సినిమా అంటేనే దృశ్య ప్రధానం… కథను సీన్లు చెప్పాలి, పెద్ద పెద్ద స్పీచులు కాదు… డైలాగులు కాదు… వోకే, సినిమాకు మంచి డైలాగులు బలం, కానీ డైలాగులే ఏ సినిమాకూ బలం కాదు..! బొమ్మరిల్లు అని అప్పట్లో ఓ హిట్ సినిమా తీసిన భాస్కర్‌కు ఈ విషయం తెలియక కాదు, కానీ ఆయన నమ్ముకున్న పంథా అదే..! మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనే ఓ డైలాగ్… తామరాకు మీద రసం… అవును, ఈ దర్శకుడు ఏదో చెప్పాలనుకుని […]
ఫాఫం, చివరకు నీ బతుకు ఎందుకిలా అయిపోయింది దర్శకేంద్రా..?
ఫాఫం… దర్శకేంద్రుడిగా పిలిపించుకున్న అలనాటి పాపులర్ నంబర్ వన్ దర్శకుడు రాఘవేంద్రరావును చూస్తే జాలేసింది… నవ్వొచ్చింది… ప్రతి పండుగకీ ఈటీవీ వాళ్లు ఏదో ఓ స్పెషల్ ప్రోగ్రాం చేస్తారు కదా… ఈసారీ చేశారు… పేరు దసరా బుల్లోళ్లు… ప్రదీప్, ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను, పొట్టి నరేష్‌తోపాటు సరే, ఎలాగూ ఉంటారు కదా… రోజా, శేఖర్ మాస్టర్ ఎట్సెట్రా… ఉన్నారు, మూడు గంటలపాటు ఏదేదో చేశారు, నవ్వించే ప్రయత్నం చేశారు… అంతమంది కమెడియన్లు ఉన్నా సరే, […]
రానురాను ఈ మాఫియాలే మానవాళికి అతి పెద్ద విపత్తు… పీల్చి చంపేస్తయ్…!!
మొన్న హెటిరో డబ్బు కట్టలు అంటూ ఓ బీరువా నిండా పేర్చిన కరెన్సీ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది… దాదాపు 1200 కోట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ అంటోంది… ఎహె, అసలు హెటిరో ఏమిటి..? డ్రగ్ కంపెనీలన్నీ కరోనా సీజన్లో కరెన్సీ నోట్లను తవ్వుకున్నయ్… వందలు, వేల కోట్లు… ఇక హాస్పిటల్స్ అయితే పక్కా నిలువు దోపిడీ కేంద్రాలుగా మారిపోయినయ్… ప్రాణాలు దక్కుతాయా లేదా అనేది లేదు… రోజుకు ఎంత..? నో ఇన్స్యూరెన్స్, […]
ఆర్కే..! దశాబ్దాల సాయుధ పోరాటం..! ప్రభుత్వంతో చర్చల ప్రధాన ప్రతినిధి.. !!
అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే… మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు… దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటమే బతుకు… ఉద్యమ నిర్మాణమే లక్ష్యం… అంతుచిక్కని వ్యాధితో అడవుల్లో మరణించాడనే వార్త టీవీ చానెళ్లలో కనిపిస్తోంది… వీటి ధ్రువీకరణ సంగతేమిటో గానీ… ఆయన మీద గతంలో బొచ్చెడు ఫేక్ వార్తలు అనేకసార్లు… అదుగో అరెస్టయ్యాడు, ఇదుగో మరణించాడు, అదుగదుగో పోలీస్ బలగాలు చుట్టుముట్టి మట్టుబెట్టాయి, లొంగుబాటకు రెడీ… ఇలాంటి బోలెడు తప్పుడు వార్తలు గతంలో చదివాం, విన్నాం… ఇప్పుడు […]
ఆంధ్రజ్యోతి ఎడిటర్ మహాశయా… ఈ వార్త ప్రచురణ తీరుపై ఓ చిన్న డౌట్…
నాకొచ్చిన పెద్ద డౌట్ ఏమిటంటే..? ఈ వార్తలో ఆమె ఫోటోలో మొహాన్ని ఎందుకు బ్లర్ చేశారు..? ఆమె తప్పు చేసిందా..? ఆమె ఐడెంటిటీ బయటపడకూడదా..? ఎందుకు..? ఆమె పెళ్లి చేసుకుంది… మరి మొహం ఎందుకు చూపించకూడదు..? అసలు ఈ వార్తను ఈ పేజీలో పెట్టిన సబ్ఎడిటర్ భావన ఏమిటి..? ఆమె ఏ కేసులోనూ నిందితురాలూ కాదు, పోలీస్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అక్కర్లేదు… ఆమె ఏ కేసులోనూ బాధితురాలు కాదు, మొహం ప్రచురించకుండా ఉండటానికి..! ఇదేమీ నిర్బంధ వివాహం […]
సిద్ధార్థ్ రీఎంట్రీ తుస్సు..! హైప్ ఎక్కువ- హోప్ తక్కువ..! మహాసముద్రమేమీ కాదు..!!
