కొందరు విపరీతంగా ఆరాధించే ఒక వ్యక్తి, మరికొందరికి ఏమాత్రం నచ్చకపోవచ్చు… ఆ మరికొందరి అంచనాలు, విశ్లేషణలు భిన్నంగా ఉండవచ్చు… మనం జాతిపిత అని పిలుచుకునే గాంధీని మెచ్చనివాళ్లు, నచ్చనివాళ్లు బోలెడు మంది లేరా ఏం..? చరిత్రలో ఆరాధనీయులుగా లిఖించబడిన వ్యక్తుల పాజిటివ్ లక్షణాల గురించు గాకుండా, వారిలోని నెగెటివ్ కోణాల్ని కూడా చెప్పుకోవడం, విశ్లేషించుకోవడం పాశ్చాత్య దేశాల్లో గమనించవచ్చు… కానీ ఇండియాలో తక్కువ… మనం పదే పదే చదువుకున్నది నిజం కాకపోవచ్చు, కావచ్చు కూడా…!! చే గువేరా […]
దుర్మార్గుల్లారా… ఉన్న ఆ ఒక్క ముచ్చటైన జంటనూ విడదీశారు కదరా…
అసలు ఇప్పుడు బిగ్‌బాస్ హౌజులో ఉన్నదే ఆ ఒక్క చూడ ముచ్చటైన జంట… దాన్ని కూడా విడదీసింది బిగ్‌బాస్ టీం… దాంతో ఏం సాధించాలని అనుకుంటున్నదో దానికే తెలియాలి… నిజానికి రెండుమూడు జంటలు ఉండాలి, వీలయితే ఓకటీరెండు త్రికోణ యవ్వారాలు ఉండాలి… సాధింపులు, కవ్వింపులు, కలవరింతలు, పులకింతలు గట్రా నడుస్తూ ఉండాలి… అప్పుడే బిగ్‌బాస్ హౌజుకు ఓ కళ… చూసేవాడికి కాస్త మజా… కానీ ఇలా చేశారేమిట్రా..? మొత్తం 19 మంది… అందులో కాస్త హాట్ హాట్ […]
ఆదానీలు, అంబానీలు కాగలరేమో కానీ… ఒక రతన్ టాటా కావడం చాలా కష్టం…!!
Jagannadh Goud………………… రతన్ టాటా – మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం..! టాటా వాళ్ళే ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా అయ్యి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది టాటా వాళ్ళ చేతుల్లోకి వచ్చిన సందర్భంలో రతన్ టాటా గారి గురించి నా అభిప్రాయం. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే […]
ఇప్పటి రెహమానే కాదు… 50 ఏళ్ల క్రితం శంకర్-జైకిషనూ అంతే…
అప్పటి సినారె దగ్గర నుంచి సుద్దాల మీదుగా గోరేటి దాకా… తెలంగాణ ఆకాంక్షల దిశలో చేసిందేమీ లేదనే భావన చాలామందిలో ఉన్నదే..! పుట్టిన మట్టిని ప్రేమించని ఘనతలెంత గొప్పవైతేనేం, వాటికున్న సార్థకత ఎంత..? ఇదే సినారె అప్పట్లో… అంటే తను రెండు చేతులతో ఎడాపెడా సినిమా పాటలు రాసేస్తున్న వేళ… 1971లో జీవితచక్రం అనే సినిమా వచ్చింది… అందులో ఎన్టీయార్, వాణిశ్రీ, శారద… అప్పటికింకా హీరోయిజాల పెడపోకడలు స్టార్ట్ కాలేదు, కథే సినిమాను ఏలుతున్న కాలం అది… […]
అయ్యో ఉమామహేశ్వరా..? ఏవి తండ్రీ ఆ అంకురం నాటి మెరుపులు..?!
