపటేల్ ప్రస్తుతం హోం సెక్రెటరీ… రిషి సునక్ ఆర్థిక […]
విఠలాచార్య..! జానపదం తీయాలంటే తిరుగులేని పేరు… ఎకానమీ దర్శకుడు…
Bharadwaja Rangavajhala…………… జై విఠలాచార్య…. విఠలాచార్య ఈ పేరు వినగానే చిన్నప్పుడేమిటి ఇప్పుడూ పూనకం వచ్చేస్తుంది. మా స్కూల్ డేస్ లో క్లాసురూమ్ లో విఠలాచార్య ప్రభావంతో రైటింగ్ పాడ్ ను డాలుగా పట్టుకుని చెక్క స్కేలును కత్తిగా చేసుకుని చేసిన యుద్ధాలన్నీ గుర్తొచ్చేస్తాయి. కాస్త హయ్యర్ క్లాసులకొచ్చాక విఠలాచార్య మీద బోల్డు సెటైర్లేసేవాళ్లం. మా చిగులూరి శ్రీనివాస్ అయితే అట్టలాచార్య అనేవాడు. అంతా సెట్టింగుల్లోనే కానిచ్చేస్తాడనేది వాడి ఆరోపణ. ఇక విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే […]
సూపర్ మచ్చి హీరోయిన్..! తెలుగు వెండితెరకు మరో కన్నడకస్తూరి..!
ఆమధ్య హీరోయిన్ కావాలంటే తమిళ, మలయాళ ఇండస్ట్రీ వైపు చూసేవాళ్లు… నటన తెలుసు, కష్టపడతారు, కమిటెడ్‌గా వర్క్ చేస్తారు, అందంగా ఉంటారు… ఇండస్ట్రీ పట్ల హంబుల్‌నెస్ కనిపిస్తుంది… తరువాత ఏమైంది..? కన్నడ కస్తూరి తెలుగు తెరను ఆవరించేసింది… అసలు బుల్లితెర హీరోయిన్లందరూ వాళ్లే… నిజానికి వాళ్లు కూడా బాగా చేస్తున్నారు… వెండితెరకూ వాళ్లే కనిపిస్తున్నారు… రష్మిక ఇప్పుడు ఎంత టాపో తెలుసు కదా… తాజాగా రచిత రామ్… చిరంజీవి అల్లుడు ‘విజేత’ సినిమా తరువాత తాజాగా సూపర్ […]
- « Previous Page
- 1
- …
- 361
- 362
- 363
- 364
- 365
- …
- 466
- Next Page »