Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె స్త్రీయే కాదు, మగాడు కూడా…! మరి భర్త గతేమిటి..? సుప్రీంలో ఓ కేసు..!!

June 29, 2025 by M S R

both organs

. hermaphroditism… వైద్యపరిభాషలో ఇదే సరైన పదం… తెలుగులో ఏమంటారో… ఉభయలింగ అని పిలవాలేమో… అంటే, అర్థమైంది కదా… ఒక వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు ఉండటం..! ప్రపంచంలో ఇదేమీ వింత కాదు, ఇప్పుడు వినడం కూడా కొత్తేమీ కాదు… కానీ ఓ కేసు సుప్రీం దాకా వచ్చింది…. అందుకే మళ్లీ కాస్త చర్చ… (ఈ స్థితిని congenital adrenal hyperplasia అని కూడా అంటారట…) హడావుడిగా చదివితే అంత తేలికగా జీర్ణం కాదు… సున్నితంగా ఉంటుంది, అబ్బురంగానూ […]

ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…

June 28, 2025 by M S R

malashri

. మగ హీరోయిన్… యాక్షన్ హీరోయిన్… అని జనం ప్రేమగా పిలుచుకునే మాలాశ్రీని అకస్మాత్తుగా కొన్నాళ్ల క్రితం ఆలీ మళ్లీ గుర్తుచేశాడు… ఈటీవీలో తన ఆలీతో సరదాగా షోకు తీసుకొచ్చాడు… పలుసార్లు కొందరు అక్కరలేని వాళ్లను కూర్చోబెట్టి, మన మెదడు తినేవాడు గానీ కొన్నిసార్లు మనం మరిచిపోయిన పాత నటుల్ని హఠాత్తుగా మనముందుకు తీసుకొచ్చేవాడు, ముచ్చట్లు పెట్టేవాడు… పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేసేవాడు… అది మాత్రం మెచ్చుకోబుద్దేసేది… మాలాశ్రీ అనే పేరు వినగానే గుర్తొచ్చే పాట… ‘‘గజ్జె […]

ఆ స్నైపర్ ‘వాలి’ మరణించాడా..? ‘వైట్ డెత్’ గురించి తెలుసా మీకు..?

June 28, 2025 by M S R

wali

. కొన్నాళ్ల క్రితం ‘వాలి’ అనే ఓ స్నైపర్ గురించి అంతర్జాతీయ మీడియా పుంఖానుపుంఖాల కథనాలు వినిపించింది… ఓ మానవాతీతుడు అన్నంతగా చిత్రించింది… గుర్తుంది కదా… ఈయన మాజీ కెనెడియన్ సైనికుడు… గతంలో అఫ్ఘన్‌ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు… మంచి నిపుణుడైన స్నైపర్ రోజుకు అయిదారుగురిని ఖతం చేస్తే గొప్ప… కానీ ఆయన ఏకంగా 40 మంది వరకూ నేలకూల్చగలడట… నలభయ్యేళ్ల ఈయన ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు మేరకు రష్యాకు వ్యతిరేకంగా పోరాడటానికి రంగంలోకి దిగాడు… తన […]

మర్రిచెట్టు అరెస్ట్… 120 ఏళ్లుగా బేడీలతోనే… ఇలాగే ఓ బెంచీ కథ కూడా…

June 28, 2025 by M S R

baniyan

. కొత్తగా ఓ ఆర్మీ క్యాంప్ కమాండర్ నియమితుడయ్యాడు… తన పరిధిలోని అన్ని విభాగాలు, ప్రాంతాలు తనిఖీ చేస్తున్నాడు… ఓ బెంచీ దగ్గర ఇద్దరు సైనికులు తుపాకులు పట్టుకుని కాపలా ఉన్న దృశ్యం గమనించాడు… దీనికి భద్రత దేనికి అని అడిగాడు… ‘‘సర్, మాకు తెలియదు, మాజీ కమాండర్ కాపలా ఉండమన్నాడు, ఉంటున్నాం, ఇది ఓ సంప్రదాయం అట…’’ అని బదులిచ్చారు వాళ్లు… . ఈ కమాండర్‌కు ఆశ్చర్యమేసింది… పాత కమాండర్ ఫోన్ నంబర్ కనుక్కుని కాల్ […]

దర్శకుడికి స్వేచ్ఛ- నో కాంప్రమైజ్… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…

June 28, 2025 by M S R

bhanu

. ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… ఆమధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన… […]

ఓ రబ్బరు బొమ్మ… ఏ లగ్జరీ బంకర్‌లో దాగున్నదో… ఎక్కడుందో… పెద్ద మిస్టరీ..!!