……. రివ్యూయర్ :: Prasen Bellamkonda……….. పొరుగువానికి సాయపడుమోయ్…. కావాలోయ్ ఆకలి శోకం లేని లోకం… ఉండునోయ్ ప్రతి మనసులోనూ మంచితనమ్ము దాంకుని …. లాంటి కొన్ని ప్రవచనాలు కమ్ హితోక్తులను ఇస్టోరీ చేసుకుని సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు… అలాని అంత వీజీ కూడా కాదు. చాలా హోమ్ వర్క్ చెయ్యాలి. కొంచెం స్పయిసింగ్ కొంచెం గార్నిషింగ్ కొంచెం అబ్రకదబ్రీంగ్ కూడా చెయ్యాలి. సోని లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇట్లు అమ్మ’ దర్శకుడు […]
టచింగ్ ఫోటో..! జస్ట్, ఓ కాజువల్ సీన్ కాదు, కావల్సినంత ఆర్ద్రత, తడి..!
కొన్ని పైపైన చూస్తే అంతే… కాజువల్‌గా, రొటీన్‌గా, ఆ ఏముందిలే ఇందులో అన్నట్టు కనిపిస్తయ్…. కానీ కాస్త తడి ఉన్న రిపోర్టర్‌కు అందులో ఆర్ద్రత అర్థమవుతుంది… న్యూస్ పాయింట్ తళుక్కుమని మెరుస్తుంది… చేతిలో స్మార్ట్ ఫోన్ వేగంగా, సైలెంటుగా క్లిక్కుమంటుంది… ఆ సీన్ రికార్డ్ అయిపోతుంది… ఫీల్డ్‌లో తిరిగే రిపోర్టర్లకు ఈ స్పాంటేనిటీ అవసరం… ఐనా ఇప్పుడు రిపోర్టర్లు అంటే వేరు కదా, ఆ సంగతి వదిలేద్దాం… ఈ ఫోటో వార్త సంగతేమిటంటే..? కామారెడ్డి జిల్లాలో ఓచోట… […]
ఫాఫం గోపీచంద్… తన కెరీర్లో బలంగా దిగిన మరో తుప్పు బుల్లెట్ ఇది…
గుర్తుంది… మొన్నామధ్య సీటీమార్ అనే సినిమా విడుదలైనప్పుడే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నం… గోపీచంద్ అనబడే నటుడి పని ఇక అయిపోయినట్టే అని…! ఐనా అది రాస్తున్నప్పుడు ఎక్కడో ఏ మూలో ఇంకాస్త ఆశ ఉండేది, అలనాటి ఆదర్శ దర్శకుడు టి.కృష్ణ కొడుకు కదా, ఆ సోయి ఏమైనా గోపీచంద్‌లో ఉందేమో, బుర్రలో ఆ తెలివి ఎక్కడైనా పిసరంత దాగుందేమో, ఆ నెత్తుటి వాసన ఏమైనా ఏందేమో అని…! నో… లేదు, అలాంటి భ్రమలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం […]
ఇది కదా రివ్యూ అంటే..! కొండపొలం పోయిన ఓ గొల్లాయన చెప్పినట్టుగా…!!
దిక్కుమాలిన ఫార్మాట్లో సినిమా రివ్యూలు ఎవడైనా రాస్తడు… అవీ తెలుగు సినిమాల్లాగే రొటీన్ రొడ్డకొట్టుడు భాష, శైలిలోనే ఉంటయ్… కానీ నిజమైన సినిమా సమీక్షలు సోషల్ మీడియాలో కనిపిస్తయ్… మెచ్చినా, నచ్చినా, వ్యతిరేకించినా గుండె లోతుల్లో నుంచి రాయబడతయ్… ప్రత్యేకించి ఏదైనా సినిమా బాగా నచ్చినప్పుడు కొందరు జర్నలిస్టు మిత్రులు వ్యక్తీకరించే అభిప్రాయాలు అసలైన సమీక్షలు… అవి కనెక్టవుతయ్… మనం వాళ్ల అభిప్రాయాలతో అంగీకరిస్తామా లేదా అనేది వేరే సంగతి… కానీ సినిమాల సమీక్షలు అంటే ఇవి […]
మైనసులున్నయ్… కానీ మెచ్చుకోవాల్సిన బోలెడు ప్లస్సులూ ఉన్నయ్…
కావచ్చుగాక… కీరవాణి సంగీతం, పాటలు ఆకట్టుకోకపోవచ్చుగాక… ఒరిజినల్ నవలను సినిమాగా దృశ్యబద్దం చేసే క్రమంలో దర్శకుడు పలుచోట్ల సినిమాటిక్ లిబర్జీలు తీసుకోవచ్చుగాక… అవి అక్కడక్కడా లాజిక్ రహితంగా ఉండి, నవ్వు పుట్టించవచ్చుగాక… సినిమా కోసమే సృష్టించిన హీరోయిన్ పాత్ర అనేకచోట్ల హీరోను డామినేట్ చేసి ఉండవచ్చుగాక… హీరో పక్కన హీరోయిన్ కాస్త ముదురు అనిపించవచ్చుగాక… వారి లవ్ స్టోరీ అసలు కథకు అడ్డం పడుతూ ఉండవచ్చుగాక… క్లైమాక్స్ ఇట్టే తేలిపోవచ్చుగాక… మరీ సెకండాఫ్ కథ నత్తనడకన సాగుతూ […]
బిడ్డను చూసి రోజూ ఏడవాలా ఆమె..? అబార్షనే కరెక్టు… హైకోర్టు తీర్పు బాగుంది..!
నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ వార్త ప్రాధాన్యం అర్థం కాలేదేమో…. కానీ చాలా ప్రాధాన్యమున్న వార్త… హ్యూమన్ టచ్ ఉన్న వార్త… హైకోర్టు మీద గౌరవాన్ని పెంచిన వార్త… కొంతమందికి నచ్చకపోవచ్చు… కానీ కోర్టు చెప్పినట్టు తల్లి ప్రాణంకన్నా గొప్పదేమీ కాదు, ఒక గర్భం…! విషయం ఏమిటంటే… ఓ పదహారేళ్ల బాలిక… దారుణంగా అత్యాచారానికి గురైంది… కేసు ఏమైందనేది పక్కన పెట్టండి, అది వేరే సంగతి… కానీ ఆమెకు కడుపైంది… ఆమే ఓ బాలిక, ఆమెకు […]
అదనపు బాదుడు ఆల్రెడీ స్టార్ట్ చేయించి… ఇప్పుడు పునఃసమీక్షిస్తారట…
ఇందులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏమీ లేదు… ప్రజల ముక్కుపిండి అదనపు కరెంటు చార్జీలను వసూలు చేయడానికే నిర్ణయం తీసుకుంది… దాదాపు 3670 కోట్ల మేరకు వసూలు చేసేయాలని లెక్కలు వేసింది, రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టింది… కమిషన్ కూడా రైట్ రైట్ తలూపింది… ఇంకేముంది..? యూనిట్‌కు 40 పైసల నుంచి 1.23 రూపాయల వరకు అదనంగా వేస్తున్నారు… మొన్నటి ఆగస్టు నుంచే కరెంటు బిల్లులు కొత్త చుక్కలు చూపించడం మొదలైంది… ఇదేమిటి మహాప్రభో అంటే, పాత […]
నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
నో కరెంట్, నో టీవీ, నో బ్రాడ్ బ్యాండ్, నో స్మార్ట్ ఫోన్, నో కనెక్టివిటీ… ఊహించండి… నెవ్వర్, ప్రస్తుత జనరేషన్ అరగంట కూడా తట్టుకోలేదు… అంతెందుకు, దిక్కుమాలిన సోషల్ సైట్లు కొన్ని గంటలు పనిచేయకపోతేనే తల్లడిల్లిపోయారుగా… మరి అవేవీ లేకుండా, అసలు మనిషి పొడ గిట్టకుండా… అడవిలో… జంతువుల నడుమ ఓ జంతువుగా పదిహేడేళ్లపాటు బతకడం అంటే..?! నమ్మడం లేదు కదా… కానీ నిజమే… ఎక్కడో కాదు, మన పొరుగునే… దక్షిణ కన్నడ జిల్లాలోని అడ్తాలే, […]
ఒక్కసారిగా సమంతకు పెద్ద రిలీఫ్… మీడియా గద్దలు వదిలేసినయ్…
సరిగ్గా నాలుగేళ్ల క్రితం… సమంత పెళ్లయ్యింది… బొచ్చెడు ఫోటోలు… అందులో ఒక్క ఫోటో బాగా కనెక్టయింది… ఆమె ఓ పాపులర్ సినిమా స్టార్, ఆమెకు ఈ ఫోటో షూట్లు, వీడియో షూట్లు పెద్ద సమస్యేముంది..? నటి, ఎలాగంటే అలా ఫోజులు పెట్టగలదు… కానీ పెళ్లి నటన కాదు, ఒరిజినల్, పర్సనల్, తన లైఫ్‌ను తిప్పేది, నిర్దేశించేది… ఏమనుకున్నదో ఏమో గానీ… ఒక్కసారిగా ఆమెలోని అసలైన అమ్మాయి బయటపడిపోయింది… కన్నీళ్లు పెట్టుకుంది… అవి కళ్ల నుంచి మాత్రమే రాలిన […]
