రాజకీయాల్లో పరిపక్వత ఎలా ఉండాలో, అపరిపక్వత ఎలా ఉండకూడదో చెప్పడానికి నిన్నటి మోడీ బెంగాల్, ఒడిశా పర్యటనలే ఉదాహరణలు… రాజకీయాలు వేరు, పరిపాలనకు సంబంధించి కేంద్రం- రాష్ట్రాల నడుమ సంబంధాలు వేరు… ప్రత్యేకించి విపత్తు సందర్భాల్లో పాలకస్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఉదాత్తమైన ప్రవర్తనను ఆశిస్తాం… కానీ ఎప్పటిలాగే మమతా బెనర్జీ చిల్లర వేషాలను ప్రదర్శించి, తన తత్వాన్ని మరోసారి తేటతెల్లం చేసుకుంది… మోడీ ఈ దేశానికి ప్రధాని, మమత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి… యాస్ తుపాన్ […]
ఆహా, బాంబు కనిపెట్టడం ఎంత వీజీయో..! టీవీ ‘దర్శకసింహ’ అవార్డు నీకే భాయ్…!!
CIA అనే అమెరికన్ గూఢచార సంస్థ ప్రపంచంలోకెల్లా నొటోరియస్ అంటారు కానీ… అబ్బే, నిజానికి దానికి అంత సీన్ లేదు… ఇజ్రాయిలీ మొసాద్ దానికి తాత… ఎహె, మన భారతీయ గూఢచార సంస్థ ‘రా’ వాటికన్నా ఇంటలిజెంట్… ఎందుకంటే..? మనవాళ్లకు బోలెడన్ని హత్యాపథకాల్ని… అదీ చేతికి తడి అంటకుండా ప్రత్యర్థులను కసుక్కుమనిపించే బోలెడు ప్లాన్లను చెప్పడానికి టీవీ సీరియళ్లున్నయ్… మన దేశీయ టెర్రరిస్టులకు, మర్డరర్లకు కూడా, డాన్లకు కూడా ఇంటలిజెన్స్ సోర్స్ మన సీరియళ్లే… ఎవరి ఎలా […]
ఏబీఎన్ చానెల్లో ఆనందయ్య వంట..! వార్తలే కాదు, మందులూ వండేస్తున్నారే…!!
ఏమైంది..? ఆనందయ్య కరోనా మందు పంపిణీ మళ్లీ స్టార్ట్ కాదేమిటి..? జగన్ సానుకూలంగా ఉన్నాడు అనేది ఉత్త తూచ్ ముచ్చటేనా..? ఈ పరిశీలనలు, ఈ అనుమతులు, ఈ కోర్టు విచారణలు తేలేదెన్నటికి..? అసలేం జరుగుతోంది..? ప్రజాశక్తులు, టీవీ9లు గట్రా విరజిమ్మే విషానికి ఆ మందు చచ్చిపోవాల్సిందేనా..? సగటు మనిషి ఆలోచనలు ఇలా సాగుతుంటయ్… మరోవైపు ఆనందయ్య మందుకు అప్పుడూ డూప్లికేట్లు వచ్చేస్తున్నయ్… అదీ బ్లాక్ మార్కెటే… ‘‘ష్, ఆనందయ్య మందును రహస్యంగా తయారు చేయిస్తున్నారు, హైదరాబాద్, బెంగుళూరు, […]
అసలే సాయిపల్లవి, ఆపై ఓ విభిన్నపాత్ర… అనుకోని అతిథిలా వచ్చి దున్నేసింది…
ఒకప్పుడు మళయాళ సినిమా అంటే సబ్ స్టాండర్డ్ బోల్డ్ సీన్లతో చుట్టబెట్టేసి జనం మీదకు వదిలేసే నాసిరకం సరుకు… అలాంటి సినిమాలే తెలుగులోకి డబ్ అయి వచ్చేవి కాబట్టి అందరికీ అదే అభిప్రాయం ఉండేది… కానీ ఓటీటీలు వచ్చాక జనం కేరళ సినిమాలోని రియల్ క్రియేటివిటీ పార్ట్‌ను చూస్తున్నాడు, ఫీలవుతున్నాడు… కొన్ని మనకు కనెక్ట్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చుగాక… కానీ ప్రయోగాలు సాగుతూనే ఉన్నయ్… భారీతనం జోలికి పోకుండా, ఫార్ములాల వాసన తగలకుండా… మరీ మనకు అలవాటైన […]
ఆ రెండు మందులపైనే ఆశ..! కానీ ఈ కేసుల సునామీలో ఎందరికి దక్కేను..?!