June 28, 2025 by M S R

alina

. అలీనా కబయెవా… ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్త మీడియాలో మళ్లీ ఒక్కసారిగా ప్రముఖంగా కనిపిస్తోంది… ఎవరీమె..? ఒక లవర్… వయస్సు 38 ఏళ్లు… రష్యా అధినేత పుతిన్ లవర్… కాదు, తను మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక ఈమే అన్నీ… ఒకప్పుడు రష్యా ఎంపీ, రష్యా అధికార పార్టీ డ్యూమా డిప్యూటీ… అసలు అదికాదు చెప్పాల్సింది… ఆమె ఎవరు..? తాష్కెంట్‌లో పుట్టింది… రిథమిక్ జిమ్నాస్ట్… అసలు ఆమె ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అన్నట్టుగా అద్భుతంగా […]

సినిమా పాత్రల్లో రాడికల్… నిజజీవితంలో బోలెడన్ని మూఢనమ్మకాలు…

June 27, 2025 by M S R

ntr

. ……. By…. Abdul Rajahussain………..  సినిమా పాత్రల్లోనే ర్యాడికల్… నిజ జీవితంలో “‌ మూఢనమ్మకాల పుట్ట ” ఎన్టీఆర్ !! ఆంధ్రుల ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయికి చాటి… చెప్పినవాడు, కాంగ్రెస్ ను మట్టి కరిపించి ‘ తెలుగుదేశం’ జెండాఎ గరేసిన మేరునగధీరుడు నందమూరి తారకరామారావు. అటువంటి వ్యక్తి మూఢ నమ్మకాల్ని నమ్మాడంటే…. నమ్మగలమా? నమ్మలేని నిజమే, అయినా.. జరిగిన వివిధ సంఘటనల్ని బట్టి నమ్మక తప్పదనిపిస్తుంది… […]

రష్యాలో విష్ణుమూర్తి విగ్రహం… అది తెలియజెప్పే కొత్త చరిత్ర… తెలియని కథ…

June 27, 2025 by M S R

idol

  …… By… పార్ధసారధి పోట్లూరి……   రష్యాలో దొరికిన పురాతన విష్ణుమూర్తి విగ్రహం ! తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో పురాతన శివలింగం బయటపడ్డది అని… కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు… బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ పరీవాహక ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి దగ్గరలోనే ఉన్న నది నుండి నీళ్ళు తెచ్చి అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో అలా ప్రతిష్టించి […]

టీచింగ్ వృత్తి కాదు… విలువల జాతి నిర్మాణం… ఈ చిన్న కథ విన్నారా..?!

June 27, 2025 by M S R

teacher

ఎండ… చెమట… ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి… అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు… పలకరించాడు… వంగి, కాళ్లు మొక్కాడు… మాస్టారూ, బాగున్నారా..? ‘సర్, నన్ను గుర్తుపట్టలేదా..?‘ ‘ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడం లేదు… గుర్తుపట్టలేకపోతున్నాను’ ‘సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్‌ను…’ ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తు రావడంలేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..? అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?’ ‘నేను టీచర్‌ను అయ్యాను మాస్టారూ…’ ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే […]

ఇండస్ట్రీ అంతే… టాలెంట్ టన్నుల్లో ఉన్నా సరే టైమ్ కలిసిరావాలి…

June 27, 2025 by M S R

satyendra

. Bharadwaja Rangavajhala………….   ఆంధ్రా దిలీప్ అని చెలాన్ని, ఆంధ్రా దేవానంద్ అని రామ్మోహన్ నీ ఇలా పిల్చారు గానీ… అసలు ఆంధ్రా నసీరుద్దీన్ అనదగ్గ నటుడు సత్యేంద్ర కుమార్ గురించి అనరేం… నిజానికి ఈ పోలిక కోసం సత్యేంద్ర కన్నా ముందు నారాయణ రావు ఉన్నారనుకోండి… ఆయన నిజంగానే ఆంధ్రా, ఈయన తెలంగాణ అనుకుంటే సమస్యే లేదు కదా… సత్యేంద్ర కుమార్ అసలు పేరు అన్నాబత్తుల సత్యేంద్రకుమార్ … ఊరు ఖమ్మం. ఖమ్మంలో కళా పరిషత్ […]

మరణాల్ని మేం ముందుగానే రికార్డ్ చేస్తాం… డెడ్లీ డెడ్‘లైన్స్’ మరి…

June 27, 2025 by M S R

deadline

. ……. By… ప్రసేన్ బెల్లంకొండ ………….   * వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని… ఈనాడు…… * గగన కచేరికి గానకోకిల… సాక్షి…… * పాటవై మిగిలావు.. ఆంధ్రజ్యోతి…. * తేరి ఆవాజ్ హి పెహచాన్ హై… నమస్తే తెలంగాణ… *అల్విదా…. నవతెలంగాణ… *మూగవోయిన గానకోకిల… దిశ… * గగనానికి గానకోకిల…. వెలుగు ఇవి 2022 ఫిబ్రవరి నెలలో ఓరోజు పేపర్లలో లత మరణ వార్త హెడ్డింగ్స్… సాధారణంగా ఇటువంటి సందర్బాలలో జ్యోతి హెడ్డింగ్స్ బాగుంటాయి. ఆరోజు మాత్రం ఈనాడు హెడ్డింగే బావుందని నాకనిపించింది. […]