చెప్పుకున్నంత వీజీ టూర్ కాదు… రిస్క్, డేర్, థ్రిల్ ప్లస్ పర్ఫెక్ట్ ప్లానింగు…
చెప్పుకున్నంత ఈజీ కాదు… ఏదో బ్లాగులో నాలుగు ఫోటోలు పెట్టేసి, వ్లాగులో రెండు వీడియోలు పెట్టేసినట్టు కాదు… ఐనాసరే, సాహసం చేయాలనే అనుకున్నాం… నాకు తగ్గట్టు దొరికింది నా భార్య… కొత్తగా పెళ్లయ్యింది మాకు… మాది త్రిసూర్… కొలువులేమో బెంగుళూరు… నేను సేల్స్ వైపు… ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ వైపు… నా పేరు హరికృష్ణన్, ఆమె లక్ష్మి… అసలు వెరయిటీగా హనీమూన్‌కు మోటార్ బైక్ మీద థాయ్‌లాండ్ వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించాం, ఆమె రెడీ అనేసింది… […]
ఈ కడక్ చాయ్ వెనుక ఓ స్పూర్తి కథ ఉంది… ఓ వ్యక్తి విజయగాథ ఉంది…
*హైదరాబాద్ అంటే…’నీలోఫర్ కేఫ్’ ! (Cafe Nilopher) చాయ్ (Tea ) కూడా….!! హైదరాబాద్, లక్డీకాపూల్ సమీపంలోని రెడ్ హిల్స్ ” నీలోఫర్ కేఫ్ “లో చాయ్ తాగటం ఓ ప్రివిలేజ్. అసలు చాయ్ కు….హైదరాబాదుకు ఓ అవినాభావ సంబంధం వుంది. ఓ కప్పు చాయ్ తాగాలన్న కోరిక ప్రతీ… హైదరాబాదీకి వుంటుంది. అలాగే… నీలోఫర్ కేఫ్ చాయ్ రుచి ప్రతీ….. హైదరాబాదీ హృదయానికి తెలుసు.(ఏక్ ప్యాలా చాయ్ కి తమన్నా… సార్ హైదరాబాదీ కి రగ్ […]
ఎహె… సాక్షాత్తూ దైవస్వరూపుడే వస్తుంటే… బతుకమ్మలేంది..? ఈ బతుకులేంది..?!
నిజానికి ఇక్కడ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తప్పేమీ కనిపించడం లేదు… వార్త రాసిన తీరు, సంఘటనను చూసిన తీరే సరిగ్గా లేదు… ఈ పాత్రికేయుడికి ఇంకాస్త శిక్షణ అవసరం… లేదా శిక్ష అవసరం… అసలు ఏం జరిగింది..? ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు వస్తోంది, ఓ గుడి దగ్గర మహిళలు బతుకమ్మలు ఆడుతున్నారు… ఎమ్మెల్యే అక్కడికి వస్తున్నాడు, వెంటనే తీసేయండి అని చెప్పినా మహిళలు వినిపించుకోలేదు… దాంతో ఎమ్మెల్యే గారి కారు బతుకమ్మల మీద నుంచి దూసుకుపోయింది, బతుకమ్మలు చెల్లాచెదురయ్యాయి… […]
ఓహ్… మరో త్యాగానికి కేసీయార్ రెడీ… ఉపరాష్ట్రపతి పోస్టుకు కాంప్రమైజ్…!!
ఓహ్, అదా సంగతి..? ఈ పెద్ద దొరవారు రెండుసార్లు హస్తినకు వెళ్లి, రోజుల తరబడీ తిష్ఠ వేసి, బీజేపీ వాళ్లతో ఏం బేరాలు కుదుర్చుకుని వచ్చాడో అర్థం గాక, అందరమూ జుట్టు పీక్కుంటున్నాం కదా… హమ్మయ్య, క్లారిటీ వచ్చేసింది… మనసులో చింతలన్నీ మాయమైపోయినయ్… ఇలాంటి స్కూపులు రాధాకృష్ణకు మాత్రమే తెలియాలని ఏముంది..? ఈసారి ఢిల్లీలోని ఆంధ్రజ్యోతి హియరింగ్ స్పై బడ్స్, హిడెన్ కెమెరాలు సరిగ్గా పనిచేయలేదేమో, తన కొత్త పలుకులోనూ ఉలుకు లేదు, పలుకు లేదు… కానీ […]
షో తీరు మారితేనే కథ మారేది..! హోస్ట్‌గా దీపిక పడుకోన్‌ను పెట్టినా అంతే..!!
నాలుగైదు రోజులుగా అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది… జెమిని టీవీలో వచ్చే మాస్టర్ చెఫ్ హోస్ట్‌గా ఉన్న తమన్నాను వెళ్లగొట్టేసి, ఆ ప్లేసులో యాంకర్ అనసూయను తీసుకుంటున్నారు అని…! మొన్నటి ఒకటీ రెండు తేదీల్లో కూడా తమన్నాయే కనిపించింది,… కానీ రాబోయే సెషన్స్‌లో అనసూయ కనిపిస్తుందనీ, ఆల్రెడీ బెంగుళూరులోని స్టూడియోలో కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా అయిపోయిందనీ అంటున్నారు… చూద్దాం… కానీ ఓ పాపులర్ స్టార్ హీరోయిన్ను తీసేసి, ఓ టీవీ యాంకర్‌ను పెట్టడం అంటే ఖచ్చితంగా అది […]
ఇది మరోరకం పైత్యం..! ప్రైవేటు కోలాటాల వీడియోలకు రాజకీయ కాలుష్యం…!!
ముందుగా ఒక పాట చూడండి… వీడియో… పల్లె పడుచులందరూ ఒక్క తీరు బట్టలు కట్టుకున్నరు… జెడల్లో మల్లెపూలు నిండుగా పెట్టుకున్నరు… కళ్లకు గజ్జెలు కట్టుకున్నరు… చేతుల్లో కోలాటం కర్రలున్నయ్… వలయంగా నిలబడి ఓ పాట పాడుతున్నరు… ఆ పాటకు తగ్గట్టుగా కోలల (కర్రల) చప్పట్లు రిథమ్ ప్రకారం వినిపిస్తున్నయ్… డిల్లం బల్లెం అంటూ సాగుతూ… గ్రామదేవతలను కీర్తిస్తున్న డాన్స్… ఒరిజినల్‌గా పాట బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తోంది… దానికి వీళ్లు అందంగా ముస్తాబై, ఆనందంగా ఆడుకుంటున్నారు… ప్యూర్ తెలంగాణ […]
డబ్బు బలిస్తే… మనిషిలో పిశాచి లేస్తే…. ఇలాంటి SQUID GAME పుట్టుకొస్తుంది…
“SQUID GAME”…….. మీరు ఆడే రేసుల్లో గుర్రాలుంటాయి ..మా డబ్బున్నవాళ్లు ఆడే రేసుల్లో మనుషులుంటారు.. డబ్బులేని పేదవాళ్లే మా రేసుల్లో గుర్రాలన్నమాట.. మీరు గుర్రాల మీద పందేలు ఎలా కాస్తారో మేము ఇక్కడ మనుషుల ప్రాణాల మీద పందెం కాస్తాం..ఇది స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో ఒక డైలాగ్.. దీనిలోనే ఈ వెబ్ సిరీస్ సారాంశం అంతా ఉంటుంది.. ధనం మూలం ఇదం జగత్… అన్నింటికీ మూలం ధనమే.. డబ్బు లేకపోతే రోజు గడుస్తుందా ? ఆఖరికి గాలి, […]
- « Previous Page
- 1
- …
- 365
- 366
- 367
- 368
- 369
- …
- 449
- Next Page »