కరోనా మార్కెట్లో కోట్లకుకోట్ల దందాకు తెరతీసిన రెమ్‌డెసివర్ వాడకానికి మన ప్రభుత్వం ఎట్టకేలకు తెరవేసింది… ఆ మందు వాడకండీ అనేస్తోంది… ఇంతకుముందు స్టెరాయిడ్ల వాడకాన్ని చూసీచూడనట్టు వదిలేసింది… అఫ్ కోర్స్, కరోనా నియంత్రణ, వైద్యం, వేక్సిన్, ఆక్సిజన్, బెడ్స్, డ్రగ్స్… ఏవిషయంలోనూ మోడీ ప్రభుత్వానికి ఓ దశ లేదు, ఓ దిశ లేదు అని చెప్పుకుంటున్నదే కదా… ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ గట్రా పంచరంగుల ఫంగసులూ పుట్టుకురావడంతో… మొదట ఏదేదో చెప్పడానికి […]
ఈటలకు కాషాయమే ఎందుకు..? బీజేపీకి ఈటలతో ఫాయిదా ఏమిటి..?!
పాయె, పాయె, వచ్చె, వచ్చె…. 1) అదుగో కాంగ్రెసోళ్లతో దోస్తీ చేస్తడట… రేవంతుతో మంతనాలట… ఇదుగో బీజేపీతో కలుస్తడట, చర్చలు అయిపోవచ్చినయ్… 2) ఎహె, కాదు, కొత్త పార్టీ పెడుతున్నడు, కేసీయార్ వ్యతిరేకులతో విస్తృత వేదిక క్రియేట్ చేస్తాడు… తను మాజీ పీడీఎస్‌యూ కదా, బీసీ కదా, దళిత బహుజన ఎజెండాతో ముందుకు పోతడు… 3) ఎటూ పోడు, ఎక్కడ చేరడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయడు, పార్టీలోనే కొన్నాళ్లు ఉంటడు, బయటికి రాడు…. 4) […]
బాబుకన్నా ముందే ఎన్టీరామారావుపై రామోజీరావు కుట్ర..! Surprise Facts..!!
ఔనా..? రామారావుకు ఇతోధిక ప్రచారం కల్పించి, అధికార పీఠం ఎక్కడానికి సాయం చేసిన రామోజీరావు తనే స్వయంగా రామారావు మీద కుట్ర పన్నాడా..? చంద్రబాబుకన్నా ముందే తిరుగుబాటుకు ప్రేరేపించాడా..? ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేశాడా..? ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఈ కథనం హెడింగ్ చూస్తేనే…. ఎవరైనా చెబితే నమ్మరు కూడా… కానీ చెబుతున్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు… ఎన్టీయార్ అల్లుడు… అప్పటి అనేక పరిణామాలకు సాక్షి… ఎన్టీయార్ పక్కనే ఉండి చూడటమే కాదు, పలు విషయాల్లో కలగజేసుకున్న వ్యక్తి… […]
టీకాయే అసలు తాత్పర్యం..! నా చికిత్స ఖర్చు ఇరవై రూపాయలు… ఎలాగంటే..?
అనేక వార్తలు… లక్షల బిల్లులు… కార్పొరేట్ దోపిడీ… సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ, చుట్టుపక్కల అమ్మలక్కల ముచ్చట్లలో గానీ, ఫోన్ల సంభాషణల్లో గానీ…. చుట్టూరా ఇవే వార్తలు డిస్టర్బ్ చేస్తున్నయ్… భయాన్ని పెంచుతున్నయ్… మరీ కొందరు మూర్ఖులు వాట్సపులో వేక్సిన్లు వేసుకుంటే చస్తార్రోయ్ అనే మెసేజులను ఫార్వర్డ్ చేస్తున్నారు… ఏ భయం లేకపోవడం కరోనాను గెలుస్తుందో, ఆ భయాన్నే కృత్రిమంగా ఇంజక్ట్ చేస్తున్నారు అందరూ… ఈ స్థితిలో సోషల్ మీడియాలో వేల మందికి పరిచితుడైన డాక్టర్ […]
Ek Mini Katha..! మగతనం- ‘చిన్న’తనం- ‘పెద్ద’రికం… ఓ బోల్డ్ కథ…!!