అంబుబాచీ మేళా… కామాఖ్య గుడి తలుపులు తెరుచుకున్నయ్…

June 26, 2025 by M S R

kamakhya

. అంబుబాచీ… పేరెప్పుడైనా విన్నారా..? అస్సోం రాజధాని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయానికి సంబంధించిన పేరు… ఇప్పుడు ఈ పేరు ఎందుకు వినిపిస్తున్నదంటే… ప్రస్తుతం అంబుబాచీ పేరిట ఆ గుడిని మూడు రోజులపాటు మూసేశారు కాబట్టి… కానీ ఎందుకు మూసేస్తారు..? ఇది అమ్మవారి గుడి… శక్తిపీఠాల్లో ఒకటి… ఎక్కడా లేనట్టు ఇక్కడ అమ్మవారి రుతుస్రావ చక్రం పాటిస్తారు… అంటే సహజంగానే రుతుస్రావ మహిళ్లలో నెలకు మూణ్నాలుగు రోజులు పీరియడ్స్ ఉంటాయి కదా… ఇక్కడ ఏడాదిలో మూడు రోజులు […]

నీడనూ నమ్మలేనితనం… క్షణక్షణమూ అభయం కాదు, ఆ భయమే..!!

June 26, 2025 by M S R

phone

. ముందుగా ఓ వార్త చదవండి.,. ‘‘ABN ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల చైర్మన్ రాధాకృష్ణ ఫోన్ నంబర్లను కేసీయార్ ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ అధికారులు… విచారణకు రావాలని రాధాకృష్ణకు సూచించిన అధికారులు..! నోటీసులు పంపిస్తే… వీలును బట్టి వచ్చి వాంగ్మూలం ఇస్తానని సిట్ అధికారులకు చెప్పిన రాధాకృష్ణ! పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు, అలా జరగకపోతేనే ఆశ్చర్యం… రారా పోరా అనుకునేంత చనువు, దోస్తీ… ఐతేనేం… రాధాకృష్ణ టీడీపీ మనిషి, చంద్రబాబు మనిషి… కేసీయార్ కూడా […]

రోదసి ప్రయాణికుడు శుభాంశు శుక్లా సరే… మరి ఈ ప్రశాంత్ నాయర్..?!

June 26, 2025 by M S R

prasanth nair

. శుభాంశు శుక్లా… రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడు… దేశమంతా అభినందనలు కురిపిస్తోంది… గుడ్… యూపీకి చెందిన శుక్లా విద్యాభ్యాసం, అర్హత, అనుభవం, శిక్షణ తదితర వివరాలతో అనేక కథనాల్ని మీడియా ప్రచురిస్తోంది… ఎయిర్ ఫోర్స్ పైలట్లే ఈ రోదసీయానానికి ఎందుకనే వివరాల దాకా… తన లవ్ స్టోరీ కూడా రాస్తోంది… ఆమె పేరు కామ్నా… మూడో తరగతి నుంచే క్లాస్‌మేట్‌… తరువాత ప్రియ స్నేహితురాలు… ప్రియురాలు.., తరువాత భార్య… ఆమె డెంటిస్ట్… ఇద్దరి చదువులు వేర్వేరు అయినా […]

ఆంధ్రా ఆలోచనపరులూ చెబుతున్నారు… బనకచర్ల ఓ గుదిబండ అని..!!

June 26, 2025 by M S R

banakacharla

. రేవంత్ రెడ్డి చెబుతున్నదే ఆంధ్రా ఆలోచనపరులు కూడా చెబుతున్నారు… బనకచర్ల ప్రాజెక్టు ఎవరికీ ఉపయోగకరం కాదు అని… తెలంగాణకే కాదు, అది ఏపీకి కూడా నష్టదాయని అని చెబుతున్నారు… ఏబీ వెంకటేశ్వరరావు తెలుసు కదా… చంద్రబాబు అంటే తను… తనంటే చంద్రబాబు… ఆ కారణంతోనే కదా జగన్ టార్గెట్ చేశాడు… సరే, విషయం ఏమిటంటే.,. తనతోపాటు చాలామంది ఆంధ్ర విజ్ఞులు, ఆలోచనాపరులు చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్లను వ్యతిరేకిస్తున్నారు… ఆహా… ఇంట్రస్టింగు… ఓసారి ఈ వార్త చదవండి… […]

వద్దన్నా వరదలా డబ్బు..! సినిమాల్లో తప్ప ఇంకెక్కడా కుదరదు…!!