ఇద్దరూ హీరో రేంజే… సో, తెర మీద రెండు బలమైన వ్యక్తిత్వాల ఘర్షణ కనిపించాలి… సరిగ్గా తీయాలే గానీ ప్రేక్షకుడిని మస్తు కనెక్ట్ చేయగలిగే సబ్జెక్టు… దానికి తగ్గట్టు కథ, కథనం, ట్రీట్మెంట్ ఉంటే మాత్రమే..! కానీ అప్పట్లో ఆర్ఎక్స్ 100 అనే ఓ సబ్‌స్టాండర్డ్ సెమీ బూతు సినిమా తీసిన దర్శకుడు ‘ఇద్దరు మిత్రుల’ సబ్జెక్టునయితే ఎన్నుకున్నాడు గానీ, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక చేతులెత్తేశాడు… జస్ట్, శర్వానంద్ కేరక్టరైజేషన్ మినహా మిగతా పాత్రలేవీ […]
భలే వార్త గురూ… ఎర్రకారంలాగే చాలా స్పైసీ న్యూ టేస్ట్… న్యూస్ టేస్ట్…!
ఇదీ వార్తేనా..? అనొద్దు ప్లీజ్..! కాదేదీ వార్తకనర్హం…! ఒకాయన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాడు… అంతే… అరె, ఆ ఏరియాకు అంతకన్నా మంచి వార్త ఏముంటది..? విలేఖరి అదే ఫీలయ్యాడు, సబ్ఎడిటరూ అదే ఫీలయ్యాడు… పత్రికలో కింది నుంచి మీది దాకా అందరూ అదే ఫీలయ్యారు… అలా ఫీలయ్యేది ఖచ్చితంగా వార్తే అవుతుంది… కావాలి..! ఎవడో దిక్కుమాలినోడు ఏదో పిచ్చి పార్టీ పెడతాడు, వార్త రాయడం లేదా ఏం..? ఓ పనికిమాలిన మీటింగ్ పెడతాడు, వార్త రాయడం […]
వారెవ్వా, సైంటిఫిక్ దర్యాప్తు..! ఈ కేరళ పోలీసుల్ని భేష్ అని అభినందిద్దాం..!
ఇది చదవాల్సిన కథ… కాదు, నిజంగానే జరిగిన ఓ నేరం, దుర్మార్గం… ఈ కథలో చాలా విశేషాలున్నయ్… ఓ సినిమాకు, ఓ నవలకు సరిపడా సరుకు ఉంది… ఒక నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత, సైన్స్ ఎలా సాయపడతాయో చెప్పడానికి నిజంగా ఇదొక కేస్ స్టడీ… నేరాన్ని గుర్తించడానికి కూడా…! పదండి కథలోకి వెళ్దాం… కేరళ… కొల్లంలోని అంచల్… సూరజ్కూ, ఉత్రకూ కొన్నాళ్ల క్రితం పెళ్లయింది… ఆమెకు కాస్త వైకల్యం, కట్నం బాగానే తీసుకున్నాడు… కానీ కొన్నాళ్లకు […]
400 Days…! జస్ట్, టైమ్‌పాస్ పల్లీబఠానీ… దారితప్పిన చేతన్ భగత్…!!
నో డౌట్… ఒకప్పుడు తెలుగు నవలారంగంలో యండమూరి అనుభవించిన స్టార్ స్టేటస్‌ను ఇండియన్ ఇంగ్లిష్ నవలారంగంలో చేతన్ భగత్ అనుభవించాడు కొన్నాళ్లు… లక్షల పుస్తకాల విక్రయాలు, అనేక భాషల్లోకి అనువాదాలు… నవలారంగంలో ఇంత డబ్బుందా, ఇంత కీర్తి ఉందా అని అందరూ అసూయపడే స్థాయిలో ఎదిగాడు… అఫ్ కోర్స్, శివ ట్రయాలజీ రామాయణ సీరీస్‌తో అమిష్ ఎక్కడికో వెళ్లిపోయాడు… చేతన్ కూడా ఇప్పుడు తనను అందుకోలేడు… నెట్ జోరు పెరిగాక పుస్తకపఠనం తగ్గిపోయింది అనేది ఓ భ్రమ… […]
కోర్టుకు అనసూయ..? ‘మా’ అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..?
కోర్టుకు అనసూయ..? మా అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..? ఈ హెడ్డింగులు చూడగానే….. ఏమిటిది యూట్యూబ్ చానెల్ ఏదో ఇలా పిచ్చి థంబ్ నెయిల్స్ వదిలిందా అనే డౌటొచ్చిందా..? మా ఎన్నికలు, దాని తదనంతర పరిణామాలు, ప్రత్యక్ష ప్రసారాలు, చానెళ్ల వికారాలు ఇదుగో ఇలాంటి శీర్షికలే బెటర్ అనిపించేలా ఉన్నయ్… అందుకే ఈ వ్యంగ్య శీర్షిక… విషయానికి వస్తే… MAA అసోసియేషన్ ఎన్నికల్లో దారుణంగా భంగపడి, సలసలమండిపోతున్న సెక్షన్… ఇక ATMA అనే పేరుతో మరో […]
ఈ ఉరితాళ్లు పేనింది తమరే కదా బాబు గారూ… మరిచిపోయారా ఆ రోజుల్ని..!?
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు… పిశాచాలు సంకీర్తనలు ఆలపిస్తున్నట్టు… అమావాస్య అర్ధరాత్రి ఆ భూత్ బంగళా నుంచి అకాలరోదనలేవో వినిపిస్తున్నట్టు…… వ్యవసాయానికి కరెంటు మీటర్ల మీద చంద్రబాబు వాదన చదువుతుంటే ఇలాగే రకరకాల ఫీలింగ్స్…! ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోకపోతే పొలిటిషియన్ ఎలా అవుతాడని అంటాడు కదా కన్యాశుల్కం గిరీశం… చంద్రబాబు గిరీశానికి ముత్తాత టైపు… నిజానికి ఏదేని అంశం మీద రాజకీయ పార్టీకి ఓ స్థిర విధానం అవసరం లేదా..? ఒక నాయకుడు తను చేసినదాన్నే తను తప్పుపట్టి […]
అసలు ఇష్యూ దారిమళ్లించేసి… నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి మళ్లీ తన్నులాట..!
తెలంగాణలో పుట్టిపెరిగినా… ఎదుగుదల అంతా తెలంగాణ మీదే అయినా… ఆంధ్రామూలాలుండి.., నిరంతరమూ ఆంధ్రా గురించే కలవరించే ఆంధ్రుడు, ఆంధ్రాజ్యోతి యజమాని రాధాకృష్ణ తెలంగాణ మీద పడి ఏడుస్తున్నాడు… తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నాడు…… ఇదీ నమస్తే తెలంగాణ అంతరంగం..! అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తల్ని తనే ఖండఖండాలుగా ఖండిస్తూ ఉంటుంది… దానికి అలవాటే, అందరూ తనలాగే రోజూ భజనల్ని మాత్రమే అచ్చేయాలి, లేకపోతే అది ఈనాడును తిడుతుంది, జ్యోతిని తిడుతుంది, వెలుగును తిడుతుంది.., అదీ వితండవాదంతో తిడుతుంది… సేమ్, […]
అంతటి అమితాబే తప్పుతెలుసుకున్నాడు..! మరి మన మహేశ్‌బాబు ఏం చేస్తాడో..!?
గుర్తుందా మీకు..? ఈమధ్య మనం ఓ స్టోరీ చెప్పుకున్నాం… మహేశ్‌బాబును తప్పుపట్టాం… సాయిపల్లవి వంటి వర్థమాన నటి కూడా సమాజానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడానికి అంగీకరించక, ఆ డబ్బును ఎడమకాలితో తోసేస్తుంటే… మహేశ్‌బాబు కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా యాడ్స్‌లో నటించడం ఏమిటనేది మన ప్రశ్న..! ఇప్పుడు మళ్లీ ఓసారి చెప్పుకోవాల్సి వస్తోంది… ‘‘మేం కాకపోతే మరో స్టార్ నటిస్తారు, ఆ ఉత్పత్తుల లాభనష్టాలతో మాకేం పని..? డబ్బు తీసుకుంటాం, నటిస్తాం’ అని వాదిస్తే అది సమర్థన […]
‘మా’ ఎన్నికల్లో మరో కోణం..! అసలు ఇండస్ట్రీలో లోకల్ ఫీలింగ్ ఉందా..?
నిజంగా మా ఎన్నికల్లో లోకల్, నాన్-లోకల్ ఫీలింగ్ పనిచేసిందా..? ప్రకాష్ రాజ్ లోకల్ కాదు కాబట్టే ఓడిపోయాడా..? ఇక్కడే ఓ ఊరిని దత్తత తీసుకుని, ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే నటుడిని నాన్-లోకల్ అనొచ్చా..? కేవలం పుట్టుక మూలాలు మాత్రమే చూడాలా..? ఐతే మరికొన్ని రిజల్ట్స్ భిన్నంగా ఎందుకొచ్చాయి..? ప్రకాశ్ రాజ్ గెలవకపోయినా, కర్ణాటకలో పుట్టిపెరిగిన శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు! మనోళ్లకేమీ అంత లోకల్ ఫీలింగ్ లేనట్టేగా..? అన్నట్టు… మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ ఎందుకు […]
టీవీలోళ్లు పిచ్చోళ్లు కారు..! డబ్బు కోసమే ‘మా’ గబ్బులో మునిగారు..!!
ఆఫ్టరాల్ ఆరు వందల వోట్లు పోలయిన ఓ అసోసియేషన్ ఎన్నికల గురించి రోజుంతా ప్రత్యక్ష ప్రసారాలా..? డిబేట్లా..? ఏమిటి టీవీల అరాచకం..? చర్చించడానికి, చూపించడానికి సమాజంలో ఎన్ని సమస్యలు లేవు..? ఇదేం దిక్కుమాలిన పాత్రికేయం..? వీ6, టీన్యూస్ చూడండి, ఎంత పద్దతిగా మా ఎన్నికల్ని అవాయిడ్ చేస్తున్నాయో… మరీ ఈ ఆంధ్రా చానెళ్లకే బుర్రల్లేవు..?……….. ఇలాంటి తిట్లు, శాపనార్థాలు నిన్న సోషల్ మీడియాలో మిక్కిలి బొచ్చెడు కనిపించినయ్… కానీ టీవీవాళ్లు పిచ్చోళ్లేమీ కాదు… నిన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు […]
ప్రకాష్‌రాజ్ ముందు మంచు విష్ణు ఓ బచ్చా..! ఐనా ఎలా గెలిచాడు..?!
ఆఫ్టరాల్ ‘మా’… ఉన్నవే 800- 900 వోట్లు… పడ్డవి ఆరేడు వందలు… జస్ట్, తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో నటుల అసోసియేషన్ అది… వోటింగుకు చాలామంది స్టార్లు రానే రాలేదు, ఎప్పుడూ రారు, ఆ అసోసియేషన్ మొహమే చూడరు… కానీ ఆ ఎన్నిక మీద ఎందుకింత రచ్చ జరుగుతోంది… అఫ్ కోర్స్, జనం ఆధారించే సెలబ్రిటీలు కావచ్చు, కాస్త ఆసక్తి క్రియేటవుతుంది… నిజమే… కానీ ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి కదా, మరి ఇప్పుడే ఎందుకీ రచ్చ..? అది […]
ఇలాగే ఊడ్వడం ప్రాక్టీస్ చేయి తల్లీ… ప్రధాని పదవికి తోవ చూపించవచ్చునేమో…
Nancharaiah Merugumala……….. గుడి వాకిలి ఊడిస్తే అధికారం రాదు చెల్లీ,‘ సత్తా’ చేతికొచ్చాకే దేశాన్ని ఊడ్చుకోవాలి..! =================================================== ఒకప్పటి ‘ప్రిన్సెస్’ ప్రియాంకా గాంధీ వాడ్రా శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్నఊలో వాల్మీకులు నివసించే లవకుశ నగర్ వాల్మికి ఆలయం వాకిలిని తెల్లటి పూచికపుల్లల చీపురుతో ఊడ్చారు. ఉత్తరాదిన వాల్మీకులు అంటే పారిశుద్ధ్యం పనిచేసే కులస్తులు. ప్రతి వాల్మికినగర్ లోనూ ఈ కులం వాళ్లే నివసిస్తారు. వారి కులం (వాల్మీకి) అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్సీ […]
స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
ఒక్కసారి… మీ ట్యాబ్, మీ ల్యాప్‌టాప్, మీ సిస్టం, మీ స్మార్ట్‌ఫోన్… ఏదయితేనేం… ఇయర్ ఫోన్స్ పెట్టుకొండి… లైట్లు బంద్ పెట్టండి, ఒక పాట యూట్యూబ్‌లో ఆన్ చేయండి… ఇదీ లింక్… ఇక కళ్లు మూసుకొండి… మనసులోని ఆలోచనల్ని కాసేపు తుడిచేయండి… డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొండి………… అంత మధురంగా ఉండదు గానీ, ఓ గంభీర స్వరం మిమ్మల్ని వైరాగ్యం, అలౌకికంలోకి అలా అలా తీసుకుపోతుంది… నెగెటివ్ ఫీలింగ్స్ వదిలేసి, ఆ పాటలో మునిగిపొండి… ఆ కాసేపు ఆ […]
*బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…* ఈ పల్లవి ఏమిటో తెలుసా..?!
ఏమీ..? ఏమిటిరా…? బతుకమ్మా బతుకమ్మా, ఎక్కడ పోతవురా, ఇక్కడ రా… ఎంకన్నా ఎంకన్నా ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…. చిన్నమ్మా చిన్నమ్మా ఎక్కడ పోతవురా..? ఇక్కడ రా……….. ఇదీ పల్లవి… ఏమనిపించింది..? ఏదో పాత తెలుగు సినిమాలో పాట అయి ఉంటుందిలే అనిపిస్తోంది కదా…! కానీ కాదు… ఓ హిందీ సినిమాలోనిది… 1969లోనే మన బతుకమ్మ అనే పదాన్ని పలికించిన పాట అది… సంగీత దర్శకుడు శంకర్ జైకిషన్… నిన్న చెప్పుకున్నాం కదా… జీవితచక్రం అనే పాత ఎన్టీయార్ సినిమాలో […]
ఇంతవారమయ్యాము అంటుంటారు కదా… ఎంతవారని..? అదెంతని..?
Bharadwaja Rangavajhala…………. ఘంటసాల భగవద్గీత రికార్డు విడుదల కార్యక్రమం ఆయన కన్నుమూశాక బెజవాడలో జరిగింది.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆరూ, విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము అన్నారు. ఆ తర్వాత మైకందుకున్న విశ్వనాథ …. నా శిష్యుడనని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వల్లనే ఇంత వాడినైతినని చెప్పినాడు. ఆ ఇంత ఎంతో నాకు తెలియదు. ఆ ఇంతలో నాకు మరొకరు అనగా […]
- « Previous Page
- 1
- …
- 364
- 365
- 366
- 367
- 368
- …
- 449
- Next Page »