స్వాతి వీక్లీలో ఏముంటుంది..? ఏమీ ఉండదు… కానీ సరసమైన కథ ఉంటుంది… ఆ వీక్లీ హిట్టయింది దాంతోనే… ఒక సమరం ప్రశ్నలు-సమాధానాలు, ఒక సరసమైన కథ… వాటిల్లో చర్చించబడేవి సరసమైన అంశాలే… చెప్పుకునేవి శృంగారానికి సంబంధించిన విషయాలే… అయితేనేం..? అవేవీ ఒక కనిపించని గీత దాటవు… అందుకే రంజింపచేస్తయ్, రక్తికట్టిస్తయ్… బోల్డ్ కంటెంట్‌పైనే బోలెడు సంగతులు చెబుతయ్… గతంలో సంభోగాల్ని, అక్రమ సంబంధాల్ని వర్ణిస్తూ పచ్చిపచ్చిగా కథల్ని పబ్లిష్ చేసిన చిన్న చిన్న పుస్తకాలు దొరికేవి మార్కెట్లో… […]
ఇంతకీ తెలుగు జాతి అనగా ఎవరు బాబు గారూ..? ఆ దేవుడిని ఏం చేశారు మీరు..?!
కొన్ని మతాలు, కులాలకు, ప్రాంతాలకు పండుగలు ఉంటాయి – కాని ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడున్న ఘనంగా జరుపుకునే పండగ ఎన్టీఆర్ జయంతి – తెలుగు జాతి అంటే ప్రపంచం మొత్తానికి మొదటగా ఎన్టీఆరే గుర్తుకు వస్తారు .………. ఈ మాట అన్నది ‘ఎవరంటే…? శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు… తమ విఖ్యాత పార్టీ డిజిటల్ మహానాడు సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నాడు… రెండు మూడు విషయాల్లో మనకూ కొంత క్లారిటీ అవసరం… లేకపోతే ఇలాంటి నాయకులు వాళ్ల […]
దీన్నే నోటిదూల అంటారు… ‘పగిలిపోద్ది’ అంటేనే సెట్‌రైట్ అవుతుంది…
దూల… నోటిదూల… నాలుక అదుపులో లేకపోతే కొన్నిసార్లు వీపు మోతమోగే ప్రమాదముంది… అఫ్కోర్స్, ప్రమాదం తెలిసి కాళ్లబేరానికి వెళ్తే సరే… ప్రఖ్యాత బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్… ఈ నోటిదూల బాపతు కేరక్టరే… మావోడు ఇంకా పిల్లాడే, పట్టించుకోవద్దు అని తండ్రి చెబుతూనే ఉంటాడు, ఈ నోటితీట వివాదాల్లో తలపెట్టి, తరువాత సారీలకు దిగుతూనే ఉంటాడు… తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ‘‘వీపు పగిలిపోతుంది సుమా’’ అనే తరహాలో బెదిరించింది… ఆ […]
ఐతే ఏంటట..! కోటీశ్వరుడైతే ఎర్ర చొక్కా వేసుకోవద్దా..? అదేమైనా అక్రమ సంపాదనా..?!
చూశారా, చూశారా… కేరళ మంత్రివర్గంలో 13 మంది కోటీశ్వరులున్నారు తెలుసా..? ఇవిగో వివరాలు, ఎవరికెంత ఆస్తి ఉందో చెప్పేస్తున్నాం… అన్నట్టుగా ఓ స్టోరీ ఏదో ఇంగ్లిషు పత్రికలో వచ్చింది… దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో చాలామంది ఎర్రన్నలు కూడా కోటీశ్వరులే సుమీ అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు… అందులో వెక్కిరింపు, విమర్శ, ఆశ్చర్యం గట్రా కనిపిస్తున్నయ్… కానీ బేసిక్‌గా ఈ స్టోరీ విషయంలోనే మనకు కొన్ని అభ్యంతరాలు ఉండాలి… ఇదేమీ ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ఏమీ కాదు… అందరూ ఎన్నికల […]
ఈ టీకా వేసుకున్నోళ్లంతా రెండేళ్లలో చచ్చిపోతారట..! అసలు ఏది నిజం..?
‘‘వేక్సినేషన్ అతి పెద్ద తప్పు… ఇప్పుడు వేక్సిన్లు వేసుకున్నవాళ్లందరూ రెండేళ్లలో చచ్చిపోతారు… అందరినీ బొందపెట్టడం తప్ప చికిత్స కూడా చేయలేం…’’… కరోనా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనుకుంటాం..? ఎవడో పిచ్చోడు, నాలుగు తగిలించండి లేదా పళ్లు రాలగొట్టండి అని తిట్టేస్తాం…. కానీ ఒక నోబెల్ ప్రైజ్ విజేత, ప్రఖ్యాత వైరాలజిస్టు, ఎయిడ్స్ వైరస్ కనిపెట్టిన వ్యక్తి ఆ మాట అంటే ఎలా ఉంటుంది..? భయమేస్తుంది… ఏమిటిలా అంటున్నాడు, వేక్సిన్ వేయించుకున్నాను ఇప్పుడెలా మరి అని గుబులు […]
కాబట్టి కామ్రేడ్స్… వయోవృద్ధ హీరోలపై రివ్యూలు రాసేటప్పుడు జాగ్రత్త…
సపోజ్, పర్ సపోజ్… సరదాగా… ఓ చిన్న ఊహ… చిరంజీవి ఈ వయస్సులోనూ యంగ్ స్టెప్పులేసిన అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ పాట గురించి ప్రస్తావిస్తూ… హబ్బ, మీరూ, మీ పక్కన మీ మనమరాలు కాజల్ భలే ఉన్నారండీ అని ఎవరైనా సినిమా విమర్శకుడు రాస్తే…! ఎఫ్2 సినిమాలో వెంకటేష్, తమన్నాల విషయంలో గానీ… మన్మథుడు2 సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జోడిపై గానీ… పైసా వసూల్ సినిమాలో బాలయ్య, ముస్కాన్‌పై గానీ… పోనీ, మరేదో […]
పోనీ… తెలుగు నిర్మాతలు, హిందీ హీరో గాకుండా… తమిళ సమంతతో చెప్పిస్తే..!!
నో కాంప్రమైజ్… ఈ తమిళుల ధోరణే అది… హిందీ భాష దగ్గర్నుంచి జల్లికట్టు దాకా పట్టిన పట్టు విడవరు, అసలు హస్తినలోని ఉత్తరాది ఆధిపత్య ధోరణిని ఢీకొట్టి నిలబడాలంటే తమిళుల తరువాతే ఎవరైనా….. ఇలా అనుకుంటాం, మెచ్చుకుంటాం… కానీ కొన్ని విషయాల్లో వాళ్ల ఉద్వేగాలు మనకు ఓపట్టాన అర్థం కావు… ప్రత్యేకించి డీఎంకే ఆలోచన సరళి… నాస్తికవాదం గట్రా ఎప్పుడో డైల్యూట్ చేశారు, ప్యూర్ ఫ్యూడల్ పార్టీలాగా తమను తాము మోల్డ్ చేసుకున్నారు, అది వేరే కథ… […]
హఠాత్తుగా ఈ తెలుగు పాటల కెరటాన్ని ఎందుకు టార్గెట్ చేశారు..? ఎవరు..?!
షణ్ముఖ ప్రియ… ఓ అచ్చ తెలుగు సంగీతకెరటం… మన విశాఖపట్నం అమ్మాయి… సోనీ టీవీ ఇండియన్ ఐడల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడబోతున్న ఫిమేల్ సింగర్ అనే ప్రచారం జరిగింది… ఈ 12వ సీజన్ ద్వారా అంతగా పాపులర్ అయిపోయింది… ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆ రేంజ్‌లోనే తన ప్రతిభను ప్రదర్శిస్తోంది కూడా… కానీ హఠాత్తుగా ఆమె మీద సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్టయ్యింది… మీమ్స్, కామెంట్స్ దాడికి దిగాయి… నిజానికి సీనియర్లయితే ఈ దాడికి సరైన రిప్లయ్స్ […]
పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
అది 1794… బ్రిటిష్ సైన్యానికీ, టిప్పు సుల్తాన్కూ నడుమ భారీ యుద్దం… బ్రిటిష్ సైన్యానికి ఆహారపదార్థాలు, దినుసులను తీసుకువెళ్తున్న ఓ బండిని పట్టుకున్నారు టిప్పు సుల్తాన్ సైనికులు… ఆ బండి తీసుకుపోతున్నది ఇండియన్… బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తున్నాడు… పేరు కోసాజీ… తను మరాఠీ… తను యుద్ధసైనికుడు కాదు కాబట్టి, కసుక్కున పొడిచి, చంపేయకుండా ముక్కు కోసేసి పంపించారు… బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తే ఊరుకునేది లేదని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ అదొక సంకేతం… లబోదిబోమంటూ కోసాజీ […]
కీలకప్రశ్న..! అసలు ఆనందయ్య మందుకూ లోకాయుక్తకూ ఏం సంబంధం..?!
మందు..! అది మందే…! ఎవరెంత వెక్కిరించినా, విషం కక్కినా సరే… కొన్ని వేల మందిని కరోనా కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన మందే… ఇప్పటికీ తీసుకురాగల మందే… టీవీ9 వాడు ఉద్దేశపూర్వకంగా వెకిలిగా వెక్కిరించే నాటు మందు, పసరు మందు కాదు… సిద్ధవైద్య ప్రమాణాల మేరకు రూపొందిన మందే… భారతీయ సంప్రదాయ వైద్యం పరంపరగా నేర్పించిన విద్యతో రూపొందిన మందే… ఫీల్డ్ నుంచి వచ్చిన సమాచారమే ఇది… మంచి చేయకపోయినా సరే, చెడు చేయని మందు… అదే […]
ఓహో, ఆయనేనా శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రకు ప్రేరణ… మరి ఆ శిష్యుడు..?!
………. By….. Amarnath Vasireddy………. శంకరాభరణం : ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. ఇది సినిమా రివ్యూ కాదు. ఒక వ్యక్తిత్వంపై సమీక్ష. నేను ఈ సినిమా చూసేనాటికి లోకజ్ఞానం తెలియని బాలుడు. అటుపై సినిమా పూర్తిగా చూసే అవకాశం దక్కలేదు. పొద్దునే యూట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను. సినిమా గొప్పతనం గురించి, కర్ణాటక సంగీతం గురించి ఇక్కడ రాయడం లేదు. సూర్యకాంతి మొక్కకు సూర్యుడి పరిచయం అవసరం లేదు. చెప్పాలనుకున్నది శంకరశాస్త్రి […]
ఔనా..? ఫేస్బుక్, ట్విట్టర్ మూసేస్తారా..? హబ్బా… ఇదుగో ఇదీ అసలు కథ..!!
ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేస్తారట కదా… ఇండియాలో ట్విట్టర్‌ను మూసేస్తారట కదా… సోషల్ మీడియా మీద నిషేధం విధిస్తారట కదా… రేపట్నుంచే అమలు చేసేస్తారట కదా… అందుకే నిన్న ఓ స్పెషల్ సెల్ ఢిల్లీలోని ట్విట్టర్ ఆఫీసుకు వెళ్లిందట కదా… సోదాలు చేసిందట కదా… సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు ఖంగుతిని అమెరికా అధ్యక్షుడికి చెప్పాయట కదా… ఆయన అమెరికా భద్రత సలహాదారుడికి పురమాయిస్తే ఆయన ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్‌కు ఫోన్ చేశాడట కదా… ఎలాగోలా కొన్నేళ్లు బ్యాన్ […]
- « Previous Page
- 1
- …
- 390
- 391
- 392
- 393
- 394
- …
- 447
- Next Page »