June 26, 2025 by M S R

అనితారెడ్డి

. Subramanyam Dogiparthi……..  కధల్లోను , సినిమాల్లోను మాత్రమే వద్దూవద్దన్నా డబ్బు వచ్చేది . రియల్ లైఫులో అంబానీ ఆదానీలకు కూడా వద్దూవద్దంటే డబ్బు రాదు . నానావిధాలుగా ఇప్పటికీ తిప్పలు పడుతూనే ఉంటారు . మామూలు జనం మనమెంత వెంపర్లాడినా లక్ష్మీ కటాక్షం దొరకదులే అని చేతులెత్తేస్తారు . 1902 లో వచ్చిన Brewster’s Millions అనే నవల ఆధారంగా 1954 లో తండ్రి యన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు కధాంశంతోనే 1985 ఫిబ్రవరిలో కొడుకు […]

ఈ కోకిలకూ ఓ విషాద ప్రేమగాథ… ఆ రాజావారు తొక్కిపడేశారు…

June 26, 2025 by M S R

lata mangeshkar

. సంగీత ప్రియుల్లో చాలామందికి తెలిసిన కథే కావచ్చు… కానీ మరోసారి మననం చేసుకోవచ్చు… లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు… ఎందుకు..? అదే ఈ కథ… నిజానికి ఓ నవలగానో, ఓ సినిమాగానో రాదగిన ప్రేమకథ… కానీ విషాదాంతం… భారతరత్నకు నిజమైన అర్హురాలు, కొన్ని వేల భారతీయ భాషల పాటల్ని పల్లవించిన గొంతులోని ఈ విషాద వీచికను తలుచుకుంటే తప్పేమీ లేదు… ఓ రాజావారి అహానికి బలైన ప్రేమకథ… అలాగని ఆ ప్రేమికుడు ఈమె ప్రేమ తాలూకు […]

వంటలే కదా, అదెంత పని… పెంట పెంట చేసేస్తారు ఈ జాతిరత్నాలు…

June 26, 2025 by M S R

star maa

. మన టీవీ నిర్మాతలు, చానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దేన్నయినా కామెడీ చేయగలవు… అనగా ఏ సబ్జెక్టయినా సరే కామెడీ షోగా మార్చేయగలవు… కామెడీ ఉంటే పర్లేదు., కానీ కాస్త వినోదం సరే… కానీ మొత్తం ఏ సబ్జెక్టు షో అయినా సరే, నలుగురు టీవీ సెలబ్రిటీలను తీసుకొచ్చి, పిచ్చి పిచ్చి ఆటలు, మాటలు, చేష్టలతో కామెడీ చేసిపారేయడమే సమస్య… ఈటీవీలో ఢీ అనే డాన్స్ షోను సర్కస్ షోగా చేశారు… గతంలో ప్రదీప్, సుధీర్, రష్మి, […]

ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…

June 25, 2025 by M S R

indira

. ఉండవల్లి అరుణ్‌కుమార్… ఈ మాజీ ఎంపీ, నాటి సీఎం వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు… ఆయన కొడుకు జగన్‌తో పెద్ద సత్సంబంధాలు పెట్టుకోనివాడు… తెలంగాణ వ్యతిరేకి… రామోజీరావు బద్ధ విరోధి… అన్నింటికీ మించి బ్రహ్మాండమైన లా పాయింట్లు ఆలోచించగలిగే మేధావి… వ్యక్తిగత ఆరోపణలేవీ కనిపించవు… కానీ జనమంతా ఒకవైపు చూస్తుంటే, ఒకటి నమ్ముతుంటే, దానికి భిన్నంగా ఆలోచించగలడు… చూడగలడు… లోకం ఆశ్చర్యంగా చూసినా సరే… తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లయినా సరే… స్టిల్, ఈ ఏర్పాటు చట్టవిరుద్ధం అనీ, […]

రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?

June 25, 2025 by M S R

aj

. ఓ వార్త ఆంధ్రజ్యోతిలో చూశాను… ఒక మహిళ రెండేళ్లలో డజను పెళ్లిళ్లు చేసుకున్నదని… నిన్నటి వార్త అది… ఏపీలో అమలాపురం ప్రాంతంలో… ఆమె పేరు బేతి వీర దుర్గ నీలిమ… ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి రెండేళ్లలో నిత్య పెళ్లికూతురుగా 12 పెళ్లిళ్లు చేసుకుందనేది వార్త సారాంశం… అంతేకాదు, పలువురు బాధితులు జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఫిర్యాదు కూడా చేశారట… పెళ్లి కాని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ధనవంతులను టాార్గెట్ చేసుకుని… భార్యలకు […]

  • « Previous Page
  • 1
  • …
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • …
  • 376
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions